
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 23) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఎస్‌ఆర్‌హెచ్, రాయల్స్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుండగా.. సీఎస్‌కే, ఎంఐ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది.
రాజస్థాన్, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత సీజన్‌లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ఎలాగైనా చేజారిన టైటిల్‌ను చేజిక్కించుకోవాలన్న కసితో బరిలోకి దిగుతుంది. గత సీజన్‌లో తమ విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాలామంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ ఈ సీజన్‌లోనూ కొనసాగించింది. ఈ సీజన్‌లో కొత్తగా షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు తుది జట్టు కూర్పు సవాలుగా మారనుంది. బ్యాటర్ల విషయంలో ఆ జట్టుకు ఓ ఐడియా ఉన్నా బౌలర్ల ఎంపికలో మాత్రం తలనొప్పులు ఉన్నాయి. పేసర్లుగా కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ స్థానాలు ఖరారైనా.. స్పిన్నర్లలో స్వదేశీ రాహుల్ చాహర్‌కు అవకాశం ఇవ్వాలా లేక విదేశీ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు చోటు ఇవ్వాలా అన్న సందిగ్దత నెలకొంది.
రాహుల్‌కు అవకాశం ఇస్తే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ లేదా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ జంపానే కావాలనుకుంటే ఓ విదేశీ ఆల్‌రౌండర్‌ను త్యాగం చేయాల్సి వస్తుంది. అదనంగా బ్యాటర్లు సచిన్ బేబి, అనికేత్ వర్మలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చు.
బ్యాటింగ్ కూర్పు విషయానికొస్తే.. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయడం ఖాయం. మిడిలార్డర్‌లో నితీశ్ రెడ్డి, క్లాసెన్ ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభినవ్ మనోహర్ బరిలోకి దిగవచ్చు.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తుది జట్టు (అంచనా)
ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వియాన్ ముల్దర్/కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్
2025 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్
Comments
Please login to add a commentAdd a comment