
బిహార్ రాష్ట్రంలోని మారుమూల పల్లె అయిన తాజ్‌పూర్‌లో పుట్టిన ఆ బాలుడు ప్రస్తుతం క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. రైతుబిడ్డగా ఎదిగిన అతను ఆటలో ప్రావీణ్యం చూపుతూ అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 14 ఏళ్లకే ఐపీఎల్‌కు ఎంపికైన ఘటన సాధించిన అతనే వైభవ్ సూర్యవంశీ. మార్చి 27, 2011న పుట్టిన సూర్యవంశీది రైతు కుటుంబం. పోలంలో పని చేస్తేనే ఇంట్లో అందరూ పోట్టనింపుకునే పరిస్థితి వారిది. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై వైభవ్‌కు వల్లమాలిన ఇష్టం.
ఆ ఇష్టాన్ని తండ్రి సంజీవ్ గమనించారు. ఎనిమిదేళ్ల తన కొడుకు ముందు ముందు క్రికెట్‌లో అద్భుతాలు సష్టిస్తాడని ఆయన అంచనా వేశారు. ఇందుకోసం తన మద్దతు అవసరం అని గ్రహించి, తన పోలాన్ని అమ్మేసి మరీ కొడుకుకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి క్రికెట్‌పై దష్టి పెట్టిన వైభవ్ శిక్షణ కోసమే పూర్తి సమయాన్ని కేటాయించాడు. సమస్తిపూర్‌కు తండ్రితోపాటు వెళ్లి అక్కడ కోచ్‌ల దగ్గర శిక్షణ పోందేవాడు. 12 ఏళ్లకే శిక్షణలో రాటుదేలాడు.
తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొని ముంబయి జట్టుపై ఆడాడు. అక్కడే అతని ప్రతిభ అందరికీ తెలిసింది. అనంతరం అండర్–16, అండర్–19 టోర్నమెంట్లలో వైభవ్ తన సత్తా చాటాడు. ఒక్కో చోట తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ మేలైన క్రీడాకారుడిగా మారాడు. అండర్–19 ఏషియా కప్‌లో తన ఆటతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు.ఇన్ని విజయాలు సాధించిన వైభవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఎంపికై దేశమంతటికీ తెలిశాడు. 14 ఏళ్లకు రూ.1.10 కోట్ల పారితోషికంతో ఐపీఎల్‌కు ఎంపికై, అతి చిన్నవయస్కుడైన ఐపీఎల్ ఆటగాడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా మైదానంలో విజంభిస్తూ అందరి ప్రశంసలు పోందుతున్నాడు.
— Sujeet Suman (@sujeetsuman1991) April 24, 2025