Travis Head
-
CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.తొలిసారిగా ఆ ఇద్దరికి చోటుఇక బ్యాటర్ మాథ్యూ షార్ట్‌తో పాటు ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన నాథన్ ఎల్లిస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్ అయిన డేవిడ్ వార్నర్, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్ గ్రీన్, పేసర్ సీన్ అబాట్ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్ ఈ జట్టులోకి వచ్చారు.మోకాలి గాయంకాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కమిన్స్ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్, స్టార్ పేసర్ కమిన్స్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.వన్డే ప్రపంచకప్-2023 విజేతఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.గ్రూప్- ‘బి’లోఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక గ్రూప్-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఆడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే? -
టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్
ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్-2024కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం(డిసెంబర్ 29) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది.ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన అర్ష్‌దీప్ 7.49 ఏకనామీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు.ఈ ఏడాది టీ20ల్లో బాబర్ పర్వాలేదన్పించాడు. 23 ఇన్నింగ్స్‌లో 738 పరుగులతో పాక్ తరపున లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా సికిందర్ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్లో ఆల్‌రౌండ్ షోతో అదరగట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్‌లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 15 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు చేశాడు.బుమ్రాకు నో ఛాన్స్.. కాగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఎనిమిది మ్యాచ్‌లలో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. అయినప్పటికి బుమ్రాను టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయకపోవడం గమనార్హం. -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియో
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ టెస్టులో టీమిండియాకు ట్రావిస్ హెడ్ 'హెడేక్' తప్పింది. ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ డకౌటయ్యాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.దీంతో అతడు ఏడు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67వ ఓవర్ వేసిన బుమ్రా మూడో బంతిని హెడ్‌కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన హెడ్ వెనక్కి విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.కానీ వైడ్ ఆఫ్ స్టంప్ వెలుపుల పడ్డ బంతి అద్బుతంగా స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. బుమ్రా దెబ్బకు హైడ్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌పై ట్రావిస్ హెడ్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే హెడ్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలను నమోదు చేసి భారత్‌కు తల నొప్పిగా మారాడు.ఈ క్రమంలో నాలుగో టెస్టులో హెడ్ డకౌట్ కావడం భారత్ కలిసొచ్చే ఆంశంగా చెప్పాలి. ఇక 83 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. What a sight for an Indian fan!!! Watch on loop! #Jaspritbumrah𓃵#INDvsAUS#BGT2024pic.twitter.com/DMLC4eCyox— Cricketwood (@thecricketwood) December 26, 2024చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్‌తో గొడవ.. విరాట్ కోహ్లికి ఐసీసీ భారీ షాక్ -
హెడ్‌కు ఫిట్నెస్ పరీక్ష!
మెల్బోర్న్: భారత్‌తో నాలుగో టెస్టుకు ముందుఆ్రస్టేలియాకు ఆందోళన పెంచే విషయమిది! సిరీస్‌లో చెలరేగిపోతున్న ట్రావిస్ హెడ్ ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆడటంపై కొంత సందిగ్ధత కనిపిస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హెడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్‌కు ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్‌కు ముందు రోజు హెడ్‌కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడే టీమ్‌ను ప్రకటిస్తారు. ఈ సిరీస్‌లో హెడ్ వరుసగా 11, 89, 140, 152, 17 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ సమయంలోనే హెడ్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను ఫీల్డింగ్‌కు కూడా దిగలేదు. సోమవారం ప్రాక్టీస్‌కు పూర్తిగా దూరంగా ఉన్న అతను...మంగళవారం మాత్రం కాసేపే సాధన చేశాడు. హెడ్ స్థానం ఇంకా ఖాయం లేదని అంగీకరించిన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్... బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది లేకపోతే కచ్చితంగా బరిలోకి దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆసీస్ తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. మెక్‌స్వీనీ స్థానంలో స్యామ్ కొంటాస్ అరంగేట్రం చేయనుండగా... హాజల్‌వుడ్‌కు బదులుగా బోలండ్ జట్టులోకి వస్తాడు. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశముంది. బాక్సింగ్ డే టెస్టుకు ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.హెడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ కుంటుతూ కన్పించాడు. అతడు భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.అయితే కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. కాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల హెడ్ నాలుగో టెస్టు కోసం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్లో కూడా కన్పించలేదంట.అతడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. కాగా హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలు నమోదు చేశాడు.ఒకవేళ బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరమైతే అసీస్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు జోషల్ హాజిల్‌వుడ్ సైతం గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
‘వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం’
టీమిండియాతో మూడో టెస్టు డ్రాగా ముగియడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే తాము తప్పక గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా.. తమ జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం ఎంతో బాగుందని సహచర ఆటగాళ్లను కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆసీస్.. భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.పదే పదే అడ్డుపడ్డ వరుణుడుఅయితే, సిరీస్‌లో ఎంతో కీలకమైన మూడో టెస్టు మాత్రం డ్రాగా ముగిసిపోయింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ టెస్టుకు తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. మరోవైపు.. వెలుతురులేమి వల్ల కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.ఆది నుంచి పటిష్ట స్థితిలోనే ఆసీస్ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటలో కూడా ఇలాంటి అవాంతరాలు ఎదురుకావడంతో.. అంపైర్ల సూచన మేరకు ఆసీస్- భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ డ్రాకు అంగీకరించారు. నిజానికి గబ్బా టెస్టులో ఆది నుంచి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాల కారణంగా పైచేయి సాధించింది.భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పిందిభారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగి 445 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన చోట.. టీమిండియా మాత్రం తడబడింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77)తో పాటు ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా(10*), ఆకాశ్ దీప్(31) విలువైన ఇన్నింగ్స్ కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది.ఐదోరోజూ ఆటంకాలుఈ క్రమంలో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్.. 89/7 వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పదే పదే వర్షం రావడంతో పాటు.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేసి.. ఇరుజట్ల కెప్టెన్లను సంప్రదించారు. భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా.. ఇరువురూ డ్రాకు అంగీకరించారు. నిజానికి ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడపకపోయి ఉంటే ఫలితం వచ్చేదే.2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వర్షం పదే పదే అడుడ్డుపడింది. లేదంటే 2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం. అయినా, మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఏదేమైనా ఈ టెస్టులో మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది.మేము భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. స్టార్క్, నేను బాగానే రాణించాం. కానీ దురదృష్టవశాత్తూ మేము జోష్ హాజిల్‌వుడ్ సేవలు కోల్పోయాం. ఇక ఐదో రోజు ఆటలో కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ ఇద్దరు అద్భుతంకొత్త బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో హెడ్, స్మిత్ అద్భుతంగా ఆడారు. అలెక్స్ క్యారీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. నాథన్ లియోన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. స్టార్క్ వికెట్లు తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు.బాక్సింగ్ డే టెస్టుకు ముందు మాకు ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉండటం సంతోషం’’ అని పేర్కొన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి టెస్టు బరిలో దిగుతామని కమిన్స్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్బోర్న్లో నాలుగో టెస్టు మొదలుకానుంది.చదవండి: Kohli- Gambhir: వారికి మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ మాత్రం అలా.. వీడియో -
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా!?
భారత్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు. అయితే ఈ పర్యటనకు ఆసీస్ రెగ్యూలర్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో కమ్మిన్స్ భార్య బెకీ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్ శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తన కొడుకు అల్బీ పుట్టినప్పుడు పక్కనలేని కమ్మిన్స్.. ఈసారి రెండో బిడ్డ విషయంలో మాత్రం ఫ్యామిలీతోనే ఉండాలని భావిస్తున్నడంట. కమ్మిన్స్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్?ఇక స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.వైస్ కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. అయితే హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ క్రికెట్లో మాత్రం సారథిగా హెడ్‌కు అనుభవం ఉంది. బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా హెడ్ వహించాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. -
భారత్‌తో మూడో టెస్టు.. చరిత్ర సృష్టించిన హెడ్.. వరల్డ్ రికార్డు
భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆదివారం వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో ట్రవిస్ హెడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది.తొలిరోజు వర్షం వల్ల అంతరాయంపెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్‌బాల్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లో శనివారం మూడో టెస్టు ఆరంభమైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. కంగారూలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఆరంభంలో భారత పేసర్ల జోరుఅయితే, వర్షం కారణంగా తొలి రోజు ఆట 13.2 ఓవర్ల వద్ద ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత పేసర్లు కట్టడి చేశారు. ఓపెనర్లలో నాథన్ మెక్‌స్వీనీ(9) అవుట్ చేసిన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఉస్మాన్ ఖవాజా(21) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా బౌలర్లకు తలనొప్పిఇక ఆంధ్ర కుర్రాడు, టీమిండియా నయా సంచలనం నితీశ్ రెడ్డి మార్నస్ లబుషేన్(12)ను పెవిలియన్‌కు పంపడంతో.. 75 పరుగుల స్కోరు వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, ట్రవిస్ హెడ్ రాకతో సీన్ రివర్స్ అయింది. స్టీవ్ స్మిత్‌తో కలిసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు.ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రక్రీజులో పాతుకుపోయిన హెడ్.. ధనాధన్ బ్యాటింగ్‌తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వరల్డ్ రికార్డును సాధించాడు. ఒకే ఏడాదిలో ఒక వేదికపై రెండు ఇన్నింగ్స్‌లోనూ గోల్డెన్ డకౌట్(కింగ్ పెయిర్) కావడంతో పాటు.. అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.గత ఏడు ఇన్నింగ్స్‌లో ఇలాగబ్బా మైదానంలో గత మూడు ఇన్నింగ్స్‌లోనూ ట్రవిస్ హెడ్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం శతక్కొట్టాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత అతడి ఖాతాలో జమైంది. గబ్బా స్టేడియంలో గత ఏడు ఇన్నింగ్స్‌లో హెడ్ సాధించిన పరుగులు వరుసగా.. 84(187), 24(29), 152(148), 92(96), 0(1), 0(1), 0(1).ఇక ఒక క్యాలెండర్ ఇయర్లో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడంతో పాటు సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలోనూ ట్రవిస్ హెడ్ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో ఉన్నది వీరే..1. వాజిర్ మహ్మద్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19582. అల్విన్ కాళిచరణ్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19743. మార్వన్ ఆటపట్టు- కొలంబో ఎస్ఎస్సీ- 20014. రామ్‌నరేశ్ శర్వాణ్- కింగ్స్టన్- 20045. మహ్మద్ ఆఫ్రాఫుల్- చట్టోగ్రామ్ ఎంఏ అజీజ్- 20046. ట్రవిస్ హెడ్- బ్రిస్బేన్ గబ్బా- 2024.బుమ్రా బౌలింగ్లోఇదిలా ఉంటే.. ఆదివారం టీ విరామ సమయానికి ఆసీస్ 70 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ(65*) పూర్తి చేసుకున్నారు. కాగా టెస్టుల్లో హెడ్‌కి ఇది తొమ్మిదో శతకం. అదే విధంగా టీమిండియా మీద మూడోది. అంతేకాదు.. ఇందులో రెండు(అడిలైడ్, గబ్బా) వరుసగా బాదడం విశేషం.బ్రేక్ అనంతరం.. సెంచరీ(101) పూర్తి చేసుకున్న స్మిత్, 152 పరుగులు సాధించిన హెడ్‌ను బుమ్రా అవుట్ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి స్మిత్, పంత్‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ చేరారు.చదవండి: రోహిత్ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్HE'S DONE IT AGAIN!Travis Head brings up another hundred ⭐️#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/10yBuL883X— cricket.com.au (@cricketcomau) December 15, 2024 -
IND VS AUS: హెడ్‌కు అచ్చిరాని గబ్బా.. హ్యాట్రిక్ డకౌట్లు
ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌కు బ్రిస్బేన్‌లోని గబ్బా పిచ్ అస్సలు అచ్చిరాదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వేదికపై హెడ్ ఆడిన గత మూడు టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో గోల్డెన్ డకౌట్లయ్యాడు. గబ్బాలో హెడ్ వైఫల్యాల పరంపర 2022లో మొదలైంది. ఆ ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెడ్ కగిసో రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్ కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్కీపర్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గబ్బాలో హెడ్ మూడో గోల్డెన్ డకౌట్ కాస్త వైవిధ్యంగా జరిగింది. విండీస్ యువ పేసర్ షమార్ జోసఫ్ వేసిన అద్భుతమైన యార్కర్‌కు హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.భారత్‌పై ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోయే హెడ్, గబ్బా పిచ్‌పై మరోసారి డకౌటవుతాడా లేక యధావిధిగా తన ఫామ్‌ను కొనసాగిస్తాడా అన్నది వేచి చూడాల్సి ఉంది. హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో ఇటీవల ముగిసిన అడిలైడ్ టెస్ట్‌లో మెరుపు వేగంతో 141 పరుగులు చేశాడు. మరోవైపు గబ్బాలో భారత్ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ట్రాక్‌పై టీమిండియా గత పర్యటనలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది. నాటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (89 నాటౌట్) ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య గాబ్బా వేదికగా జరుగబోయే మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
'గిల్‌క్రిస్ట్‌లా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు.. కానీ ఇప్పుడే వద్దు'
టీమిండియాకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. భారత్ అంటే చాలు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన హెడ్.. ఆసీస్ సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శనివారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఈ డేంజరస్ ఆసీస్ బ్యాటర్‌ను అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది.అతడిని ఎలాగైనా ఆదిలోనే పెవిలియన్‌కు పంపాలని రోహిత్ అండ్ కో భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో హెడ్‌ను రికీ పోల్చాడు. అయితే ఇప్పటి నుంచే అతడిని 'గ్రేట్' అని పిలువద్దని అతడు అభిప్రాయపడ్డాడు."ట్రవిస్ హెడ్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. అయితే, ఏదో ఒక ఇన్నింగ్స్ చూపి అతడిని గ్రేట్ క్రికెటర్ అని చెప్పలేము. కానీ అతడేం చేసినా అత్యద్భుతంగా చేస్తున్నాడు. జట్టు కోసం తాను చేయగలిగినంతా చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రశంసలకు తాను అర్హుడిని కానన్నట్లుగా హుందాగా ఉంటాడు.హెడ్ బ్యాటింగ్ చేసే విధానం గిల్‌క్రిస్ట్ అప్రోచ్‌కు దగ్గరగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో రెండు స్థానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గిల్లీ, హెడ్ ఒకేలా బ్యాటింగ్ చేస్తున్నారు. గిల్లీ ఆరు లేదా ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఇప్పుడు హెడ్ ఐదో డౌన్ వచ్చి అదే పనిచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్‌తో బ్యాటింగ్ చేస్తాడు. అతడిలో ఔటవ్వతానన్న భయం కూడా కన్పించడం లేదు. ప్రతికూల ఫలితంతో అతడికి అస్సలు పనిలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడమే అతడి పని అని ఐసీసీ రివ్యూలో అతడు పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడు -
సిరాజ్.. నీకు అసలు బుద్ది ఉందా..?
అడిలైడ్ టెస్ట్ సందర్భంగా టీమిండియా పేసర్ మొహహ్మద్ సిరాజ్- ఆసీస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మధ్య జరిగిన ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు సిరాజ్ అతి చేశాడని అంటుంటే, మరికొందరు హెడ్‌ను తప్పుబడుతున్నాడు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. హెడ్‌కు ఓ డీ మెరిట్ పాయింట్ ఇవ్వగా.. సిరాజ్‌కు డీ మెరిట్ పాయింట్‌తో పాటు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.సిరాజ్-హెడ్ గొడవపై సోషల్‌మీడియాలో డిబేట్లు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ మ్యాచ్ జరుగుతుండగానే రాజీ పడ్డారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు. హెడ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అర్దం చేసుకున్నానని సిరాజ్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గొడవలో సిరాజ్ తప్పు ఎంతన్నది పక్కన పెడితే, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సిరాజ్‌ను తప్పుబట్టే వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు.హెడ్ పట్ల సిరాజ్‌ది పిచ్చి ప్రవర్తన అని దుయ్యబట్టాడు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినందుకు అభినందించాల్సి పోయి అతనితో వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఇలా అన్నాడు.హే సిరాజ్.. హెడ్ నీ బౌలింగ్‌ను నిర్దాక్షిణ్యంగా ఛేదించాడు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించాడు. నీ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సర్లు అలవోకగా కొట్టగలిగాడు. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి.. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తావా..? అసలు నీకు బుద్ధి ఉందా..? పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు. దీన్ని స్లెడ్జింగ్ అంటారా? ఇది కేవలం పిచ్చి మాత్రమే అని అన్నాడు.హెడ్‌ను అగౌరవపరిచినందుకు శ్రీకాంత్ సిరాజ్‌ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. భారత బౌలర్ల పట్ల, ముఖ్యంగా అశ్విన్ లాంటి అనుభవజ్ఞుల పట్ల హెడ్ నిర్భయ విధానాన్ని మెచ్చుకున్నాడు.శ్రీకాంత్ మాటల్లో.. "ఓ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అతని నాక్ను మెచ్చుకోవాలి. అలా చేయాల్సింది పోయి అగౌరవపరిచే రీతిలో సెండ్ ఆఫ్ ఇస్తావా..? నువ్వు హెడ్‌ను సున్నా పరుగులకో లేక పది పరుగులకో ఔట్ చేసి ఉంటే అది వేరే విషయం. నువ్వు ఏదో ప్లాన్ చేసి అతని వికెట్ తీసినట్లు సంబురపడిపోయావు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించిన విషయం ఎలా మరిచిపోతావు..? హెడ్ విరుచుకుపడుతుంటే ఏ ఒక్క భారత బౌలర్ దగ్గర సమాధానం లేదు. అతను ఇష్టారీతిన సిక్సర్లు కొట్టాడు. అతను అశ్విన్ అసలు స్పిన్నర్‌గా గుర్తించలేదు. వికెట్లు వదిలి ముందుకు వచ్చి అలవోకగా సిక్సర్లు బాదాడు" -
సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
అడిలైడ్: మైదానంలో భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్‌ను సిరాజ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్ వైపు నడిచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్ నియమావళిలోని 2.13 ఆరి్టకల్‌ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. సిరాజ్‌కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్ పాయింట్లకు గురైతే మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు. సిరాజ్...ఏమైనా పిచ్చిపట్టిందా? సిరాజ్ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్‌లో అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్ లేదంటే 10 పరుగుల లోపు అవుట్ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
సిరాజ్, హెడ్లకు షాకిచ్చిన ఐసీసీ
టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్లకు ఐసీసీ షాకిచ్చింది. భారత్-ఆసీస్ మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్‌లో వీరిద్దరూ పరస్పరం దూషించుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఐసీసీ వీరిద్దరి మ్యాచ్ ఫీజుల్లో 20 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గానూ వీరిద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కూడా లభించింది. గత 24 నెలల్లో చేసిన మొదటి తప్పిదం కావడంతో సిరాజ్, హెడ్ నిషేధం బారి నుంచి తప్పించుకున్నారు. వీరిద్దరు తాము చేసిన తప్పిదాలను ఒప్పుకుని మ్యాచ్ రిఫరీ విధించిన పెనాల్టీని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.కాగా, అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో సిరాజ్, హెడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకుని జోష్ మీద ఉన్న హెడ్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హెడ్.. సిరాజ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇందుకు ప్రతిగా సిరాజ్ కూడా నోటికి పని చెప్పాడు. సిరాజ్ ఒక అడుగు ముందుకేసి హెడ్‌ను పెవిలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగలు చేశాడు. ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. సిరాజ్, హెడ్ మ్యాచ్ ఫీజ్‌ల్లో 20 శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్ సాంక్షన్ చేసింది.ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్‌లో సిరాజ్, బుమ్రా పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో పేక మేడలా కూలింది. నితీశ్ కుమార్ రెడ్డి మెరుపులు మినహా బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషాలేవీ లేవు. అంతకుముందు తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది. -
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
అడిలైడ్ వేదికగా భారత్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ది కీలక పాత్ర. మరోసారి భారత్‌పై హెడ్ సత్తాచాటాడు. ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. తన మెరుపు శతకంతో మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు. భారత బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 111 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 141 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్.. 4 సిక్స్‌లు, 17 బౌండరీలతో 140 పరుగులు చేశాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను హెడ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. 👉టీమిండియాపై పింక్, రెడ్, వైట్ బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరికి సాధ్యం కాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్-2023లో భారత్‌పై తొలి రెడ్ బాల్ సెంచరీని హెడ్ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో హెడ్ 163 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో(వైట్‌బాల్) భారత్‌పై హెడ్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 137 పరుగులు చేసి తమ జట్టును ఆరోసారి వన్డే వరల్డ్‌కప్‌ను అందించాడు. ఇప్పుడు పింక్‌బాల్‌తో జరిగిన టెస్టులో కూడా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం భారత్‌పై హెడ్ సెంచరీ చేయలేదు.👉అదే విధంగా డే అండ్ నైట్ టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన హెడ్.. తన రికార్డును తనే బద్దులు కొట్టాడు. 2022లో ఇంగ్లండ్‌తో హోబర్ట్ వేదికగా జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో 112 బంతుల్లో శతకం సాధించాడు. -
ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు ఐసీసీ షాక్!?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్‌ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఐసీసీ సీరియస్..!ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్ -
ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడు.. అతడు నన్ను తిట్టాడు: సిరాజ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హెడ్‌ను అద్బుతమైన యార్కర్‌తో ఔట్ చేసిన అనంతరం సిరాజ్.. కాస్త దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.అందుకు హెడ్ సైతం ఏదో అంటూ కౌంటరిచ్చాడు. దీంతో సిరాజ్ మరింత సీరియస్ అయ్యాడు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ తీరును చాలా మంది తప్పుబట్టారు. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం ట్రావిస్ హెడ్ స్పందించాడు.హెడ్ మాట్లాడుతూ.. తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నానని, అంతకుమించి ఏమి అనలేదని చెప్పుకొచ్చాడు. కానీ సిరాజ్ మాత్రం తన మాటలను తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని, అతడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని ఈ ఆసీస్ స్టార్ తెలిపాడు. అయితే తాజాగా హెడ్ వ్యాఖ్యలకు సిరాజ్ కౌంటరిచ్చాడు. హెడ్ అబద్దం చెబుతున్నాడని, నిజంగానే హెడ్ దుర్భాషలాడాడని సిరాజ్"ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత నేను నా స్టైల్లో సంబరాలు చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను అతడు దుర్భాషలాడాడు. ఇది లైవ్‌లో కూడా కన్పించింది. కావాలంటే ఇప్పుడు టీవీ రిప్లేలో కూడా చూడవచ్చు.నా సెలబ్రేషన్స్‌ను నేను చేసుకున్నా అంతే. అతడిని నేను ఏమి అనలేదు. విలేకరుల సమావేశంలో అతడు అబద్దం చెప్పాడు. అతడు నన్ను బాగా బౌలింగ్ చేశావని అనలేదు. మేము ప్రతీ ఒక్క ప్లేయర్‌ను గౌరవిస్తాము.ఎందుకంటే క్రికెట్‌ను జెంటిల్మన్ గేమ్‌గా భావిస్తాము కాబట్టి. ట్రావిస్ హెడ్ తీరు నాకు నచ్చలేదు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.చదవండి: IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. -
సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ మితిమీరి ప్రవర్తించాడు.అద్భుతమైన యార్కర్‌తో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అతడి వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు హెడ్ రియాక్ట్ కావడంతో సిరాజ్ మరింత రెచ్చిపోయాడు. ఆడింది చాలు ముందు ఇక్కడ నుంచి వెళ్లు అన్నట్లు సైగలు చేశాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత ఈ హైదరాబాదీ అసీస్ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ను చేస్తున్న సిరాజ్‌ను ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ ఫీల్డింగ్ పొజిషన్‌ను మార్చేశాడు.ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అద్బుతమైన సెంచరీ చేసిన ఆటగాడి పట్ల సిరాజ్ ప్రవర్తించిన తీరు సరికాదని గవాస్కర్ మండిపడ్డాడు."సిరాజ్ అలా ప్రవర్తించడం సరి కాదు. హెడ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడేమి నాలుగైదు పరుగులు చేసి ఔట్ కాలేదు. 140 పరుగులు చేసిన ఆటగాడిని గౌరవించాల్సింది పోయి అంత ఆగ్రహాంగా సెంఢాఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సిరాజ్ ఇలా చేసినందుకు ఆసీస్ అభిమానుల నుంచి వచ్చిన ప్రతిస్పందన నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు.ట్రావిస్ హెడ్ లోకల్ హీరో. సెంచరీ చేసి ఔటైన తర్వాత సిరాజ్ చప్పట్లు కొట్టి అతడిని అభినందించి ఉంటే కచ్చితంగా హీరో అయ్యి ఉండేవాడు. కానీ మితి మీరి ప్రవర్తించడంతో సిరాజ్ ఇప్పుడు విలన్ అయ్యాడు" అని స్టార్ స్పోర్ట్స్ టీ టైమ్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రాకు గాయం.. కీలక అప్డేట్ ఇచ్చిన బౌలింగ్ కోచ్ -
భారత్‌కు ‘హెడ్’పోటు...
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్...వన్డే వరల్డ్ కప్ ఫైనల్...గతంలో రెండు కీలక సందర్భాల్లో భారత్ ఓటమిని శాసించిన ట్రవిస్ హెడ్ మరోసారి మనపై చెలరేగిపోయాడు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడిన అతను మెరుపు సెంచరీతో రెండో టెస్టులో ఆ్రస్టేలియాకు విజయావకాశం కల్పించాడు. 157 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన రోహిత్ సేన ఇంకా ఆ లోటును పూడ్చుకోకుండానే సగం వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతానికి ఆసీస్‌దే పూర్తి ఆధిపత్యం కాగా... పంత్, నితీశ్ పోరాటంపైనే ఆదివారం భారత్ ఆశలు మిగిలి ఉన్నాయి. అడిలైడ్: గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టులో భారత్ వైఫల్యం రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగింది. ముందుగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియా భారీ ఆధిక్యంతో అదరగొట్టగా... టీమిండియా ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (141 బంతుల్లో 140; 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం శనివారం ఆట ముగిసే సమయానికి రోహిత్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (24; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (28; 3 ఫోర్లు) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. రిషబ్ పంత్ (25 బంతుల్లో 28 బ్యాటింగ్; 5 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్... కంగారూల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. లబుషేన్ అర్ధ సెంచరీ... ఓవర్‌నైట్ స్కోరు 86/1తో ఆసీస్ రెండో రోజు ఆటను కొనసాగించింది. మరోసారి బుమ్రా చెలరేగిపోతూ 13 బంతుల వ్యవధిలో మెక్‌స్వీనీ (109 బంతుల్లో 39; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (2)లను పెవిలియన్ పంపించాడు. అయితే లబుషేన్, హెడ్ భాగస్వామ్యంలో ఆసీస్ కోలుకుంది. భారత బౌలర్లను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా భారీగా పరుగులిచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మార్నస్ లబుషేన్ ఎట్టకేలకు 114 బంతుల్లో అర్ధ శతకంతో టచ్‌లోకి వచ్చాడు. రాణా ఓవర్లో అతను మూడు ఫోర్లు బాదడం విశేషం. ఎట్టకేలకు లబుషేన్‌ను అవుట్ చేసి నితీశ్ ఈ జోడీని విడదీయగా... మరో ఎండ్‌లో హెడ్ తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన అతను 63 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మిచెల్ మార్‡్ష (9), క్యారీ (15) కొద్ది సేపు హెడ్‌కు అండగా నిలిచారు. అశ్విన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచి్చన మార్‡్ష అంపైర్ నిర్ణయం కోసం కూడా చూడకుండా వెళ్లిపోయాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది! వికెట్లు పడినా మరో వైపు జోరు తగ్గించని హెడ్‌కు హాఫ్ సెంచరీ నుంచి శతకం అందుకునేందుకు 48 బంతులు సరిపోయాయి. రాణా వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను 111 బంతుల్లో కెరీర్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం రాణా మరో ఓవర్లో అతను మళ్లీ మూడు ఫోర్లు కొట్టాడు. భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత హెడ్ సహా 27 పరుగుల వ్యవధిలో ఆస్ట్రేలియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు 54.3 ఓవర్లు ఆడిన ఆ జట్టు 251 పరుగులు జోడించింది. కోహ్లి, రోహిత్ విఫలం... ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అప్పటికే ప్రత్యరి్థకి భారీ ఆధిక్యం సమర్పించుకున్న భారత్... నాలుగో ఓవర్లోనే కేఎల్ రాహుల్ (7) వికెట్ కోల్పోయింది. అయితే యశస్వి జైస్వాల్, గిల్ నిలకడగా ఆడటంతో మళ్లీ ఆశలు చిగురించగా... బోలండ్ టీమిండియాను దెబ్బకొట్టాడు. మొదట జైస్వాల్‌ను అవుట్ చేసిన అతడు... కాసేపటికి విరాట్ కోహ్లి (11)ని కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత గిల్‌ను అద్భుత బంతితో స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేయగా...కమిన్స్ వేసిన పదునైన ఇన్‌స్వింగర్ కెపె్టన్ రోహిత్ శర్మ (6) స్టంప్స్‌ను ఎగరగొట్టింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన పంత్, నితీశ్ మరో 19 బంతుల పాటు వికెట్ పడకుండా ఆటను ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనీ (సి) పంత్ (బి) బుమ్రా 39; లబుõÙన్ (సి) జైస్వాల్ (బి) నితీశ్ రెడ్డి 64; స్మిత్ (సి) పంత్ (బి) బుమ్రా 2; హెడ్ (బి) సిరాజ్ 140; మార్‡్ష (సి) పంత్ (బి) అశ్విన్ 9; క్యారీ (సి) పంత్ (బి) సిరాజ్ 15; కమిన్స్ (బి) బుమ్రా 12; స్టార్క్ (సి) హర్షిత్ (బి) సిరాజ్ 18; లయన్ (నాటౌట్) 4; బోలండ్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (87.3 ఓవర్లలో ఆలౌట్) 337. వికెట్ల పతనం: 1–24, 2–91, 3–103, 4–168, 5–208, 6–282, 7–310, 8–332, 9–332, 10–337, బౌలింగ్: బుమ్రా 23–5–61–4; సిరాజ్ 24.3–5–98–4; హర్షిత్ 16–2–86–0; నితీశ్ రెడ్డి 6–2–25–1; అశ్విన్ 18–4–53–1. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) క్యారీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) క్యారీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 11; పంత్ (బ్యాటింగ్) 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (24 ఓవర్లలో 5 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, బౌలింగ్: స్టార్క్ 9–0–49–1; కమిన్స్ 8–0–33–2; బోలండ్ 7–0–39–2. హెడ్ X సిరాజ్ అడిలైడ్ ట్రవిస్ హెడ్ సొంత మైదానం. చుట్టూ 51,642 మంది ప్రేక్షకులు...99.29 స్ట్రైక్‌రేట్‌తో చేసిన మెరుపు సెంచరీతో స్టేడియం ఊగిపోతోంది...ఎట్టకేలకు ఆసీస్ ఆధిక్యం 130 పరుగులకు చేరాక ఒక ఫుల్‌టాస్ యార్కర్‌తో హెడ్‌ను సిరాజ్ బౌల్డ్ చేసి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. అంతటితో ఆగిపోకుండా పెవిలియన్ వైపు వెళ్లమంటూ రెండు సార్లు సైగ కూడా చేశాడు. హెడ్ కూడా ఏదో చెబుతూ నిష్క్రమించాడు. కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు. తమ బ్యాటర్‌తో తలపడిన సిరాజ్‌ను ఒక్కసారిగా అంత భారీ సమూహం గేలి చేసింది. తర్వాతి బంతికి స్టార్క్ ఫోర్ కొట్టడంతో ఇది మరింత పెరిగింది. ఆ ఓవర్ మాత్రమే కాదు...ఆ తర్వాత అతను వేసిన ప్రతీ అడుగుకు ఇలాగే స్పందించారు. సిరాజ్ డీప్ థర్డ్‌మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకుల హేళన ఇంకా పెరిగిపోవడంతో రోహిత్ అతడిని లోపలి వైపు పాయింట్ వద్దకు మార్చాల్సి వచ్చింది. సిరాజ్ బౌలింగ్‌లో హెడ్ 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఆ సిక్స్ తర్వాతి బంతికే వికెట్ దక్కింది. హెడ్ 76 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్ క్యాచ్ వదిలేశాడు కూడా. దాంతో సహజంగానే హైదరాబాదీ తన భావోద్వేగాన్ని చూపించాడు. అయితే ఏకంగా 140 పరుగులు చేసిన తర్వాత ఇలాంటి సైగలు చేయడాన్ని మాజీ క్రికెటర్ గావస్కర్ కూడా తప్పుపట్టాడు.2023 నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి ట్రవిస్ హెడ్ భారత్‌పై 19 ఇన్నింగ్స్‌లలో 61.9 సగటుతో 1052 పరుగులు చేయడం విశేషం. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇతర జట్లపై మాత్రం 54ఇన్నింగ్స్‌లలో కేవలం 36.8 సగటుతో 1875 పరుగులు మాత్రమే చేయగలిగిన అతను 3 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు సాధించాడు. -
‘ఇక్కడి నుంచి వెళ్లిపో’.. సెంచరీ వీరుడిపై కోపంతో ఊగిపోయిన సిరాజ్!
టీమిండియాతో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భారత్‌ను 180 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కమిన్స్ బృందం మరో 251 పరుగులు జమ చేసి ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(64) అర్ధ శతకంతో మెరవగా.. ఐదో నంబర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(140) భారీ శతకం బాదాడు. టీమిండియా బౌలర్లకు కొరకాని కొయ్యగా మారి.. 141 బంతుల్లోనే 140 పరుగులు స్కోరు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.అద్భుత యార్కర్‌తో హెడ్‌కు చెక్అయితే, ప్రమాదకారిగా మారిన హెడ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు భారత బౌలర్లు కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్‌కు అతడి వికెట్ దక్కించుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 82వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన సిరాజ్.. అద్భుత యార్కర్‌తో హెడ్‌ను బౌల్డ్ చేశాడు.‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ ఇక కీలక వికెట్ దక్కిన ఆనందంలో సిరాజ్.. హెడ్‌ను ఉద్దేశించి ‘‘ఇక వెళ్లు’’ అన్నట్లుగా సైగ చేస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా హెడ్ సైతం అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న సిరాజ్.. ‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ అన్నట్లు ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే, హెడ్ మాత్రం తన సెంచరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు.డీఎస్పీ సర్‌కు కోపం వచ్చిందిఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘డీఎస్పీ సర్‌కు కోపం వచ్చింది. శతకం బాదిన ఆటగాడికి తనదైన స్టైల్లో సెండాఫ్ ఇచ్చాడు’’ అంటూ అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అతి చేయవద్దు సిరాజ్.. కాస్త సంయమనం పాటించు’’ అని హితవు పలుకుతున్నారు.కాగా భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లతో చెలరేగగా..నితీశ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో 295 పరుగులతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. రెండో టెస్టులో కాస్త తడబడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి కమిన్స్ బృందం.. రోహిత్ సేనపై 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT— cricket.com.au (@cricketcomau) December 7, 2024 -
ఆసీస్ జట్టులో విభేదాలు?.. పింక్ బాల్ టెస్టు మాకూ సవాలేనన్న బ్యాటర్!
టీమిండియాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం విదితమే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు.. కంగారూలను 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది. ముఖ్యంగా బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో కమిన్స్ బృందానికి ఈ మేర ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో మొదటి టెస్టు ఫలితం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు వినిపించాయి.పెర్త్‌లో పరాజయం తర్వాత బ్యాటర్లదే తప్పు అన్నట్లుగా ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ఇవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేశాడు. విభేదాలనే మాటకు తావు లేదు‘ఏ జట్టులోనైనా గెలుపోటముల్లో బ్యాటర్లు, బౌలర్లందరి సమాన బాధ్యత ఉంటుంది. ఏ ఆటగాడైనా విజయం కోసం తాను వ్యక్తిగతంగా కూడా కీలకపాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తాడు.మేం భారీ స్కోరు చేస్తే బౌలర్ల పని సులువవుతుందని తెలుసు. కాబట్టి సమష్టిగా ఉండటం తప్ప విభేదాలనే మాటకు తావు లేదు. మేం 0–1తో వెనుకబడి ఉన్నామనేది వాస్తవం. కానీ మాకు ఇంకా చాలా అవకాశం ఉంది. ఎన్నో సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కోలుకొని చెలరేగిన సత్తా మా సొంతం’ అని హెడ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. బుమ్రా సూపర్.. ‘బుమ్రా బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మాకు అనుభవంలోకి వస్తోంది. అతను విసిరే సవాల్‌ను ఎదుర్కొంటూ పోటీ పడటం ప్రత్యేకంగా అనిపిస్తోంది. కెరీర్ ముగిసిన తర్వాత నేనూ బుమ్రాను ఎదుర్కొన్నాను అని మా మనవలకు చెప్పుకోగలను. ఈ సిరీస్‌లో మరికొన్నిసార్లు అతడితో తలపడే అవకాశం ఎలాగూ వస్తుంది. నా దృష్టిలో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోయాడు’ అని హెడ్ వ్యాఖ్యానించాడు.పెర్త్ టెస్టులో హెడ్ ఒక్కడే కాస్త బుమ్రాను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించగా... స్మిత్, లబుషేన్, ఖాజా పూర్తిగా విఫలమయ్యారు. ‘బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అయితే ఏ బౌలర్‌నైనా ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాటర్‌కు తనదైన శైలి ఉంటుంది. వారు ఎలా ఆడగలరనేది వారికి మాత్రమే తెలుసు. నేను కాస్త మెరుగ్గా ఆడినంత మాత్రాన నా సహచరులు సలహాలు, సూచనల కోసం నా వద్దకు రాలేదు కదా’ అని బుమ్రా బౌలింగ్ గురించి హెడ్ అభిప్రాయపడ్డాడు.‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందినాలుగేళ్ల క్రితం ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ 36 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తనకు గుర్తుందని, అయితే ఈసారి అలాంటిది జరగకపోవచ్చని అతను అన్నాడు. తాము కూడా ‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందని... పరిస్థితులకు తగినట్లుగా మన ఆటను మార్చుకోవడమే ఇరు జట్లకు కీలకమని హెడ్ చెప్పాడు. కాగా భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: ‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’ -
ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: ఆసీస్ స్టార్ బ్యాటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకడని కొనియాడాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం తనకు దక్కిన గౌరవమని.. తన మనవళ్లకు కూడా ఈ విషయం గురించి గర్వంగా చెప్పగలనంటూ బుమ్రాను ఆకాశానికెత్తాడు.భారత జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించి.. కంగారూ గడ్డపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.ఇటు కెప్టెన్‌గా.. అటు బౌలర్గానూఫలితంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇటు కెప్టెన్‌గా.. అటు బౌలర్‌గానూ బుమ్రాకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో రైటార్మ్ పేసర్ బుమ్రా మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి.. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలుచేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బుమ్రా వంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కొన్నాననిఈ నేపథ్యంలో బుమ్రా నైపుణ్యాలను కొనియాడిన ఆసీస్ టెస్టు మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్పనైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా ఎదుగుతాడు. మన కెరీర్ ముగిసిన తర్వాత.. వెనక్కి తిరిగి చూసుకుంటే.. బుమ్రా వంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కొన్నానని మనవలు, మనవరాళ్లకు చెప్పడం ఎంతో బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు.89 పరుగులతో ఆసీస్ టాప్ స్కోరర్గాకాగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసి.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో హెడ్ బౌల్డ్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో ఆసీస్ టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్‌గా హెడ్ ఆరెంజ్ ఆర్మీకి ఫేవరెట్ ప్లేయర్‌గా మారిపోయిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. భారత్- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. డిసెంబరు 6- 10 వరకు పింక్ బాల్‌తో ఈ మ్యాచ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. రెండో టెస్టు ఎన్నిరోజుల పాటు సాగనుందనే అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.గిల్ అర్ధ శతకంకాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో బుమ్రా రోహిత్ సారథ్యంలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. గాయం నుంచి కోలుకున్న భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కూడా తిరిగి జట్టుతో చేరాడు. గులాబీ బంతితో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అర్ధ శతకం(50- రిటైర్డ్ హర్ట్)తో చెలరేగాడు. రోహిత్ మాత్రం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: SMAT 2024 PUN Vs HYD: తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం -
రోహిత్ నిర్ణయం సరైనదే.. నేనైనా అలానే చేసేవాడని: హెడ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ (Border-Gavaskar Trophy) ప్రారంభానికి సమయం అసన్నమైంది. మరో రెండు రోజుల్లో భారత్-ఆసీస్ మధ్య ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి తెరలేవనుంది. ఈ బీజీటీ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.రోహిత్ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ జట్టుతో పాటు ఆస్టేలియాకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే మరి కొన్ని రోజుల పాటు భార్యతో పాటే ఉండాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పెర్త్ టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు.అయితే రోహిత్ నిర్ణయాన్ని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా తప్పుబట్టారు. ముందుగానే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టులో ఆడింటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాత్రం రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హెడ్ తెలిపాడు."రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం వంద శాతం సరైనదే. అతడికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. అదే పరిస్థితిలో నేను ఉన్నా రోహిత్‌లానే ఆలోచిస్తాను. క్రికెటర్లగా మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము. వృత్తిని, ఫ్యామిలీని రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్‌లు కూడా కోల్పోవాల్సి వస్తుంది.ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు మంచి రికార్డు ఉంది. గత రెండు పర్యటనలలో కీలక ఆటగాళ్లు గాయాలతో దూరంగా ఉన్నప్పటికి భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. మా దృష్టిలో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ పేర్కొన్నాడు.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
తండ్రైన సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు..
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ రెండో సారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా సోమవారం పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ శుభవార్తను జెస్సికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. తన భర్త హెడ్, కుమార్తె మీలా, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను జెస్సికా షేర్ చేసింది.హెడ్-జెస్సికా జోడీ తమ కుమారుడికి హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. "వెల్కమ్ టూ వరల్డ్ హారిసన్ జార్జ్ హెడ్" అంటూ ఆమె క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. కాగా వీరిద్దిరికి తొలి సంతానంగా 2022 ఏడాదిలో మీలా జన్మించింది.బీజీటీతో రీఎంట్రీ?ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న హెడ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన కుటుంబంతో సమయం గడిపేందుకు పాకిస్తాన్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు హెడ్ దూరమయ్యాడు. అతడు తిరిగి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 22న పెర్త్‌లో ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఎస్ఆర్హెచ్ రిటైన్..ఇక ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ట్రావిస్ హెడ్ విధ్వంసకర ప్రదర్శనలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన హెడ్.. 191.55 స్ట్రైక్ రేటుతో 567 పరుగులు చేశాడు. దీంతో హెడ్‌ను ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. View this post on Instagram A post shared by JESSICA DAVIES (@jess_head) -
ఐదో వన్డేలో ఆసీస్ విజయం.. సిరీస్ కైవసం
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆస్ట్రేలియా స్కోర్ 165/2 (20.4 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ ఇంగ్లండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉంది.డకెట్ సెంచరీఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (52 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించారు. విల్ జాక్స్ (0), జేమీ స్మిత్ (6), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జేకబ్ బేథెల్ (13), బ్రైడన్ కార్స్ (9), మాథ్యూ పాట్స్ (6) విఫలం కాగా.. ఆఖర్లో ఆదిల్ రషీద్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ (25 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆడాడు. రషీద్ ఈ పరుగులు చేయకుండి ఉంటే ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును తాకేది కాదు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో రెండో వికెట్లు దక్కించుకున్నారు.రాణించిన షార్ట్ఛేదనలో ఆస్ట్రేలియా ఆది నుంచి వేగంగా ఆడింది. తొలి 10 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్కును దాటింది. మాథ్యూ షార్ట్ మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 58; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా.. బంతితో మ్యాజిక్ చేసిన ట్రవిస్ హెడ్ ఓ మోస్తరు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడాడు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి స్టీవ్ స్మిత్ (48 బంతుల్లో 36), జోష్ ఇంగ్లిస్ (20 బంతుల్లో 28) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బంతితో రాణించి, సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో అలరించిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేలు, ఐదో వన్డే ఆసీస్ గెలువగా.. ఇంగ్లండ్ మూడు, నాలుగు వన్డేల్లో విజయాలు సాధించింది.చదవండి: భారత్‌తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన