Matthew Potts
-
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఓ మార్పు చేసింది. గత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ వోక్స్ స్థానంలో మాథ్యూ పాట్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించనుంది ఇంగ్లండ్ మేనేజ్మెంట్.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. మరో టెస్ట్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది తొలి టెస్ట్ సిరీస్ విజయం.తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో విజయంక్రైస్ట్చర్చ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.323 పరుగుల తేడాతో విజయంవెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (123, 55), జో రూట్ (106) సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది.మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్ -
ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్
కౌంటీ క్రికెట్లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్ రెచ్చిపోయాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1 పోటీల్లో భాగంగా లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్హమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్స్ ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. పాట్స్ చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్‌లో డర్హమ్ ఇన్నింగ్స్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో పాట్స్ 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 9) పడగొట్టాడు. 25 ఏళ్ల పాట్స్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 8 టెస్ట్‌ల్లో 28 వికెట్లు.. 4 వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ హర్స్ట్ 90 పరుగులతో రాణించాడు. డర్హమ్ బౌలర్లలో బెన్ రెయిన్ 5, మాథ్యూ పాట్స్ 3, బాస్ డి లీడ్ ఓ వికెట్ పడగొట్టారు.బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీడేవిడ్ బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీతో (279), అకెర్మన్ (186) భారీ సెంచరీతో చెలరేగడంతో డర్హమ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. లాంకాషైర్ బౌలర్లలో వెల్స్ 4, ఫిలిప్ 2, బెయిలీ, థామస్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు.తొమ్మిది వికెట్లు పడగొట్టిన పాట్స్345 పరుగులు వెనకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లాంకాషైర్.. మాథ్యూ పాట్స్ తొమ్మిది వికెట్లతో చెలరేగడంతో ఈ ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. పాట్స్ ధాటికి లాంకాషైర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు చాపచుట్టేసింది.చదవండి: తొమ్మిది వికెట్లు తీసిన చహల్ -
Ind Vs Eng: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి!
India Vs England 5th Test: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్డ్ టెస్టులో అతడు విఫలమయ్యాడు. ఇంగ్లండ్ యువ బౌలర్ మాథ్యూ పాట్స్ బంతికి బౌల్డ్ అయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కోహ్లి చేసిన స్కోరు 11 పరుగులు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ‘‘పెద్దగా అంచనాలేమీ పెట్టుకోలేదు.. అయినా నువ్వు మరోసారి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచావు. మా గుండె పగిలింది కోహ్లి. అయినా గత కొన్ని నెలలుగా మాకిది అలవాటు అయిందిలే!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు నీ తరహా సూపర్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు కోహ్లి ఫ్యాన్స్ పరిస్థితి ఇప్పుడు ఇదిగో ఇలా ఉంటుంది అంటూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. కాగా గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి భారత కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరిదైన ఐదో టెస్టును తాజాగా నిర్వహిస్తుండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఇక దాదాపు రెండున్నరేళ్లుగా కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. చదవండి: India Vs England ODI - T20 Series: టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్.. ఇంగ్లండ్ ‘జట్ల’ ప్రకటన.. వారిద్దరి ఎంట్రీ! EDGBASTON GOES POTTY! 🎉 Scorecard/Videos: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/X5G3B2HsRU — England Cricket (@englandcricket) July 1, 2022 Even when we have zero expectations on #ViratKohli He's disappointing!!!!!! 💔 #ENGvsIND — Srivatsava Sai (@srivatsava_sai) July 1, 2022 Virat Kohli fan's expression right now 💔 This whole love for #ViratKohli𓃵💔 Ab toh ummeed krna bekar hai 💔#INDvsENG #Bumrah pic.twitter.com/0UyvvStvqD — Suraj Kumar (@surajkumar2894) July 1, 2022 -
Eng Vs NZ: అదరగొట్టిన సౌథీ, బౌల్ట్.. ఇంగ్లండ్‌కు షాక్! కానీ.. మళ్లీ!
New Zealand tour of England 2022- Eng Vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా తొలిరోజు ఆరంభంలో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించిన ఇంగ్లండ్ 141 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆటలో 92/2తో మెరుగైన స్థితిలో కనిపించిన ఆతిథ్య జట్టును కివీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. ట్రెంట్ బౌల్ట్, కైలీ జెమీషన్, టిమ్ సౌథీ తలా రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరి దెబ్బకు 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. ఇక శుక్రవారం నాటి రెండోరోజు ఆటలో భాగంగా సౌథీ.. స్టువర్డ్ బ్రాడ్‌ను అవుట్ చేయడంతో ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆతిథ్య జట్టు.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఫోక్స్ రూపంలో తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. ఈ క్రమంలో పార్కిన్సన్ వికెట్ తీసి బౌల్ట్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లండ్.. కివీస్ కంటే కేవలం 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా సౌథీ నాలుగు, బౌల్డ్ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జెమీషన్‌కు రెండు, గ్రాండ్‌హోమ్‌కు ఒక వికెట్ లభించాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. టామ్ లాథమ్ 14, విల్ యంగ్ 1, కేన్ విలియమ్సన్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆండర్సన్ ఒకటి, అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీశాడు. రెండో రోజు ఆటలో 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 36-3. న్యూజిలాండ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్: తొలి టెస్టు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132-10 (40 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 141-10 (42.5 ఓవర్లు) చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Wasim Jaffer Trolls Eng Vs NZ 1st Test: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! JIMMMY! 😍 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/BLyPNdqwRp — England Cricket (@englandcricket) June 3, 2022 This is some debut 💪 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 | @MattyJPotts pic.twitter.com/9028Sleasc — England Cricket (@englandcricket) June 3, 2022 A 9 run deficit as Tim Southee and Trent Boult combine for 7 wickets at Lord's 🏏 Watch LIVE in NZ with @sparknzsport and listen with @SENZ_Radio 📲#ENGvNZ pic.twitter.com/30zD1K3kXB — BLACKCAPS (@BLACKCAPS) June 3, 2022 -
'వాళ్లిద్దరికే వికెట్లు పడుతున్నాయి.. నీ బాధ నాకు అర్థమైంది'
కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్ దశ మారినట్లుంది. క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు కకావికలమైంది. ఇంగ్లీష్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైంది. రీఎంట్రీ ఇచ్చిన అండర్సన్.. డెబ్యూ టెస్టు ఆడుతున్న మాథ్యూ పాట్స్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు కూడా తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగిపోయారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ సంగతి పక్కనబెడితే.. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''డెవన్ కాన్వే.. నీ బాధ నాకు అర్థమయింది..'' అంటూ కాన్వే ఫోటో కాకుండా బ్రాడ్ ఫోటోను పెట్టాడు. కాన్వేకు బదులుగా బ్రాడ్ ఫోటో పెట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది. మ్యాచ్‌లో అండర్సన్, బ్రాడ్లు రీఎంట్రీ ఇచ్చారు. రొటేషన్‌లో భాగంగా విండీస్‌తో సిరీస్‌కు వీరిద్దరిని దూరంగా పెట్టారు. ఇక కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇద్దరికి అవకాశం వచ్చింది. అండర్సన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 4 వికెట్లు తీసి కివీస్ ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి తోడుగా డెబ్యూ బౌలర్ మాథ్యూ పాట్స్ కూడా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. ఇద్దరే చెరో నాలుగు వికెట్లు తీయడంతో బ్రాడ్‌కు ఒక్క వికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. కానీ డెవన్ కాన్వే రూపంలో బ్రాడ్‌కు అదృష్టం తగిలింది. ఆఫ్‌స్టంప్‌కు వైడ్ రూపంలో వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్న కాన్వే వికెట్ సమర్పించుకున్నాడు. అలా ఎట్టకేలకు అండర్సన్, మాథ్యూ పాట్స్ల మధ్య బ్రాడ్ వికెట్ దక్కించకున్నాడు. ఇది పసిగట్టిన వార్నర్ కాస్త తెలివిని ప్రదర్శిస్తూ కాన్వేపై జాలి చూపిస్తూనే.. ఇన్‌డైరెక్ట్‌గా బ్రాడ్‌కు మెసేజ్ పంపాడు. ''ఇన్నింగ్స్‌లో వాళ్లిద్దరే వికెట్లన్నీ పడగొట్టారు.. నీకు దక్కుతుందో లేదో అని భయపడ్డా.. మొత్తానికి దక్కించుకున్నావు.. నీ బాధ నాకు అర్థమయింది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! -
Eng Vs NZ: అరంగేట్రంలోనే అదుర్స్.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4!
England Vs New Zealand 1st Test 2022 Day 1: ఇంగ్లండ్ పేసర్ మాథ్యూ పాట్స్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తన వికెట్ల ఖాతా తెరిచాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు గురువారం ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక కివీస్ ఇంగ్లండ్ బౌలర్ల దాటికి 132 పరుగులకే కుప్పకూలింది. తొలి రోజే ఇంగ్లండ్ ఈ మేర కివీస్‌కు చుక్కలు చూపించిందంటే.. అందులో సింహభాగం మాథ్యూ పాట్స్కే చెందుతుంది. సీనియర్ జేమ్స్ ఆండర్సన్ ఓపెనర్ల వికెట్లు కూల్చగా.. మ్యాటీ.. విలియమ్సన్ వికెట్‌తో బ్రేక్ ఇచ్చాడు. అదే విధంగా డారిల్ మిచెల్, టామ్ బ్లండల్, అజాజ్ పటేల్‌ను పెవిలియన్‌కు పంపాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 9.2 ఓవర్లు బౌలింగ్ చేసిన మ్యాటీ..13 పరుగులు మాత్రమే ఇచ్చి ఇలా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. దీంతో ఈ యువ బౌలర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. దుర్హమ్కు చెందిన మాథ్యూ పాట్స్ 1998లో జన్మించాడు. 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. బ్యాట్‌తోనూ రాణించగల మ్యాటీ.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒక అర్ధ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తంగా 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కొత్త టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ నమ్మకం గెలుచుకున్న మ్యాటీ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్‌లోనే తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రశంసలు అందుకుంటున్నాడు. చదవండి 👇 అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే అంతే ఇక: జయవర్ధనే IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! 36 balls 🔴 5 maidens ⛔ 4 Runs 🏏 2 Wickets ☝ Every ball from Jimmy's opening spell 😍 pic.twitter.com/BNcyQSgZ2t — England Cricket (@englandcricket) June 2, 2022 -
Eng Vs NZ: కుప్పకూలిన టాపార్డర్.. 132 పరుగులకే కివీస్ ఆలౌట్!
England Vs New Zealand 1st Test 2022 Day 1: ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ జట్టు విలవిల్లాడింది. ఆతిథ్య జట్టు బౌలర్ల దాటికి నిలవలేక పర్యాటక కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలి టెస్టు మొదటి రోజు 132 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన జేమ్స్ ఆండర్సన్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. అదే విధంగా.. అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ సైతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాను సైతం నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిమిత్తం న్యూజిలాండ్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బృందానిన్ని ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఆండర్సన్. ఓపెనర్లు టామ్ లాథమ్(1 పరుగు), విల్ యంగ్(1)ను పెవిలియన్‌కు పంపాడు. అతడికి తోడు మాథ్యూ పాట్స్ చెలరేగాడు. విలియమ్సన్(2 పరుగులు)ను అవుట్ చేసి కివీస్‌కు భారీ షాకిచ్చాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు వరుసగా చేసిన స్కోర్లు: 1,1, 2, 3,13,14,42,6,26,7,14. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్రాండ్‌హోమ్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. 42 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండర్సన్ 4, పాట్స్ 4, స్టువర్ట్ బ్రాడ్ ఒకటి, బెన్ స్టోక్స్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132-10 (40 ఓవర్లు) చదవండి 👇 Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. అమ్మో అదో పీడకల.. తాను ఎదురుగా ఉన్నాడంటే ఇక అంతే: జయవర్ధనే 36 balls 🔴 5 maidens ⛔ 4 Runs 🏏 2 Wickets ☝ Every ball from Jimmy's opening spell 😍 pic.twitter.com/BNcyQSgZ2t — England Cricket (@englandcricket) June 2, 2022