trent boult
-
ప్రపంచంలో ఆ ఐదుగురే అత్యుత్తమ బౌలర్లు..!
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచంలో తాను మెచ్చిన ఐదుగురు అత్యుత్తమ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో రషీద్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఆతర్వాత ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిదికి చోటిచ్చాడు. ఆదిల్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు.కాగా, ఆదిల్ రషీద్ ఎంపిక చేసిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు కలిగి ఉన్నాడు. స్టార్క్ తన కెరీర్లో ఇప్పటివరకు 673 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటిదాకా 611 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో బుమ్రా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు 397 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 313 వికెట్లు ఉన్నాయి. ఆదిల్ ఎంపిక చేసిన అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చివరి స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఆర్చర్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 115 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
చివరి మ్యాచ్ ఆడేశాను: ట్రెంట్ బౌల్ట్ భావోద్వేగం
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ జట్టు తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినట్లు ప్రకటించాడు.గత రెండు రోజులుగా ఎన్నో భావోద్వేగాలు తనను చుట్టుముట్టాయని.. ఈ అనుభూతి కొత్తగా ఉందని పేర్కొన్నాడు. ఏదేమైనా తన చివరి మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించానని బౌల్ట్ సంతోషం వ్యక్తం చేశాడు.న్యూజిలాండ్ చెత్త ప్రదర్శనటీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో భాగంగా పపువా న్యూగినియాతో మ్యాచ్ అనంతరం బౌల్ట్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. దీంతో న్యూజిలాండ్ క్రికెటర్‌గా బౌల్ట్ పదమూడేళ్ల ప్రయాణానికి తెరపడినట్లయింది.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. గ్రూప్-సిలో ఉన్న కివీస్ జట్టు.. తొలి రెండు మ్యాచ్‌లలో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది.ఫలితంగా సూపర్-8 నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్.. అనంతరం ఉగాండా.. తాజాగా పపువా న్యూగినియాపై గెలుపొంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో పపువా న్యూగినియాపై విజయం తర్వాత బౌల్ట్ మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి సంకేతాలు ఇచ్చాడు. అయితే, కేవలం అంతర్జాతీయ టీ20లకు మాత్రమే అతడు గుడ్‌బై చెప్పాడా అనే చర్చ నడుస్తోంది.టెస్టుల్లో దుమ్ము లేపి2011లో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ట్రెంట్ బౌల్ట్. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున 78 టెస్టులాడి ఏకంగా 317 వికెట్లు కూల్చాడు.ఇక 114 వన్డేల్లో 211 వికెట్లు తీసిన బౌల్ట్.. 61 టీ20లు ఆడి 83 వికెట్లు పడగొట్టాడు. అయితే, బౌల్ట్ రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ క్రికెట్లో ఆడే క్రమంలో అంతర్జాతీయ విధులకు కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో తిరిగి కివీస్ జట్టుతో కలిసి బౌల్ట్.. నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా తొమ్మిది వికెట్లు తీశాడు.ఇక బౌల్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ఇప్పట్లో తాను తన టీ20 కెరీర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు. చదవండి: BCCI: ద్రవిడ్‌తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్? View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
వారెవ్వా సకిబ్.. నాలుగు ఓవర్లు.. 7 పరుగులు! 4 వికెట్లు
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో బంగ్లా జట్టు తమ సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా బంగ్లా విజయంలో ఆ జట్టు యువ పేసర్ తంజిమ్ హసన్ షకిబ్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో తంజిమ్ హసన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన పేస్ బౌలింగ్‌తో నేపాల్ బ్యాటర్లకు తంజిమ్ చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్ దాటికి నేపాల్ పట్టుమని పదినిమిషాలు క్రీజులో నిలబడలేకపోయారు.ఈ మ్యాచ్‌లో తంజిమ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా అతడి బౌలింగ్ కోటాలో రెండు మెయిడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. దీంతో బంగ్లాదేశ్ 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోగలిగింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తంజిమ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక డాట్‌బాల్స్ వేసిన బౌలర్‌గా సకిబ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో సకిబ్ 21 డాట్ బాల్స్ వేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పేరిట ఉండేది. బౌల్డ్ 20 డాట్‌బాల్స్ వేశాడు. తాజా మ్యాచ్‌తో బౌల్ట్ అల్‌టైమ్ రికార్డును సకిబ్ బ్రేక్ చేశాడు. -
పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు తొలి విజయం.. ఏం లాభం?
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఉగాండాను చిత్తుగా ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది.ఈ మెగా ఈవెంట్లో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాలో కలిసి గ్రూప్-సిలో ఉన్న న్యూజిలాండ్.. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.మొదట అఫ్గనిస్తాన్ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కేన్ విలియమ్సన్ బృందం.. తదుపరి వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.మరోవైపు.. అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ వరుస విజయాలతో రాణించి.. సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో న్యూజిలాండ్ కథ ముగిసిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కివీస్.. తాజాగా శనివారం నాటి మ్యాచ్‌లో పసికూన ఉగాండాపై ప్రతాపం చూపింది.ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టిమ్ సౌతీ(3/4), ట్రెంట్ బౌల్ట్(2/7), లాకీ ఫెర్గూసన్(1/9).. స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్(2/8), రచిన్ రవీంద్ర(2/9) ఆకాశమే హద్దుగా చెలరేగారు.దీంతో ఉగాండా 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఉగాండా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ 11గా నమోదైంది. ఇక అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(15 బంతుల్లో 22), రచిన్ రవీంద్ర(1)తో కలిసి అజేయంగా నిలిచి.. కివీస్ విజయాన్ని ఖరారు చేశాడు.ఫలితంగా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన న్యూజిలాండ్ వరల్డ్‌కప్-2024లో పాయింట్ల ఖాతా తెరిచింది. తదుపరి జూన్ 17న పపువా న్యూగినియాతో కివీస్ జట్టు తలపడనుంది. కాగా ఉగాండాపై న్యూజిలాండ్ విజయం నేపథ్యంలో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటి గెలిచిందని కొంతమంది సంతోషిస్తుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే..
ఐపీఎల్-2024 ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ముందంజ వేయలేదని అభిప్రాయపడ్డాడు.సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లేఈ మేరకు.. ‘‘సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే. వీరిద్దరూ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8- 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అతడు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ తిరిగి పుంజుకోగలడనే ఆశిద్దాం.ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకుఈ సీజన్లో ట్రావిస్ హెడ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో అవుట్ చేసినప్పటికీ ట్రెంట్ బౌల్ట్ అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన హెడ్ బాగా ఆడాడు.అర్ధ శతకం కూడా సాధించాడు. అయితే, ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు మరింత గట్టిగానే ప్రయత్నం చేయడం ఖాయం. ట్రావిస్ హెడ్ గనుక ఈసారి పరుగులు రాబట్టకపోతే సన్‌రైజర్స్ ముందుకు సాగలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ట్రావిస్ హెడ్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణిస్తే మాత్రం రాజస్తాన్ బౌలర్లు వాళ్లను ఆపలేరని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో దుమ్ములేపుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా జోస్యం చెప్పాడు.వరుసగా రెండుసార్లు డకౌట్‌కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు మ్యాచ్‌లలో హెడ్ లెఫ్టార్మ్ సీమర్ల చేతికి చిక్కి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్వాలిఫయర్-2లో రాజస్తాన్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి అతడికి గండం పొంచి ఉంది. కాగా ఈ సీజన్లో హెడ్ ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడి 199.62 స్ట్రైక్‌రేటుతో 533 పరుగులు సాధించాడు.చదవండి: T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం -
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే.ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు.మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు.నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది.అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా.అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను.ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
చితక్కొట్టేశాడు.. బౌల్ట్‌కు చుక్కలు చూపించాడు!
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు పునరాగమనంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కివీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌లో.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ చితక్కొట్టాడు. కాగా కివీస్ పర్యటనలో భాగంగా ఆసీస్ ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి అక్లాండ్ వేదికైంది. ఈడెన్ పార్క్ మైదానంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కివీస్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన ట్రెంట్ బౌల్ట్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. మొదటి ఓవర్ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన హెడ్.. ఆ తర్వాత పరుగు తీయలేకపోయినా.. మరుసటి బంతికి సిక్సర్ బాదాడు. అదే జోరును కొనసాగిస్తూ వరుసగా మరో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఇలా బౌల్ట్ బౌలింగ్‌లో ఒక్క ఓవర్లోనే 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్‌లో బౌల్ట్ ఏకంగా 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 45), కెప్టెన్ మిచెల్ మార్ష్(26), ప్యాట్ కమిన్స్(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. ఆడం మిల్నే, బెన్ సియర్స్, మిచెల్ సాంట్నర్ తలా రెండు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడే క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్ కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2022 నవంబరులో కివీస్ తరఫున ఆఖరి టీ20 ఆడిన బౌల్ట్.. 2023లో వన్డే ఆడాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా టిమ్ సౌతీ స్థానంలో జట్టులోకి వచ్చాడు. -
ఉత్కంఠ సమరంలో చివరి బంతికి విజయం.. వైపర్స్‌ను గెలిపించిన అఫ్రిది
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో నిన్న మరో రసవత్తర సమరం జరిగింది. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి బంతికి వైపర్స్ మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్) కావాల్సిన పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఫలితంగా వైపర్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో వైపర్స్‌కు ఇది రెండో విజయం. pic.twitter.com/s2yg5r0O5B — Jas Pope (@jas_pope93438) January 30, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. మొహమ్మద్ ఆమీర్ (4-0-26-3), లూక్ వుడ్ (4-0-32-2), మతీష పతిరణ (4-0-32-2), హసరంగ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (28), అకీల్ హొసేన్ (24), అంబటి రాయుడు (23) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన వైపర్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహీన్ అఫ్రిది చివరి బంతికి మూడు పరుగుల తీసి వైపర్స్‌ను గెలిపించాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. అఫ్రిది, లూక్ వుడ్ (6 నాటౌట్) సాయంతో తన జట్టును గెలిపించాడు. వైపర్స్ ఇన్నింగ్స్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (35), హసరంగ (26), ఆజమ్ ఖాన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిద్ ఖాన్ 3 వికెట్లతో వైపర్స్‌ను ఇబ్బంది పెట్టగా.. ఫజల్ హక్ ఫారూకీ, డ్వేన్ బ్రావో తలో 2 వికెట్లు, సలామ్‌కీల్ ఓ వికెట్ పడగొట్టారు. -
క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్.. పక్షిలా ఎగురుతూ! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. అబుదాబి బ్యాటర్ లారీ ఎవాన్స్‌ను సంచలన క్యాచ్‌తో బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. అబుదాబి ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్ ఆఫ్‌లో ఉన్న బౌల్ట్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఎవాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బౌల్ట్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ విజయం సాధించింది. N̶o̶ f̶l̶y̶ z̶o̶n̶e̶ this term doesn't exist in Boult's dictionary ✈️ #MIEvADKR | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/RUPxDCx488 — Zee Cricket (@ilt20onzee) January 28, 2024 -
జీరో దగ్గర వదిలేశాడు.. ఏకంగా విధ్వంసం సృష్టించేశాడు! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటిల్స్ శుభారంభం చేసింది. శనివారం ఎంఐ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్(81) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొంపముంచిన ట్రెంట్ బౌల్ట్.. దుబాయ్ క్యాపిటిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్బాజ్‌కు ఆరంభంలోనే ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అవకాశమిచ్చేశాడు. సున్నా పరుగుల వద్ద గుర్బాజ్ ఇచ్చిన ఈజీ రిటర్న్ క్యాచ్‌ను బౌల్ట్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు ఎంఐ ఎమిరేట్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత గుర్భాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీల వర్షం కురిపించాడు. గుర్బాజ్ ఏకంగా 81 పరుగులతో విజయాన్ని ముంబైకు దూరం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఒక వేళ గుర్భాజ్ క్యాచ్‌ను బౌల్ట్ పట్టివుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌల్ట్ విడిచిపెట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🫣 🫣#DCvMIE | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee | @ILT20Official pic.twitter.com/9D7H6fB9H8 — Zee Cricket (@ilt20onzee) January 20, 2024 -
సెమీస్ లక్ష్యంగా! న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ.. లంక 171 ఆలౌట్
ICC Cricket World Cup 2023- New Zealand vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించారు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. నాలుగో స్థానం కోసం కివీస్ పోరాడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఓపెనర్ పాతుమ్ నిసాంక(2)ను టిమ్ సౌథీ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(6)ను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. అంతేకాదు.. నాలుగో స్థానంలో వచ్చిన సమరవిక్రమ(1), ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక(8)ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ కుశాల్ పెరీరా పట్టుదలగా నిలబడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో అర్థ శతకం సాధించి.. లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి పెరీరాకు సహకారం కరువైంది. దీంతో లంక స్కోరు బోర్డు నత్తనడకన సాగుతుండగా.. పెరీరా వికెట్ తీసి లాకీ ఫెర్గూసన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్ మూడో బంతికి ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరీరా వెనుదిరిగాడు. దీంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడు. పవర్ ప్లే ముగిసే లోపే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ కుశాల్ పెరీరా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 74 పరుగులు చేసిన శ్రీలంకను.. ఆ తర్వాత కివీస్ బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు పడగొట్టారు. అయితే మహీశ్ తీక్షణ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 46.4 ఓవర్లలో 171 పరుగులకు లంక ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ మూడు, ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. సౌథీకి ఒక వికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని వీలైనన్ని తక్కువ బంతుల్లో ఛేదించి రన్‌రేటు మెరుగుపరచుకోవడంపైనే న్యూజిలాండ్ దృష్టి సారించింది. అయితే, ఓవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు.. గత ముఖాముఖి పోరు ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు ప్రస్తుతానికి వరుణుడు, లంక బౌలర్ల ప్రదర్శన తీరుపైనే ఆధారపడి ఉన్నాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్.. తొలి కివీస్ బౌలర్‌గా
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50కు పైగా వికెట్లు సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా బౌల్ట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో కుశాల్ మెండిస్‌ను ఔట్ చేసిన బౌల్ట్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో టోర్నీలో బౌల్ట్ ఇప్పటివరకు 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా బౌల్ట్ నిలిచాడు. బౌల్ట్ కంటే ముందు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు వసీం అక్రమ్, మిచిల్ స్టార్క్ ఈ ఘనత సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన లిస్ట్‌లో బౌల్ట్ ఆరో స్ధానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్(71 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్(68), స్టార్క్(59), లసిత్ మలింగ(56), వసీం అక్రమ్(55) ఉన్నారు. చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత.. కివీస్ తొలి బౌలర్‌గా..
ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అంతర్జాతీయ వన్డేల్లో చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా.. బంగ్లా క్రికెటర్ తౌహిద్ హృదోయ్ వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. కాగా చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్ అటాకింగ్ ఆరంభించిన ఫాస్ట్‌బౌలర్ బౌల్ట్.. ఇన్నింగ్స్ తొలి బంతికే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. షకీబ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అదరగొట్టిన ముష్షికర్, మహ్మదుల్లా ఆరంభంలోనే ఇలా షాకిచ్చినప్పటికీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(40), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం(66) బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరితో పాటు.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మదుల్లా 41 పరుగులతో రాణించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. వీరి ముగ్గురి నిలకడైన ఆట కారణంగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఆరంభంలో లిటన్ దాస్ వికెట్ తీసిన ట్రెంట్ బౌల్ట్.. 37.5వ ఓవరల్లో తౌహిద్‌ను నకుల్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన తౌహిద్.. బాల్‌ను గాల్లోకి లేపగా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ సాంట్నర్ ఒడిసిపట్టాడు. చరిత్ర సృష్టించిన బౌల్ట్.. వన్డేల్లో తొలి కివీస్ బౌలర్‌గా ఘనత కాగా అంతర్జాతీయ వన్డేల్లో బౌల్ట్‌కు ఇది 200వ వికెట్. ఈ క్రమంలో తక్కువ మ్యాచ్‌లలోనే 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ మైలురాయిని చేర్చుకున్న కివీస్ తొలి బౌలర్‌గా బౌల్ట్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా.. అంతర్జాతీయ వన్డే హిస్టరీలో తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. తక్కువ మ్యాచ్‌లలోనే అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 102 ►సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్)- 104 ►ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్)- 107 ►బ్రెట్ లీ(ఆస్ట్రేలియా)- 112 ►అలెన్ డొనాల్డ్(సౌతాఫ్రికా)- 117 వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని తక్కువ బంతుల్లో అందుకున్నది వీళ్లే ►మిచెల్ స్టార్క్- 5240 ►సక్లెయిన్ ముస్తాక్- 5451 ►బ్రెట్ లీ- 5640 ►ట్రెంట్ బౌల్ట్- 5783 చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ View this post on Instagram A post shared by ICC (@icc) -
లివింగ్ స్టోన్ అద్భుత ఇన్నింగ్స్.. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 79 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను లైమ్ లివింగ్ స్టోన్(95 నాటౌట్), సామ్ కుర్రాన్(42) పరుగులతో అదుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో పడగొట్టగా.. సౌథీ రెండు, హెన్రీ, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 147 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(57) మినహా మిగితా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, టోప్లీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ రెండు, అటిక్కిన్ సన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 13న లండన్ వేదికగా జరగనుంది. చదవండి: వాన వచ్చింది... ఆట ఆగింది -
ENG VS NZ 2nd ODI: రీఎంట్రీలో ఇరగదీసిన బౌల్ట్.. అద్భుత గణాంకాలు
ఓ రోజు తక్కువ ఏడాది తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కివీస్ పేస్ గన్ ట్రెంట్ బౌల్ట్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. వచ్చీ రాగానే బౌల్ట్ తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్‌తో వారి స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన బౌల్ట్ తాను సంధించిన తొలి 17 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. ☝️ Jonny Bairstow ☝️ Joe Root ☝️ Ben Stokes Trent Boult strikes thrice in the first 15 balls on his ODI return at The Rose Bowl⚡⚡⚡#ENGvNZ pic.twitter.com/weUjfflBuH — CricTracker (@Cricketracker) September 10, 2023 బౌల్ట్ పడగొట్టిన వికెట్లు ఆషామాషీ ఆటగాళ్లవనుకుంటే పొరపాటే. ప్రపంచ క్రికెట్లో అతి భయంకర ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్‌లను బౌల్ట్ వరుస పెట్టి పెవిలియన్‌కు సాగనంపాడు. సాంట్నర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో బెయిర్‌స్టో (6), ఎల్బీడబ్ల్యూగా రూట్ (0), సౌథీ క్యాచ్ పట్టడంతో స్టోక్స్ (1) పెవిలియన్ బాటపట్టారు. బౌల్ట్‌తో పాటు మరో పేసర్ మ్యాట్ హెన్రీ (4-1-17-1), స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ (4-0-15-1) ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కకావికలమైంది. Mitch Santner with an assist for Trent Boultpic.twitter.com/SDynAvFU7V — CricTracker (@Cricketracker) September 10, 2023 12.1 ఓవర్లలో ఆ జట్టు 55 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. హ్యారీ బ్రూక్ (2)ను హెన్రీ.. బట్లర్‌ను (30) సాంట్నర్ ఔట్ చేశారు. 16 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 73/5గా ఉంది. లివింగ్‌స్టోన్ (14), మొయిన్ అలీ (17) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌల్ట్‌కు ఇది కెరీర్లో 100వ వన్డే కావడం విశేషం. Trent Boult is on fire in his 100th ODI 🌟 pic.twitter.com/41Vmf70VLd — ICC (@ICC) September 10, 2023 కాగా, 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ 2-2తో సమం కాగా.. తొలి వన్డే విజయం సాధించిన కివీస్ వన్డే సిరీస్‌లో ఆధిక్యంలో (1-0) ఉంది. -
న్యూజిలాండ్ తరఫున రీ ఎంట్రీ.. ట్రెంట్ బౌల్ట్ కీలక వ్యాఖ్యలు.. ఇకపై..
I’m a dad first: జాతీయ జట్టులో పునరాగమనం చేయడం సంతోషంగా ఉందని న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హర్షం వ్యక్తం చేశాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వైదొలగాలన్న కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని.. కెరీర్‌ను పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వెల్లడించాడు. జాతీయ జట్టుకు ఆడటం ఎల్లప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా గతేడాది బ్లాక్ క్యాప్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకుంటూ బౌల్ట్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలో ఆడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత తిరిగి న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయ్యాడు బౌల్ట్. ఇంగ్లండ్‌లో పర్యటించే కివీస్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. మళ్లీ వెనక్కి ఎందుకు? ఈ నేపథ్యంలో బౌల్ట్ అభిమానులు సంతోషిస్తుండగా.. కొంతమంది మాత్రం న్యూజిలాండ్ బోర్డు వైఖరిని తప్పుబడుతున్నారు. ఎంతో మంది యువ ప్లేయర్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తుంటే.. దేశాన్ని లెక్కచేయని వాళ్లను మళ్లీ వెనక్కి పిలవడం ఏమిటని మండిపడుతున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ట్రెంట్ బౌల్ట్.. ‘‘న్యూజిలాండ్ క్రికెట్ బబుల్ నుంచి దూరమవ్వాలన్న నిర్ణయం తీసుకునేందుకు ఎంతో మదనపడ్డాను. కానీ నాకోసం, నా కుటుంబం కోసం అలా చేయకతప్పలేదు. న్యూజిలాండ్ కోసమైనా, ఫ్రాంఛైజీలకు ఆడినా అదంతా నా కెరీర్‌ను పొడిగించుకోవడం కోసమే! ముందు డాడీని.. తర్వాతే.. బౌలర్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని కోరుకుంటున్నా. దేశం కోసం ఆడటం గొప్ప అనుభూతినిస్తుంది. రానున్న రెండు నెలలు సంతోషంగా గడవనున్నాయి’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక మళ్లీ టీ20 ఫ్రీలాన్స్ క్రికెటర్‌గా సేవలు అందిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా..‘‘ఇప్పటికైతే తెలియదు. ఎందుకంటే నేను ముందుగా డాడీని.. ఆ తర్వాతే ఆల్‌రౌండర్‌ను’’ అని ప్రాధాన్యాలను వివరించాడు. కాగా 34 ఏళ్ల ట్రెంట్ బౌల్ట్‌కు భార్య గెర్ట్, ముగ్గురు కొడుకులు ఉన్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా! -
ఇంగ్లండ్‌తో వన్డే,టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ వచ్చేశాడు
ఇంగ్లండ్ టూర్‌కు తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కివీస్ 4 టీ20లు, 4 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కేన్‌మామ తిరిగి వన్డే ప్రపంచకప్‌తో మైదానంలో అడుగు పెట్టే అవకావం ఉంది. ఇక ఇంగ్లండ్‌తో వన్డేలకు బ్లాక్‌క్యాప్స్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ ఎంపిక కాగా.. టీ20ల్లో ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌథీ సారధిగా వ్యవహరించనున్నాడు. ట్రెంట్ బౌల్ట్ రీ ఎంట్రీ.. ఇక గతేడాది బ్లాక్ క్యాప్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. మళ్లీ జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డేలకు బౌల్ట్‌కు కివీస్ జట్టులో చోటుదక్కింది. అదే విధంగా స్టార్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రెస్‌వేల్ గాయం కారణంగా ఇంగ్లండ్ టూర్‌కు మొత్తం దూరమయ్యాడు. ఇంగ్లండ్ కంటే ముందు.. ఇక న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ముందు యూఏఈకు వెళ్లనుంది. అతిథ్య యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ తలపడనుంది. ఆగస్టు 17న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యూఏఈతో సిరీస్‌కు కూడా కివీస్ తమ జట్టును ప్రకటించింది. యూఏఈ పర్యటనలో కూడా టిమ్ సౌథీనే జట్టును నడిపించనున్నాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లు డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఆది అశోక్‌కు తొలిసారి కివీస్ జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో టీ20లకు కివీస్ జట్టు: టిమ్ సౌథీ (సి), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ రవీంద్ర సీఫెర్ట్, ఇష్ సోధి ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, విల్ యంగ్ యూఏఈతో టీ20లకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), ఆది అశోక్, చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, లాకీ ఫెర్గూసన్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైల్ జామీసన్, కోల్ మెక్కాంచీ, జిమ్మీ నీషమ్, రచిన్ సె రవీంద్ర, మిచెల్ సీ రవీంద్ర, మిచెల్ సీ రవీంద్ర షిప్లీ, విల్ యంగ్ చదవండి: IND vs WI: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? పాపం తిలక్ వర్మ -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్‌ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్‌ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్‌ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్‌ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్‌తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన క్లాసెన్.. ప్లే ఆఫ్స్‌కు ముంబై
మేజర్ లీగ్ క్రికెట్లో తొలి సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో నిన్న (జులై 25) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు, సీయాటిల్ ఆర్కాస్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 110 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఫలితంగా ఆర్కాస్ జట్టు.. ఎంఐ న్యూయార్క్‌పై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. A KLAAssic century and celebration 💯 🙌 💥 #MajorLeagueCricket's first-ever CENTURY. HISTORY. MADE. 💚 🐳 pic.twitter.com/Bq5MotMfYU — Major League Cricket (@MLCricket) July 26, 2023 తొలుత పూరన్, ఆఖర్లో బౌల్ట్.. ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తొలుత నికోలస్ పూరన్ (34 బంతుల్లో 68; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), మధ్యలో పోలార్డ్ (18 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రెచ్చిపోగా.. టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), డేవిడ్ వీస్ (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) తలో చేయి వేశారు. ఆర్కాస్ బౌలర్లలో ఇమాద్ వసీం, హర్మీత్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. గానన్, ఆండ్రూ టై తలో వికెట్ దక్కించుకున్నారు. NICKY P HAS COME TO PLAY!🏏 Nicholas Pooran has RACED🏇 to 23 RUNS off just 8 balls! 4⃣6⃣/2⃣ (5.0) pic.twitter.com/GBrY5XAYed — Major League Cricket (@MLCricket) July 25, 2023 RASHID KHAN TRAPS QDK IN FRONT!😱 Huge wicket for @MINYCricket! 2⃣5⃣/1⃣ (3.2) pic.twitter.com/u3NqqAusnr — Major League Cricket (@MLCricket) July 25, 2023 An innings that will go down in history 👏 Heinrich Klaasen wins the Player of the Match award for his outstanding 💯 #MLC2023 pic.twitter.com/LGYxguTdJf — Major League Cricket (@MLCricket) July 26, 2023 రాణించిన నౌమాన్.. శతక్కొట్టిన క్లాసెన్ 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లలో డికాక్ (9) విఫలం కాగా.. నౌమాన్ అన్వర్ (30 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ఆతర్వాత బరిలోకి దిగిన జయసూర్య డకౌట్ కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన క్లాసెస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. HEINRICH KLAASEN IS TAKING ON EVERYBODY! Heinrich Klaasen BLASTS 3 SIXES against Rashid Khan! 1⃣6⃣6⃣/4⃣ (15.5) pic.twitter.com/nYJQrnXh06 — Major League Cricket (@MLCricket) July 26, 2023 WELCOME TO THE KLAAS-ROOM!👨🏫 Heinrich Klaasen demonstrating a MASTERCLASS⚔️ in playing spin! 9⃣8⃣/2⃣ (10.2) pic.twitter.com/z6sTIYjdpx — Major League Cricket (@MLCricket) July 25, 2023 INNOVATION! 🧑🔬 Nauman Anwar brings out the SCOOP! 6⃣0⃣/2⃣ (8.0) pic.twitter.com/IemmlFecTY — Major League Cricket (@MLCricket) July 25, 2023 బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి అజేయ శతకంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓ పక్క బంతితో బౌల్డ్ (4-0-31-4), రషీద్ ఖాన్ (4-1-41-2) చెలరేగుతున్నా ఏమాత్రం తగ్గని క్లాసెన్.. ఆండ్రూ టై (4 నాటౌట్) సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడినా.. ఆర్కాస్, సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లతో పాటు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ లీగ్ నుంచి నిష్క్రమించాయి. WHAT A LAST OVER BY TRENT BOULT! 3 WICKETS, BUT FOUR ON THE NIGHT! pic.twitter.com/zt05U5A8el — Major League Cricket (@MLCricket) July 26, 2023 Where we stand at the end of the group stage 🤗 Onto playoffs at Grand Prairie Stadium!!! 🇺🇸 🏏 🏟️ #MajorLeagueCricket | Abound by the Times of India pic.twitter.com/ndYMAHsh5E — Major League Cricket (@MLCricket) July 26, 2023 -
ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం.. మొయిన్ అలీ బాటలోనే..!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు అంగీకరించాడు. గతేడాది ఆగస్ట్‌లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్.. బోర్డు విజ్ఞప్తి మేరకుతో మళ్లీ కివీస్ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పాడు. న్యూజిలాండ్ ప్రజలు బోల్ట్‌ను వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులోకి తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తేవడంతో NZC ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ బోర్డు 20 మంది ఆటగాళ్లకు 2023-24 సీజన్ సెంట్రల్ కాంట్రక్ట్ ఇచ్చిన రోజే (జూన్ 8) ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, బౌల్ట్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు, అలాగే కుటుంబంతో గడిపేందుకు గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌల్ట్.. 2023 వరల్డ్‌కప్‌లో కూడా న్యూజిలాండ్ జట్టులో భాగం కావాలని ఆ దేశ ప్రజలు కోరుకున్నారు. చివరి రెండు వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరడంలో బౌల్ట్ కీలకపాత్ర పోషించాడు. 2015లో ఆసీస్ మిచెల్ స్టార్క్‌తో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా (22).. 2019లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) నిలిచాడు. ఓవరాల్‌గా బౌల్ట్ వరల్డ్‌కప్‌లలో 21.79 సగటున 39 వికెట్లు పడగొట్టి, ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 7) ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సైతం తన దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ ప్రకటించాక కూడా టెస్ట్‌ల్లో ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఈసీబీ మొయిన్ అలీని యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో మొయిన్ దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మొయిన్ 2021లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం -
పంజాబ్‌తో రాజస్తాన్ కీలకపోరు..గెలిస్తే నిలుస్తారు.. లేదంటే ఇంటికే!
ఐపీఎల్-2023లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. రాజస్తాన్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్తాన్ విజయం సాధిస్తే..శాంసన్ సేన ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తోంది. అయితే రాజస్తాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తమ తదపరి మ్యాచ్‌ల్లో ఓటమి చెందితే.. ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకమవుతోంది. అయితే ముంబై, ఆర్సీబీ కంటే రాజస్తాన్(+0.140) నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించే ఛాన్స్ ఉంటుంది. ఇక పంజాబ్‌కు కూడా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెథ్యమేటిక్‌గా ఉన్నాయి. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా రాజస్తాన్‌పై భారీ విజయం సాధించాలి. అంతే కాకుండా ముంబై, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ ఓటమి పాలవ్వాలి. అప్పుడు ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమమవుతాయి. అప్పుడు నెట్‌రన్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ట్రెంట్ బౌల్ట్ ఎంట్రీ.. జంపా ఔట్ ఇక పంజాబ్‌తో కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ తమ జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పంజాబ్‌తో పోరుకు తిరిగి జట్టులోకి రానున్నట్లు సమాచారం. బౌల్ట్ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్ ఆడమ్ జంపా బెంచ్‌కే పరిమితమయమ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌పై రాజస్తాన్ మెనెజెమెంట్ మరోసారి నమ్మకం ఉంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్తాన్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్( కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్. చదవండి: IPL 2023 Playoffs: ఓటమి వ్యత్యాసం కూడా కీలకమే.. రాజస్తాన్ ఆ విషయం మర్చిపోయినట్టుంది! -
RCB VS RR:సెంచరీ కొట్టిన బౌల్ట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (ఏప్రిల్ 23, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అరుదైన మైల్‌స్టోన్‌ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో బౌల్ట్.. కోహ్లి వికెట్ పడగొట్టడంతో ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో 100 వికెట్ కోహ్లిది కావడం, అది కూడా కోహ్లిని గోల్డెన్ డకౌట్ చేయడం బౌల్ట్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది.ఐపీఎల్లో మొత్తం 84 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్.. 101 వికెట్లు పడగొట్టాడు. Milestone Unlocked 🔓 1⃣0⃣0⃣ wickets in #TATAIPL for Trent Boult 💯 He gets Virat Kohli on the first ball! Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/pe4wQOp4Ob — IndianPremierLeague (@IPL) April 23, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి బంతికే భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌటై ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. సొంత మైదానంలో ఇరగదీస్తాడనుకున్న కోహ్లి ఉసూరుమనిపించడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కోహ్లి ఔటైన కొద్దిసేపటికే ఆర్సీబీ మరో వికెట్ కూడా కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి షాబాజ్ అహ్మద్ (2) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (35 బంతుల్లో 64), డుప్లెసిస్ (34 బంతుల్లో 56) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 128/2గా ఉంది. -
ట్రెంట్ బౌల్ట్ ఉగ్రరూపం.. సన్‌రైజర్స్‌పై ఎలాగో ఢిల్లీపై కూడా..!
ఐపీఎల్-2023లో భాగంగా గౌహతి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ ఉగ్రరూపం దాల్చాడు. నిప్పులు చెరిగే బంతులతో తొలి ఓవర్ సంధించిన బౌల్ట్ పరుగులేమీ ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టాడు. మూడో బంతికి పృథ్వీ షా (0) ఔట్ చేసిన అతను.. ఆ మరుసటి బంతికే మనీశ్ పాండే (0) ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇక్కడ ఆసక్తికర మరో అంశం ఏమిటంటే.. ఈ సీజన్లో ఆర్ఆర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనూ బౌల్ట్ ఇలాగే తొలి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి బెంబేలెత్తించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. డీసీపై లాగే భారీ స్కోర్ (203/5) సాధించింది. అప్పుడు కూడా భారీ లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ను బౌల్ట్ తన పేస్ పదునుతో గడగడలాడించాడు. డీసీపై లాగే ఆ మ్యాచ్‌లోనూ బౌల్ట్ తొలి ఓవర్లోనే పరుగులేమీ ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైతే ఓపెనర్లలో ఒకరు (షా), వన్‌డౌన్ బ్యాటర్ (మనీశ్) డకౌట్ అయ్యారో, సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0), వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (0) కూడా అలాగే డకౌటయ్యారు. సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎలాగైతే మూడో బంతికి ఔటయ్యాడో, డీసీ ఓపెనర్ పృథ్వీ షా కూడా మూడో బంతికే ఔటయ్యాడు. డీసీతో మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ మనీశ్ పాండే గోల్డెన్ డకౌట్ (తొలి బంతికే ఔట్) కాగా, సన్‌రైజర్స్ వన్‌డౌన్ బ్యాటర్ త్రిపాఠి మాత్రం ఓ బంతి ఆగి రెండో బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. ఇదొక్క తేడా తప్పించి సన్‌రైజర్స్‌పై తొలి ఓవర్లో ఎలాగైతే చెలరేగాడో.. ప్రస్తుతం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ బౌల్ట్ అలాగే విజృంభించాడు. ఈ పోలిక చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. బౌల్ట్‌కు సలాం కొడుతున్నారు. ఉపఖండపు పిచ్‌లపై ఓ పేసర్ ఇలా రెచ్చిపోవడమేంటని ముక్కున వెళ్లేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఓపెనర్లు యశస్వి (60), బట్లర్ (79) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆఖర్లో హెట్‌మైర్ (39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. డీసీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, కుల్దీప్, రోవ్‌మన్ పావెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 68/3గా ఉంది. వార్నర్ (33), లలిత్ యాదవ్ (16) క్రీజ్‌లో ఉన్నారు. Lightning does strike twice and his name is Trent Boult 🔥#RRvDC #TATAIPL #IPLonJioCinema@rajasthanroyals pic.twitter.com/dgCYaAn6G4 — JioCinema (@JioCinema) April 8, 2023 -
కిందా మీదా పడ్డాడు.. నీ కష్టం ఊరికే పోలేదు!
బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య తొలి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఫలితం సంగతి ఎలా ఉన్నా మ్యాచ్‌లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్రాడీ కౌచ్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే ఇదంతా చోటుచేసుకుంది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని మాథ్యూ గైక్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే నిల్చున్నబ్రాడీ కౌచ్ లో-లెవెల్లో వచ్చిన క్యాచ్‌ను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చేజారింది. ఆ తర్వాత బంతి అతని కాళ్లకు తాకి పైకి లేవగా అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మరోసారి మిస్ అయింది. చివరకు ఎలాగోలా బంతి సురక్షితంగా తీసుకోవడం జరిగింది. మొత్తానికి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన బ్రాడీ కౌచ్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. నిక్ లార్కిన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బర్న్స్ 18 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో గురీందర్ సందు, ఫజల్హక్ ఫరుఖీ, డేనియల్ సామ్స్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. బ్రెండన్ డొగ్గెట్, క్రిస్ గ్రీన్ చెరొక వికెట్ పడగొట్టారు. Absolutely INSANE from Brody Couch 🤯🤯🤯 #BBL12 pic.twitter.com/GFKsXCM3GS — KFC Big Bash League (@BBL) December 13, 2022 చదవండి: కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 10 వికెట్లు తీస్తారు.. -
సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న మరో న్యూజిలాండ్ ఆటగాడు! ఇకపై
New Zealand Cricket- Martin Guptill: గతంలో.. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోం.. తాజాగా స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు. గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బుధవారం ప్రకటన చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 జట్టుకు గప్టిల్ ఎంపికైనప్పటికీ ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న గప్టిల్‌ను కాదని ఫిన్ అలెన్‌ను ఓపెనర్‌గా ఆడించింది యాజమాన్యం. ఇక ఈ టోర్నీలో కివీస్ సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గప్టిల్.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. చర్చించిన తర్వాతే ఈ నేపథ్యంలో అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు ఈ స్టార్ బ్యాటర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అనేక చర్చల అనంతరం గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. గప్టిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నా.. జాతీయ జట్టు సెలక్షన్ సమయంలో అతడి పేరును పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎన్‌జెడ్‌సీ స్పష్టం చేస్తోంది. దేశవాళీ క్రికెట్ జట్టు ఎంపిక సమయంలోనూ అతడికి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ విషయంపై స్పందించిన 36 ఏళ్ల గప్టిల్.. ‘‘దేశం తరఫున ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. బ్లాక్‌క్యాప్స్‌కు ఆడే సమయంలో నాకు సహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నా అవసరాల మేరకు ఇతర ఆప్షన్లు చూసుకోవాల్సి ఉంది. ఇతర అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అద్భుత రికార్డులు అలాగే కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికీ నేను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్ తరఫున టీ20లలో 122 మ్యాచ్‌లు ఆడి 3531 పరుగులు చేశాడు గప్టిల్. ఈ ఫార్మాట్లో న్యూజిలాండ్ టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. గుడ్ బై చెప్పినట్లే! అదే విధంగా 47 టెస్టుల్లో 2586, 198 వన్డేల్లో 7346 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 18 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్న ఈ స్టార్ బ్యాటర్.. టీ20లలో రెండె సెంచరీలు, 20 అర్ధ శతకాలు సాధించాడు. కాగా న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకునే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో గప్టిల్ అనధికారికంగా ఎన్జెడ్సీకి గుడ్‌బై చెప్పినట్లే! చదవండి: Cristiano Ronaldo: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! -
భారత్‌తో వన్డే, టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన
స్వదేశంలో టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు కేన్ విలియమన్స్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా సీనియర్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, మార్టిన్ గప్టిల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు యువ ఆటగాడు ఫిన్ అలెన్‌కు వన్డే, టీ20 జట్ల రెండింటిలోనూ చోటు దక్కింది. అదే విధంగా గత కొంత కాలంగా వన్డే జట్టుకు దూరంగా ఉన్న ఆడమ్ మిల్నే తిరిగి టీమిండియా సిరీస్‌లో పునరాగమనం చేయనున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న వెటరన్ పేసర్ మాట్ హెన్రీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా ఈ హోమ్ సిరీస్‌లో భాగంగా టీమిండియాతో న్యూజిలాండ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) Our squads to face India in three T20I's & three ODI's starting on Friday at @skystadium 🏏 Details | https://t.co/OTHyEBgKxQ#NZvIND pic.twitter.com/2Ov3WgRJJt — BLACKCAPS (@BLACKCAPS) November 14, 2022 చదవండి: India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు -
ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం!
న్యూజిలాండ్ ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్ ఆడడంలో బిజీగా ఉంది. టి20 ప్రపంచకప్‌కు మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతున్న ఈ ట్రై సిరీస్‌లో ఇప్పటికే బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా బంగ్లాదేశ్, కివీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్లో నజ్ముల్ షాంటో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు వదిలేశారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన గుడ్‌లెంగ్త్ బంతిని షాంటో గాల్లోకి లేపాడు. అంతే క్యాచ్ తీసుకోవడానికి ఏకకాలంలో నలుగురు ఫీల్డర్లు పరిగెత్తుకొచ్చారు. చూసినవాళ్లు కచ్చితంగా ఆ నలుగురిలో ఎవరో ఒకరు క్యాచ్ తీసుకుంటారని అనుకున్నారు. తీరా చూస్తే ఒక్కడు కూడా పట్టుకోలేదు. దీంతో బౌల్ట్.. ఏంటిది అన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ 48 పరుగులతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవన్ కాన్వే(40 బంతుల్లో 64 పరుగులు), గ్లెన్ పిలిప్స్(24 బంతుల్లో 60 పరుగులు) మెరుపులు మెరిపించారు. గుప్టిల్ 34, ఫిన్ అలెన్ 32 పరుగులతో రాణించారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడిపోయింది. షకీబ్ అల్ హసన్ (44 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఈ టోర్నీలోని మూడో జట్టు పాకిస్తాన్ కూడా ఫైనల్ చేరింది. నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ ఉంది. No way 😂😭😂pic.twitter.com/UMIfm8zeMG — Out Of Context Cricket (@GemsOfCricket) October 12, 2022 చదవండి: తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్ -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్! స్టార్ బౌలర్ వచ్చేశాడు!
క్వీన్స్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న చాపెల్-హాడ్లీ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ తమ జట్టును గురువారం ప్రకటించింది. గాయం కారణంగా విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన మాట్ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా విండీస్‌తో అఖరి రెండు వన్డేలకు దూరమైన కెప్టెన్ విలియమ్సన్ కూడా తిరిగి జట్టులోకి చేరాడు. మరోవైపు సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తప్పుకుంటునట్లు ప్రకటించిన ట్రెంట్ బౌల్ట్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేయడం గమనార్హం. ఈ సిరీస్‌తో 23 ఏళ్ల బెన్ సియర్స్ న్యూజిలాండ్ తరపున వన్డే అరంగేట్రం చేయనున్నాడు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదు మంది పేస్ బౌలర్లను న్యూజిలాండ్ ఎంపిక చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బెన్ సియర్స్ని ఈ సిరీస్‌కు ఎంపిక చేశాం. అతడు ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై అద్భుతంగా రాణించగలడన్న నమ్మకం ఉంది. ఇక హెన్రీ కూడా తిరిగి జట్టులోకి రావడం మాకు మరింత బలం చేకూరుతుంది. అతడు గత కొన్నేళ్లగా మా జట్టు ప్రధాన బౌలర్‌గా ఉన్నాడని" పేర్కొన్నాడు. ఇక చాపెల్-హాడ్లీ ట్రోఫీ సెప్టెంబర్ 6 నుంచి జరగనుంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ ఫిలిప్స్, మిచెల్ బెన్ సియర్స్, టిమ్ సౌథీ} చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్! -
'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ క్రికెట్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టి జట్లను కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు అందరికంటే ముందుగా తమ కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆటగాళ్లను పరిచయం చేసింది. సీఎస్ఏ టి20 లీగ్‌లో 'ఎంఐ కేప్‌టౌన్'(MI Capetown).. యూఏఈ టి20 లీగ్‌లో 'ఎంఐ ఎమిరేట్స్'(MI Emirates)ను జట్లుగా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్. తాజాగా యూఏఈ ఇంటర్నేషనల్ టి20లో తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోయే జట్టును కూడా ప్రకటించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ జట్టులో పెద్దపీట వేసింది. 14 మందితో కూడిన ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, విండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ ఫ్లెచర్‌లు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ట్రెంట్ బౌల్ట్‌ను మళ్లీ జట్టులో చోటు కల్పించింది. వీరితో పాటు ఇంగ్లండ్ నుంచి సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్ లు ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీలను ఎంపిక చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు అవకాశం దక్కింది. ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ జట్టును తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు జరగనుంది. లీగ్ మార్గదర్శకాలను అనుసరించి తమ ఫ్రాంచైజీకి ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకున్నారని, ఇక స్థానిక (యూఏఈ) క్రికెటర్లు కూడా వీరికి జతకలుస్తారని ఎంఐ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మా జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడైన పొలార్డ్.. ఎమిరేట్స్‌లో మాతోనే కొనసాగుతున్నాడు. బ్రావో, బౌల్డ్, పూరన్ లు మళ్లీ మాతో చేతులు కలపనున్నారు. ఎమిరేట్స్ జట్టుకు ఆడబోయే ఆటగాళ్లకు స్వాగతం.’అని పేర్కొన్నాడు. ఐఎల్టీ20కి ఎంఐ ఎమిరేట్స్ జట్టు: కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, అండ్రె ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్, నజిబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫరూఖీ, బ్రాడ్లే వీల్, బాడ్ డీ లీడే The 𝗟𝗹𝗼𝗿𝗱, the 𝗟𝗲𝗴𝗲𝗻𝗱 & his 𝗟𝗲𝗴𝗮𝗰𝘆! @KieronPollard55 will don the iconic Blue and Gold in IL T20 💙 🗞️ Read more: https://t.co/RMiQOJfj9N#OneFamily #MIemirates @MIEmirates @EmiratesCricket pic.twitter.com/C1flVytrpI — Mumbai Indians (@mipaltan) August 12, 2022 చదవండి: MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. -
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్.. వైదొలిగిన స్టార్ బౌలర్
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆ దేశ సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) బుధవారం ధృవీకరించింది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు బౌల్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌జెడ్‌సీ వెల్లడించింది. బౌల్ట్ నిర్ణయంతో జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని (అతని సమ్మతం మేరకు) ఎన్‌జెడ్‌సీ పేర్కొంది. బౌల్ట్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపింది. తమ దేశ స్టార్ బౌలర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం బాధాకరమని, అతని భవిష్యత్తు మరింత బాగుండాలని విష్ చేసింది. ఇప్పటివరకు అతను జట్టుకు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారు. బౌల్ట్ తాజాగా నిర్ణయంతో అతను అనధికారికంగా న్యూజిలాండ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనట్లే అవుతుంది. 33 ఏళ్ల బౌల్ట్ 2011లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ సహకారాన్నందించాడు. అతని జట్టులో ఉండగా కివీస్ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా కొనసాగింది. కివీస్ తరఫున 78 టెస్ట్‌లు, 93 వన్డేలు, 44 టీ20 ఆడిన బౌల్ట్.. మొత్తం 548 వికెట్లు (టెస్ట్‌ల్లో 317, వన్డేల్లో 169, టీ20ల్లో 62) పడగొట్టాడు. చదవండి: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
ICC ODI Rankings: వరల్డ్ నెంబర్ వన్ వన్డే బౌలర్‌గా బుమ్రా!
ICC ODI Bowling Rankings: ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో బుమ్రా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్‌గా నిలిచాడు బుమ్రా. అంతేకాకుండా పలు ఇతర రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. సుమారు ఆరేళ్ల తర్వాత వన్డేల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ గెలుపుతో వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా బుమ్రా రెండేళ్ల అనంతరం టాప్ ర్యాంకు అందుకోవడం విశేషం. గతంలో(2017) టి20 బౌలింగ్ విభాగంలో అతను టాప్ ర్యాంకులో నిలిచాడు. ఇదిలా ఉంటే.. భారత్ తరఫున భువనేశ్వర్ మాత్రమే టి20 బౌలర్ల జాబితాలో టాప్–10లో (ఏడో ర్యాంకులో) ఉన్నాడు. వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి (803), రోహిత్ శర్మ (802) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న బౌలర్లు వీళ్లే! 1.జస్ప్రీత్ బుమ్రా(ఇండియా) 2.ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్) 3.షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్) 4.జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా) 5.ముజీబ్ ఉర్ రెహమాన్(అఫ్గనిస్తాన్) 6.మెహెదీ హసన్(బంగ్లాదేశ్) 7.క్రిస్ వోక్స్(ఇంగ్లండ్) 8. మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్) 9.మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్) 10. రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్) చదవండి: ICC T20 Rankings: దుమ్ము లేపిన సూర్యకుమార్.. ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. ఐదో ర్యాంకు! -
238 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్
ఇంగ్లండ్‌తో నాటింగ్హమ్లో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 473/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 539 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(145), జో రూట్(176) సెంచరీలతో చెలరేగారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (5/106), బ్రేస్‌వెల్ (3/62) రాణించారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసేసరికి 7 వికెట్లకు 224 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మిచెల్(32),హెన్రీ(8) పరుగులతో ఉన్నారు. చదవండి: ENG vs NZ: టెస్టు క్రికెట్లో ఆండర్సన్ అరుదైన ఫీట్.. మూడో బౌలర్‌గా..! -
Eng Vs NZ: అదరగొట్టిన సౌథీ, బౌల్ట్.. ఇంగ్లండ్‌కు షాక్! కానీ.. మళ్లీ!
New Zealand tour of England 2022- Eng Vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా తొలిరోజు ఆరంభంలో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించిన ఇంగ్లండ్ 141 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆటలో 92/2తో మెరుగైన స్థితిలో కనిపించిన ఆతిథ్య జట్టును కివీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. ట్రెంట్ బౌల్ట్, కైలీ జెమీషన్, టిమ్ సౌథీ తలా రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరి దెబ్బకు 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. ఇక శుక్రవారం నాటి రెండోరోజు ఆటలో భాగంగా సౌథీ.. స్టువర్డ్ బ్రాడ్‌ను అవుట్ చేయడంతో ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆతిథ్య జట్టు.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఫోక్స్ రూపంలో తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. ఈ క్రమంలో పార్కిన్సన్ వికెట్ తీసి బౌల్ట్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లండ్.. కివీస్ కంటే కేవలం 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా సౌథీ నాలుగు, బౌల్డ్ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జెమీషన్‌కు రెండు, గ్రాండ్‌హోమ్‌కు ఒక వికెట్ లభించాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. టామ్ లాథమ్ 14, విల్ యంగ్ 1, కేన్ విలియమ్సన్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆండర్సన్ ఒకటి, అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీశాడు. రెండో రోజు ఆటలో 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 36-3. న్యూజిలాండ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్: తొలి టెస్టు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132-10 (40 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 141-10 (42.5 ఓవర్లు) చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Wasim Jaffer Trolls Eng Vs NZ 1st Test: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! JIMMMY! 😍 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/BLyPNdqwRp — England Cricket (@englandcricket) June 3, 2022 This is some debut 💪 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 | @MattyJPotts pic.twitter.com/9028Sleasc — England Cricket (@englandcricket) June 3, 2022 A 9 run deficit as Tim Southee and Trent Boult combine for 7 wickets at Lord's 🏏 Watch LIVE in NZ with @sparknzsport and listen with @SENZ_Radio 📲#ENGvNZ pic.twitter.com/30zD1K3kXB — BLACKCAPS (@BLACKCAPS) June 3, 2022 -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యలతో కూడిన తమ కొత్త జట్టును న్యూజిలాండ్ క్రికెట్ సోమవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కివీస్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జాన్2న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇక తొలి టెస్ట్‌కు గాయంతో బాధపడుతున్న హెన్రీ నికోల్స్ బ్యాకప్‌గా మైఖేల్ బ్రేస్‌వెల్‌ను న్యూజిలాండ్ సెలక్టెర్లు ఎంపిక చేశారు. కాగా తొలుత 20 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. అయితే ఈ జట్టులో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్, రచిన్ రవీంద్ర, , బ్లెయిర్ టిక్నర్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను న్యూజిలాండ్ విడుదల చేసింది.. అయితే తొలి ప్రకటించన జట్టులో అవకాశం దక్కని అజాజ్ పటేల్ తిరిగి మళ్లీ చోటు దక్కింది. ఇక తొలి టెస్టుకు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ దూరం కానున్నాడు. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, క్యామ్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్ , అజాజ్ పటేల్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్ చదవండి: IPL 2022: రియల్ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా.. Squad News | The 15-man squad to face @englandcricket in the upcoming three-Test series, with the addition of @cricketwgtninc all-rounder Michael Bracewell as 16th man for the first Test starting at the @HomeOfCricket in London on Thursday 🏏 READ MORE | https://t.co/mTC60LJ3Y9 pic.twitter.com/Zh8u9wObfE — BLACKCAPS (@BLACKCAPS) May 30, 2022 -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బీజీగా ఉన్న న్యూజిలాండ్ తొలి టెస్టుకు సిద్దమైంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జూన్ 2న ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బౌల్ట్ ప్రస్తుతం ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో భాగమైన్నాడు. ఇక క్వాలిఫయర్ 2లో ఆర్సీబీపై విజయం సాధించి రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం(మే 29) ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. అయితే న్యూజిలాండ్ కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం జరగనున్న తొలి టెస్టుకు బౌల్ట్ సిద్దం కావడం అసాధ్యం. కాబట్టి తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బౌల్ట్ తొలి టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో టిమ్ సౌథీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్ చదవండి: ENG Vs NZ Test Series 2022: ఇంగ్లండ్‌తో టెస్టులకు కివీస్ జట్టును ప్రకటన.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు! -
అడగ్గానే ఇచ్చేశాడు.. వైరల్‌గా మారిన రాజస్తాన్ బౌలర్ చర్య
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరుకుంది. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జాస్ బట్లర్ మెరుపు సెంచరీతో మ్యాచ్ మొత్తం వన్‌సైడ్‌గా మారిపోయింది. మ్యాచ్ గెలవడంతో రాజస్తాన్ ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన చర్యతో అభిమానిని ఆనందంలో ముంచెత్తాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న బౌల్ట్‌ను ఒక కుర్రాడు ఆపాడు. మీరంటే నాకు చాలా అభిమానం.. మీ బౌలింగ్ అంటే చాలా ఇష్టం.. మీ జెర్సీ నాకు గిఫ్ట్‌గా ఇస్తారా అని అడిగాడు. కుర్రాడి మాటలకు ముచ్చటపడిన బౌల్ట్ అక్కడే తన షర్ట్‌ను విప్పేసి పెవిలియన్ గ్లాస్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వీలు కాకపోవడంతో ఎంట్రీ వద్ద ఉన్న మరో రాజస్తాన్ ఆటగాడి వద్దకు జెర్సీ విసిరేసి.. ఆ కుర్రాడికి జెర్సీని అందివ్వు అని చెప్పాడు. ఆ తర్వాత కుర్రాడు బౌల్ట్ ఇచ్చిన జెర్సీని వేసుకొని తెగ సంతోషపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన ట్విటర్లో షేర్ చేసింది. ''ఇంత చేశాకా నిన్ను లవ్ చేయకుండా ఉలా ఉంటాం బౌల్ట్'' అని క్యాప్షన్ జత చేసింది. కాగా బౌల్ట్ ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జట్టుకు మంచి బ్రేక్ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 8.24 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు. ఇక 2008 తర్వాత మరోసారి ఫైనల్ చేరిన రాజస్తాన్ రాయల్స్ మే29(ఆదివారం) జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే! Trolls On RCB Fan Girl: 'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు' How can you not love Trent Boult? 😍 Watch him make a young fan's day after #RRvRCB. 💗 pic.twitter.com/YrWgRsAgsN — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని వదులుకుని..
IPL 2022- Mumbai Indians: ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, హిట్టర్ కీరన్ పొలార్డ్(వెస్టిండీస్), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కీలక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌లను అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను వదిలేయాల్సి వచ్చింది. ఇక బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో అతడిని సొంతం చేసుకునేందుకు ముంబై పోటీ పడినా నిరాశ తప్పలేదు. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ 8 కోట్లు ఖర్చుచేసి బౌల్ట్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. అనువభవజ్ఞుడైన బౌల్ట్‌ను వదులుకుని ముంబై పెద్ద పొరపాటే చేసిందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఆయన ఖేల్‌నీతి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ముంబై లెక్క తప్పింది. ట్రెంట్ బౌల్ట్ సేవలను వాళ్లు కచ్చితంగా మిస్సవుతారు. బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా కలిసి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. అలాంటి పేసర్(బౌల్ట్)ను ఎందుకు వదిలేసిందో అర్థం కావడం లేదు. ఇప్పుడు అతడి గైర్హాజరీలో వాళ్లు ఉనద్కట్ వైపు చూస్తారేమో! ఇటీవల అతడు సౌరాష్ట్ర తరఫున మంచి ప్రదర్శన ఇచ్చాడు. తన అనుభవం ముంబైకి పనికివస్తుంది. ఇక మరో ఇద్దరు లెఫ్టార్మ్ బౌలర్లను కూడా ముంబై కొనుగోలు చేసింది. కానీ బౌల్ట్ లేని లోటు వారు తీరుస్తారా అన్నదే ప్రశ్న’’ అని పేర్కొన్నాడు. కాగా జయదేవ్ ఉనద్కట్‌తో పాటు డానియల్ సామ్స్, టైమల్ మిల్స్‌ను ముంబై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: మీకంత సీన్ లేదు.. అసలు ఆ పోలికేంటి? 16 కోట్లు పెట్టి ఆటగాడిని కొనేవాళ్లు ఉన్నారా? Drills, catching skills & birthday celebrations - MI Daily is now 𝗟𝗜𝗩𝗘 📹💙 Ab se roz 9 ka alarm laga lo Paltan. Ye ab daily hone waala hai! 😎#OneFamily #MumbaiIndians MI TV pic.twitter.com/mq0hclfJyE — Mumbai Indians (@mipaltan) March 17, 2022 -
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్!
దక్షిణాఫ్రికాపై తొలి టెస్ట్‌లో విజయం సాధించి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఓవల్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఫిట్నెస్ సమస్యల కారణంగా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. "ట్రెంట్ బౌల్ట్ రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అతడు గత కొద్ది కాలంగా విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి ఫిట్నెస్ దృష్ట్యా విశ్రాంతి ఇవ్వాలని భావించాం అని కోచ్ స్టెడ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఇన్నిగ్స్ అండ్ 276 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ మాట్ హెన్రీ 7 వికెట్లు పడగొట్టి ప్రొటీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లోను హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: ICC T20I Rankings: ఆరేళ్ల తర్వాత ఇదే తొలి సారి.. రెండో కెప్టెన్‌గా రోహిత్ -
రూ.10 కోట్లకు ప్రసిధ్ద్ కృష్ణ.. రాజస్తాన్ రాయల్స్ జట్టు ఇదే
ఐపీఎల్-2022 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ తమ జట్టును బలమైన జట్టుగా సిద్దం చేసుకుంది. ఈ సారి వేలంలో రాజస్తాన్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత బౌలర్ ప్రసిధ్ద్ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అదే విధంగా వెస్టిండీస్ బ్యాటర్ హెట్మైర్ను రూ. 8.50 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు, దేవ్‌దత్త్ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్తాన్ జట్టు మొత్తం 24 మంది ఆటగాళ్లు కాగా.. అందులో 16 మంది భారత క్రికెటర్లు కాగా, ఎనమిది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం రాజస్తాన్ రూ. 89.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. రాజస్తాన్ రాయల్స్ జట్టు: సంజూ సామ్సన్: రూ. 14 కోట్లు ప్రసిధ్ కృష్ణ: రూ. 10 కోట్లు జోస్ బట్లర్: రూ. 10 కోట్లు హెట్‌మైర్: రూ. 8 కోట్ల 50 లక్షలు ట్రెంట్ బౌల్ట్: రూ. 8 కోట్లు దేవ్‌దత్ పడిక్కల్: రూ. 7 కోట్ల 75 లక్షలు యజువేంద్ర చహల్: రూ. 6 కోట్ల 50 లక్షలు అశ్విన్: రూ. 5 కోట్లు యశస్వీ జైస్వాల్: రూ. 4 కోట్లు రియాన్ పరాగ్: రూ. 3 కోట్ల 80 లక్షలు నవ్‌దీప్ సైనీ: రూ. 2 కోట్ల 60 లక్షలు కూల్టర్‌నీల్: రూ. 2 కోట్లు జిమ్మీ నీషమ్: రూ. 1 కోటి 50 లక్షలు కరుణ్ నాయర్: రూ. 1 కోటి 40 లక్షలు వాన్‌డెర్ డసెన్: రూ. 1 కోటి డారిల్ మిచెల్: రూ. 75 లక్షలు ఒబెడ్ మెకాయ్: రూ. 75 లక్షలు కరియప్ప: రూ. 30 లక్షలు తేజస్ బరోకా: రూ. 20 లక్షలు అనునయ్ సింగ్: రూ. 20 లక్షలు కుల్దీప్ సేన్: రూ. 20 లక్షలు ధ్రువ్ జురెల్: రూ. 20 లక్షలు కుల్దీప్ : రూ. 20 లక్షలు శుభమ్ గార్హ్వాల్: రూ. 20 లక్షలు -
టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన బౌల్ట్.. రెండో బౌలర్‌గా!
కింగ్స్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లా బ్యాటర్ మెహాది హాసన్ వికెట్ పడగొట్టి టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరాడు. టెస్టుల్లో 300 వికెట్ల ఘనత సాధించిన నాలుగో కివీస్ బౌలర్‌గా బౌల్ట్ నిలిచాడు. అంతే కాకుండా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో కివీస్ బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు ఆర్జే హాడ్లీ(431), డానియల్ వెటోరీ(361), టిమ్ సౌథీ(328), ఈ జాబితాలో ఉన్నారు. అయితే 75 మ్యాచ్‌ల్లో సౌథీ ఈ ఘనత సాధించగా, బౌల్ట్ 74 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 521-6 వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగగా, కాన్వే సెంచరీతో మెరిశాడు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 126 పరుగులకే కూప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో 5 వికెట్లు సాధించిగా, టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే.. -
మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్
ఒక జట్టుకేమో విజయానికి ఒక వికెట్ కావాలి.. అదే సమయంలో అవతలి జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో ఉన్నదేమో టెయిలెండర్. ఈ సమయంలో ఒత్తిడికి లోనయ్యి వికెట్ ఇచ్చుకోవడమో లేక పరుగులు చేయకపోవడమో జరుగుతుంది. అయితే న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ మాత్రం ఒత్తిడిని తట్టుకొని ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు. సూపర్ స్మాష్ టి20 న్యూజిలాండ్ టోర్నీలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. చదవండి: MS Dhoni: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు కాంట్బర్రీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తన్బ్రేవ్స్ ఒక వికెట్‌తో తేడాతో సంచలన విజయం సాధించింది. నార్తన్బ్రేవ్ విధించిన 108 పరుగుల లక్ష్యాన్ని కాంట్బెర్రీ 20వ ఓవర్ ఆఖరి బంతికి చేధించింది. అప్పటికే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఔటవ్వడంతో ఆఖరి వికెట్‌గా బౌల్ట్ వచ్చాడు. రెండు బంతులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఆఖరి ఓవర్ ఐదో బంతి బౌల్ట్ తలపై నుంచి వెళ్లింది. ఇక చివరి బంతి మంచి టైమింగ్‌తో రావడంతో బౌల్ట్ లాంగాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. దీంతో నార్తన్ బ్రేవ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు కాంట్బెర్రీ 17.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. చదవండి: వివాదాలకు బ్యాట్‌తోనే కోహ్లి సమాధానం చెబుతాడు.. ఇప్పుడూ అంతే! TRENT BOULT!! Needed 6 runs off the final ball and he delivered!#SparkSport #SuperSmashNZ@ndcricket @supersmashnz pic.twitter.com/GhiSy8DmPf — Spark Sport (@sparknzsport) December 23, 2021 -
నా వీక్నెస్ బౌల్ట్‌కు బాగా తెలుసు.. ట్రాప్‌లో పడిపోయా
Trent Boult Traps Rohit Sharma With Short Ball.. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో సూర్యకుమార్ టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే టీమిండియా విజయం దిశగా సాగుతున్న వేళ బౌల్ట్ బౌలింగ్‌లో షార్ట్‌బాల్ ఆడడంలో విఫలమయ్యి ఔటయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ పోస్ట్ ప్రెజంటేషన్లో మాట్లాడాడు. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు! ''బౌల్ట్‌కు నా వీక్నెస్ బాగా తెలుసు. కానీ అతని బలం ఏంటనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. ముంబై ఇండియన్స్ తరపున నేను కెప్టెన్‌గా అతనికి అన్ని షార్ట్బంతులు విసరమని సలహా ఇచ్చాను. చాలాసార్లు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు బౌల్ట్ అవే షార్ట్‌బాల్స్‌ను నాపై ప్రయోగించాడు.'' అంటూ తెలిపాడు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో మూడు బంతులు షార్ట్ బంతులు వేశాడు.. కానీ రోహిత్ శర్మ 21 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌల్ట్ వేసిన మరో ఓవర్లో తొలి బంతిని భారీ సిక్స్‌గా మలిచాడు. అదే తరహాలో మరో షార్ట్బంతి వేయగా.. ఈసారి మాత్రం రోహిత్ మిస్ చేయడంతో షార్ట్‌ఫైన్ లెగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్, రాహుల్ జోడి.. -
బస్ డ్రైవర్‌ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్.. వీడియో వైరల్
Trent Boult Hugs Bus Driver.. టి20 ప్రపంచకప్‌ను అందుకోవడంలో విఫలమైన న్యూజిలాండ్ చివరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైన కివీస్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. తాజాగా ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్ ముగించుకొని టీమిండియా పర్యటనకు దుబాయ్ నుంచి భారత్‌కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు ఎయిర్పోర్ట్ వరకు బస్‌లో వచ్చింది. న్యూజిలాండ్ జట్టును తీసుకొచ్చిన బస్ డ్రైవర్ సంతోష్ బౌల్ట్‌ను కలవాలని భావించాడు. అడిగిందే తడవుగా బౌల్ట్ ఆ బస్ డ్రైవర్‌తో సెల్ఫీ దిగి ఆ తర్వాత అతన్ని హగ్ చేసుకొని సంతోషపరిచాడు. చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టి20.. వెంకటేశ్ అయ్యర్‌పై ద్రవిడ్ దృష్టి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియాతో మూడు టి20లు.. రెండు టెస్టులు ఆడనుంది. కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి రానున్నాడు. నవంబర్ 17న ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. Finishing up at the @T20WorldCup with a hug from our bus driver Santhosh. Next stop Jaipur! #T20WorldCup #INDvNZ pic.twitter.com/BdHPCHyzrX — BLACKCAPS (@BLACKCAPS) November 15, 2021 -
కోహ్లిని వెంటాడుతున్న ఆ చెత్త రికార్డు.. సోధి మళ్లీ మెరుస్తాడా!
Ish Sodhi is threat looming large for India: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య కీలక పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి ముప్పు పొంచి ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. షాహిన్ అఫ్రిది తరహాలో రెచ్చిపోతానని.. టీమిండియాకు బౌల్ట్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా వుంటే.. మరోవైపు బౌల్ట్ నుంచే కాదు ఆ జట్టు స్పిన్నర్ ఇష్ సోధి నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందని క్రికెట్ నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే అతడు భారత్‌పైన మంచి రికార్డును కలిగి ఉండడమే దీనికి కారణం. భారత్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన సోధి 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు కోహ్లిను పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో 5 సార్లు ఔట్ చేసిన రికార్డును సోధి కలిగి ఉన్నాడు. కోహ్లిను ఈ చెత్త రికార్డు వెంటాడుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో సోధిని కోహ్లి ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి. కాగా భారత్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన సోధి 17 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఈ ఏడాదిలో 8 మ్యాచ్‌లు ఆడిన సోధి 18 వికెట్లు సాధించాడు. ఈ మెగాటోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కూడా రెండు కీలకమైన వికెట్లను సోధి పడగొట్టాడు. చదవండి: భారత్ గెలవాలంటే ఆ ముగ్గురు రావాలి: పాక్ మాజీ కెప్టెన్ -
షాహిన్ అఫ్రిది తరహాలో టీమిండియాపై విరుచుకుపడతా.. కివీస్ స్టార్ పేసర్
Trent Boult Plots Shaheen Afridi Style Assault On India: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అక్టోబర్ 24న టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిది(3/31) భారత బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసి, పాక్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(అక్టోబర్ 31) టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌ను ఉద్దేశించి కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది తరహాలో రెచ్చిపోతానని.. టీమిండియా బ్యాటర్ల భరతం పడతానని హెచ్చరించాడు. ఈ సందర్భంగా బౌల్ట్.. అఫ్రిది బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అఫ్రిది బుల్లెట్ వేగంతో బంతులను సంధించడంతో పాటు స్వింగ్‌ను కూడా రాబట్టి టీమిండియాపై విరుచుకుపడ్డాడని, అతన్ని స్పూర్తిగా తీసుకుని తాను కూడా భారత్‌పై చెలరేగుతానని తెలిపాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీలో పాక్ చేతిలో టీమిండియాతో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌లు కూడా ఖంగుతిన్నాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై చెలరేగిన అఫ్రిది.. కివీస్(4-1-21-1), అఫ్గానిస్థాన్(4-0-22-1)లపై రాణించాడు. ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ విషయం టీమిండియా అభిమానులను కలవరపెడుతుంది. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌పై విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చదవండి: అచ్చం ధోనిలానే చేశాడు.. అతని స్టైల్లోనే మ్యాచ్ ముగించాడు.. -
IPL 2021: పాక్‌తో సిరీస్ కాదని వాళ్లొచ్చేస్తున్నారు..
ఆక్లాండ్: యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10 వరకు జరిగే ఐపీఎల్ 2021 రెండో అంచెలో పాల్గొనేందుకు తమ క్రికెటర్లకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో విలియమ్సన్ (సన్‌రైజర్స్), బౌల్ట్ (ముంబై ఇండియన్స్), జేమీసన్ (బెంగళూరు), సాట్నర్ (చెనై సూపర్ కింగ్స్) తరఫున బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి ఐపీఎల్ జరిగే సమయంలో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్... పాకిస్తాన్‌తో మూడు వన్డేలతో పాటు ఐదు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌ల నుంచి ఐపీఎల్లో ఆడే ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. అంతేకాకుండా టి20 ప్రపంచకప్, భారత్‌తో జరిగే టి20 సిరీస్‌ల కోసం కేన్ విలియమ్సన్ నాయకత్వంలో ఒక జట్టును... బంగ్లాదేశ్, పాక్‌లతో ఆడేందుకు టామ్ లాథమ్ సారథ్యంలో మరొక జట్టును ప్రకటించారు. టి20 ప్రపంచకప్, భారత్‌తో జరిగే టి20 సిరీస్ లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టు: విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్టల్, బౌల్ట్, చాప్మన్, కాన్వే, ఫెర్గూసన్, గప్టిల్, జేమీసన్, డరైల్ మిచెల్, నీషమ్, ఫెలిప్స్, సాన్ట్నెర్, సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే (రిజర్వ్ ప్లేయర్). -
ఐపీఎల్ 2021: మిగతా మ్యాచ్‌లకు కివీస్ ఆటగాళ్లు దూరం!
ముంబై: ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు లేకపోతే లీగ్‌కు స్టార్ కళ ఉండదు. మన టీమిండియా ఆటగాళ్లు ఎంతమంది ఉన్నా విదేశీ ఆటగాళ్లు లేకపోతే మజా రాదు. అది దృష్టిలో ఉంచుకొని కోట్లు గుమ్మరించి మరీ కొనుగోలు చేస్తాయి ఆయా ఫ్రాంచైజీలు. మరి అలాంటిది కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసింది. అయితే సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్ విండోలో నిర్వహిస్తామని బీసీసీఐకి చెబుతున్నా అది అంత సులువు కాదని తెలుస్తోంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశకు బిజీ ఇంగ్లండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఈసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఒకవేళ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహిస్తే కివీస్ ప్లేయర్లు లీగ్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్ పాల్గొనాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని కివీస్ జట్టు ఈ సిరీస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తుంది. దీంతో కెప్టెన్ విలియమ్సన్, బౌల్ట్ సహా తదితర ఆటగాళ్లంతా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే మాత్రం విదేశీ స్టార్లు అందుబాటులో లీగ్ కళ తప్పడంతో ఫ్రాంచైజీలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరోవైపు బీసీసీఐ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేసి నిర్వహించాలని చూస్తుంది. చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' 'షార్ట్ వేసుకుందామనుకున్నా.. కానీ మాల్దీవ్స్‌లో లేను' -
పాపం బౌల్ట్.. బంతిని పట్టుకోలేక
చెన్నై: క్రికెట్లో అద్భుతమైన ఫీల్డింగ్లే కాదు.. కొన్ని సందర్భాల్లో ఫీల్డర్ల విన్యాసాలు నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ చేసిన ఫీల్డింగ్ కాసేపు నవ్వులు తెప్పించినా అయ్యో పాపం అని కూడా అనిపించింది. అసలు ఫీల్డింగ్ చేస్తూ అలా తూలిపోతున్నాడేంటి అని మ్యాచ్ చూసిన చాలామంది అభిమానులు అనుకున్నారు. బ్యాలెన్స్ చేసుకోలేక, బంతిని పట్టుకోలేక ఇలా బౌల్ట్ ఆగమేగమయ్యాడు బౌల్ట్. కృనాల్ పాండ్యా వేసిన ఒక ఓవర్లో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ వార్నర్ షాట్ ఆడాడు. అది కవర్స్ మీదుగా ఫోర్ బౌండరీకి దూసుకెళ్లే క్రమంలో బౌల్ట్ దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ముందు బంతి, వెనుకాల బౌల్ట్.. కానీ చివరకు బంతికి ఫోర్కు పోయింది. ఆ బంతిని ఆపడానికి డైవ్ కొడదామనే ఆలోచన రాగానే బౌల్ట్ అదుపు తప్పాడు. అంతే బ్యాలెన్స్ చేసుకోలేక నానా అగచాట్లు పడ్డాడు. చివరకు కాస్త స్థిమిత్తంగానే కింద పడటంతో ఎటువంటి గాయం కాలేదు. కాకపోతే ఇటీవల చెన్నై బీచ్‌లో సర్ఫింగ్ చేసిన బౌల్ట్‌కు అక్కడ విన్యాసాలు ఏమైనా గుర్తుకొచ్చాయేమనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌కే చెందిన జిమ్మీ నీషమ్ అయితే తన సహచర క్రికెటర్ ఇలా ఫీల్డింగ్‌లో విఫలవడంపై తనకు ఫ్రతీ ఒక్కరూ వారి యొక్క బెస్ట్ జిఫ్‌లను పంపాలని కోరాడు. , View this post on Instagram A post shared by Abijit Ganguly (@abijitganguly) -
వావ్.. వాట్ ఎ స్టన్నింగ్ క్యాచ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. కళ్లు చెదిరే విన్యాసం చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా ఒంటి చేత్తో బంతిని అందుకొని వావ్ అనిపించాడు. అతని ఫీల్డింగ్ విన్యాసానికి అభిమానులు ముగ్దులైపోయారు. ప్రస్తుతం ఆ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. బౌల్ట్ పట్టిన ఈ క్యాచ్‌ను ట్రెండ్ సెట్టింగ్ క్యాచ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతిని బౌలర్ మ్యాట్ హెన్రీ ఔట్ ఆఫ్ ది హాఫ్ స్టంప్ దిశగా సంధించగా.. బంగ్లా బ్యాట్స్‌మన్ లిటన్ దాస్ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు. The Boult Special. 😳😳#NZvBAN pic.twitter.com/MQuORWNfhP — CricTracker (@Cricketracker) March 26, 2021 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. డెవాన్ కాన్వే(110 బంతుల్లో 126; 17 ఫోర్లు), డారిల్ మిచెల్(92 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లా జట్టును మ్యాట్ హెన్రీ(4/27), జేమ్స్ నీషమ్(5/27) దారుణంగా దెబ్బతీయడంతో ఆతిధ్య జట్టు 164 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. -
ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు..
సిడ్నీ: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ విజయాల్లో పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లలో కానీ బౌల్ట్ తనదైన పేస్‌తో చెలరేగిపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన క్వాలిఫయర్-1లో బౌల్ట్ ఆరంభంలోనే రెండు వికెట్లు సాధించి తన బౌలింగ్ వేడిని రుచి చూపించాడు. తొలి ఓవర్లోనే పృథ్వీ షా, అజింక్యా రహానేలను డకౌట్లుగా పంపి ఢిల్లీని కోలుకోని దెబ్బకొట్టాడు. కాగా, ఈ సీజన్లో బౌల్ట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయడం ఆ జట్టు చేసిన తప్పిదంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. (ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్!) ముంబైకు బౌల్ట్‌ను ఒక గిఫ్ట్‌గా ఢిల్లీ అప్పగించిందని విమర్శించాడు. ‘ అదొక అసాధారణమైన చర్య. ట్రేడింగ్ ద్వారా బౌల్ట్‌ను ముంబైకు వదిలేయడం సరైన నిర్ణయం కాదు. ప్రస్తుతం ముంబై జట్టులో బౌల్ట్ కీలక బౌలర్‌గా మారిపోయాడు. టోర్నమెంట్ యూఏఈలో జరుగుతుందని వారికి తెలియకపోవడంతోనే బౌల్ట్‌ను వదిలేసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా ముంబై దొరికిన ఒక గిఫ్ట్ బౌల్ట్. పవర్ ప్లేలో బౌల్ట్ ఒక అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. బలమైన జట్టుకు బౌల్ట్‌ను అప్పగించి తప్పుచేసింది ఢిల్లీ. ఒకవేళ ట్రేడింగ్ ద్వారా బౌల్ట్ ముంబైకు వెళ్లకపోతే అతని కోసం వేలంలో చాలా జట్లు పోటీ పడేవి. ఏది ఏమైనా బౌల్ట్‌ను వదిలేయడం ఢిల్లీ చేసిన అది పెద్ద తప్పు’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మూడీ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్ బౌల్ట్ జతకట్టాడు. ట్రేడింగ్ విండో విధానం ఐపీఎల్-2015 నుంచి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. (‘ఫినిషర్ అంటే అలా ఉండాలి’) -
ట్రెంట్ బౌల్ట్ అనుమానమే!
దుబాయ్: ముంబై ఇండియన్స్‌కు ఫైనల్‌కు చేరిన ఆనందం ఒకటైతే, ట్రెంట్ బౌల్ట్ గాయం ఆ జట్టును కలవర పెడుతోంది. ప్రస్తుతం తొడ కండరాల గాయంతో సతమతమవుతున్న బౌల్ట్ ఫైనల్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బౌల్ట్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత బౌలింగ్ చేసేందుకు మళ్లీ రాలేదు. మ్యాచ్ జరుగుతుండగా.. బౌల్ట్ డ్రెసింగ్ రూంలో కనిపించాడు. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మైదానం వీడిన తర్వాత బౌల్ట్‌ను మళ్లీ చూడలేదు. అతడికైనా గాయం తీవ్రమైంది కాదనిపిస్తోంది. గాయం చిన్నదే కాబట్టి ఎలాంటి ఆందోళన లేదు. ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉంది. ఈలోగా అతడు కోలుకుంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే బౌల్ట్‌కు అయినా గాయంపై ఎలాంటి స్పష్టత లేదు.201 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బరిలో దిగగా.. తొలి ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా (0), అజింక్య రహానే (0)లను ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ బౌలింగ్‌కు దిగిన బుమ్రా.. అద్భుతమైన యార్కర్‌తో శిఖర్ ధావన్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. మంచి ఫామ్‌లో ఉన్న రహానేను బౌల్ట్ ఔట్ చేయడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. ఇదే ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించడానికి దోహద పడింది. -
‘కింగ్స్’ ఖేల్ ఖతమ్!
ఐపీఎల్లో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టు, ఐదుసార్లు రన్నరప్, బరిలోకి దిగిన పది సీజన్లలో ప్రతీసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరిన ఘనత... లీగ్‌లో అద్భుత రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన పాతాళానికి చేరింది. ఇంతకంటే దిగువకు పడిపోవడానికి ఇంకా ఏమీ లేదన్నట్లుగా సాగిన ఆ జట్టు ఆటతో మరో పరాభవం దరిచేరింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ధోని సేన అవమానకర రీతిలో నిష్క్రమించనుంది. 11 మ్యాచ్‌లలో ఎనిమిదో ఓటమిని ఎదుర్కొన్న ఆ జట్టు ఇక ముందుకు వెళ్లేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరింత పేలవ ప్రదర్శనతో 114 పరుగులే నమోదు చేసిన జట్టు, ఈ లీగ్ చరిత్రలో తొలిసారి 10 వికెట్ల పరాజయాన్ని చవిచూసింది. 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి స్యామ్ కరన్ పట్టుదలతో స్కోరు వంద పరుగులు దాటినా అది ఏమాత్రం సరిపోలేదు. ఇషాన్, డికాక్ ఆడుతూ పాడుతూ మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేర్చడంతో ముంబై మళ్లీ అగ్రస్థానానికి దూసుకుపోయింది. పనిలో పనిగా సీజన్ తొలి మ్యాచ్‌లో తమకు ఎదురైన ఓటమికి డిఫెండింగ్ చాంపియన్ బదులు తీర్చుకుంది. షార్జా: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్–2020లో తమ జోరును కొనసాగిస్తోంది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (4/18) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. అనంతరం ముంబై 12.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు. టపటపా... ఒక వైపు నుంచి బౌల్ట్, మరోవైపు నుంచి బుమ్రా పదునైన బంతులతో విరుచుకుపడుతుంటే చెన్నై బ్యాట్స్‌మెన్ నిస్సహాయులుగా కనిపించారు. డగౌట్ చేరడానికి వారంతా ఒకరితో మరొకరు పోటీ పడినట్లు కనిపించింది. తీవ్ర ఒత్తిడి మధ్య అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (0), జగదీశన్ (0) డకౌట్ కాగా, అనుభవజ్ఞులు అంబటి రాయుడు (2), డుప్లెసిస్ (1) కూడా చేతులెత్తేశారు. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి జడేజా (7) మిడ్వికెట్లో క్యాచ్ ఇవ్వడంతో పవర్‌ప్లేలోనే చెన్నై సగం వికెట్లు చేజార్చుకుంది. 6 ఓవర్లలో జట్టు స్కోరు 24/5 మాత్రమే. ఐపీఎల్ కెరీర్లో రెండోసారి మాత్రమే రెండో ఓవర్లోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చిన ఎమ్మెస్ ధోని (16 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్)... బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినా, ఎక్కువసేపు నిలవలేదు. లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్ చక్కటి బంతితో ధోని ఆటకట్టించాడు. అతనొక్కడే... సీజన్ మొత్తంలో సీఎస్కే గురించి చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే అతని స్యామ్ కరన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన గురించే. తొలి మ్యాచ్ నుంచి తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా, ఏ స్థాయిలో బ్యాటింగ్ చేయించినా, ఎప్పుడు బౌలింగ్ అవకాశం ఇచ్చినా సత్తా చాటిన 22 ఏళ్ల కరన్ మరోసారి తన విలువను ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మూడో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన అతను బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొంటూ చివరి బంతి వరకు పట్టుదలగా నిలిచి పరుగులు రాబట్టాడు. రాహుల్ చహర్, కూల్టర్‌నైల్ వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టి అతను జోరును ప్రదర్శించాడు. బౌల్ట్ వేసిన 20వ ఓవర్లో కరన్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన బౌల్ట్ గణాంకాలు ఈ ఓవర్‌తో మారిపోయాయి. ఈ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన కరన్ 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి అద్భుత యార్కర్‌తో కరన్‌ను బౌల్డ్ చేసి బౌల్ట్ సంతృప్తి చెందాడు. కరన్‌కు ఇమ్రాన్ తాహిర్ (13 నాటౌట్) సహకరించడంతో స్కోరు 100 పరుగులు దాటింది. వీరిద్దరు 31 బంతుల్లో 43 పరుగులు జోడించారు. ఐపీఎల్లో తొమ్మిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అలవోకగా... ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఇషాన్ కిషన్, డికాక్‌లను చెన్నై బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. స్వేచ్ఛగా ఆడిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ చకచకా పరుగులు రాబట్టారు. జడేజా ఓవర్లో వరుసగా 2 భారీ సిక్సర్లు కొట్టిన కిషన్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగియడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఎడమకాలి కండరాల గాయంతో ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అతని స్థానంలో కీరన్ పొలార్డ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; డుప్లెసిస్ (సి) డికాక్ (బి) బౌల్ట్ 1; రాయుడు (సి) డికాక్ (బి) బుమ్రా 2; జగదీశన్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 0; ధోని (సి) డికాక్ (బి) రాహుల్ చహర్ 16; జడేజా (సి) కృనాల్ (బి) బౌల్ట్ 7; స్యామ్ కరన్ (బి) బౌల్ట్ 52; దీపక్ చహర్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 0; శార్దుల్ (సి) సూర్యకుమార్ (బి) కూల్టర్‌నైల్ 11; తాహిర్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–0; 2–3; 3–3; 4–3; 5–21; 6–30; 7–43; 8–71; 9–114. బౌలింగ్: బౌల్ట్ 4–1–18–4; బుమ్రా 4–0–25–2; కృనాల్ 3–0–16–0; రాహుల్ చహర్ 4–0–22–2; కూల్టర్‌నైల్ 4–0–25–1; పొలార్డ్ 1–0–4–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (నాటౌట్) 46; ఇషాన్ కిషన్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (12.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 116. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–34–0; హాజల్‌వుడ్ 2–0–17–0; తాహిర్ 3–0–22–0; శార్దుల్ 2.2–0–26–0; జడేజా 1–0–15–0. -
నెట్ బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్!
అబుదాబి : ఎడారి దేశం యూఏఈలో ప్రస్తుతం సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు వచ్చిన న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ స్వస్థలంలో ప్రస్తుతం శీతాకాలం అదీ 7–8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. తనకు సంబంధించి వాతావరణంలో ఈ తేడానే పెద్ద సవాల్ విసురుతోందని బౌల్ట్ అన్నాడు. ఇలాంటి చోట బౌలింగ్ చేయడం అంత సులువు కాదని అతను అభిప్రాయపడ్డాడు. లసిత్ మలింగ గైర్హాజరులో ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్‌గా బౌల్ట్పై మరింత బాధ్యత పెరిగింది. (చదవండి : ఇప్పటికీ ఆయనే బెస్ట్ ఫినిషర్: మిల్లర్) ‘యూఏఈలో ఉష్ణోగ్రతలకు అలవాటు పడటమే కొంత ఇబ్బందిగా మారింది. అది అంత సులువు కాదు. అయితే ప్రాక్టీస్ మాత్రం బాగానే కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇందులో చాలా మందికి మంచి అనుభవం ఉండటం జట్టు పనిని సులువు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన పలువురు ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్‌లో బౌలర్‌గా ఉండటం నాకు సానుకూలాంశం. టోరీ్నలో పిచ్‌లు బాగుండాలని కోరుకుంటున్నా. అప్పుడు బౌలర్‌గా సత్తా చాటేందుకు మంచి అవకాశం లభిస్తుంది’ అని బౌల్ట్ అభిప్రాయపడ్డాడు. నెట్ బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్! ఈ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్లలో ఒకడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం అర్జున్ అబుదాబిలో ముంబై జట్టు వెంట ఉన్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో సేదదీరుతున్న ఫొటోను అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. -
వచ్చీ రాగానే.. 'క్లీన్ బౌల్ట్'
-
వచ్చీ రాగానే.. 'క్లీన్ బౌల్ట్'
దుబాయ్ : న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్లో ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. లసిత్ మలింగ లేని లోటును తాను తీరుస్తానని బౌల్ట్ అంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో వికెట్లను విరగొట్టేస్తున్న బౌల్ట్.. తాను ఫామ్‌లోనే ఉన్నా అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు హెచ్చరికలు పంపాడు. ముంబై ప్రధాన కోచ్ మహేల జయవర్దనే ఆధ్వర్యంలో బౌల్ట్ తన బౌలింగ్ ప్రాక్టీస్ కొనసాగించాడు. బౌలింగ్ చేస్తున్నంత సేపు పదునైన లైన్ అండ్ లెంగ్త్ డెలివరీలు, యార్కర్లతో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలోనే బౌల్ట్ సంధించిన ఒక డెలివరీ వేగంగా వెళ్లి మిడిల్ స్టంప్ వికెట్‌ను గిరాటేయగా.. అది రెండు ముక్కలైంది. తాజాగా బౌల్ట్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోనూ ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. ' ట్రెంట్ వచ్చీ రాగానే.. వికెట్ క్లీన్ బౌల్ట్ అయింది ' అంటూ కామెంట్ చేసింది. (చదవండి : ముంబైతో కలిసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్) ఐపీఎల్ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో లసిత్ మలింగ దూరమవ్వడంతో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌల్ట్ బౌలింగ్ పంచుకోనున్నాడు. 2015లో మొదటిసారి ఐపీఎల్లో పాల్గొన్న బౌల్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 5 కోట్లకు బౌల్ట్‌ను కొనుగోలు చేసింది. 2018-19లో బౌల్ట్ 2.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేయగా.. డిసెంబర్ 2019లో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్లకు దక్కించుకుంది. (చదవండి : రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ చూస్తారా..) -
క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?
ఆక్లాండ్ : ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరగనున్న చాపెల్- హాడ్లీ ట్రోఫీని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ టోకెన్ గేమ్స్‌గా అభివర్ణించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తీరిక లేకుండా షెడ్యూల్ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'తీరికలేని షెడ్యూల్‌తో వరుసగా జరుగుతున్న మ్యాచ్‌లను ఎవరు చూస్తారు. ఈ సిరీస్ ద్వారా జరిగే మ్యాచ్‌లు ఒక టోకెన్ గేమ్స్ లాంటివి. నేను క్రికెట్ అభిమానినే. కానీ వన్డే సిరీస్‌లు జరపడానికి ఇది అనువైన సీజన్ కాదు. మహిళల ప్రపంచకప్ గెలుపుతో క్రికెట్ సీజన్ ముగిసింది. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు జరిగాయి. మాకు ఇన్ని మ్యాచ్‌లు అవసరం లేదు'అని క్లార్క్ పేర్కొన్నాడు. (మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు) అయితే న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మైకేల్ క్లార్క్ కు తనదైన శైలిలో స్పందించాడు.'రసవత్తకరమైన సిరీస్ అతనికి టోకెన్ గేమ్స్‌గా ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదన్నాడు. అతని సమస్య ఏంటో నాకు తెలియదు. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో ప్రేక్షకులకు కావాల్సిన మజా లభిస్తుందన్నాడు. క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదేశం. న్యూజిలాండ్ కన్నా అక్కడి మైదానాలు పెద్దవి. ఈ సిరీస్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌తో ఈ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. కొంతమంది మాట్లాడే మాటల్లో అర్థమే లేదు ' అని చెప్పుకొచ్చాడు. గెలుపే లక్ష్యంగా తాము ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నట్లు బౌల్ట్ పేర్కొన్నాడు.(కోహ్లి, రోహిత్‌లు కాదు.. రాహులే గ్రేట్!) కాగా వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల్లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి.ఈ సీజన్లో ఆస్ట్రేలియా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సిరీస్‌లు ఆడింది. భారత్‌తో 1-2, సౌతాఫ్రికాతో 0-3తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. అంతకు ముందు సౌతాఫ్రికాపైనే 2-1తో టీ20 సిరీస్ గెలిచింది. మార్చి 7నే సౌతాఫ్రికా పర్యటనను ముగించుకున్న ఆసీస్.. 5 రోజుల గ్యాప్‌తోనే 13 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
పోరాటం లేదు.. దాసోహమే
క్రైస్ట్‌చర్చ్: భారత బ్యాట్స్‌మెన్ మరోసారి న్యూజిలాండ్ బౌలర్లకు దాసోహమయ్యారు. కనీసం పోరాటపటిమను కూడా ప్రదర్శించుకుండా నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నారు. దీంతో రెండో టెస్టు కూడా టీమిండియా చేతుల్లోంచి దాదాపు చేజారి వైట్‌వాష్‌కు దగ్గరైంది. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 97 పరుగుల లీడ్‌లో టీమిండియా ఉంది. ప్రస్తుతం హనుమ విహారీ (5 బ్యాటింగ్), పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బౌలింగ్‌లో కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (3/12) మరోసారి తన పేస్ రుచిచూపించగా.. గ్రాండ్‌హోమ్, వాగ్నర్,సౌతీలు తలో వికెట్ పడగొట్టారు. బ్యాట్స్‌మన్ తీరుమారలేదు.. కివీస్ టెయిలెండర్లు సైతం సులువుగా పరుగులు రాబట్టిన చోట భారత బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించిందన్న సంబరం కొన్ని నిమిషాలకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. స్కోర్ బోర్టులో పరుగుల కంటే వేగంగా వికెట్లు పడ్డాయి. పిచ్ ప్రభావం.. కివీస్ బౌలర్ల ప్రతిభ అనడంకంటే భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం, తొందరపాటు అని చెప్పాలి. తొలుత మయాంక్ అగర్వాల్(3)ను బౌల్ట్ బోల్తాకొట్టించగా.. సౌథీ బౌలింగ్‌లో పృథ్వీషా(14) తొందరపడ్డాడు. అనంతరం గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో ఔటైన విధంగానే రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఔటవ్వడం గమనార్హం. ఇక రహానే (9)ను పక్కా వ్యూహంతో వాగ్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి వ్యూహాలకు అనుభవజ్ఞుడైన రహానే తలవంచడం విడ్డూరంగా ఉంది. ఇక ఆదుకుంటాడని భావించిన పుజారా (24) కూడా బౌల్టౌ జిమ్మిక్కులను అర్థం చేసుకోలేక బౌల్డ్ అయ్యాడు. నైట్‌వాచ్‌మన్ ఉమేశ్ యాదవ్ (1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. దీంతో 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా రెండో టెస్టులో ఓటమి అంచున నిల్చుంది. ఇక ప్రస్తుతం క్రీజులో ఉన్న విహారీ, పంత్‌ల పోరాటంపైనే టీమిండియా గెలుపోటమి ఆధారపడి ఉంది. అయితే ప్రస్తుత సమయంలో గెలుపుపై ఆశ లేదు కానీ కనీసం పోరాడే స్కోర్ సాధిస్తే కాస్త పరువైనా మిగులుతుంది. తోకను కత్తిరించలేకపోయారు.. కివీస్ టెయిలెండర్లు మరోసారి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 63/0తో రెండో రోజు ఆట ప్రాంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్(52) అర్థసెంచరీతో రాణించాడు. లాథమ్ మినహా మరే బ్యాట్స్‌మన్ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించకపోవడంతో ఓ క్రమంలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అయితే కీలక సమయంలో జేమీసన్(49) దాటిగా ఆడి టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. జేమీసన్‌కు తోడు వాగ్నర్(21) భారత బౌలర్లను ప్రతిఘటించాడు. వీరిద్దరు 9 వికెట్‌కు 51 పరుగులు జోడించి కివీస్‌ను ఆధిక్యంవైపు నడిపించారు. అయితే షమీ బౌలింగ్‌లో జడేజా సూపర్బ్ క్యాచ్ అందుకోవడంతో వాగ్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ వెంటనే జేమీసన్‌ను కూడా షమీ పెవిలియన్‌కు పంపించడంతో కివీస్ 235 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమీ (4/81), బుమ్రా (3/62), జడేజా (2/22), ఉమేశ్ (1/46)లు రాణించారు. చదవండి: అదే బంతి.. బౌలర్ మారాడంతే! సలాం జడ్డూ భాయ్.. పర్ఫెక్ట్ ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ అంటే ఇదే! -
సమష్టి వైఫల్యం.. 10 వికెట్ల పరాభవం
వెల్లింగ్టన్ : అంతా ఊహించిందే జరిగింది! న్యూజిలాండ్‌తో జరిగిన తొలిటెస్టులో టీమిండియాకు ఘోర ఓటమి తప్పలేదు. సమష్టిగా విఫలమైన కోహ్లీసేన ప్రత్యర్థి ముందు మోకరిల్లింది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో రాణించిన కివీస్ 10 వికెట్లతో తేడాతా ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ముందంజలోఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్ అయిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అంతా కలిసి ద్విశతకం కూడా చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ ఒక్కడే 58 పరుగులతో రాణించాడు. దీంతో టీమిండియా 191 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థికి నామమాత్ర 9 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ 7, టామ్ బ్లండెల్ 2 పరుగులతో లాంఛనాన్ని పూర్తి చేశారు. టీమిండియా ‘బౌల్ట్’.. టిమ్ సౌతీ, జేమీషన్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కుదేలైన టీమిండియాను రెండో ఇన్నింగ్స్‌లో బౌల్ట్ కోలుకోలేని దెబ్బతీశాడు. కోహ్లి (19), పుజారా (11), పృథ్వీ షా (14), రహానే (29) వికెట్లను బౌల్ట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన సౌతీ, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి భారత్‌కు ‘డ్రా’ కూడా దక్కకుండా చేశాడు. అదే కథ పునరావృతం.. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కోహ్లీసేన చాపచుట్టేయగా.. కివీస్ 348 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. ఈ స్కోరులో కివీస్ టెయిలెండర్ల పరుగులే కీలకం. మూడోరోజు ఆట మొదలైన తొలి బంతికే న్యూజిలాండ్ వికెట్ కోల్పోయింది. వాట్లింగ్ (14)ను బుమ్రా అవుట్ చేశాడు. మరో 9 పరుగుల తర్వాత సౌతీ (6) వికెట్‌ను ఇషాంత్ శర్మ పడేశాడు. కివీస్ స్కోరు 225/7. ఇక భారత్ పేస్ అలజడి మొదలైందని అనుకున్నారంతా! టెయిలెండర్లను అవుట్ చేయడం ఎంతసేపు... 250, 260 స్కోరుతో కివీస్ కథ ముగుస్తుందనిపించింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. మరో వికెట్ తీసేందుకు సుదీర్ఘ పోరాటం తప్పలేదు. గ్రాండ్‌హోమ్ (74 బంతుల్లో 43; 5 ఫోర్లు)తో జతకలిసిన తొమ్మిదో వరుస బ్యాట్స్‌మన్ జేమీసన్ (45 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్స్‌లు) చకచకా పరుగులు బాదేశాడు. వన్డేను తలపించేలా జేమీసన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. షమీ బౌలింగ్‌లో 2, అశ్విన్ ఒకే ఓవర్లో మరో రెండు సిక్సర్లు దంచేశాడు. చూస్తుండగానే స్కోరు దూసుకెళ్లింది. ఎట్టకేలకు 300 స్కోరుకు ముందు జేమీసన్‌ను, 300 అయ్యాక గ్రాండ్‌హోమ్‌ను అశ్వినే పెవిలియన్ చేర్చాడు. 9 వికెట్లు పడ్డా కూడా ఆలౌట్ అయ్యేందుకు మరో 38 పరుగులు ఆగాల్సి వచ్చింది. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బౌల్ట్ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలతో హోరెత్తించాడు. చివరకు ఇషాంత్ అతన్ని అవుట్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ 348 పరుగుల వద్ద ముగిసింది. ఇషాంత్‌కు 5, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. మయాంక్ ఒక్కడే... మూడోరోజు లంచ్ తర్వాత 183 పరుగుల లోటుతో భారత్ రెండో ఇన్నింగ్స్ కష్టాలతో మొదలైంది. 8వ ఓవర్లో పృథ్వీ షా (14)ను బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో మయాంక్ అగర్వాల్‌కు పుజారా జతయ్యాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ వికెట్లు కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. కొంతవరకు ఇది ఫలించినా... రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాక జిడ్డుగా ఆడుతున్న పుజారాను బౌల్టే క్లీన్ బౌల్డ్ చేశాడు. 78 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోగా... ఓపెనర్‌కు కెప్టెన్ కోహ్లి అండగా నిలిచాడు. చక్కగా ఆడుతున్న మయాంక్ 75 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ జట్టు స్కోరు వంద పరుగులకు ముందే అతని వికెట్ కూడా పడిపోవడం భారత్ కష్టాల్ని ఒక్కసారిగా పెంచింది. ఆఖరి సెషన్ మొదలైన కాసేపటికి సౌతీ బౌలింగ్‌లో మయాంక్ వెనుదిరిగాడు. 96 పరుగులకే భారత్ మూ డు కీలక వికెట్లను కోల్పోయింది. ఇది చాలదన్నట్లు బౌల్ట్... కోహ్లి (19; 3 ఫోర్లు) వికెట్ పడగొట్టి భారత్‌ను చావుదెబ్బ తీశాడు. మరో వికెట్ పడకుండా రహానే (29), విహారి (15) ఆచితూచి ఆడుతున్న క్రమంలో జట్టు స్కోరు 148 పరగుల వద్ద ఇద్దరూ ఔట్ అయ్యారు. అటు తర్వాత తర్వాత అశ్విన్ (4), ఇషాంత్ శర్మ (12) వెనుదిరగ్గా, వికెట్ కీపర్ రిషభ్ పంత్ కాసేపు పోరాడాడు. 41 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బుమ్రా పరుగులైమీ చేయకుండానే వికెట్ సమర్పించుకోవడంతో 191 పరుగుల వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. -
భారమంతా హనుమ, అజింక్యాలపైనే!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా గెలుచుకోవాలన్నా, కనీసం డ్రా చేయాలన్నా ఆ భారమంతా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, తెలుగు కుర్రాడు హనుమ విహారిలదే. తొలి ఇన్నింగ్స్ లోటు 183 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 39 పరుగుల వెనుకంజలో కోహ్లి సేన ఉంది. ప్రస్తుతం అజింక్యా రహానే (25 బ్యాటింగ్), విహారి (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(58) మినహా.. పృథ్వీ షా(14), పుజారా(11), కోహ్లి(19)లు ట్రెంట్ బౌల్ట్ ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో నాలుగో రోజు రహానే, విహారిలతో పాటు రిషభ్ పంత్‌లు బ్యాటింగ్‌పైనే టీమిండియా తొలి టెస్టు భవిత్యం ఆధారపడి ఉంది. బ్యాట్స్‌మెన్ తీరు మారలేదు.. పరువు కోసం తప్పక పోరాడాల్సిన స్థితిలో టీమిండియా టాపార్డర్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకుంది. ముందుగా ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు పడిన ప్రథ్వీ షా తన వికెట్ పారేసుకున్నాడు. ఓ వైపు మయాంక్ అగర్వాల్ పోరాడుతుండగా.. పుజారా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. టీ విరామానికి ముందు కోహ్లి సేనకు ఓ పెద్ద షాక్ తగిలింది. బౌల్ట్ బౌలింగ్‌లో పుజారా బౌల్డ్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. హాప్ సెంచరీతో ఊపుమీదున్న మయాంక్ అగర్వాల్ టిమ్ సౌతీ వేసిన లెగ్ సైడ్ బంతిని వెంటాడి మరి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మూడు ఫోర్లతో కాన్ఫిడెంట్‌గా కనిపించిన సారథి కోహ్లి.. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అనవసరంగా టచ్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. దీంతో 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రహానే, విహారిలు భారీ భాగస్వామ్యం నమోదు చేయడం, పంత్ మెరుపులు మెరిపిస్తే తప్ప టీమిండియా గెలిచే అవకాశాలు లేవు. మరి నాలుగో రోజు టీమిండియా ఏం చేస్తుందో చూడాలి. జేమిసన్, బౌల్ట్ బౌండరీల వర్షం.. 51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్(14)ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. సౌతీని ఇషాంత్ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది. ఓ వైపు గ్రాండ్‌హోమ్ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్ యథేచ్చగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (5/68), అశ్విన్(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: ‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’ పాక్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు! ఆధిక్యం 51 నుంచి 183కు.. -
నాలుగు ఢమాల్.. ఆశలు పోయినట్లేనా?
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జేమీసన్‌కు దాసోహమైన టీమిండియా టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ దెబ్బకు కుదేలైంది. పరువు కోసం తప్పక పోరాడాల్సిన స్థితిలో పృథ్వీషా(14), పుజారా(11), కోహ్లి(19) చేతులెత్తేశారు. ఈ ముగ్గురు కూడా బౌల్ట్ బౌలింగ్‌కే బలి కావడం గమనార్హం. మూడో రోజు 183 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా ఆరంభించింది. మయాంక్ అగర్వాల్(58) మినహా.. మిగతా బ్యాట్స్‌మన్ ఎవరు కూడా పరుగులు కాదుకదా కనీసం క్రీజులో కూడా నిలదొక్కుకోలేకపోయారు. బౌల్ట్ దాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే తన అర్థసెంచరీని భారీ స్కోర్‌గా మలచకుండా టిమ్ సౌతీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు తెలుగు కుర్రాడు హనుమ విహారీ క్రీజులో ఉన్నారు. కోహ్లి మరీ ఘోరంగా.. టీ విరామానికి ముందు పుజారా ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన సారథి విరాట్ కోహ్లి పైనే టీమిండియా భారం పడింది. మూడు బౌండరీలతో కాన్ఫిడెంట్‌గానే కనిపించాడు. అయితే 46వ ఓవర్లో బౌల్ట్ వేసిన షార్ట్ పించ్ బంతిని వెంటాడి మరి కీపర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే కీలక సమయంలో కోహ్లి ఔటైన తీరు విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది. ఇక కోహ్లి ఔటవ్వడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొనగా.. కివీస్ శిబిరంలో గెలిచినంత ఆనందాన్ని పొందారు. 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై దాదాపు ఆశలు వదిలేసుకున్నట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతాలు జరిగితే తప్ప కివీస్ నుంచి మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం లేదంటున్నారు. చదవండి: టీమిండియా గెలిస్తే నిజంగా అదుర్సే.. ‘జడేజానే నా ఫేవరెట్ ప్లేయర్’ ఆధిక్యం 51 నుంచి 183కు.. -
ఆధిక్యం 51 నుంచి 183కు..
వెల్లింగ్టన్: ఐదు ప్రధాన వికెట్లు తీశాం.. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే తోకను కత్తిరిస్తే ఆధిక్యం వందలోపే ఉంటుందని భావించిన కోహ్లి సేనకు న్యూజిలాండ్ టెయిలెండర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తమ బౌలింగ్‌తో హడలెత్తించిన ఆతిథ్య బౌలర్లు బ్యాట్‌తోనూ మెరవడంతో కివీస్‌కు 183 పరుగుల మంచి ఆధిక్యం లభించింది. 51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్ స్కోర్ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు వేసిన తొలి బంతికే వాట్లింగ్(14)ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో బుమ్రా ఆనందం నింపాడు. అనంతరం సౌతీ(6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. సౌతీని ఇషాంత్ బోల్తాకొట్టించాడు. ఇక ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమైంది. ఓ వైపు గ్రాండ్‌హోమ్ క్రీజులో నిలదొక్కుకోగా జేమీసన్ యథేచ్చగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 45 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, 1 ఫోర్‌తో 44 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం గ్రాండ్‌హోమ్(43; 74 బంతుల్లో 5ఫోర్లు)ను కూడా అశ్విన్ బోల్తాకొట్టించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 38 పరుగులు చేసి కివీస్‌కు కావాల్సిన ఆధిక్యాన్ని టీమిండియాకు జరగాల్సిన నష్టాన్ని కలిగించి ఔటయ్యాడు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 100.2 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (5/68), అశ్విన్(3/99)లు రాణించగా.. షమీ, బుమ్రాలు తలో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: ఆధిక్యం పోయింది ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయాడు! -
కివీస్ 348 పరుగులకు ఆలౌట్
-
కోహ్లి వికెట్ తీస్తేనే మజా: బౌల్ట్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని చూస్తున్నాడు. ఈనెల 21న మొదలయ్యే తొలి టెస్టులో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వికెట్ తీస్తేనే అసలైన మజా ఉంటుందని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో బౌల్ట్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతను ఆరు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనలేకపోయాడు. ఇప్పుడు సంప్రదాయ క్రికెట్‌తో మళ్లీ తాజాగా బరిలోకి దిగబోతున్న బౌల్ట్ మీడియాతో మాట్లాడుతూ... ‘కోహ్లి అసాధారణ బ్యాట్స్‌మన్. తన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అతనెంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు. అలాంటి మేటి బ్యాట్స్‌మన్‌ని అవుట్ చేయడం ద్వారా నా సత్తాను నేనే పరీక్షించుకుంటాను. అందుకే మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను’ అని అన్నాడు. ఐదు రోజుల ఆట కోసం బాగా సన్నద్ధమయ్యానని చెప్పాడు. వెల్లింగ్టన్లో ఆడటం తనకెంతో ఇష్టమని అన్నాడు. భారత్ చేతిలో సొంతగడ్డపై టి20ల్లో క్లీన్‌స్వీప్ (0–5) కావడం బాధించిందని... అయితే తమ జట్టు వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుందని చెప్పాడు. 65 టెస్టులాడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ 256 వికెట్లు తీశాడు. -
బౌల్ట్ వచ్చేశాడు
వెల్లింగ్టన్: కుడి చేతి గాయంతో భారత్‌తో జరిగిన టి20, వన్డే సిరీస్‌లకు దూరమైన న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టెస్టు జట్టులోకి వచ్చేశాడు. ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో భారత్‌తో ఈ నెల 21 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టుకు బౌల్ట్ ఎంపికయ్యాడు. కేన్ విలియమ్సన్ సారథిగా 13 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ సోమవారం ప్రకటించింది. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గాయపడిన బౌల్ట్ తిరిగి జట్టులోకి రావడంతో కివీస్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన 6 అడుగుల 8 అంగుళాల కైల్ జేమీసన్, ఎడంచేతి వాటం స్పిన్నర్ ఎజాజ్ పటేల్‌లు కూడా జట్టులోకి ఎంపికయ్యారు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించిన నీల్ వ్యాగ్నర్తో పాటు టిమ్ సౌతీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. న్యూజిలాండ్ టెస్టు జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, వాట్లింగ్, టామ్ బ్లన్‌డెల్, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్, జేమీసన్, టామ్ లాథమ్, మిచెల్, హెన్రీ నికోల్స్, ఎజాజ్ పటేల్, టిమ్ సౌతీ, నీల్ వ్యాగ్నర్. -
బౌల్ట్ వచ్చేస్తున్నాడు..!
హామిల్టన్: టీమిండియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన న్యూజిలాండ్ ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ రీఎంట్రీ షురూ అయ్యింది. ఈనెల 21వ తేదీ నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు బౌల్ట్ అందుబాటులోకి వచ్చాడు. తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో బౌల్ట్ పునరాగమనం ఖాయమైంది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రకటించిన టెస్టు జట్టులో బౌల్ట్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో చేతికి తీవ్ర గాయం కావడంతో బౌల్ట్ వరుస సిరీస్‌లకు దూరం కావాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే టీమిండియా జరిగిన ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌లో సైతం బౌల్ట్ ఆడలేదు. కాగా, రెండు టెస్టుల సిరీస్‌లో బౌల్ట్ చోటు దక్కించుకోవడంతో కివీస్ పేస్ బలం మరింత పెరిగింది. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ అయిన కివీస్.. వన్డే సిరీస్‌లో జూలు విదిల్చింది. ఫలితంగా టీమిండియాను వైట్‌వాష్ చేసింది. ఇక టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల బలంగా ఉండటంతో హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్ టెస్టు జట్టు ఇదే.. కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, గ్రాండ్ హోమ్, జెమీసన్, ట్రెంట్ బౌల్ట్, టామ్ లాథమ్, డార్లీ మిచెల్, హెన్రీ నికోలస్, అజాజ్ పాటేల్, టిమ్ సౌతీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, వాట్లింగ్ -
కివీస్ కష్టాలు తీరేలా లేవు!
హామిల్టన్: టీమిండియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు కష్టాలు వన్డే సిరీస్‌లో కూడా తీరేలా కనబడటం లేదు. భారత్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఆసీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన కివీస్.. ఇప్పుడు మరింత డీలా పడింది. బుధవారం భారత్‌తో జరిగిన మూడో టీ20లో మ్యాచ్‌ను టైగా ముగించి సూపర్ ఓవర్ వరకూ తీసుకొచ్చినా అందులో కివీస్‌కు అదృష్టం కలిసిరాలేదు. సూపర్ ఓవర్లో 18 పరుగుల టార్గెట్‌ను భారత్‌కు నిర్దేశించినా కివీస్ దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. దాంతో టీ20 సిరీస్‌ను 3-0తేడాతో భారత్‌కు అప్పగించింది. శుక్రవారం, ఆదివారం జరుగనున్న రెండు టీ20 మ్యాచ్‌ల్లో కనీసం గెలిచి పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉంది. మరొకవైపు భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. మిగిలిన రెండు టీ20ల్లో గెలవాలనే తలంపుతో ఉంది. (ఇక్కడ చదవండి: ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్ ముగింపు) ఇదిలా ఉంచితే, టీ20 సిరీస్ తర్వాత జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం కావడంపై ఇప్పుడు కివీస్ తర్జన భర్జనలు పడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ త్రయం ట్రెంట్ బౌల్ట్,లూకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్నీలు ఇంకా కోలుకోలేదు. దాంతో వచ్చే వారం టీమిండియాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు వీరు దూరమయ్యారు. వన్డే సిరీస్ నాటికి ఈ ముగ్గురు పేసర్లు తేరుకుంటారని తొలుత భావించారు. కాగా, వారు ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, దానికి మరింత సమయం పడుతుందని కివీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దాంతో న్యూజిలాండ్ జట్టులో కలవరం మొదలైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయిన కివీస్‌కు వన్డే సిరీస్‌లో కూడా కష్టాలు తీరేలా కనబడటం లేదు. ప్రధాన ఆటగాళ్లు దూరం కావడంతో ఇది కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. వీరి స్థానాల్లో కేల్ జెమీసన్, స్కాట్ కుగ్లీజిన్, హమిష్ బెన్నెట్లకు కివీస్ వన్డే జట్టులో చోటు కల్పించారు. ఇందులో జిమిసన్ తొలిసారి న్యూజిలాండ్ నుంచి పిలుపు అందుకోగా, కుగ్లీజిన్, బెన్నెట్లు 2017లో చివరిసారి వన్డే మ్యాచ్‌లు ఆడారు. న్యూజిలాండ్ వన్డే జట్టు ఇదే.. కేన్ విలియమ్సన్(కెప్టెన్), హమిష్ బెన్నెట్, టామ్ బ్లండెల్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్టిల్, జిమిసన్, కుగ్లీజిన్, టామ్ లాథమ్, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోలస్, మిచెల్ సాంట్నార్, ఇష్ సోథీ, టిమ్ సౌతీ, రాస్ టేలర్ -
భారత్‌తో టీ20 సిరీస్: కివీస్‌కు షాక్
వెల్లింగ్టన్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిశాక సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా న్యూజిలాండ్ బయల్దేరనుంది. ఈ పర్యటనలో రెండు జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ సిరీస్‌ను ఇరుజట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ కీలక సిరీస్‌కు ముందు ఆతిథ్య కివీస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్లు గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. ఈ ఇద్దరు దూరమవడంతో టీ20 సిరీస్ కోసం గురువారం ప్రకటించిన కివీస్ జట్టులో అనూహ్యంగా 32 ఏళ్ల బెనెట్‌కు అవకాశం కల్పించారు. బెనెట్ గత రెండేళ్లలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని 14 మంది ఆటగాళ్ల జాబితాలో సీనియర్ ఆటగాళ్లు మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, కొలిన్ మున్రో, కొలిన్ డి గ్రాండ్ హోమ్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ నెల 24న జరగబోయే తొలి టీ20తో కివీస్ పర్యటనను టీమిండియా ప్రారంభించనుంది. న్యూజిలాండ్ టీ 20 జట్టు కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, టేలర్, గ్రాండ్‌హోమ్, బ్లైర్ టిక్నర్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, హమీశ్ బెనెట్, టామ్ బ్రూసీ, కుగ్లీజిన్, డార్లీ మిచెల్. -
ముంబై ఇండియన్స్‌కు బౌల్ట్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్లో ఫ్రాంచైజీ మారాడు. వచ్చే సీజన్ కోసం అతను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు మారాడు. ఐపీఎల్–12వ సీజన్‌కు సంబంధించిన మార్పులు, చేర్పులకు నేటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫ్రాంచైజీ కివీస్ పేసర్‌ను విడుదల చేయడంతో ముంబై అతన్ని తీసుకుంది. 2014లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బౌల్ట్ రెండు సీజన్ల (2018, 2019)పాటు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో 33 మ్యాచ్‌లాడిన అతను 38 వికెట్లు తీశాడు. దేశవాళీ సీమర్ అంకిత్ రాజ్‌పుత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి రాజస్తాన్ రాయల్స్ పంచన చేరాడు. -
ఈ సారి ముంబై ఇండియన్స్ తరుపున..
ముంబై : న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇక మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు అంకిత్ రాజ్‌పుత్ ఆటగాళ్ల మార్పులో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. ఐపీఎల్-2020 సీజన్‌కు సంబంధించి ట్రేడింగ్ విండో గడువు రేపటికి(నవంబర్ 14)ముగుస్తుండటంతో ఆటగాళ్ల మార్పులు ఇంకా చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రేడింగ్ ముగిసిన అనంతరం ఐపీఎల్ వేలం డిసెంబర్19న కోల్‌కతాలో జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటివరకు మూడు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. అయితే వచ్చే సీజన్ కోసం సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్ బౌల్ట్ జతకట్టాడు. ఇక అంకిత్ రాజ్‌పుత్ కూడా కింగ్స్ పంజాబ్ తరుపున ఆడి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కాగా, ఇటీవలే ట్రెడింగ్ విండో విధానంతో కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిన విషయం తెలిసిందే. ఇక ట్రేడింగ్ విండో విధానం ఐపీఎల్-2015 నుంచి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. 🚨Aala Re🚨@trent_boult ⚡ joins #MumbaiIndians from Delhi Capitals!#OneFamily #CricketMeriJaan pic.twitter.com/Sh1HQbiQ0N — Mumbai Indians (@mipaltan) November 13, 2019 -
బౌల్ట్ వెనుక పడ్డ లంక క్రికెటర్లు!
గాలే: న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గురువారం రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ట్రెంట్ బౌల్ట్ ఆడిన ఓ బంతి ఎడ్జ్ తీసుకున్న తర్వాత హెల్మెట్‌లో ఇరుక్కుపోవడం అక్కడ నవ్వులు పూయించింది. లంక స్పిన్నర్ లసిత్ ఎమ్బుదినియా వేసిన 82వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. బౌల్ట్ స్వీప్ షాట్ ఆడబోగా అది ఎడ్జ్ తీసుకున్న వెంటనే హెల్మెట్‌లో ఇరుక్కుపోయింది. ఒకవేళ ఆ బంతి కింద పడే సమయంలో లంక ఫీల్డర్లు క్యాచ్ పడితే బౌల్ట్ అవుటయ్యేవాడు. కాకపోతే ఆ బంతి హెల్మెట్ గ్రిల్లోపల అలానే ఉండిపోవడంతో లంక క్రికెటర్లు.. బౌల్ట్ వెనుక పడ్డారు. ఆ క్రమంలోనే కాసేపు లంక ఫీల్డర్లను బౌల్ట్ ఆట పట్టించాడు. దాంతో లంక క్రికెటర్లతో పాటు బౌల్ట్ కూడా పడిపడి నవ్వుకున్నాడు. అది జరిగిన కాసేపటికి బౌల్ట్ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 83.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ముగిసింది. 203/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్వల్ప వ్యవధిలోనే ఎంతో సేపు నిలవలేదు.కేవలం 46 పరుగులే జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది. తొలి సెషన్లో లంక పేసర్ లక్మల్ (4/29) విజృంభించాడు. pic.twitter.com/i8oQaugKhp — Out of Context Cricket (@ooccricket) August 15, 2019 -
న్యూజిలాండ్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ ఘన విజయం
-
బంగ్లాదేశ్ 211 ఆలౌట్
వెల్లింగ్టన్: వర్షం తెరిపినివ్వడంతో మూడో రోజు మొదలైన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఒకే రోజు 12 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. న్యూజిలాండ్ పేస్ బౌలర్లు నీల్ వాగ్నర్ (4/28), ట్రెంట్ బౌల్ట్ (3/38) చెలరేగడంతో... బంగ్లాదేశ్ 61 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 74; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... లిటన్ దాస్ (49 బంతుల్లో 33; 6 ఫోర్లు), షాద్మన్ ఇస్లామ్ (53 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. తమీమ్, ఇస్లామ్ తొలి వికెట్‌కు 75 పరుగులు జత చేసి శుభారంభం అందించారు. అయితే ఇస్లామ్‌ను వాగ్నర్ ఔట్ చేశాక బంగ్లాదేశ్ వికెట్ల పతనం మొదలైంది. ఒకదశలో ఆరు వికెట్లకు 206 పరుగులతో ఉన్న బంగ్లాదేశ్... బౌల్ట్ ధాటికి చివరి నాలుగు వికెట్లను కేవలం నాలుగు పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 11.4 ఓవర్లలో రెండు వికెట్లకు 38 పరుగులు చేసింది. ఓపెనర్లు జీత్ రావల్ (3), లాథమ్ (4)లను అబూ జాయెద్ ఔట్ చేశాడు. విలియమ్సన్ (10 బ్యాటింగ్), రాస్ టేలర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ట్రెంట్ బౌల్ట్, మహ్ముదుల్లాలపై ఐసీసీ జరిమానా
క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్ముదుల్లాలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్య తీసుకుంది. మ్యాచ్ జరిగే సమయంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బౌల్ట్పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా, క్రికెట్ సామగ్రిని ధ్వంసం చేసినందుకు మహ్ముదుల్లా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. వారి ఖాతాలో ఒక్కో డీ మెరిట్ పాయింట్ కూడా చేరింది. -
బౌల్ట్ దెబ్బకు బోల్తా
ఔరా బౌల్ట్! ఏమా బౌలింగ్? అటు స్వింగ్, ఇటు పేస్, మధ్యమధ్యలో బౌన్స్‌తో గాల్లో ఏ దిక్కుకు వెళ్తుందో అంతుపట్టని బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఆటాడుకున్నాడీ కివీస్ పేసర్. ఒక్కో బంతి ఒక్కో గండం తీరుగా... ఒక్క పరుగు వచ్చినా పండుగే అన్నట్లు బ్యాట్స్‌మెన్ భావించేట్లుగా... తమ దేశంలోని పిచ్‌ల అసలు స్వభావాన్ని టీమిండియాకు మరోసారి గుర్తుచేశాడీ ఎడంచేతి వాటం బౌలర్. ఊపిరి సలపనివ్వకుండా... పుంజుకొనే అవకాశమే లేకుండా... ఏకబిగిన పది ఓవర్లు వేసేసి ప్రత్యర్థిని చుట్టేశాడు. అతడి ధాటికి వణికిపోయిన రోహిత్ బృందం విదేశాల్లో కుప్పకూలే పేకమేడ లాంటి ఒకనాటి బ్యాటింగ్ ఆర్డర్‌ను తలపించింది. బౌల్ట్‌కు తోడు గ్రాండ్‌హోమ్ ధాటికి టీమిండియా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అంతా కలిపి 30 పరుగులే చేయగలిగారు. దీంతో నాలుగో వన్డేలో కివీస్ జయభేరి మోగించింది. హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా హ్యాట్రిక్ విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. బంతిని వికెట్‌కు రెండు వైపులా అద్భుతంగా స్వింగ్ చేస్తూ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (5/21) చెలరేగడంతో గురువారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో కివీస్ 8 వికెట్లతో సునాయాసంగా గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బౌల్ట్ దెబ్బకు 30.5 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటైంది. పదో స్థానంలో దిగిన యజువేంద్ర చహల్ (37 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 16; 4 ఫోర్లు), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (33 బంతుల్లో 15; 1 ఫోర్) కొన్ని పరుగులు చేశారు. గ్రాండ్‌హోమ్ (3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ నికోల్స్ (42 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (25 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) నిలబడటంతో ఆతిథ్య జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఈ నెల 3న వెల్లింగ్టన్లో జరుగనుంది. నిలవలేకపోయారు ఐదు ఓవర్లలో 20 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్ ఆశావహంగానే ప్రారంభమైంది. హెన్రీ బౌలింగ్‌లో ధావన్ ఫోర్, సిక్స్ కొట్టడంతో గత మ్యాచ్‌ల్లానే మన జట్టుదే ఆధిపత్యం అనుకున్నారంతా. కానీ, ఆరో ఓవర్ నుంచి మొదలైంది బౌల్ట్ హవా. అతడి ధాటికి ధావన్ (13) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం ఫుల్ లెంగ్త్ బంతిని పుష్ చేయబోయి కెప్టెన్ రోహిత్ శర్మ (7) బౌల్ట్‌కే క్యాచ్ ఇచ్చాడు. మరో ఎండ్‌లో బౌలింగ్‌కు దిగిన గ్రాండ్‌హోమ్... అంబటి రాయుడు (0), దినేశ్ కార్తీక్ (0)లను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. వికెట్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి వీరిద్దరూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. బౌల్ట్ బౌన్సర్ హెల్మెట్‌కు తగిలి బెంబేలెత్తించినా రెండు మంచి షాట్లు కొట్టి సౌకర్యంగానే కనిపించిన యువ శుబ్‌మన్ గిల్ (9) అచ్చం రోహిత్ తీరుగానే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. కేదార్ జాదవ్ (1)నూ పెవిలియన్ చేర్చి 35/6తో టీమిండియాను బౌల్ట్ దిక్కు తోచని స్థితిలో పడేశాడు. కాసేపు నిలిచిన భువనేశ్వర్ (1)ను గ్రాండ్‌హోమ్ బౌల్డ్ చేశాడు. లాభం లేదని భావించిన పాండ్యా... బౌల్ట్పై ఎదురుదాడికి దిగి మూడు బౌండరీలు బాదాడు. అతడిని షార్ట్ లెంగ్త్ బంతితో బలిగొన్న కివీస్ ఎడంచేతి వాటం పేసర్ ఐదు వికెట్ల ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 55/8. కుల్దీప్, చహల్ 9వ వికెట్‌కు 57 బంతుల్లో 25 పరుగులు జోడించి పరువు కాపాడారు. జట్టు స్కోరులో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. కుల్దీప్ను ఆస్టల్, ఖలీల్‌ను నీషమ్ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. అలవోకగానే... స్వల్ప లక్ష్యాన్ని ఊదేద్దామని భావించాడో ఏమో, భువనేశ్వర్ వేసిన తొలి బంతికి సిక్స్, ఆ వెంటనే రెండు ఫోర్లు బాది కివీస్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించాడు మార్టిన్ గప్టిల్ (14). కానీ, లెగ్ వికెట్‌పై పడిన నాలుగో బంతి అతడి బ్యాట్ అంచుకు తాకి గాల్లోకి లేవగా పాయింట్లో పాండ్యా క్యాచ్ అందుకున్నాడు. నికోల్స్, కెప్టెన్ విలియమ్సన్‌లు ఖలీల్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టారు. విలియమ్సన్‌ను భువీ త్వరగానే ఔట్ చేసినా నికోల్స్, టేలర్ మరో అవకాశం ఇవ్వలేదు. చహల్‌ను లక్ష్యంగా చేసుకున్న టేలర్ భారీ షాట్లు కొట్టాడు. అతడు వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అతడి మరుసటి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో లాంఛనాన్ని పూర్తి చేశాడు. తేడా అతడే...! మ్యాచ్‌లో భారత్, కివీస్ మధ్య తేడా బౌల్టే. ఏమంత ప్రమాదకరంగా లేని, కుదురుకుంటే పరుగులు వచ్చే పిచ్ అయినప్పటికీ బౌల్ట్ స్వింగింగ్ డెలివరీలతో మన బ్యాట్స్‌మెన్ పని పట్టాడు. ధావన్, రోహిత్, శుబ్‌మన్, జాదవ్‌లను అతడు ఔట్ చేసిన తీరు ఆకట్టుకుంది. వరుసగా ఓవర్లు వేస్తూ బౌల్ట్ బెంబేలెత్తిస్తుంటే... కోహ్లి, ధోని లేని టీమిండియాకు పోరాడే అవకాశమే లేకుండా పోయింది. అతడి బౌలింగ్ కోటా ముగిసిన తర్వాత పరిస్థితి తుపాను అనంతరం ప్రశాంతతలా కనిపించింది. దీంతోనే కుల్దీప్, చహల్ విలువైన పరుగులు జోడించడం గమనార్హం. శుబ్‌మన్ అరంగేట్రం... భారత్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలో దిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో 19 ఏళ్ల బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ అరంగేట్రం చేశాడు. ధోని చేతుల మీదుగా గిల్ క్యాప్ అందుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో బరిలోకి దిగిన 227వ క్రికెటర్‌గా గిల్ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తీరిక లేకుండా ఆడుతున్న పేసర్ షమీ బదులుగా ఖలీల్‌ను తీసుకుంది. గాయం నుంచి ధోని కోలుకోకపోవడంతో దినేశ్ కార్తీక్ కీపింగ్ చేశాడు. ►2 భారత ఇన్నింగ్స్‌లో పదో నంబర్ బ్యాట్స్‌మన్ టాప్ స్కోరర్‌గా నిలువడం ఇది రెండోసారి మాత్రమే. 1998లో పాకిస్తాన్‌తో టొరంటోలో జరిగిన మ్యాచ్‌లో శ్రీనాథ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ►1 మిగిలి ఉన్న బంతుల పరంగా భారత్‌కిదే ఘోర పరాజయం. ఈ మ్యాచ్‌లో 212 బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు ఓటమి ఎదురైంది. 2010 దంబుల్లాలో శ్రీలంక చేతిలో భారత్ 209 బంతులు మిగిలి ఉండగా ఓడింది. ►1 న్యూజిలాండ్ గడ్డపై భారత్ నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 2002 ఆక్లాండ్‌లో జరిగిన వన్డేలో భారత్ 108 పరుగులకు ఆలౌటైంది. -
చిత్తుగా ఓడిన టీమిండియా
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ చిత్తు చిత్తుగా ఓడింది. న్యూజిలాండ్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వని భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 93 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగా, కివీస్ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ 39 పరుగులకే మార్టిన్ గప్టిల్(14), కేన్ విలియమ్సన్(11)ల వికెట్లను చేజార్చుకున్నప్పటికీ, నికోలస్(30 నాటౌట్), రాస్ టేలర్(37 నాటౌట్)లు జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్‌కు ఇదొక అతి పెద్ద ఊరట విజయం. భారత బౌలర్ భువనేశ్వర్ మాత్రమే రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్‌కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉంది. కాగా, న్యూజిలాండ్‌లో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(5/21), గ్రాండ్ హోమ్(3/26) పదునైన బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. ధావన్(13),పాండ్యా(16) చహల్(18 నాటౌట్), కుల్దీప్(15)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ(6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కష్టకాలంలో బాధ్యతాయుతంగా ఆడతాడని భావించిన జాదవ్(1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చివర్లో చహల్, కుల్దీప్లు బ్యాట్ ఝుళిపించడంతో భారత్ ఈ మాత్రం స్కోరును సాధించగల్గింది. -
బౌల్ట్ దెబ్బకు.. భారత్ ప్యాకప్
హామిల్టన్: న్యూజిలాండ్‌తో సిరీస్ అంటే ఎలా ఉంటుందో నాలుగో వన్డేకు గాని టీమిండియాకు తెలిసిరాలేదు. తొలి మూడు వన్డేలు ఆడుతుపాడుతూ గెలిచిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా తడబడింది. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(5/21), గ్రాండ్ హోమ్(3/26) పదునైన బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. కివీస్ బౌలర్ల ధాటికి కనీస గౌరవప్రదమైన స్కోర్ నమోదు చేయకుండానే 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే ప్యాకప్ అయింది. పాండ్యా(16) చహల్(18), కుల్దీప్(15)లు చివర్లో రాణించడంతో ఆమాత్రం స్కోరయినా టీమిండియా సాధించగలిగింది. దీంతో తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్‌కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉంది. శ్రీలంక(2000)పై 54 పరుగులే భారత్‌కు వన్డేల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఓ దశలో క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌటవుతుందా అనే అనుమానాన్ని బ్యాట్స్‌మెన్ కలిగించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు తొలి 5 ఓవర్లు మాత్రమే ఆనందాన్ని కలిగించాయి. అనంతరం రోహిత్ సేనకు కివీస్ బౌలర్లు అసలు పేస్ రుచి చూపించారు. టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ(6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కష్టకాలంలో బాధ్యతాయుతంగా ఆడతాడని భావించిన జాదవ్(1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. గ్రాండ్ హోమ్ మూడు వికెట్లు సాధించగా.. ఆస్టల్, నీషమ్‌లు తలో వికెట్ పడగొట్టారు. -
కివీస్‌తో వన్డే: కష్టాల్లో టీమిండియా
హామిల్టన్: ఆతిథ్య న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా నాలుగో వన్డే బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. భారత జట్టు 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో రోహిత్ సేన కనీసం గౌరవప్రదమైన స్కోర్ అయినా సాధించడం కష్టంగా మారింది. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా(0), భువనేశ్వర్(0) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ(6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కష్టకాలంలో బాధ్యతాయుతంగా ఆడతాడని భావించిన జాదవ్(1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. -
‘బౌల్ట్ కూడా ధోని చెప్పినట్లే చేశాడు’
-
‘బౌల్ట్ కూడా ధోని చెప్పినట్లే చేశాడు’
నేపియర్ : న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాట్స్‌మెన్ సమయోచిత ఇన్నింగ్స్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ గెలుపుతో ప్రారంభించింది. బౌలర్లు కుల్దీప్ (4/39), షమీ(3/19), చహల్( 2/43), కేదార్ జాదవ్(1/17)లు చెలరేగి ఆతిథ్య జట్టును157 పరుగులకే ఆలౌట్ చేశారు. ఓపెనర్లు గుప్టిల్(5), మున్రో(8)లను వరుస ఓవర్లలో మహ్మద్ షమీ క్లీన్‌బౌల్డ్ చేయగా.. కుల్దీప్ యాదవ్ ట్రెంట్ బౌల్ట్ వికెట్‌తో కివీస్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. అయితే టెయిలెండర్ ట్రెంట్ బౌల్ట్‌కు.. కుల్దీప్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో మిస్టర్ కూల్ ధోని... ‘ అతడు గుడ్డిగా వెనక్కి వెళ్తాడు. నువ్వు గూగ్లీ వెయ్’ అంటూ సూచించాడు. ధోని చెప్పినట్లుగానే కుల్దీప్ బంతి సంధించగానే... స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి బౌల్ట్ పెవిలియన్‌కు చేరాడు. కాగా ధోని.. కుల్దీప్తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ధోని చెప్పినట్లుగానే కుల్దీప్ బౌల్ చేశాడు. బౌల్ట్ కూడా ధోని చెప్పినట్లే చేశాడు. శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ధోని మెదడు చాచా చౌదరీ కంటే కూడా చురుగ్గా పనిచేస్తుంది’ అంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. -
కివీస్ సిరీస్‌ల రికార్డు
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్ 423 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ఈ ఏడాది కివీస్ చేజిక్కించుకున్న నాలుగో సిరీస్ ఇది. దీంతో 88 ఏళ్ల న్యూజిలాండ్ టెస్టు చరిత్రలో తొలిసారి వరుసగా నాలుగు సిరీస్‌లు సొంతం చేసుకొని కొత్త రికార్డు సృష్టించింది. చివరి రోజు 14 బంతుల వ్యవధిలోనే ట్రెంట్ బౌల్ట్ (3/77), వాగ్నర్ (4/48) మూడు వికెట్లను పడగొట్టి లంక ఇన్నింగ్స్‌కు తెరదించారు. 231/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక 236 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధసెంచరీ చేసిన సౌతీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే వచ్చే నెల 3న మౌంట్ మాంగనిలో జరుగుతుంది