గంభీర్‌ ఆల్‌టైమ్‌ భారత జట్టు ఇదే.. రోహిత్‌, బుమ్రాకు దక్కని చోటు? | Gautam Gambhir unveils his all-time India XI | Sakshi
Sakshi News home page

గంభీర్‌ ఆల్‌టైమ్‌ భారత జట్టు ఇదే.. రోహిత్‌, బుమ్రాకు దక్కని చోటు?

Published Mon, Sep 2 2024 11:34 AM | Last Updated on Mon, Sep 2 2024 2:40 PM

Gautam Gambhir unveils his all-time India XI

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ త‌న ప్ర‌యాణం ఆరంభంలోనే గెలుపోటముల రుచి చూశాడు. అత‌డి నేతృత్వంలో శ్రీలంక‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విజయం సాధించిన భారత్‌.. వన్డే సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం గంభీర్ తన తదుపరి సవాల్‌కు సిద్దమవుతున్నాడు. ఈ నెల 18 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. 

ఈ సిరీస్ అనంత‌రం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు భార‌త్ ఆడ‌నుంది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. లంక‌తో వన్డే సిరీస్ త‌ర్వాత భార‌త జ‌ట్టుకు దాదాపు నెల రోజులు విశ్రాంతి ల‌భించ‌డంతో గౌతీ వ‌రుస ఇంట‌ర్వ్యూలో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గంభీర్ త‌న ఆల్‌టైమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవ‌న్‌కు ఎంచుకున్నాడు.

కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని..
గంభీర్ త‌న ఎంచుకున్న ఆల్‌టైమ్ జ‌ట్టుకు భార‌త మాజీ సార‌థి ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అదేవిధంగా ఈ జ‌ట్టులో ఓపెన‌ర్లగా త‌న‌తో పాటు దిగ్గ‌జ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గౌతీ ఎంచుకున్నాడు. ఫ‌స్ట్ డౌన్‌లో భార‌త మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌, సెకెండ్ డౌన్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ల‌కు గంభీర్ చోటిచ్చాడు. 

అదే విధంగా విరాట్ కోహ్లి, యువ‌రాజ్ సింగ్‌ల‌కు వ‌రుస‌గా నాలుగు, ఐదు స్ధానాల్లో ఛాన్స్ ఇచ్చాడు.  వికెట్ కీప‌ర్ జాబితాలో ధోనికి చోటు ద‌క్కింది. ఇక త‌న జ‌ట్టులో ఫాస్ట్ బౌల‌ర్లగా ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్‌ల‌ను గంభీర్ అవ‌కాశ‌మిచ్చాడు. అదేవిధంగా స్పిన్న‌ర్ల కోటాలో దిగ్గ‌జాలుఅనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌ల‌ను అత‌డు ఎంపిక చేశాడు. అయితే ఈ జ‌ట్టులో భార‌త్‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన రోహిత్ శ‌ర్మ‌, జ‌స్ప్రీత్ బుమ్రా పేర్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గంభీర్ ఎంచుకున్న ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవ‌న్ ఇదే
వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌/ వికెట్‌ కీపర్‌), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement