
LSG vs MI Live Updates: ముంబై ఘన విజయం
వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు.
అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు.
బుమ్ బుమ్ బుమ్రా.. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 16వ ఓవర్ వేసిన బుమ్రా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
బదోని ఔట్..
అయూష్ బదోని రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బదోని.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో డేవిడ్ మిల్లర్(24), సమద్(1) ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
లక్నో నాలుగో వికెట్ డౌన్..
మిచెల్ మార్ష్(34) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో మార్ష్ ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. లక్నో విజయానికి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు డౌన్..
లక్నో సూపర్ జెయింట్స్ 7వ ఓవర్‌లో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో తొలి బంతికి పూరన్(27) ఔట్ కాగా.. మూడో బంతికి రిషబ్ పంత్(24) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
లక్నో తొలి వికెట్ డౌన్..
216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఐడైన్ మార్‌క్రమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(6), మార్ష్(13) ఉన్నారు.
సూర్య, రికెల్టన్ హాఫ్ సెంచరీలు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
ముంబై ఐదో వికెట్ డౌన్
157 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 174/5
ముంబై నాలుగో వికెట్ డౌన్
తిలక్ వర్మ రూపంలో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(44), హార్దిక్ పాండ్యా(5) ఉన్నారు.
ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..
విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జాక్స్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(15) ఉన్నారు.
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్..
ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రికెల్టన్..
దిగ్వేష్ రతి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 115/2
6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో అదరగొట్టింది. తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రికెల్టన్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) జోరు మీద ఉన్నాడు. అతనికి జతగా విల్ జాక్స్ (3) క్రీజ్‌లో ఉన్నాడు.
వరుసగా 2 సిక్సర్లు బాది ఔటైన రోహిత్ శర్మ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (12) అదే ఓవర్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 33/1గా ఉంది. రికెల్టన్ (19), జాక్స్ క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.
ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో లక్నో స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సాంట్నర్ స్థానంలో కర్ణ్ శర్మ.. విజ్ఞేశ్ పుథుర్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్