హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ ఓ మార్పు చేసింది. గత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ వోక్స్ స్థానంలో మాథ్యూ పాట్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించనుంది ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. మరో టెస్ట్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది తొలి టెస్ట్ సిరీస్ విజయం.
తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో విజయం
క్రైస్ట్‌చర్చ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.
323 పరుగుల తేడాతో విజయం
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (123, 55), జో రూట్ (106) సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది.
మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్
Comments
Please login to add a commentAdd a comment