వన్డే ప్రపంచకప్-2023కు మరో 24 గంటల్లో తేరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్, కివీస్ జట్లు మంగళవారం అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ జట్టు నేరుగా తిరువనంతపురం నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుగా.. ఇంగ్లీష్ జట్టు గువహటి నుంచి వచ్చింది.
కాగా కివీస్ వామప్ మ్యాచ్‌ల్లో అదరగొట్టింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయం సాధించింది. అదే విధంగా ఇంగ్లండ్‌కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. భారత్‌తో వామప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బట్లర్ సేన జూలు విదిలించింది.
ఇక అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు బుధవారం ఒక్క రోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోనున్నాయి. కాగా ఈ రెండు జట్లు హాట్ ఫేవరేట్లగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకోగా.. కివీస్ రన్నరప్‌గా నిలిచింది.
వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.
చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment