
మాథ్యూ పాట్స్ అరంగేట్రం(PC: England Cricket)
New Zealand tour of England- 2022: ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా తొలి టెస్టు గురువారం(జూన్ 2) ఆరంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్, కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో వెటరన్ సీమర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లండ్ జట్టులో పునరాగమనం చేశారు.
అదే విధంగా పేసర్ మాథ్యూ పాట్స్ అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతడికి శుభాకాంక్షలు తెలిపింది. కాగా ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన 704వ ఆటగాడిగా నిలిచాడు ఈ 23 ఏళ్ల కుర్రాడు. మరోవైపు.. గాయం కారణంగా జట్టుకు దూరమైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కై కివీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది.
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు తుది జట్లు:
ఇంగ్లండ్:
జాక్ క్రాలే, అలెక్స్ లీస్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
న్యూజిలాండ్:
టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్). కొలిన్ డే గ్రాండ్‌హోం, కైలీ జెమీషన్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, ట్రెంట్ బౌల్ట్.
చదవండి 👇
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!
Congratulations on becoming an England cricketer, @MattyJPotts! 🏴🏏#ENGvNZ pic.twitter.com/DwanRNWzuE
— England Cricket (@englandcricket) June 2, 2022