పూర‌న్‌, మార్ష్ విధ్వంసం.. స‌న్‌రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన ల‌క్నో | IPL 2025: Nicholas Pooran And Shardul Thakur Power Lucknow To 5-wicket Win Over Hyderabad, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025: పూర‌న్‌, మార్ష్ విధ్వంసం.. స‌న్‌రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన ల‌క్నో

Published Thu, Mar 27 2025 11:14 PM | Last Updated on Fri, Mar 28 2025 11:16 AM

IPL 2025: Pooran-Shardul power Lucknow to 5-wicket win over Hyderabad

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ల‌క్నో ఘ‌న విజ‌యం సాధించింది. 191 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ల‌క్నో కేవ‌లం 16.1 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్‌.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

అత‌డితో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన మిచెల్ మార్ష్ సైతం త‌న బ్యాట్‌కు ప‌నిచెప్పాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 52 ప‌రుగులు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జంపా, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ష‌మీ త‌లా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు త‌మ స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేకపోయారు. భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.

నాలుగేసిన శార్ధూల్‌..
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్లు అద్బుతంగా రాణించారు. ల‌క్నో పేస‌ర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్ల‌తో చెల‌రేగాడు. అత‌డితో పాటు ప్రిన్స్ యాద‌వ్‌, దిగ్వేష్‌, ర‌వి బిష్ణోయ్‌, ప్రిన్స్ యాద‌వ్ త‌లా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్‌(47) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. అనికేత్ వ‌ర్మ‌(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్‌(26) రాణించారు.
చ‌ద‌వండి: IPL 2025: నికోల‌స్ పూర‌న్ ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైర‌ల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement