సన్‌రైజర్స్ (PC: SRH X)
ఐపీఎల్-2024 ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ముందంజ వేయలేదని అభిప్రాయపడ్డాడు.
సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే
ఈ మేరకు.. ‘‘సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే. వీరిద్దరూ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8- 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.
ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అతడు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ తిరిగి పుంజుకోగలడనే ఆశిద్దాం.
ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు
ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో అవుట్ చేసినప్పటికీ ట్రెంట్ బౌల్ట్ అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన హెడ్ బాగా ఆడాడు.
అర్ధ శతకం కూడా సాధించాడు. అయితే, ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు మరింత గట్టిగానే ప్రయత్నం చేయడం ఖాయం. ట్రావిస్ హెడ్ గనుక ఈసారి పరుగులు రాబట్టకపోతే సన్‌రైజర్స్ ముందుకు సాగలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
ట్రావిస్ హెడ్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణిస్తే మాత్రం రాజస్తాన్ బౌలర్లు వాళ్లను ఆపలేరని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌లో దుమ్ములేపుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా జోస్యం చెప్పాడు.
వరుసగా రెండుసార్లు డకౌట్
కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు మ్యాచ్‌లలో హెడ్ లెఫ్టార్మ్ సీమర్ల చేతికి చిక్కి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.
ఈ క్రమంలో క్వాలిఫయర్-2లో రాజస్తాన్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి అతడికి గండం పొంచి ఉంది. కాగా ఈ సీజన్‌లో హెడ్ ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడి 199.62 స్ట్రైక్‌రేటుతో 533 పరుగులు సాధించాడు.
చదవండి: T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం
Comments
Please login to add a commentAdd a comment