క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్ముదుల్లాలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్య తీసుకుంది.
మ్యాచ్ జరిగే సమయంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బౌల్ట్‌పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా, క్రికెట్ సామగ్రిని ధ్వంసం చేసినందుకు మహ్ముదుల్లా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. వారి ఖాతాలో ఒక్కో డీ మెరిట్ పాయింట్ కూడా చేరింది.
Comments
Please login to add a commentAdd a comment