England Vs New Zealand
-
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు. ఇక స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.గజ్జ గాయం కారణంగా ఈ కివీ స్టార్ క్రికెటర్ భారత్ టెస్టులకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు గాయం నుంచి విలియమ్సన్ పూర్తిగా కోలుకోవడంతో ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌కు కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.అదేవిధంగా బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్‌కు తొలిసారి కివీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్మిత్ 114 ఫస్ట్-క్లాస్ వికెట్లతో పాటు 1919 పరుగులు కూడా సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.అజాజ్ పటేల్, సోధి దూరం!ఇక ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ స్పిన్ ద్వయం అజాజ్ పటేల్, ఇష్ సోధిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. దీంతో అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.జాకబ్ డఫీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. నవంబర్ 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.ఇంగ్లండ్ టెస్టులకు న్యూజిలాండ్ జట్టుటామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ (అన్ క్యాప్డ్), మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , నాథన్ స్మిత్, టిమ్ సౌతీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: IND vs AUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు మరో భారీ షాక్ -
Eng vs NZ: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రకటన.. ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ఎంట్రీ
పాకిస్తాన్లో చేదు అనుభవం చవిచూసిన ఇంగ్లండ్ తదుపరి మరో పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం తమ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.కాగా బెన్ స్టోక్స్ బృందం ఇటీవల పాకిస్తాన్లో మూడు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పాక్ గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. రెండు, మూడో టెస్టుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. ‘బజ్‌బాల్’కు కళ్లెం వేసిన పాక్ స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 1-2తో ఇంగ్లండ్ పాకిస్తాన్‌కు సిరీస్‌ను కోల్పోయింది.కివీస్‌తో మూడు టెస్టులుఈ క్రమంలో నవంబరు 28 నుంచి ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన జేమీ స్మిత్ దూరమయ్యాడు. అతడు పెటర్నిటీ సెలవులో వెళ్లిన కారణంగా.. జోర్డాన్ కాక్స్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.మరోవైపు.. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన ఆల్‌రౌండర్ జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20 మ్యాచ్‌లు ఆడిన జాకోబ్ 738 పరుగులు చేశాడు. అదే విధంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతడు ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈసారి అరంగేట్రం పక్కామరోవైపు.. కాక్స్ 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 3194 పరుగులతో రాణించాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించినప్పటికీ అతడు ఇంతవరకు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. శ్రీలంక సిరీస్ నుంచి జట్టుతోనే ఉన్నా ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి మాత్రం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకునే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కివీస్‌తో సిరీస్ ఆడే జట్టులో ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్‌లకు కూడా చోటిచ్చారు సెలక్టర్లు. కాగా 2008 తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇక కివీస్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రేహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జాక్ లీచ్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: Mumbai Pitch: కివీస్‌తో మూడో టెస్టు.. తొలిరోజు వారికే అనుకూలం!? -
న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు దుమ్ములేపింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఐదో టీ20లోనూ విజయం సాధించింది.లండన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా 5-0తో వైట్‌వాష్ చేసి సత్తా చాటింది.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. పర్యాటక జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.హీథర్ నైట్ కెప్టెన్ ఇన్నింగ్స్(31 బంతుల్లో 46 నాటౌట్) కారణంగా ఈ మేరకు స్కోరు చేసింది. మిగతా వాళ్లలో అలిస్ కాప్సీ 25, చార్లీ డీన్ 24 పరుగులతో రాణించారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు సుజీ బేట్స్(16), జార్జియా ప్లీమర్(8) విఫలమయ్యారు.అయితే, వన్‌డౌన్ బ్యాటర్ అమేలియా కెర్(42) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. బ్రూక్ హాలీడే(25) ఆమెకు సహకారం అందించింది. అయితే, మిగతా వాళ్లెవరూ బ్యాట్ ఝులిపించలేకపోయారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగుల(ఎనిమిది వికెట్లు)కే పరిమితమైన న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడి.. క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. సారా గ్లెన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకుంది.టీ20 వరల్డ్‌కప్-2024కు రెడీఈ ఏడాది అక్టోబరులో బంగ్లాదేశ్ వేదికగా ఐసీసీ వుమెన్స్ టీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌పై ఇలాంటి విజయం తమకు మంచి బూస్ట్ ఇచ్చిందని కెప్టెన్ హీథర్ నైట్ పేర్కొంది.మెగా టోర్నీకి ముందు అజేయంగా నిలవాలని భావించామని.. దూకుడైన ఆటతో ఆ కలను నెరవేర్చుకున్నట్లు తెలిపింది. వరల్డ్‌కప్‌నకు సన్నాహకాల్లో భాగంగా ముందుగా తాము అబుదాబికి వెళ్తామని.. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించింది.ఇదిలా ఉంటే.. జూన్ 26న ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ మహిళా జట్టు వన్డే సిరీస్‌ను కూడా 0-3తో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. అక్కడా వైట్‌వాష్ ఎదుర్కొంది. ఓవరాల్‌గా ఈ టూర్ వాళ్లకు చేదు అనుభవం మిగిల్చింది. View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) -
NZ vs Pak: షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్-2025కి కివీస్ స్టార్స్ దూరం?
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 2025 ఏడాదికి గానూ తమ హోం షెడ్యూల్‌ను ప్రకటించింది. స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్లతో సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, శ్రీలంక- పాకిస్తాన్లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, పాక్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. కివీస్ జట్టు ఇప్పటికే సౌతాఫ్రికా- పాకిస్తాన్‌తో ట్రై సిరీస్ ఆడేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి సన్నాహకంగా ముందుగా ఈ త్రైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్ పాల్గొననుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది.న్యూజిలాండ్ మెన్స్ షెడ్యూల్(2024- 2025)వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్👉మొదటి టెస్టు- నవంబరు 28- డిసెంబరు 2- క్రైస్ట్‌చర్చ్👉రెండో టెస్టు- డిసెంబరు 6- 10- వెల్లింగ్టన్👉మూడో టెస్టు- డిసెంబరు 14- 18- హామిల్టన్శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు👉తొలి టీ20- డిసెంబరు 28- తౌరంగ👉రెండో టీ20- డిసెంబరు 30- తౌరంగ👉మూడో టీ20- జనవరి 2- నెల్సన్👉తొలి వన్డే- జనవరి 5- వెల్లింగ్టన్👉రెండో వన్డే- జనవరి 8- హామిల్టన్👉మూడో వన్డే- జనవరి 11- ఆక్లాండ్పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్‌లు👉మొదటి టీ20- మార్చి 16- క్రైస్ట్‌చర్చ్👉రెండో టీ20- మార్చి 18- డునెడిన్👉మూడో టీ20- మార్చి 21- ఆక్లాండ్👉నాలుగో టీ20- మార్చి 23- తౌరంగ👉ఐదో టీ20- మార్చి 26- వెల్లింగ్టన్తొలి వన్డే- మార్చి 29- నేపియర్👉రెండో వన్డే- ఏప్రిల్ 2- హామిల్టన్👉మూడో వన్డే- ఏప్రిల్ 5- తౌరంగ.చదవండి: మీరంటే నేను.. నేనంటే మీరు: గంభీర్ భావోద్వేగం -
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే.ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు.మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు.నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది.అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా.అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను.ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచింది!
వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు. నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది. అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా. అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను. ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
పాక్, ప్రోటీస్ కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చెరే జట్లు ఇవే: సచిన్
క్రికెట్ అభిమానలు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్-2023కు గురువారం(ఆక్టోబర్ 5) తెరలేచింది. అహ్మాదాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు చెరే నాలుగు జట్లను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కకర్ ఎంచుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను సెమీఫైనల్ ఫేవరేట్లగా 'మాస్టర్ బ్లాస్టర్' ఎంపిక చేశాడు. "భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టు కూడా చాలా సమతుల్యంగా ఉంది. కచ్చితంగా టీమిండియా సెమీస్‌కు చేరుతోంది. అదే విధంగా ఆస్ట్రేలియా కూడా అత్యుత్తమంగా ఉంది. కాబట్టి వారు సెమీఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక మూడో జట్టుగా డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లీష్ జట్టు కూడా మరోసారి టైటిల్ బరిలో ఉంటుంది. ఇంగ్లండ్ జట్టులో హ్యారీ బ్రూక్, సామ్ కుర్రాన్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇక నా నాల్గువ జట్టు న్యూజిలాండ్. కివీస్ వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో న్యూజిలాండ్ ఎల్లప్పుడూ బాగా రాణిస్తుంది. కివీస్ కూడా కచ్చితంగా టాప్-4లో ఉంటుందని" ఐసీసీ డిజిటిల్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి? -
ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి?
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య వరల్డ్‌కప్ తొలి మ్యాచ్.. హాట్ ఫేవరేట్‌గా ఇంగ్లీష్ జట్టు. కివీస్ ముందు 283 పరుగుల భారీ లక్ష్యం.. రెండో ఓవర్లోనే న్యూజిలాండ్ వికెట్ డౌన్. దీంతో కివీస్ పతనం మొదలైందని అనుకున్నారంతా. ఈ సమయంలో తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న 23 ఏళ్ల కుర్రాడు క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లీష్ పేస్ బౌలర్లను ఇతడేం ఆడుతాడు? ఒకట్రెండు ఓవర్లలో ఔటైపోతాడని అంతా భావించారు. కానీ విలియమ్సన్ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ యువ సంచలనం అందరి అంచనాలను తలకిందలూ చేస్తూ విధ్వంసం సృష్టించాడు. అతడే కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర. మొదటి వరల్డ్‌కప్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు. అతడి పేరు ప్రస్తుతం మారుమ్రోగిపోతుంది. తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ.. రచిన్ రవీంద్రకు ఇదే తొలి వరల్డ్‌కప్. ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్లు వోక్స్, మార్క్ వుడ్‌కు రవీంద్ర చుక్కలు చూపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 96 బంతులు ఎదుర్కొన్న రవీంద్కర 1 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి రెండో వికెట్‌కు 273 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని రవీంద్ర నెలకొల్పాడు. బౌలింగ్‌లో కూడా ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ అద్బుత ప్రదర్శనకు గానూ రవీంద్రకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించిన రవీంద్ర గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఎవరీ రచిన్ రవీంద్ర..? 23 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు. రవీంద్ర కూడా అక్కడే పుట్టాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో రవీంద్ర న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా రవీంద్ర న్యూజిలాండ్‌లో ఉన్నప్పటికీ.. క్రికెట్లో మెళకువలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే నేర్చుకున్నాడు. ప్రతీ ఏడాది అనంతపురంకు వచ్చి రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్‌లో ట్రైనింగ్ పొందేవాడు. అంతేకాకుండా స్ధానికంగా క్రికెట్ టోర్నీలు కూడా రచిన్ ఆడేవాడు. కాగా అతడి తండ్రికి న్యూజిలాండ్ లో హాట్ హాక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ఉంది. దీంతో కొంతమంది న్యూజిలాండ్ ఆటగాళ్లతో రవీంద్ర అనంతపురంకు వచ్చి క్రికెట్ ఆడేవాడట. ఆ పేరు ఎలా వచ్చిందంటే? రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తికి భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో తన ఆరాధ్య క్రికెటర్ల పేర్లు వచ్చేలా రచిన్ రవీంద్రకు కృష్ణమూర్తి పేరు పెట్టాడు. రాహుల్ ద్రవిడ్ పేరు నుంచి 'రా'.. సచిన్ పేరు నుంచి 'చిన్' తీసుకుని రచిన్అనే పేరు తన కొడుకుకు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు రచిన్ రవీంద్ర 3 టెస్ట్‌లు, 12 వన్డేలు, 18 టీ20లు న్యూజిలాండ్ తరపున ఆడాడు. కాగా ఇదే అతడికి తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. చదవండి: Asian games 2023: అదరగొట్టిన తిలక్ వర్మ..సెమీఫైనల్లో బంగ్లా చిత్తు! ఫైనల్‌కు భారత్ -
వారిద్దరే మా ఓటమిని శాసించారు.. చాలా బాధగా ఉంది! కానీ: బట్లర్
వన్డే ప్రపంచకప్-2023ను డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఘోర ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్‌లో మాత్రం చేతిలేత్తేసింది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 36.2 ఓవర్లలలోనే కివీస్ ఛేదించింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే(152), రచిన్ రవీంద్ర(123) ఆజేయ శతకాలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రాన్ తప్ప మిగితా ఎవరూ వికెట్ సాధించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(77) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు. తమ బ్యాటింగ్ తీరు పట్ల బట్లర్ ఆసహనం వ్యక్తం చేశాడు. వారిద్దరూ అద్బుతం "తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవ్వడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. అయితే ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ ఓటమిని ఎంతవేగం మర్చిపోతే అంతమంచిది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడారు. ఇంతకు ముందు చాలా జట్లను ఈ విధంగానే మేము ఓడించాము. అదే విధంగా ఇటువంటి పరాజయాలు గతంలో కూడా మాకు ఎదురయ్యాయి. కానీ ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి విజయాలను సాధించాము. మేము ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేయలేదు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను చూసి ఈ మాట చెప్పడం లేదు. ఎందుకంటే వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. మేము ఈ పిచ్‌పై 330 పరుగులు చేయాల్సింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కీలక భాగస్వామ్యం నెలకొల్పడం చాలా కష్టం. కానీ మేము సరైన ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్లను కోల్పోయాం. అయితే ఈ టోర్నీలో మేము పాజిటివ్‌గా ఆడాల్సిన అవసరం ఉంది. మరీ డిఫెన్సీవ్‌గా ఆడాల్సిన పని కూడా లేదు. మా శైలిలోనే మేము ఆడుతాం. కానీ న్యూజిలాండ్ మాత్రం అద్బుతంగా ఆడింది. వారు షాట్ సెలక్షన్స్ కూడా చాలా బాగుంది. అందుకు తగ్గట్టు ప్రతిఫలం కూడా దక్కింది. కాన్వే లాంటి ఆటగాడు భారీ షాట్లు ఆడలేదు, కానీ తన బ్యాటింగ్ టెక్నిక్‌తో చాలా త్వరగా పరుగులు సాధించాడు. రచిన్ రవీంద్ర కూడా ఆ విధంగానే ఆడాడు. వీరి నుంచి మేము ఇటువంటి ప్రదర్శన వస్తుందని అస్సలు ఊహించలేదు. వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అదే మా ఓటమిని శాసించింది. ఫ్లడ్ లైట్స్ కింద బౌలింగ్ చేయడం కష్టమనే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ అది జరగలేదు. ఇక జోరూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఫామ్‌పై మాకు ఎటువంటి సందేహం లేదు. అతను ఏ ఫార్మాట్లో ఆడినా రన్ మిషన్. స్టోక్స్ కూడా ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
World Cup 2023, England vs. New Zealand: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపు (ఫోటోలు)
-
CWC 2023 ENG VS NZ: జగజ్జేతలకు షాక్.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
2023 వన్డే వరల్డ్‌కప్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గత ఎడిషన్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు పలు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గత వరల్డ్‌కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ టీమ్.. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో మట్టికరిపించి, మెగా టోర్నీలో బోణీ విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించిన న్యూజిలాండ్, వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత వేగంగా 280 అంతకంటే ఎక్కువ స్కోర్‌ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన మరిన్ని రికార్డులు.. ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో ఇంగ్లండ్ పరుగుల ఖాతాను సిక్సర్‌తో తెరిచి ఆల్‌టైమ్ వరల్డ్‌కప్ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచకప్ చరిత్రలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్ చేశారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇది ప్రపంచ రికార్డు. వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం- డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర (అజేయమైన 273 పరుగులు) డెవాన్ కాన్వే న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (22 ఇన్నింగ్స్‌లు) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు వరల్డ్‌కప్ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల, 321 రోజులు) రచిన్ రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. వరల్డ్‌కప్ అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా (32 ఏళ్ల 89 రోజులు) కాన్వే రికార్డుల్లోకెక్కాడు. -
CWC 2023 ENG VS NZ: కాన్వే, రచిన్ మెరుపు శతకాలు.. రికార్డు భాగస్వామ్యం నమోదు
వన్డే వరల్డ్‌కప్ 2023కి అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వారు ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో కాన్వే, రచిన్ జోడి రెండో వికెట్‌కు అజేయమైన 273 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 1996 వరల్డ్‌కప్‌లో లీ జెర్మాన్-క్రిస్ హారిస్ జోడి నమోదు చేసిన 168 పరుగుల భాగస్వామ్యామే ఈ మ్యాచ్‌కు ముందు వరకు ప్రపంచకప్‌ల్లో న్యూజిలాండ్ బెస్ట్ పార్ట్నర్షిప్గా ఉండింది. తాజాగా కాన్వే-రచిన్ జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్ సెంచరీకి చేరుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. కాన్వే 83 బంతుల్లో శతక్కొడితే.. రచిన్ 81 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. వన్డేల్లో కాన్వేకు ఇది ఐదో సెంచరీ కాగా.. రచిన్‌కు తన కెరీర్ మొత్తంలోనే ఇది తొలి సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే, రచిన్ శతక్కొట్టడంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. -
CWC 2023 ENG VS NZ: 4658 వన్డేల చరిత్రలో తొలిసారి ఇలా..!
భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తుది జట్టులోని సభ్యులందరూ (11 మంది) రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు సభ్యులు జానీ బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11), జోస్ బట్లర్ (43), జో రూట్ (77), లియామ్ లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11), మార్క్ వుడ్ (13 నాటౌట్), ఆదిల్ రషీద్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. 4,658 ODI matches in history so far. First time ever all the 11 batters of a team scored runs in double digits. pic.twitter.com/UYP1oWDf0S — Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023 ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు రాణించినప్పటికీ జట్టులోని సభ్యులందరూ తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (39), డెవాన్ కాన్వే (33) ధాటిగా ఆడుతూ తమ జట్టును లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 73/1గా ఉంది. -
CWC 2023 ENG VS NZ: రూట్ కొంపముంచిన రివర్స్ స్వీప్
2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎదురీదుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్ సేన ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తుంది. మధ్యలో (ఐదో వికెట్‌కు) కాసేపు (70 పరుగులు) రూట్, బట్లర్ జోడీ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినప్పటికీ బట్లర్ వికెట్ పడ్డాక కథ మళ్లీ మొదటికొచ్చింది. Watch Joe Root's reverse-scoop: https://t.co/riEnCtwreZ pic.twitter.com/RCUIh8oFUl — CricTracker (@Cricketracker) October 5, 2023 బట్లర్ ఓటయ్యాక 33 పరుగులు జోడించిన అనంతరం లివింగ్‌స్టోన్ కూడా ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 221 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన జో రూట్ బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. Wait what 🤯! Reverse scoop to Trent Boult 🤯, Joe Root🤌 📸: Disney+Hotstar pic.twitter.com/R1JRhC2BUk — CricTracker (@Cricketracker) October 5, 2023 రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్ స్వీప్ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆఖర్లో కుదురుకున్న ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్ ఇంగ్లండ్ టెయిలెండర్లు ఆఖర్లో తలో చేయి వేసి ఓ మోస్తరు పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేసింది. 252 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ మరో 30 పరుగులు జోడించి 282 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. -
CWC 2023: చరిత్ర సృష్టించిన బెయిర్‌స్టో.. వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి..!
భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ప్రారంభమైందని బాధపడుతున్న క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్సర్ బాదిన బెయిర్‌స్టో, మెగా టోర్నీకి ఓపెనింగ్ సెర్మనీ జరగకపోయినా అంతకుమించిన మజాను అందించాడు. First runs of the #icccricketworldcup2023 & that too with a SIX 6⃣ ... England started the Bazball way 🔥🔥#ENGvsNZ #ICCCricketWorldCup #Ahmedabad #NarendraModiStadium pic.twitter.com/ddyNAfYHyL — SRKxVIJAY (@Srkxvijay) October 5, 2023 ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్‌లో రెండో బంతినే సిక్సర్‌కు తరలించడం ద్వారా బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ జట్టు రికార్డుపుటల్లోకెక్కింది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. టోర్నీలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ షాట్‌తో బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ చరిత్రపుటల్లోకెక్కింది. తొలి ఓవర్లో బెయిర్‌స్టో సిక్సర్‌తో పాటు మరో బౌండరీ కూడా బాదాడు. తద్వారా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 12 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11) ఔట్ కాగా.. జో రూట్ (35), జోస్ బట్లర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. -
ఓపెనింగ్ సెర్మనీ లేదు.. ఖాళీ కుర్చీలు.. ఊహించిన విధంగా ప్రారంభం కాని క్రికెట్ వరల్డ్‌కప్
మహా క్రికెట్ సంగ్రామం వన్డే వరల్డ్‌కప్ 2023 ఊహించిన విధంగా ఆరంభానికి నోచుకోలేదని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైన నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు భారీ తారాగణంతో ఓపెనింగ్ సెర్మనీ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మెగా టోర్నీని తూతూమంత్రంగా ప్రారంభించారు నిర్వహకులు. The scene for the World Cup opener…IT’S MASSIVE 🤯#CWC23 pic.twitter.com/Rljsp4HICA— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 5, 2023 The stands at the 132,000 capacity Narendra Modi stadium in Ahmedabad are only sparsely filled for the #CWC23 opener between England and New Zealand 🏟️ pic.twitter.com/lQSgGEWuTE — ESPNcricinfo (@ESPNcricinfo) October 5, 2023 అలాగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తారని అంతా ఊహించారు. అయితే ఇది కూడా జరగలేదు. మ్యాచ్ ప్రారంభమై గంట గడుస్తున్నా స్టేడియం మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఈ సీన్‌ను చూసి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు ఇది వరల్డ్‌కప్ టోర్నీనేనా.. ఈ మ్యాచ్ జరుగున్నది భారత దేశంలోనే అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వరల్డ్‌కప్ గ్లోబల్ అంబాసిడర్ హోదాలో సచిన్ టెండూల్కర్ టోర్నీని అధికారికంగా ప్రారంభించాడనే మాట తప్పించి మెగా టోర్నీ ప్రారంభమంతా నామమాత్రంగా సాగడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. జనాలు స్టేడియంకు రాలేదంటే ఇవాళ పని దినం అనుకునే సర్దిచెప్పుకోవచ్చు.. మరి కనీసం ఓపెనింగ్ సెర్మనీ కూడా నిర్వహించలేని దుస్థితిలో బీసీసీఐ ఉందా అంటే..? ఈ ప్రశ్నకు ఏలికలే సమాధానం చెప్పాలి. Hopefully after office hours, there should be more people coming in. But for games not featuring Bharat, there should be free tickets for school and college children. With the fading interest in 50 over game, it will definitely help that youngsters get to experience a World Cup… — Virender Sehwag (@virendersehwag) October 5, 2023 ఏదిఏమైనప్పటికీ వరల్డ్‌కప్ 2023 మాత్రం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 64/2గా ఉంది. ఓపెనర్లు బెయిర్‌స్టో (33), మలాన్ (14) ఔట్ కాగా.. జో రూట్ (16), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్‌కు తలో వికెట్ దక్కింది. -
మేము కూడా ముందు బౌలింగ్ చేయాలనుకున్నాం.. కానీ! స్టోక్స్‌కు: బట్లర్
క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తొలుత ఇంగ్లడ్‌ను బ్యాటింగ్ అహ్హనించాడు. తొలి మ్యాచ్‌కు కేన్ విలియమ్సన్ దూరం కావడంతో లాథమ్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. స్టోక్స్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని టాస్ సందర్భంగా జోస్ బట్లర్ తెలిపాడు.బట్లర్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై మాకు కూడా ముందు బౌలింగ్ చేయాలని ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ వికెట్ వికెట్ చాలా బాగుంది. ఇక టోర్నీకి అన్ని విధాల సన్నద్దమయ్యాం. అదేవిధంగా మా సొంత గడ్డపై న్యూజిలాండ్‌ను వన్డే సిరీస్‌లో ఓడించాం. కాగా ఈ మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. స్టోక్స్ తుంటి గాయంతో బాధపడుతున్నాడు. స్టోక్స్‌తో పాటు టోప్లీ, విల్లీ, అటిక్సన్ దూరమయ్యారు. చివరగా ఈ టోర్నమెంట్ కోసం ఎంతో అతృతగా మేము ఎదురుచూశమని పేర్కొన్నాడు. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్ జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! ఇదేం ప్రశ్న? నవ్వు ఆపుకొన్న బట్లర్! వీడియో -
WC 2023: కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్ గత వరల్డ్‌కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో కివీస్ టీమ్.. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో చిత్తు చేసి, మెగా టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర.. గెలుపుకు చేరువైన కివీస్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రచిన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. రచిన్ 82 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రచిన్‌కు కెరీర్లో ఇది తొలి శతకం. మరో ఎండ్‌లో కాన్వే (111) సెంచరీ పూర్తయ్యాక కూడా నిలకడగా ఆడుతున్నారు. 30.4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 214/1గా ఉంది. న్యూజిలాండ్ గెలుపుకు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది. డెవాన్ కాన్వే మెరుపు శతకం.. గెలుపుకు చేరువైన కివీస్ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 83 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో ఐదో శతకాన్ని పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (90) కూడా శతకానికి చేరువయ్యాడు. ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో కివీస్ ఆడుతూపాడుతూ విజయం దిశగా సాగుతుంది. 26.1 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 193/1గా ఉంది. శతకాల దిశగా పరుగులు పెడుతున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (71), డెవాన్ కాన్వే (82) శతకాల దిశగా దూసుకుపోతున్నారు. వీరిద్దరి ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. 20 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 154/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 30 ఓవర్లలో 129 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (62 నాటౌట్), రచిన్ రవీంద్ర (58 నాటౌట్) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 15 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 121/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 35 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. లక్ష్యం దిశగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు ఏడో బంతికే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (47), డెవాన్ కాన్వే (44) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 92/1గా ఉంది. టార్గెట్ 283.. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి విల్ యంగ్ డకౌటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 19/1గా ఉంది. డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (8) క్రీజ్‌లో ఉన్నారు. పడి లేచిన ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ రూట్ (77), బట్లర్ (43) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గట్టెక్కించారు. ఆఖర్లో టెయింలెండర్లు మేము సైతం అని ఓ చేయి వేయడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 252 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి సామ్ కర్రన్ (14) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 250 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి క్రిస్ వోక్స్ (11) ఔటయ్యాడు. జో రూట్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది. ఈ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా ఈ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి ఆ ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటివరకు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రూట్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్, క్రిస్ వోక్స్ క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 221 పరుగుల వద్ద (38.5 ఓవర్లు) ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన స్లో బాల్‌కు లివింగ్‌స్టోన్ (20) ఔటయ్యాడు. జో రూట్ (72), సామ్ కర్రన్ క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. ఐదో వికెట్ డౌన్ ఇంగ్లండ్ టీమ్ కష్టాల్లో పడింది. 188 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు (33.2 ఓవర్లలో)బౌలింగ్‌లో వికెట్‌కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (43) ఔటయ్యాడు. జో రూట్ (59) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్ జో రూట్ 57 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 166/4గా ఉంది. రూట్‌తో పాటు జోస్ బట్లర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ 118 పరుగల వద్ద (21.2 ఓవర్లు) ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (11) క్లీన్ బౌల్డయ్యాడు. జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నాడు. 94 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ వరుసగా 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది జోష్ మీదుండిన హ్యారీ బ్రూక్ (25) అనవసరమైన షాట్ ఆడి వికెట్ పరేసుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 94/3. జో రూట్ (20), మొయిన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. జానీ బెయిర్‌స్టో ఔట్.. ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్ 64 పరుగుల వద్ద (12.5 ఓవర్లు) ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్‌స్టో (33) ఔటయ్యాడు. జో రూట్ (15), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 40 పరుగుల వద్ద (7.4 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న డేవిడ్ మలాన్ 14 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జానీ బెయిర్‌స్టో (24) క్రీజ్‌లో ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 35/0గా ఉంది. బెయిర్‌స్టో (21), మలాన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన బెయిర్‌స్టో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఊహించని ఆరంభం లభించింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బంతికే బెయిర్‌స్టో సిక్సర్ బాదాడు. ఆతర్వాత ఐదో బంతికి బౌండరీ కొట్టాడు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి ఓవర్లో 12 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో (11), డేవిడ్ మలాన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ (అక్టోబర్ 5) డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ బెన్ స్టోక్స్ లేకుండా బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోయింది. విలియమ్సన్తో పాటు ఫెర్గూసన్, టిమ్ సౌథీ, ఐష్ సోధి ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. -
WC 2023 Eng Vs NZ: టాస్ గెలిచిన కివీస్.. ఇంగ్లండ్‌కు షాక్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే వరల్డ్‌కప్-2023కు తెరలేచింది. భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీ ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్‌కు షాక్.. స్టోక్స్ లేకుండానే టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక 2019 వరల్డ్‌కప్ హీరో బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లండ్.. కివీస్‌తో బరిలోకి దిగనుంది. గాయం వేధిస్తున్న క్రమంలో అతడు జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. వాళ్లు ముగ్గురూ మిస్ కాగా కొన్నాళ్ల క్రితం 50 ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. ఇంగ్లండ్ బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ న్యూజిలాండ్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా.. లాథమ్ మాట్లాడుతూ.. ‘‘టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. పిచ్ బాగుంది. పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకుంటున్నాం. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. దురదృష్టవశాత్తూ కేన్ ఇంకా మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాలేదు. ఫెర్గూసన్‌ని గాయం వేధిస్తోంది. ఇష్ సోధి, కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ ఈరోజు మిస్సయ్యారు’’ అని పేర్కొన్నాడు. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్ జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. -
Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! బట్లర్ రిప్లై ఇదే! వీడియో వైరల్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు వింత ప్రశ్న ఎదురైంది. ఓ రిపోర్టర్ తిక్క ప్రశ్నతో అతడిని ఆశ్చర్యపరిచాడు. అయితే, బట్లర్ మాత్రం హుందాగా సమాధానమిచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యజిలాండ్ మధ్య మ్యాచ్‌తో గురువారం ప్రపంచకప్ టోర్నకి తెరలేవనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జోస్ బట్లర్‌కు ఇంగ్లండ్ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది. వాళ్లిద్దరు లేరు కదా! ఓ జర్నలిస్టు.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, మరో ఫాస్ట్‌బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ లేకుండా ఈ మెగా టోర్నీలో బట్లర్ బృందం ఎలా ఆడబోతుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘నాకు తెలిసి జిమ్మీ ఇంకా సెలక్షన్‌కు అందుబాటులోనే ఉన్నాడనే అనుకుంటున్నా. 2015 నుంచి అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఇక స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయ్యాడు. కాబట్టి దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు ఈసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడం లేదు. అయితే, మా జట్టులో మెరుగైన నైపుణ్యాలు గల మరికొంత మంది ఫాస్ట్‌బౌలర్లు ఉన్నారు. నవ్వు ఆపుకొన్న బట్లర్ స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మా జట్టు సమతూకంగా ఉంది’’ అంటూ బట్లర్ నవ్వులు చిందించాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి నవ్వులపాలు కాకుండా చూశాడు. కాగా ఆండర్సన్ టెస్టులపై దృష్టిపెట్టే క్రమంలో 2015లో తన చివరి వన్డే ఆడాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, 41 ఏళ్ల వయసులోనూ రెడ్‌బాల్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. స్టువర్ట్ బ్రాడ్ సైతం ఎక్కువగా టెస్టులు ఆడే క్రమంలో 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక ఇటీవలే అతడు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఐసీసీ టోర్నమెంట్లో సదరు రిపోర్టర్ వీళ్లిద్దరి ప్రస్తావన తీసుకురాగా.. బట్లర్ ఈ విధంగా స్పందించాడు. ఇక 2019లో తొలిసారి ఇంగ్లండ్‌కు వరల్డ్‌కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ వారసత్వాన్ని నిలబెట్టేక్రమంలో.. టీ20 ప్రపంచకప్ విజేత బట్లర్ భారత్‌లో తన వ్యూహాలు ఎలా అమలు చేస్తాడో చూడాలి! చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. A journalist asked Jos Buttler in the PC if the absence of Anderson and Broad will affect their pace bowling in the tournament?Just look at him,he was trying so hard not to laugh 😂😭.#CWC23 Video Credit: @ICC Facebook pic.twitter.com/1rdOjglfEd — Delhi Capitals Fan (@pantiyerfc) October 4, 2023 -
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేసిన జో రూట్
వన్డే ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. కాగా కివీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రూట్ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు 428 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్.. 18555 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమిస్తాడు. గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్లో 18575 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్ టోర్నీలో 445 పరుగులు చేస్తే 19000 పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. రూట్ తన వన్డే కెరీర్లో 6246 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్(758 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చదవండి: గంభీర్ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్ -
టీమిండియా స్టార్ క్రికెటర్‌కు విడాకులు మంజూరు..
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ దావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు. దీంతో ఈ కేసు కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ విశ్వసించారు. కొన్నాళ్ల పాటు కుమారుడితో విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా ఆస్ట్రేలియాలో తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తనని యజమానిగా చేయాలని ఆయేషా తనను ఒత్తిడి చేసిందన్న ధావన్ ఆరోపణను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. కాగా ధావన్, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్‌కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా కూడా ధావన్ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది. కాగా వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్బోర్న్కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత ధావన్-ఆయేషా వ్యక్తిగత కారణాల వల్ల ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2021లో ధావన్‌తో విడాకులు తీసుకుంటున్నాని ఆయేషానే స్వయంగా వెల్లడించింది. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే?: -
ఇంగ్లండ్- న్యూజిలాండ్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..?
క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ క్రికెట్ మహాసంగ్రామానికి సర్వం సిద్దమైంది. గురువారం అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి పోరుతో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ రెండు జట్లు కూడా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లూక్కేద్దం. ఇరు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. 2019 వరల్డ్‌కప్ హీరో బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆ జట్టుకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే తొలి మ్యాచ్‌కు స్టోక్స్ అందుబాటుపై సందేహం నెలకొంది. స్టోక్స్ తుంటి గాయంతో బాధపడుతున్నాడు. స్టోక్స్ తొలి మ్యాచ్‌కు దూరమైన బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, కెప్టెన్ జోస్ బట్లర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలిగే లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ వంటి వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. వీరిందరూ తమ బ్యాట్‌కు పని చేబితే అహ్మదాబాద్‌లో పరుగుల వరద పారడం ఖాయం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా ఇంగ్లండ్ బలంగా కన్పిస్తోంది. మార్క్ వుడ్, టోప్లీ వంటి నిప్పులు చేరిగే ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అదిల్ రషీద్ వంటి అద్బుతమైన స్పిన్నర్లు కూడా ఉన్నారు. మరోవైపు వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్.. ప్రతీసారి ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్బుతాలు చేస్తుంది కివీస్ జట్టు. వరుసగా రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్ టోర్నీ రన్నరప్‌లుగా నిలిచింది. 2019 ప్రపంచకప్ తుది పోరులో ఇంగ్లండ్ చేతిలోనే కివీస్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది టోర్నీలో తొలి మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని బ్లాక్ క్యాప్స్ భావిస్తోంది. న్యూజిలాండ్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే మొదటి మ్యాచ్‌కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టు గట్టి ఎదురుదెబ్బ. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరించనున్నాడు. ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. రెండు సార్లు కూడా 300 పైగా పరుగులు నమోదు చేసింది. బ్యాటింగ్‌లో డెవాన్ కాన్వే, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కూడా అదరగొడుతున్నారు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వామప్ మ్యాచ్‌లో 93 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్లో కూడిన పేస్ త్రయం ఉంది. వీరిముగ్గురూ బంతితో చెలరేగితే ఇంగ్లండే కాదు ప్రత్యర్ధి ఏ జట్టు అయినా తలవంచాల్సిందే. న్యూజిలాండ్ కూడా బంగ్లాదేశ్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసి భారత్ గడ్డపై అడుగుపెట్టింది. కాబట్టి మరోసారి ఇంగ్లండ్‌కు కివీస్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి పోరులో ఎవరూ ఎవరిపై పై చేయి సాధిస్తారో వేచి చూడాలి. హెడ్ టూ హెడ్ రికార్డులు.. ఇక ఇంగ్లండ్-కివీస్ జట్లు ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ టోర్నీలో 10 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇరు జట్లు చెరో ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక ఓవరాల్‌గా ఇరు జట్లు 95 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇంగ్లండ్ 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 44 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. మరో నాలుగు మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే రద్దు అయ్యాయి. పిచ్ రిపోర్ట్.. ఇక అహ్మాదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. మిడిల్ ఓవర్లలో కాస్త స్పిన్‌కు అనూకూలించే ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, మలన్, రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్, ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బౌల్ట్ చదవండి: Babar Azam On Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంది బాబర్.. ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్ కెప్టెన్ -
వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (అక్టోబర్ 5) జరుగబోయే వరల్డ్‌కప్ 2023 ఆరంభ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. తుంటి నొప్పి (Hip Pain) కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. న్యూజిలాండ్‌తో రేపు జరుగబోయే మ్యాచ్ సమయానికి స్టోక్స్ నొప్పి నుంచి తేరుకోవడం అనుమానమనని తెలుస్తుంది. రేపటి మ్యాచ్‌కు స్టోక్స్ అందుబాటులో ఉండటం అనుమానమని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌కు స్టోక్స్ బెంచ్‌కు పరిమితం కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. స్టోక్స్ గాయంపై ఇంగ్లండ్ క్రికెట్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఈ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఒకవేళ స్టోక్స్ గాయం నిజమై రేపటి మ్యాచ్‌కు అతను దూరమైతే, అది ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. వార్మప్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి జోరుమీదున్న న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని, గత వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. కాగా, గతంలో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ ఇటీవలే ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చి, వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్‌పై భారీ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ నవంబర్ 19 వరకు సాగుతుంది. మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత భారత్ అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో (న్యూఢిల్లీ) తమ రెండో మ్యాచ్ ఆడుతుంది. దీని తర్వాత టీమిండియా.. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. -
ODI WC 2023: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్-కివీస్ జట్లు
వన్డే ప్రపంచకప్-2023కు మరో 24 గంటల్లో తేరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్, కివీస్ జట్లు మంగళవారం అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ జట్టు నేరుగా తిరువనంతపురం నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుగా.. ఇంగ్లీష్ జట్టు గువహటి నుంచి వచ్చింది. కాగా కివీస్ వామప్ మ్యాచ్‌ల్లో అదరగొట్టింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయం సాధించింది. అదే విధంగా ఇంగ్లండ్‌కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. భారత్‌తో వామప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బట్లర్ సేన జూలు విదిలించింది. ఇక అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు బుధవారం ఒక్క రోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోనున్నాయి. కాగా ఈ రెండు జట్లు హాట్ ఫేవరేట్లగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకోగా.. కివీస్ రన్నరప్‌గా నిలిచింది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం