అద్బుత ప్రదర్శనలతో భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఘనత అతడది. అంతర్జాతీయ టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్ అతడు. 17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు అందించిన ధీరుడు. క్యాన్సర్‌తో పోరాడి మరి గెలిచిన యోదుడు.
జట్టు కష్టాల్లో ఉందంటే అందరికి గుర్తు వచ్చే సేవియర్. అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ మాయ చేసే మేజిషేయన్. ఇప్పటకే మీకు ఆర్ధమై పోయింటుంది ఇదింతా ఎవరి కోసమో. అవును మీరు అనుకుంటుంది నిజమే. అతడే టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్.
సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను బయట ఎక్కువగా మాట్లాడని యువీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతంలో ఓ సినీ నటితో డేటింగ్ చేసినట్లు యువీ చెప్పుకొచ్చాడు. 2007-08లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లగా తనకు ఎదురైన అనుభవాలను ఈ పంజాబీ దిగ్గజం గుర్తుచేసుకున్నాడు.
"2007-08లో టెస్టు సిరీస్ కోసం ఆసీస్ పర్యటనకు వెళ్లాం. ఆ సమయంలో నేను ఒక నటితో డేటింగ్‌లో ఉన్నాను. నేను ఆమె పేరు చెప్పాలనుకోవడం లేదు. ఆ సమయంలో ఆమె టాప్ హీరోయిన్‌లో ఒకరిగా ఉంది. ఆమె కూడా షూటింగ్ పనిమీద అడిలైడ్‌కు వచ్చింది. మేము అప్పడు కాన్‌బెర్రాలో ఉన్నాం. కానీ నేను ఆమెతో ఫోన్‌లో ఒక మాట చెప్పాను. ఆసీస్ టూర్‌లో ఉన్నందున ఆటపై దృష్టి పెట్టాలనకుంటున్నాను, మనం ఎక్కువగా కలవద్దని ఆమెతో అన్నాను.
కానీ ఆమె మాత్రం నా మాట వినకుండా కాన్‌బెర్రాకు వచ్చేసింది. నేను అప్పటికే తొలి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాను. కాబట్టి మూడో మ్యాచ్‌లో ఎలాగైనా మెరుగ్గా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాను. ఆ సమయంలో ఆమెను కాన్‌బెర్రాలో చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఏమి చేస్తున్నావు అని ప్రశ్నించాను. నేను మీతో సమయం గడపాలనుకుంటున్నాను ఆమె చెప్పింది. ఆ రోజు రాత్రి ఆమెను నేను కలిశాను.
ఆమెతో చాలా విషయాలు మాట్లాడాను. నీవు నీ కెరీర్‌పై దృష్టి పెట్టు, నా కెరీర్‌పై కూడా నేను ఫోకస్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆసీస్ పర్యటనలో ఉన్నాను. మాకు ఆ సిరీస్ చాలా ముఖ్యం. ఆ తర్వాత కాన్‌బెర్రా నుండి అడిలైడ్‌కి బయలు దేరుతున్నాము. ఆమె నా సూట్‌కేస్‌ను ప్యాక్ చేసింది. పొద్దున్న లేచే సరికి నా బూట్లు కన్పించలేదు. వెంటనే ఆమెను నా షూ ఎక్కడ ఉన్నాయి? అని అడిగాను, వాటిని కూడా ప్యాక్ చేసేశాను ఆమె చెప్పింది.
మరి నేను బస్సులో ఎలా వెళ్లాలి అని ఆమెను ప్రశ్నించాను. నా స్లిప్పర్స్ ధరించండి అని ఆమె సలహా ఇచ్చింది. ఆమె మాటలు విన్న నేను ఓమైగాడ్ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె దగ్గర ఉన్న పింక్ స్లిప్పర్లు వేసుకుని బస్సు దగ్గరకు వెళ్లాను.
నా లగేజీ బ్యాగ్‌ను అడ్డుపెట్టుకుని కనిపించకుండా బస్ ఎక్కాను. కానీ సహచరుల్లో కొందరు చూసేశారు. నన్ను చప్పట్లు కొడుతూ ఆట పట్టించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో వేరే చెప్పులను కొనుకున్నాను. మా హోటల్ నుంచి విమానాశ్రయానికి పింక్ స్లిప్పర్స్‌ను ధరించవలిసి వచ్చింది" అని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో యువీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment