SRH vs RR
-
#IPL2025 : ఉప్పల్ స్టేడియంలో వాళ్ళ సందడి వేరే లెవెల్...(ఫొటోలు)
-
జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి?
గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కొన్ని కీలక మార్పులు చేసింది. అందులో మొదటిది ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమిన్స్ (Pat Cummins)కి నాయకత్వ బాధ్యతలను అప్పగించడం.. రెండోది ఆస్ట్రేలియాకే చెందిన ఓపెనర్, టీమిండియాకు ‘తలనొప్పి’ తెప్పించే ట్రావిస్ హెడ్ (Travis Head)ని అభిషేక్ శర్మకి జతగా ఓపెనింగ్‌కి పంపాలని నిర్ణయించడం. ఈ రెండు నిర్ణయాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వరూపాన్నే మార్చేశాయి.పవర్ ప్లే అంటే ప్రత్యర్థికి దడేఅంతవరకూ ఎప్పుడూ విజయం కోసం ఎదురు చూసిన జట్టు.. ఇప్పుడు ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరిపోయింది. మ్యాచ్ తొలి ఓవర్లలో, ముఖ్యంగా పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ద్వయం ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడి విధ్వంసకర బ్యాటింగ్ తో వారి రిథమ్‌ని దెబ్బతీశారు. ఫలితంగా పరుగుల వెల్లువ ప్రవహించింది. వీరిద్దరూ ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డులను తిరగరాశారు. ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేసింది. గత సంవత్సరం ఫైనల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌కు చేరువగా రావడంలో బ్యాటర్లదే కీలక పాత్ర.సన్‌రైజర్స్ ఫార్ములాకి అప్‌గ్రేడ్ కిషన్ఇంత అద్భుత ఫలితాల్నిచ్చిన ఫార్ములాను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుఉంటుందా? అందుకే అదే ఫార్ములాను అప్‌గ్రేడ్ చేసింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి అవకాశం కోసం ఎదురు చేస్తున్న ఇషాన్ కిషన్ ని మునుపటి నంబర్ 3 బ్యాటర్ రాహుల్ త్రిపాఠి స్థానం లో తీసుకొచ్చింది. ఈ నేపధ్యం లో సొంతగడ్డ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సత్తా మరోసారి ప్రదర్శించింది.ఇందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా సన్‌రైజర్స్ కి తన వంతు సహకారం అందించింది. ఎందుకంటే అలాంటి ఊపు మీదున్న సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ కి టాస్ గెలిచినప్పటికీ ముందుగా బ్యాటింగ్ కి ఆహ్వానించడం రాయల్స్ చేసిన పెద్ద తప్పిదనం. ఇందుకు భారీ మూల్యమే చెల్లించాల్సివచ్చింది.రాయల్స్ కొంపముంచిన టాస్రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆ జట్టు బౌలర్ల పై విరుచుకు పడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి ఆరు ఓవర్లలో 94 పరుగులు చేయడంతో స్కోర్ రాకెట్ వేగంతో ముందుకు పోయింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అదే ఊపును కొనసాగించాడు.గతంలో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన కిషన్ 47 బంతుల్లో 11 బౌండరీలు, ఆరు సిక్సర్లుతో అజేయంగా నిలిచి 106 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ కి ఐపీఎల్ లో ఇది మొదటి సెంచరీ. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసి మరోసారి సత్తా చాటింది. గత సంవత్సరం బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల నష్టానికి 287 పరుగుల ఐపీఎల్ స్కోర్ ని ఒక్క పరుగుతో వెనుక పడింది.చివరి వరకూ పోరాడిన రాయల్స్ఇంత అత్యధిక లక్ష్యాన్ని సాధించడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే నిజానికి రాయల్స్ చివరి వరకూ పోరాడింది. ప్రారంభంలోనే భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ రియాన్ పరాగ్‌ల వికెట్లను కోల్పోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించింది. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్సమన్ సంజు సామ్సన్, మరియు ధ్రువ్ జురెల్ రాయల్స్‌ను జట్టుకి ఆత్మవిశ్వాసం కలిగించే రీతిలో ఆడారు.నాల్గవ వికెట్‌కు వారిద్దరు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సామ్సన్ 66 పరుగులు చేయగా, జురెల్ 70 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్, శుభం దూబే వచ్చి స్కోర్ ని పరుగు పెట్టించినప్పటికీ ఫలితం లేకపోయింది. హెట్‌మైర్ 44 పరుగులు సాధించగా దూబే 32 పరుగులు చేయడంతో రాయల్స్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 242 కి చేరింది. కావ్యా మారన్ కళ్లలో ఆనందంఈ మ్యాచ్ లో చివరికి రాయల్స్ 44 పరుగుల తేడాతో పరాజయం చవిచూసినప్పటికీ ముందు జరిగే మ్యాచ్ లకు కొండంత ఆత్మ విశ్వాసాన్నిచిదనడంలో సందేహంలేదు. ఇక క్లాసెన్, ఇషాన్ కిషన్ ప్ర్యతర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ పలికించిన హావభావాలు, భావోద్వేగానికి గురైన తీరు జట్టు ప్రదర్శన పట్ల ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు.చదవండి: మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్An epic run-fest goes the way of @SunRisers 🧡The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
సన్‌రైజర్స్ VS రాజస్తాన్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో హీరో వెంకటేష్ సందడి (ఫొటోలు)
-
మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అద్భుత విజయంతో ఆరంభించింది. గత సీజన్ తాలుకు విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో చిత్తు చేసింది.‘పాకెట్ డైనమైట్’ సెంచరీస్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (31 బంతుల్లో 67) తనదైన శైలిలో చెలరేగగా.. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan kishan) ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. ఈ పాకెట్ డైనమైట్ రాజస్తాన్ బౌలింగ్‌ను చితకొట్టి.. అజేయ అద్భుత శతకం సాధించాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు.𝙄.𝘾.𝙔.𝙈.𝙄 🔥Ishan Kishan dealt in sixes on his way to a magnificent maiden #TATAIPL 💯 😮 👊Updates ▶ https://t.co/ltVZAvHPP8#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/9PjtQK231J— IndianPremierLeague (@IPL) March 23, 2025 ఇక హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా ధనాధన్ ఇన్నింగ్స్ (14 బంతుల్లో 34)తో దుమ్ములేపాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో రైజర్స్ 286 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ 242 పరుగులకే పరిమితం కావడంతో జయకేతనం ఎగురువేసింది.మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయనుఈ నేపథ్యంలో విజయానంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాటర్లకు పొరపాటున కూడా బౌలింగ్ చేయబోనంటూ సహచర ఆటగాళ్ల దూకుడును ప్రశంసించాడు. ఇషాన్ కిషన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ‘‘నమ్మశక్యం కాని బ్యాటింగ్ ఇది. నేను మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.బాబోయ్.. భయపెట్టేశారుప్రత్యర్థి జట్టు బౌలర్లను భయపెట్టేశారు. ఇలాంటి బ్యాటర్లు ఉంటే బౌలర్లకు చుక్కలే. వికెట్ తీయడం గురించి కాకుండా.. పరుగులను ఎలా నియంత్రించాలన్న అంశం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మేము గత వైభవాన్ని కొనసాగించాలని ఫిక్సయ్యాం. అసాధారణ ఇన్నింగ్స్ గతంలో ఆడిన ఒకరిద్దరు ప్లేయర్ల సేవలను ఈసారి మేము కోల్పోయాం. అయితే, వారి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని.. ఆటను పూర్తిగా ఆస్వాదించాలని అతడు భావించాడు. మైదానంలో ఆ పని చేసి చూపించాడు.ప్రాక్టీస్‌లో మా బాయ్స్ కష్టపడ్డారు. అద్భుత రీతిలో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యారు. ఇక మా కోచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. వారంతా అద్భుతం. గత మూడు- నాలుగు వారాలుగా మాతో పాటు ఉన్నారు. ఏదేమైనా మా వాళ్లు తమ భీకర బ్యాటింగ్‌తో సీజన్‌కు బ్లూప్రింట్లాంటిది తయారు చేశారు. మా బ్యాటర్లను ఎంత ప్రశంసించినా తక్కువే’’ అని కమిన్స్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్👉టాస్: రాజస్తాన్ రాయల్స్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 286/6 (20)👉రాజస్తాన్ స్కోరు: 242/6 (20)👉ఫలితం: 44 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇషాన్ కిషన్చదవండి: IPL 2025 RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే ఒక్కడు -
ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ.. రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేయగలిగింది. ధ్రువ్ జురేల్(70), సంజు శాంసన్(66) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికి ఈ భారీ టార్గెట్‌ను రాజస్తాన్ అందుకోలేకపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు.ఇషాన్ సూపర్ సెంచరీ..తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ రెండో వికెట్ కు 39 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కిషన్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కిషన్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. ట్రావిస్ హెడ్(67) హాఫ్ సెంచరీతో మెరవగా.. క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ వదిలేసింది.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ -
SRH Vs RR: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్
ఐపీఎల్-2025ను సన్‌రైజర్స్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తనదైన స్టైల్లో ఆరంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను హెడ్ ఊచకోత కోశాడు. ఉప్పల్ మైదానంలో ఈ ఆసీస్ ఓపెనర్ బౌండరీల వర్షం కురిపించాడు. రాజస్తాన్ స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్‌ను అయితే హెడ్ ఓ ఆట ఆడేసికున్నాడు. 5వ ఓవర్ వేసిన అర్చర్ బౌలింగ్‌లో హెడ్ ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆనందంలో కావ్యపాప..కాగా ఈ మ్యాచ్‌లో హెడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదగా 105 మీటర్ల సిక్స్‌ను హెడ్ కొట్టాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. చప్పట్లు కొడుతూ హెడ్‌ను అభినందించింది. ఆ షాట్ చూసి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా షాకయ్యాడు.Hurricane Head graces #TATAIPL 2025 🤩Travis Head smashing it to all parts of the park in Hyderabad 💪👊Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers pic.twitter.com/cxr6iNdR3S— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
SRH Vs RR: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. ఎవరిది పైచేయి..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్‌పై సన్‌రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్‌లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్‌నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్‌లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.జట్లను పరిశీలిస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. బౌలింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌దే పైచేయిగా తెలుస్తుంది. సన్‌రైజర్స్‌లో సమర్దవంతమైన పేసర్లతో (కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్) పాటు నాణ్యమైన స్పిన్నర్లు (రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, కమిందు మెండిస్, అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్) ఉన్నారు. రాయల్స్‌లో అది లోపించింది. పేసర్లలో సందీప్ శర్మ, జోప్రా ఆర్చర్.. స్పిన్నర్లలో హసరంగ, తీక్షణ మాత్రమే ఆ జట్టు తరఫున అనుభవజ్ఞులుగా ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. సన్‌రైజర్స్‌లో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్ కిషన్ ఉండగా.. రాయల్స్‌లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. ఇరు జట్ల బ్యాటర్లు సీజన్ ప్రారంభానికి ముందు ఆడిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో బీభత్సమైన ఫామ్ కనబర్చారు. దీన్ని బట్టి చూస్తే నేటి మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (ఆర్సీబీపై 287) నమోదు చేయడంతో పాటు మూడు సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే.సన్‌రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
IPL 2025: తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ.. స్టార్ స్పిన్నర్‌కు నో ప్లేస్..!
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 23) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్కే, ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఎస్ఆర్హెచ్, రాయల్స్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుండగా.. సీఎస్కే, ఎంఐ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది.రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్ ఈ సీజన్లో ఎలాగైనా చేజారిన టైటిల్‌ను చేజిక్కించుకోవాలన్న కసితో బరిలోకి దిగుతుంది. గత సీజన్లో తమ విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాలామంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ ఈ సీజన్లోనూ కొనసాగించింది. ఈ సీజన్లో కొత్తగా షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు తుది జట్టు కూర్పు సవాలుగా మారనుంది. బ్యాటర్ల విషయంలో ఆ జట్టుకు ఓ ఐడియా ఉన్నా బౌలర్ల ఎంపికలో మాత్రం తలనొప్పులు ఉన్నాయి. పేసర్లుగా కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ స్థానాలు ఖరారైనా.. స్పిన్నర్లలో స్వదేశీ రాహుల్ చాహర్‌కు అవకాశం ఇవ్వాలా లేక విదేశీ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు చోటు ఇవ్వాలా అన్న సందిగ్దత నెలకొంది. రాహుల్‌కు అవకాశం ఇస్తే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ లేదా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ జంపానే కావాలనుకుంటే ఓ విదేశీ ఆల్‌రౌండర్‌ను త్యాగం చేయాల్సి వస్తుంది. అదనంగా బ్యాటర్లు సచిన్ బేబి, అనికేత్ వర్మలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చు.బ్యాటింగ్ కూర్పు విషయానికొస్తే.. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయడం ఖాయం. మిడిలార్డర్లో నితీశ్ రెడ్డి, క్లాసెన్ ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభినవ్ మనోహర్ బరిలోకి దిగవచ్చు.రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తుది జట్టు (అంచనా)ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వియాన్ ముల్దర్/కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్2025 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్