NZ vs Pak: షెడ్యూల్‌ విడుదల.. ఐపీఎల్‌-2025కి కివీస్‌ స్టార్స్‌ దూరం? | New Zealand Summer Schedule, Pakistan Series Likely to Overlap With IPL 2025 | Sakshi
Sakshi News home page

NZ vs Pak: షెడ్యూల్‌ విడుదల.. ఐపీఎల్‌-2025కి కివీస్‌ స్టార్స్‌ దూరం?

Published Wed, Jul 17 2024 12:10 PM | Last Updated on Wed, Jul 17 2024 12:27 PM

New Zealand Summer Schedule, Pakistan Series Likely to Overlap With IPL 2025

న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు 2024- 2025 ఏడాదికి గానూ తమ హోం షెడ్యూల్‌ను ప్రకటించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌లతో సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది.

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌, శ్రీలంక- పాకిస్తాన్‌లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, పాక్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. కివీస్‌ జట్టు ఇప్పటికే సౌతాఫ్రికా- పాకిస్తాన్‌తో ట్రై సిరీస్‌ ఆడేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి సన్నాహకంగా ముందుగా ఈ త్రైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్‌ పాల్గొననుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకుంది.

న్యూజిలాండ్‌ మెన్స్‌ షెడ్యూల్‌(2024- 2025)
వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌
👉మొదటి టెస్టు- నవంబరు 28- డిసెంబరు 2- క్రైస్ట్‌చర్చ్‌
👉రెండో టెస్టు- డిసెంబరు 6- 10- వెల్లింగ్‌టన్‌
👉మూడో టెస్టు- డిసెంబరు 14- 18- హామిల్టన్‌

శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు
👉తొలి టీ20- డిసెంబరు 28- తౌరంగ
👉రెండో టీ20- డిసెంబరు 30- తౌరంగ
👉మూడో టీ20- జనవరి 2- నెల్సన్‌

👉తొలి వన్డే- జనవరి 5- వెల్లింగ్‌టన్‌
👉రెండో వన్డే- జనవరి 8- హామిల్టన్‌
👉మూడో వన్డే- జనవరి 11- ఆక్లాండ్‌

పాకిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్‌లు
👉మొదటి టీ20- మార్చి 16- క్రైస్ట్‌చర్చ్‌
👉రెండో టీ20- మార్చి 18- డునెడిన్‌
👉మూడో టీ20- మార్చి 21- ఆక్లాండ్‌
👉నాలుగో టీ20- మార్చి 23- తౌరంగ
👉ఐదో టీ20- మార్చి 26- వెల్లింగ్‌టన్‌

తొలి వన్డే- మార్చి 29- నేపియర్‌
👉రెండో వన్డే- ఏప్రిల్‌ 2- హామిల్టన్‌
👉మూడో వన్డే- ఏప్రిల్‌ 5- తౌరంగ.

చదవండి: మీరంటే నేను.. నేనంటే మీరు: గంభీర్‌ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement