Vaibhav Suryavanshi
-
సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
టీనేజీ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల వైభవ్.. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ (బీహార్) ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ పేరిట ఉండేది. అలీ 14 ఏళ్ల 51 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్లోని అరంగేట్రం చేశాడు. తాజాగా వైభవ్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్‌తో పాటు రంజీల్లో మరియు అండర్-19 స్థాయిలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు.కాగా, వైభవ్ లిస్ట్-ఏ అరంగేట్రం ఊహించినంత సజావుగా సాగలేదు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్ ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రాతినిథ్యం వహించిన బీహార్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బిపిన్ సౌరభ్ (50), గనీ (48), ప్రబల్ ప్రతాప్ సింగ్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, ఆర్యన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో 2, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు.197 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 25.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ హర్ష్ గావ్లి (83), కెప్టెన్ రజత్ పాటిదార్ (55) అర్ద సెంచరీలతో రాణించి మధ్యప్రదేశ్‌ను గెలిపించారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
13 ఏళ్లకే కోటి రూపాయలు.. క్రికెట్లో కొత్త ‘వైభవం’
12 సంవత్సరాల 9 నెలల 9 రోజులు.. సాధారణంగా ఈ వయసులో చిన్నారులంతా ఏం చేస్తుంటారు? బడిలో పాఠాలు నేర్చుకుంటూంటారు. కానీ ఆ అబ్బాయి దేశంలో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. 13 సంవత్సరాల 7 నెలల 29 రోజులు.. ఈ వయసులో చిన్నారులు సంపాదిస్తారా? తాము కోరుకున్నది పేరెంట్స్ కొనిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ బాలుడు తన ఆటతో కోటి రూపాయలు సంపాదించి, ఔరా అనిపించాడు. భారత క్రికెట్లో సంచలనంలా మారిన ఆ అబ్బాయే వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా కొత్త ఘనతను నమోదు చేశాడు.చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ ఎప్పటికప్పుడు తనకంటే పెద్ద వయసు ఉన్న ఆటగాళ్ల టోర్నీలలోనే పాల్గొంటూ వచ్చాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఇతర ఆటగాళ్లు అతని కంటే కనీసం 5–6 ఏళ్లు పెద్దవాళ్లు. అలాంటి చోట బరిలోకి దిగడమే కాదు.. తన పదునైన బ్యాటింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. స్థానికంగా జరిగిన ఒక అండర్–19 స్థాయి టోర్నీలో ఏకంగా 332 పరుగులతో వైభవ్ అజేయంగా నిలవడం విశేషం. ఫలితంగా బిహార్ రాష్ట్ర అండర్–19 జట్టులో చోటు దక్కింది. ఈ స్థాయిలో బీసీసీఐ నిర్వహించే రెండు ప్రధాన టోర్నీలు కూచ్‌బెహర్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో ప్రదర్శన వైభవ్ ఆట గాలివాటం కాదని నిరూపించింది. కూచ్‌బెహర్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లోనే 151 పరుగులు చేయడంతో అతని ఆట అందరికీ తెలిసింది. వినూ మన్కడ్ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లో 78.60 సగటుతో 393 పరుగులు చేయడం వైభవ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహజంగానే ఈ ప్రదర్శన భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. విజయవాడలో నాలుగు జట్ల మధ్య జరిగిన చాలెంజర్ టోర్నీలో భారత అండర్–19 బి జట్టు తరఫున బరిలోకి దిగిన అతను తన చూడ చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక్కడే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వైభవ్‌లోని ప్రతిభను గుర్తించాడు. అప్పటి నుంచి జాఫర్ అతనికి మార్గనిర్దేశనం చేస్తూ వచ్చాడు. నాన్న నేర్పిన ఓనమాలతో..బిహార్‌లోని సమస్తీపుర్కి చెందిన సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే పిచ్చి. ఆటను అభిమానించడమే కాదు.. క్రికెటర్‌గా కూడా ఎదిగే సత్తా తనలో ఉందని నమ్మిన అతను భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబైకి చేరాడు. అక్కడి ప్రఖ్యాత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాతే సంజీవ్‌కు వాస్తవం అర్థమైంది. ముంబై మహానగరంలో తనలాంటివారు, తనకంటే ప్రతిభావంతులు ఎందరో క్రికెట్లో ఎదిగేందుకు సర్వం ఒడ్డి పోరాడుతున్నారని! దాంతో తన ఆశలను కట్టిపెట్టి మళ్లీ బిహార్ చేరాడు. అయితే తాను చేయలేనిది కొడుకు ద్వారా సాధించాలనే తపనతో వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్.. తండ్రి శిక్షణ, పర్యవేక్షణలో రాటుదేలాడు. 13 ఏళ్ల వయసుకే ప్రపంచ క్రికెట్ దృష్టిలో పడ్డాడు.రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి..ఏజ్ గ్రూప్ క్రికెట్ తర్వాత ప్రతి ఆటగాడి లక్ష్యం సీనియర్ టీమ్‌లోకి ఎంపిక కావడమే. అక్కడికి వెళ్లాక ఆట స్థాయి, ప్రత్యర్థుల స్థాయి కూడా పెరుగుతుంది. సీనియర్ టీమ్‌లోకి రావడం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి భీకరమైన బౌలింగ్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతూ అతను తొలి మ్యాచ్‌లోనే అత్యంత పటిష్ఠమైన ముంబై టీమ్‌ను ఎదుర్కొన్నాడు. భారీ స్కోరు చేయకపోయినా అతని షాట్లు చూసినవారు ప్రశంసల వర్షం కురిపించారు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అభిమానించే ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ ఇప్పటికి 5 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన ఏకైక టి20 మ్యాచ్‌లో కొట్టిన భారీ సిక్సర్లు అతని ధాటిని చూపించాయి. వేలంలో ప్రధాన ఆకర్షణగా..వైభవ్ కెరీర్లో అసలు మలుపు రెండు నెలల క్రితం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్–19 టీమ్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో వచ్చింది. ఈ పోరులో భారత అండర్–19కు ప్రాతినిధ్యం వహించిన అతను 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. ఇదే ఆట అతణ్ణి ఐపీఎల్ దిశగా అడుగులు వేయించింది. నాగపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ దూకుడు టీమ్ సీఈఓ జేక్ లష్ను ఆకర్షించింది. భవిష్యత్తు కోసం తీర్చిదిద్దగల తారగా ఆయన భావించాడు. అందుకే వేలంలో రూ. 30 లక్షల కనీస విలువ నుంచి ఢిల్లీతో పోటీ పడి మరీ రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్‌ను ఎంచుకుంది. ‘వైభవ్‌లో నిజంగా చాలా ప్రతిభ ఉంది. మా టీమ్‌లో అతను ఎదిగేందుకు తగిన వాతావరణం ఉంది. అందుకే అతణ్ణి తీసుకోవడం పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం’ అని రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం వైభవ్ కెరీర్ సరైన రీతిలో వెళ్లనుంది అనేందుకు సంకేతం. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 6) జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చేతన్ శర్మ (3/34), కిరణ్ చోర్మలే (2/32), ఆయుశ్ మాత్రే (2/37), యుధజిత్ గుహా (1/19), హార్దిక్ రాజ్ (1/30) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో లక్విన్ అభయ్సింఘే (69) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షరుజన్ షణ్ముగనాథన్ (42), విహాస్ తేవ్మిక (14), కవిజ గమగే (10) రెండంకెల స్కోర్లు చేశారు.174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (34), ఆండ్రీ సిద్దార్థ్ (22), కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (25 నాటౌట్), కేపీ కార్తికేయ (11) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో విహాస్ తేవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది. -
Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. షార్జాలో బుధవారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను చిత్తుగా ఓడించి టాప్-4కు అర్హత సాధించింది.కాగా దుబాయ్ వేదికగా వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడి ఓటమిపాలైన మహ్మద్ అమాన్ సేన.. రెండో మ్యాచ్‌లో జపాన్ను 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.137 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో షార్జా క్రికెట్ స్టేడియంలో యువ భారత్ తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. రయాన్ ఖాన్ ఒక్కడు 35 పరుగులతో రాణించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 44 ఓవర్లలోనే యూఏఈ కథ ముగిసింది. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లతో చెలరేగగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పసికూనపై ప్రతాపం చూపింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయం అందించారు. ఆయుశ్ 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. వైభవ్ 46 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. ఇలా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో భారత్ కేవలం 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. వైభవ్ కొట్టిన సిక్సర్‌తో విజయతీరాలకు చేరిన టీమిండియా(143).. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన ఆయుశ్ మాత్రే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా అండర్-19 ఆసియా కప్‌లో డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్‌లు జరుగనుండగా.. డిసెంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.చదవండి: రోహిత్ వచ్చాడు!.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్ -
సచిన్, కోహ్లి కాదు! 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఆదర్శం ఇతడే!
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడీ పేరు హాట్‌టాపిక్. పన్నెండేళ్ల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడిన ఈ బిహారీ చిచ్చరపిడుగు... ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పదమూడేళ్ల ఈ కుర్రాడి కోసం రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన వైభవ్ తన ఐడల్ ఎవరో చెప్పేశాడు. సచిన్, కోహ్లి కాదు! అతడే ఆదర్శంమెజారిటీ మంది టీమిండియా అభిమానులు ఊహించినట్లుగా వైభవ్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్, రోహిత్ శర్మల పేరు చెప్పలేదు. అతడికి వెస్టిండీస్ దిగ్గజం లారా ఆదర్శమట. ‘‘బ్రియన్ లారా నాకు ఆదర్శం. నేను ఆయనలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే, నాదైన సహజ శైలిని మాత్రం విడిచిపెట్టను. నాకున్న నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ టోర్నీ మీదే ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంతో సంబంధం లేదు’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.పట్టించుకోనుఐపీఎల్లో తన డిమాండ్, తన వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ వస్తున్న ఆరోపణలను పట్టించుకోనని వైభవ్ కుండబద్దలుకొట్టాడు. కాగా దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 44 పరుగుల తేడాతో అమాన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇక శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. యువ టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో ఆడనుంది. చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! Vaibhav Sooryavanshi gears up for the big stage 🌟 🗣️ Hear from India’s rising star as the action unfolds against Pakistan 🎤 #SonySportsNetwork #NextGenBlue #AsiaCup #NewHomeOfAsiaCup #INDvPAK pic.twitter.com/PLG8UlvB6i— Sony Sports Network (@SonySportsNetwk) November 30, 2024 -
Ind vs Pak: ఆఖరి వరకు పోరాడిన యువ భారత్.. పాక్ చేతిలో తప్పని ఓటమి
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. లీగ్ దశలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడ్డ పాక్.. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. షాజైబ్ ఖాన్ భారీ శతకంఓపెనర్లలో ఉస్మాన్ ఖాన్హాఫ్ సెంచరీ(60)తో మెరవగా.. షాజైబ్ ఖాన్ భారీ శతకం బాదాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 159 పరుగులు సాధించాడు.ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మద్ రియాజుల్లా 27 రన్స్ చేయగా.. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. అయితే, ఓపెనర్లు వేసిన బలమైన పునాది కారణంగా పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 281 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు సమర్థ్ నాగరాజ్ మూడు, యుధాజిత్ గుహ ఒక వికెట్ పడగొట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆయుశ్ మాత్రే రెండు, కిరణ్ చోర్మలే ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. అయితే, లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే భారీ షాకులు తగిలాయి.ఆదిలోనే ఎదురుదెబ్బఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ 15 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 పరుగులుతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ మొహ్మద్ 16 పరుగులకు నిష్క్రమించాడు. ఇక 82 పరుగులకే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ కుమార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.Nikhil Kumar brings up a crucial half-century, adding vital runs for India! 💪🏏Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/X7DCbJLNxq— Sony LIV (@SonyLIV) November 30, 2024 నిఖిల్ వీరోచిత అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నిఖిల్ 77 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 67 రన్స్ చేశాడు. అయితే, నవీద్ అహ్మద్ ఖాన్ బౌలింగ్‌లో నిఖిల్ స్టంపౌట్ కావడంతో యువ భారత్ విజయానికి దూరమైంది. మిగతా వాళ్లలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ఆఖర్లో మొహ్మద్ ఇనాన్ పోరాటపటిమ కనబరిచాడు. చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగాచేతిలో ఒకే ఒక వికెట్ ఉన్న సమయంలోనూ చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా బ్యాట్ ఝులిపించాడు. ఈ టెయిలెండర్ 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ యుధాజిత్ గుహ(12*)తో సమన్వయలోపం కారణంగా ఇనాన్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 47.1 ఓవర్లలో 237 పరుగులకు అమాన్ సేన ఆలౌట్ అయింది.ఫలితంగా పాకిస్తాన్ 44 పరుగుల తేడాతో గెలుపొంది ఈ వన్డే టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇక పాక్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా.. అబ్దుల్ సుభాన్, ఫాహమ్ ఉల్ హఖ్ రెండేసి వికెట్లు కూల్చారు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.తదుపరి జపాన్తోఇదిలా ఉంటే.. భారత్ తమ రెండో మ్యాచ్‌లో జపాన్‌తో డిసెంబరు 2న తలపడనుంది. మరోవైపు.. అదే రోజు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
Ind vs Pak: ఐపీఎల్ కాంట్రాక్టు పట్టాడు.. పాక్‌తో మ్యాచ్‌లో ఫెయిల్! కారణం అదే!
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్.. అండర్- 19 క్రికెట్లో అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్‌గానూ చరిత్రకెక్కాడు.కోటీశ్వరుడు అయ్యాడు.. దిష్టి తగిలిందిఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్‌తో జరిగిన అనధికారిక టెస్టులో 58 బంతుల్లోనే వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పదమూడేళ్ల లెఫ్టాండర్‌ను రాజస్తాన్ రాయల్స్ ఊహించని ధరకు సొంతం చేసుకుంది. ఈ బిహారీ అబ్బాయిని ఏకంగా రూ. 1.10 కోట్లకు కొనుక్కుంది.ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులోనే అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అయితే, కొంతమంది మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ ఆరోపణలు చేయగా.. వైభవ్ తండ్రి సంజీవ్ వాటిని కొట్టిపారేశాడు.తమకు ఏ భయమూ లేదని.. కావాలంటే బీసీసీఐ ఏజ్ టెస్టుకు వైభవ్‌ను మరోసారి పంపించడానికి సిద్దమని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. వైభవ్ సైతం తన గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్.. ‘‘పదమూడేళ్లకే ఇతడు ఏం చేశాడో చూడండి’’ అంటూ వైభవ్ నైపుణ్యాలను కొనియాడింది.తీవ్రమైన ఒత్తిడిలోఓవైపు ఓవర్‌నైట్ స్టార్‌గా మారడటం.. మరోవైపు వయసు గురించి ఆరోపణలు.. ఇలాంటి పరిస్థితుల నడుమ అండర్-19 ఆసియా కప్ బరిలో దిగాడు వైభవ్ సూర్యవంశీ. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థిని ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఫలితంగా బౌలింగ్‌కు దిగిన యువ భారత్‌కు పాక్ ఓపెనర్లు కొరకరాని కొయ్యగా మారారు. ఉస్మాన్ ఖాన్ 60 పరుగులు సాధించగా.. షాజైబ్ ఖాన్ ఏకంగా 159 పరుగులతో భారీ శతకం నమోదు చేశాడు. నాలుగో స్థానంలో మహ్మద్ రియాజుల్లా వచ్చిన 27 పరుగులు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.అయితే, ఓపెనర్ల విజృంభణ వల్ల పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆయుశ్ మాత్రే రెండు, యుధాజిత్ గుహ, కిరన్ చోర్మలే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.Samarth takes his 3️⃣rd wicket! 💥Shahzaib Khan departs after scoring 159Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/m3dZn8YskL— Sony LIV (@SonyLIV) November 30, 2024 ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేశాడు. అలీ రజా బౌలింగ్‌లో సాద్ బేగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ కూడా 15 పరుగులే చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. నిఖిల్ కుమార్ హాఫ్ సెంచరీ(67) చేయగా.. మిగతా వారిలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26), మొహ్మద్ ఇనాన్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో 238 పరుగులకే పరిమితమైన యువ భారత్ పాక్ చేతిలో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ఆశలపై నీళ్లు! -
13 ఏళ్లకే కోటీశ్వరుడు
-
పదమూడు కాదు.. పదిహేను!.. రూ. 1.10 కోట్లు.. మాకేం భయం లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు అతడి పేరే హాట్ టాపిక్. అయితే, కొంతమంది వైభవ్ నైపుణ్యాలను ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం వయసు విషయంలో అతడు అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డవైభవ్ సూర్యవంశీ పదమూడేళ్ల పిల్లాడు కాదని.. అతడి వయసు పదిహేనేళ్లు అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు చిన్ననాటి నుంచే ఎంతో కఠిన శ్రమకోరుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన విజయం వల్ల బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డ అయిపోయాడు.ఎనిమిదేళ్ల వయసులోనే అతడు అండర్-16 డిస్ట్రిక్ట్ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. క్రికెట్ కోచింగ్ కోసం నేను తనని రోజూ సమస్తిపూర్ వరకు తీసుకువెళ్లి.. తిరిగి తీసుకువచ్చేవాడిని. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు మేమెంతగా కష్టపడ్డామో ఎవరికీ తెలియదు.మాకు ఏ భయమూ లేదుఆర్థిక ఇబ్బందుల వల్ల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నా కుమారుడు ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్ టెస్టు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే అతడు ఇండియా అండర్-19 జట్టుకు ఆడుతున్నాడు. మాకు ఏ భయమూ లేదు. కావాలంటే మరోసారి వైభవ్ ఏజ్ టెస్టుకు వెళ్తాడు’’ అని ఆరోపణలు చేస్తున్న వారికి సంజీవ్ సూర్యవంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు.కాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల 243 రోజులు. ఇక రూ. 30 లక్షల కనీస ధరతో అతడు తన పేరును ఐపీఎల్-2025 మెగా వేలంలో నమోదు చేసుకున్నాడు. ఆక్షన్‌లో వైభవ్ కోసం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా.. రాజస్తాన్ ఏకంగా రూ. కోటీ పది లక్షల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది.ఒకే ఓవర్లో 17 పరుగులు ఈ విషయం గురించి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ‘‘నాగపూర్‌లో ట్రయల్స్ సమయంలో వైభవ్‌ను రమ్మని రాజస్తాన్ రాయల్స్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ సర్ నా కుమారుడిని టెస్టు చేశారు. ఒకే ఓవర్లో అతడు 17 పరుగులు చేశాడు. ట్రయల్స్‌లో మొత్తంగా ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు’’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: Gautam Gambhir: ఆసీస్‌తో రెండో టెస్ట్‌కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్ Vaibhav Suryavanshi, all of 13 years old, entering the IPL! 💗😂 pic.twitter.com/ffkH73LUeG— Rajasthan Royals (@rajasthanroyals) November 25, 2024 View this post on Instagram A post shared by Vaibhav Suryavanshi (@vaibhav.suryavanshi_25) -
13 ఏళ్ల కుర్రాడికి జాక్ పాట్.. ఏకంగా రూ.1.10 కోట్లు! ఎవరీ సూర్యవంశీ?
ఐపీఎల్-2025 మెగా వేలంలో బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాక్‌పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల యువ క్రికెటర్‌ను రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతడి ప్రస్తుత వయస్సు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. రూ.30లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సూర్య వంశీ కోసం తొలుత రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి వైదొలగడంతో ఈ యువ క్రికెటర్‌ను రాజస్తాన్ తమ సొంతం చేసుకుంది.ఎవరీ వైభవ్ సూర్యవంశీ?13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2011లో బిహార్‌లోని తాజ్పుర్ గ్రామంలో జన్మించాడు. అతడికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. ఆ దిశగానే వైభవ్ అడుగులు వేశాడు. అతడు అద్బుతమైన క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీది కీలక పాత్ర. 8 ఏళ్లకే వైభవ్‌ను క్రికెట్ అకాడమీలో చేర్పించి రెండేళ్లపాటు శిక్షణ సంజీవ్ ఇప్పించాడు. ఈ క్రమంలోనే కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి వైభవ్ చరిత్ర సృష్టించాడు.2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో బిహార్ తరపున ఫస్ట్‌క్లాస్ డెబ్యూ చేశాడు. తద్వారా రంజీ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు రంజీ మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని రాజస్తాన్ రాయల్స్ పోటీపడి మరి సొంతం చేసుకుంది. -
Ind vs Aus: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND U-19 Vs AUS U-19 Test Series: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో అండర్-19 అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా తొలి టెస్టులో యువ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.కాగా ఓవర్‌నైట్ స్కోరు 110/4తో బుధవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా అండర్–19 జట్టు 67.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. రిలీ కింగ్సెల్ (48; 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ కాగా... ఎయిడెన్ ఓ కానర్ (38 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. ఇక యువ భారత బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ మహమ్మద్ ఇనాన్ ఆరు వికెట్లతో చెలరేగాడు.మరోవైపు.. కెప్టెన్ సొహమ్ పట్వర్ధన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువభారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 61.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి జయభేరి మోగించింది.అయితే, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (1) విఫలం కాగా.. నిత్య పాండ్యా (86 బంతుల్లో 51; 3 ఫోర్లు), నిఖిల్ కుమార్ (71 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఛేజింగ్‌లో ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన నిఖిల్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఎయిడెన్ ఓ కానర్ నాలుగు, విశ్వ రామ్‌కుమార్ మూడు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో అనధికారిక టెస్టు మొదలు కానుంది. చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
Ind vs Aus: టీ20 తరహా ఇన్నింగ్స్.. వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అండర్-19 టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ఈ ఫీట్ నమోదు చేసి ఔరా అనిపించాడు.మొయిన్ అలీ తర్వాతచెన్నై వేదికగా ఆస్ట్రేలియా యువ జట్టుతో జరుగతున్న అనధికారిక తొలి టెస్టు సందర్భంగా మంగళవారం ఈ ఘనత సాధించాడు. కాగా అండర్ 19 స్థాయిలో వైభవ్ కంటే ముందు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ మొయిన్ అలీ. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ 2005లో కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకన్నాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చింది. పుదుచ్చేరిలో జరిగిన వన్డే సిరీస్‌లో పర్యాటక జట్టును 3-0తో వైట్‌వాష్ చేసిన యువ భారత్.. చెన్నైలోని చెపాక్‌లో అనధికారిక తొలి టెస్టు మొదలుపెట్టింది.వైభవ్ రనౌట్ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటలోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓపెనర్లు విహాన్ మల్హోత్రా 26 పరుగులతో ఆడుతుండగా.. వైభవ్ సూర్యవంశీ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రరెడ్బాల్ మ్యాచ్‌లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడిన ఈ పదమూడేళ్ల కుర్రాడు.. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు.. ఇదే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించి.. బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.కాగా దేశవాళీ క్రికెట్లో వైభవ్ బిహార్ జట్టుకు ఆడుతున్నాడు. ఇక 12 ఏళ్ల వయసులోనే రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరు పదిహేనేళ్ల వయసులో రంజీ టోర్నీలో అడుగుపెట్టారు.చదవండి: ‘జై షా తర్వాత బీసీసీఐ కార్యదర్శి ఎవరో గానీ.. ఈసారి అక్కడ మ్యాచ్‌లు వద్దు’