
132 పరుగులకే కివీస్ ఆలౌట్.. ఇంగ్లండ్ ఆటగాళ్ల సంబరం(PC: ECB)
England Vs New Zealand 1st Test 2022 Day 1: ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ జట్టు విలవిల్లాడింది. ఆతిథ్య జట్టు బౌలర్ల దాటికి నిలవలేక పర్యాటక కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలి టెస్టు మొదటి రోజు 132 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన జేమ్స్ ఆండర్సన్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.
అదే విధంగా.. అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ సైతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాను సైతం నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిమిత్తం న్యూజిలాండ్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బృందానిన్ని ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఆండర్సన్.
ఓపెనర్లు టామ్ లాథమ్(1 పరుగు), విల్ యంగ్(1)ను పెవిలియన్‌కు పంపాడు. అతడికి తోడు మాథ్యూ పాట్స్ చెలరేగాడు. విలియమ్సన్(2 పరుగులు)ను అవుట్ చేసి కివీస్‌కు భారీ షాకిచ్చాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు వరుసగా చేసిన స్కోర్లు: 1,1, 2, 3,13,14,42,6,26,7,14.
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్రాండ్‌హోమ్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. 42 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండర్సన్ 4, పాట్స్ 4, స్టువర్ట్ బ్రాడ్ ఒకటి, బెన్ స్టోక్స్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు స్కోర్లు:
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132-10 (40 ఓవర్లు)
చదవండి 👇
Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే..
అమ్మో అదో పీడకల.. తాను ఎదురుగా ఉన్నాడంటే ఇక అంతే: జయవర్ధనే
36 balls 🔴
— England Cricket (@englandcricket) June 2, 2022
5 maidens ⛔
4 Runs 🏏
2 Wickets ☝
Every ball from Jimmy's opening spell 😍 pic.twitter.com/BNcyQSgZ2t