
న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు సిక్సర్లు బాదిన సౌథీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు 131 ఇన్నింగ్స్‌లలో సౌథీ 78 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 78 సిక్సలతో 15 స్థానంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును సౌథీ సమం చేశాడు. తన టెస్టు కెరీర్‌లో 144 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని 78 సిక్స్‌లు బాదాడు. ఇక అరుదైన రికార్డు సాధిచిన జాబితాలో 109 సిక్స్‌లతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ తొలి స్థానంలో ఉన్నాడు.
ఇక టెస్టు విషయానికి వస్తే.. రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అంతకముందు ఇంగ్లండ్ 87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీ(186 ) సాధించగా... జో రూట్ 153 పరుగులతో అజేయంగా నిలిచాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. భారీ రికార్డుపై కన్నేసిన అశ్విన్!