ఎంస్ ధోని.. భారత క్రికెట్ రూపరేఖలను మార్చేసిన నాయకుడు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఏకైక కెప్టెన్. తన అద్బుత కెప్టెన్సీతో, ఆటతీరుతో టీమిండియాను నెం1 జట్టుగా నిలిపిన ఘనత మిస్టర్ కూల్‌ది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఎంఎస్‌డి సొంతం చేసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు నాలుగేళ్లు అవుతున్నప్పటకి అతడిపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు.
కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోనిని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ ప్రతీ ఏటా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అంతలా ఆరాధించే ధోనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి విమర్శల వర్షం కురిపించాడు. ధోని వల్లే యువరాజ్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిందని యోగరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఎప్పటికీ క్షమించను..
యువరాజ్ సింగ్ కెరీర్‌ను ఎంఎస్ ధోని నాశనం చేశాడు. అతడిని నేను ఎప్పటకి క్షమించను. తనను తను అద్దంలో చూసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ధోని చాలా పెద్ద క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు నా కొడుకు పట్ల పక్షపాతంగా వ్యవహరించాడు.
ప్రతీ విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. నేను ఎవరైనా తప్పు చేశారని భావిస్తే వారిని జీవితంలో క్షమించను. అది నా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. యువరాజ్ ఇంకా నాలుగైదేళ్లు ఈజీగా ఆడేవాడు. కానీ ధోని మాత్రం నా కుమారుడికి సపోర్ట్ చేయలేదు.
అందుకే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. క్యాన్సర్‌తో బాధపడుతూనే దేశం కోసం ఆడి.. ప్రపంచకప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్‌ను భారతరత్నతో సత్కరించాలని జీస్వీచ్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.
యువీది చెరగని ముద్ర..
కాగా యువరాజ్ కూడా భారత క్రికెట్‌లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడం యువీ కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరపున 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్.. 11,178 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 17 సెంచరీలు,71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Yograj Singh's latest explosive interview on MS Dhoni.
😨
Also, demands Bharat Ratna for his son Yuvraj Singh for his outstanding and selfless contribution to Cricket. pic.twitter.com/JDoJrLMeIW— Abhishek (@vicharabhio) August 31, 2024
Comments
Please login to add a commentAdd a comment