
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025ను సన్‌రైజర్స్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తనదైన స్టైల్లో ఆరంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను హెడ్ ఊచకోత కోశాడు.
ఉప్పల్ మైదానంలో ఈ ఆసీస్ ఓపెనర్ బౌండరీల వర్షం కురిపించాడు. రాజస్తాన్ స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్‌ను అయితే హెడ్ ఓ ఆట ఆడేసికున్నాడు. 5వ ఓవర్ వేసిన అర్చర్ బౌలింగ్‌లో హెడ్ ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు.
ఈ క్రమంలో హెడ్ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆనందంలో కావ్యపాప..
కాగా ఈ మ్యాచ్‌లో హెడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదగా 105 మీటర్ల సిక్స్‌ను హెడ్ కొట్టాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. చప్పట్లు కొడుతూ హెడ్‌ను అభినందించింది. ఆ షాట్ చూసి ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా షాకయ్యాడు.
Hurricane Head graces #TATAIPL 2025 🤩
Travis Head smashing it to all parts of the park in Hyderabad 💪👊
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers pic.twitter.com/cxr6iNdR3S— IndianPremierLeague (@IPL) March 23, 2025
Comments
Please login to add a commentAdd a comment