టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బుధవారం అమెరికాపై టీమిండియా విజయనంతరం రోహిత్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
7 వికెట్ల తేడాతో అమెరికాను భారత్ చిత్తు చేసింది. ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హిట్‌మ్యాన్ అధిగమించాడు. దాదా కెప్టెన్‌గా 22 మ్యాచ్‌ల్లో 16 విజయాలు టీమిండియాకు అందించాడు.
తాజా మ్యాచ్‌తో గంగూలీ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ధోని కెప్టెన్‌గా 58 మ్యాచ్‌ల్లో 41 విజయాలు భారత్‌కు అందించాడు. ధోని సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను భారత్ సొంతం చేసుకుంది.
అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకోలేకపోయింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆఖరి మొట్టుపై భారత్ బోల్తా పడింది. ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 అర్హత సాధించిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.
చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్!
Comments
Please login to add a commentAdd a comment