I’m a dad first: జాతీయ జట్టులో పునరాగమనం చేయడం సంతోషంగా ఉందని న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హర్షం వ్యక్తం చేశాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వైదొలగాలన్న కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని.. కెరీర్‌ను పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వెల్లడించాడు. జాతీయ జట్టుకు ఆడటం ఎల్లప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు.
కాగా గతేడాది బ్లాక్ క్యాప్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకుంటూ బౌల్ట్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలో ఆడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత తిరిగి న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయ్యాడు బౌల్ట్. ఇంగ్లండ్‌లో పర్యటించే కివీస్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
మళ్లీ వెనక్కి ఎందుకు?
ఈ నేపథ్యంలో బౌల్ట్ అభిమానులు సంతోషిస్తుండగా.. కొంతమంది మాత్రం న్యూజిలాండ్ బోర్డు వైఖరిని తప్పుబడుతున్నారు. ఎంతో మంది యువ ప్లేయర్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తుంటే.. దేశాన్ని లెక్కచేయని వాళ్లను మళ్లీ వెనక్కి పిలవడం ఏమిటని మండిపడుతున్నారు.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ట్రెంట్ బౌల్ట్.. ‘‘న్యూజిలాండ్ క్రికెట్ బబుల్ నుంచి దూరమవ్వాలన్న నిర్ణయం తీసుకునేందుకు ఎంతో మదనపడ్డాను. కానీ నాకోసం, నా కుటుంబం కోసం అలా చేయకతప్పలేదు. న్యూజిలాండ్ కోసమైనా, ఫ్రాంఛైజీలకు ఆడినా అదంతా నా కెరీర్‌ను పొడిగించుకోవడం కోసమే!
ముందు డాడీని.. తర్వాతే..
బౌలర్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని కోరుకుంటున్నా. దేశం కోసం ఆడటం గొప్ప అనుభూతినిస్తుంది. రానున్న రెండు నెలలు సంతోషంగా గడవనున్నాయి’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక మళ్లీ టీ20 ఫ్రీలాన్స్ క్రికెటర్‌గా సేవలు అందిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా..‘‘ఇప్పటికైతే తెలియదు. ఎందుకంటే నేను ముందుగా డాడీని.. ఆ తర్వాతే ఆల్‌రౌండర్‌ను’’ అని ప్రాధాన్యాలను వివరించాడు. కాగా 34 ఏళ్ల ట్రెంట్ బౌల్ట్‌కు భార్య గెర్ట్, ముగ్గురు కొడుకులు ఉన్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment