New Zealand vs Srilanka
-
మూడో వన్డేలో కివీస్ చిత్తు.. వైట్‌వాష్ నుంచి తప్పించుకున్న శ్రీలంక
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్(Newzeland(తో జరిగిన మూడో వన్డేలో 140 పరుగుల తేడాతో శ్రీలంక(Srilanka) ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వైట్ వాష్ నుంచి లంక తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోర్ సాధించింది.శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(54), లియాంగే(53), కమిందు మెండిస్(46) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ శాంట్నర్ రెండు, నాథన్ స్మిత్, బ్రెస్‌వెల్ తలా వికెట్ సాధించారు.నిప్పులు చెరిగిన లంకేయులు..అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను లంక బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. అసితా ఫెర్నాండో, తీక్షణ, మలింగ దాటికి న్యూజిలాండ్ కేవలం 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఆ సమయంలో మార్క్ చాప్మన్ కివీస్‌ను అదుకునే ప్రయత్నం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి చాప్మన్ మాత్రం బౌండరీలు బాదుతూ కివీస్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. లంకేయులపై కౌంటర్ ఎటాక్ దిగిన చాప్మన్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.దీంతో లక్ష్య చేధనలో బ్లాక్ క్యాప్స్ 150 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మన్(81 బంతుల్లో 81, 10 ఫోర్లు, ఒక సిక్స్) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో,తీక్షణ, మలింగ తలా మూడు వికెట్లు సాధించారు. మూడు వికెట్లతో సత్తాచాటిన అసితా ఫెర్నాండోకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ అసాంతం అద్బుత ప్రదర్శన కనబరిచిన మాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా అంతకంటే ముందు కివీస్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో లంక కోల్పోయింది. ఇక శ్రీలంక తమ తదుపరి సిరీస్‌లో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు ఆడనుంది.చదవండి: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ -
శ్రీలంక స్పిన్నర్ హ్యాట్రిక్.. అరుదైన జాబితాలో చోటు
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. కివీస్ ఇన్నింగ్స్ 35 ఓవర్లో ఆఖరి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసిన మహేశ్ తీక్షణ.. ఆ తర్వాత 37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో తన తొలి హ్యాట్రిక్‌ను అందుకున్నాడు.న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌ను తొలుత ఔట్ చేసిన ఈ లంక మిస్టరీ స్పిన్నర్.. ఆ తర్వాత వరుసగా నాథన్ స్మిత్, మాట్ హెన్రీని ఔట్ చేసి ఈ మైలు రాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.కాగా ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చాప్మన్(62), మిచెల్(38) పరుగులతో రాణించారు.లంక బౌలర్లలో తీక్షణతో పాటు హసరంగా రెండు, మలింగ, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు. లక్ష్య చేధనలో శ్రీలంక పోరాడుతోంది. 26 ఓవర్లు ముగిసే సరికి లంక 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్(63) పరుగులతో ఉన్నాడు.ఇక ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తీక్షణ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్లో హ్యాట్రిక్ సాధించిన ఏడో శ్రీలంక బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ చమిందా వాస్ ఉన్నాడు. 2001లో జింబాబ్వేపై వాస్ తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. తర్వాత 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ మరో హ్యాట్రిక్ నమోదు చేశాడు. -
విల్ యంగ్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో శ్రీలంక చిత్తు
స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌ను అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో శ్రీలంకను కివీస్ చిత్తు చేసింది. లంకేయులు నిర్దేశించిన 179 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి కేవలం 26.2 ఓవర్లలోనే ఊదిపడేసింది.కివీస్ ఓపెనర్ విల్ యంగ్(86 బంతుల్లో 90, 12 ఫోర్లు) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు రచిన్ రవీంద్ర(45), మార్క్ చాప్మన్(29 నాటౌట్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో విక్రమసింఘే ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా తేలిపోయారు. నిప్పులు చెరిగిన హెన్రీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 43.4 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ తలా రెండు వికెట్లు సాధించారు.శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(56) టాప్ స్కోరర్‌గా నిలవగా..లియాంగే(36), హసరంగా(35) పర్వాలేదన్పించారు. ఇక విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే హామిల్టన్ వేదికగా జనవరి 8న జరగనుంది. కాగా ఇప్పటికే లంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కివీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి!
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ గండం నుంచి శ్రీలంక తప్పించుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన నామమాత్రపు మూడో టీ20లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. కుశాల్ పెరీరా(Kusal Perera) విధ్వంసక శతకంతో దుమ్ములేపగా.. చరిత్ అసలంక(Charith Asalanka) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో లంక గట్టెక్కగలిగింది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా మొదట టీ20లు జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం నెల్సన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం పర్యాటక లంక ఆతిథ్య కివీస్ జట్టుకు ఊహించని షాకిచ్చింది.సాక్స్టన్ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు పాతుమ్ నిసాంక(12 బంతుల్లో 14), కుశాల్ మెండిస్(16 బంతుల్లో 22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.లంక తరఫున ఫాస్టెస్ట్ సెంచరీఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరీరా మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 219కి పైగా స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించాడు. తద్వారా శ్రీలంక తరఫున అంతర్జాతీయ టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ(44 బంతుల్లో) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ఇక మిడిలార్డర్లో అవిష్క ఫెర్నాండో(17) విఫలమైనా.. చరిత్ అసలంక(24 బంతుల్లో 46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన వాళ్లలో భనుక రాజపక్స, చమిందు విక్రమసింఘే చెరో ఆరు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి శ్రీలంక 218 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, జకారీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన రచిన్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఘనంగానే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ఓపెనర్లలో టిమ్ రాబిన్సన్(21 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. రచిన్ రవీంద్ర(39 బంతుల్లో 69) అర్ధ శతకంతో రాణించాడు. కానీ వీరిద్దరు అవుటైన తర్వాత కివీస్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. వన్‌డౌన్‌లో వచ్చిన మార్క్ చాప్మన్(9), గ్లెన్ ఫిలిప్స్(6) పూర్తిగా విఫలమయ్యారు.అయితే, డారిల్ మిచెల్(17 బంతుల్లో 35) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా నువాన్ తుషార అతడికి చెక్ పెట్టాడు. మిగతా వాళ్లలో మిచెల్ హే(8), మైకేల్ బ్రాస్‌వెల్(1) విఫలమయ్యారు. ఆఖర్లో సాంట్నర్(10 బంతుల్లో 14*), జకారీ ఫౌల్క్స్(13 బంతుల్లో 21*) మెరుపులు మెరిపించినా.. విజయానికి కివీస్ ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 211 పరుగులే చేయగలిగింది. 2006 తర్వాత తొలిసారిఫలితంగా ఏడు పరుగుల తేడాతో జయభేరి మోగించిన శ్రీలంక సిరీస్‌లో కివీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి.. వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. అంతేకాదు.. కివీస్ గడ్డపై 2006 తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. లంక బౌలర్లలో అసలంక అత్యధికంగా మూడు, వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, బినుర ఫెర్నాండో ఒక్కో వికెట్ తీశారు.ఇక సెంచరీ వీరుడు కుశాల్ పెరీరా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోగా.. కివీస్ పేసర్ జాకబ్ డఫీ(Jacob Duffy)కి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? -
శ్రీలంక ప్లేయర్ మెరుపు సెంచరీ.. 14 ఏళ్ల తర్వాత తొలిసారి
నెల్సన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పెరీరా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన కుశాల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. పెరీరా కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ వెటరన్ క్రికెటర్‌కు ఇదే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ. అదే విధంగా 2025 ఏడాదిలో తొలి అంతర్జాతీయ సెంచరీ కుశాల్ బ్యాట్ నుంచి వచ్చినదే కావడం విశేషం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.అతడితో పాటు కెప్టెస్ అసలంక(24 బంతుల్లో 46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లలో ఫోల్క్స్, శాంట్నర్, మిచెల్, హెన్రీ, ఢపీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పెరీరా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తొలి శ్రీలంక ప్లేయర్‌గా👉14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టీ 20ల్లో సెంచరీ బాదిన తొలి శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా, జయవర్ధనే (2010), దిల్షాన్ (2011) తర్వాత అతి తక్కువ ఫార్మాట్లో సెంచరీ కొట్టిన మూడో శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. చివరగా తిలకరత్నే దిల్షాన్(2011) టీ20ల్లో లంక తరపున సెంచరీ చేశాడు. మళ్లీ ఇప్పుడు పెరీరా ఈ ఫీట్ నమోదు చేశాడు.👉అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి శ్రీలంక బ్యాటర్‌గా కుశాల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 77 టీ20 మ్యాచ్‌ల్లో 134.11 స్ట్రైక్ రేట్‌తో 2056 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పెరీరా తర్వాత కుశాల్ మెండిస్ ఉన్నాడు. -
నిస్సాంక అద్భుత ఇన్నింగ్స్ వృథా.. ఉత్కంఠ పోరులో ఓడిన శ్రీలంక
మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 8 పరుగుల తేడాతో శ్రీలంకపై కివీస్ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమతమైంది. లక్ష్య చేధనలో లంకకు ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.తొలి వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన కివీ పేసర్ జాకబ్ ఢఫీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.కుశాల్ మెండిస్(46),కుశాల్ పెరీరా(0), కమిందు మెండిస్(0)లను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్‌ను న్యూజిలాండ్ వైపు మలుపుతిప్పాడు. ఆ తర్వాత లంకేయులు తిరిగి కోలుకోలేకపోయారు. ఆఖరి ఓవర్లో శ్రీలంక విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.అయితే లంక ఓటమిపాలైనప్పటికి పాథుమ్ నిస్సాంక మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోల్క్స్, హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు.అదరగొట్టిన మిచెల్, బ్రేస్వెల్అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(62), బ్రేస్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, థీక్షణ, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో డిసెంబర్ 30న జరగనుంది.చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడికి చోటు
స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన బెవాన్ జాకబ్స్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.న్యూజిలాండ్ దేశీవాళీ క్రికెట్లో జాకబ్స్ గత కొంత కాలంగా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాక్క్యాప్స్ సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇచ్చారు.ఈ రెండు సిరీస్‌లలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా మిచెల్ శాంట్నర్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే తమ వైట్ బాల్ జట్టు ఫుల్‌టైమ్ కెప్టెన్ శాంట్నర్‌ను కివీ క్రికెట్ బోర్డు నియమించింది. ఇక ఈ సిరీస్‌లకు కోసం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మాట్ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు గత నెలలో శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై పునరగామనం చేయననున్నారు. ఈ వైట్‌బాల్ సిరీస్‌లలో భాగంగా పర్యాటక శ్రీలంకతో న్యూజిలాండ్ మూడు టీ20లు ,మూడు వన్డేలు ఆడనుంది.టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్వన్డే జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, మిచ్ హే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్చదవండి: సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!.. వీడియో -
SL vs NZ: న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టింది శ్రీలంక. డంబుల్లా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో పర్యాటక కివీస్ జట్టును ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.సెంచరీలతో చెలరేగిన అవిష్క, కుశాల్తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(12) నిరాశపరిచినా.. అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 100) అద్భుత శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(128 బంతుల్లో 143) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఇక చరిత్ అసలంక సైతం కెప్టెన్ ఇన్నింగ్స్(28 బంతుల్లో 40) అలరించాడు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా శ్రీలంక 49.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 324 పరుగులు స్కోరు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.కివీస్ లక్ష్యం 221అనంతరం.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 221 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 27 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 175 పరుగులే చేసింది. ఓపెనర్లు విల్ యంగ్(48), టిమ రాబిన్సన్(35), మిడిలార్డర్ మిచెల్ బ్రాస్‌వెల్(34 నాటౌట్) ఫర్యాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమిహెన్రీ నికోల్స్(6), మార్క్ చాప్మన్(2), గ్లెన్ ఫిలిప్స్(9) పూర్తిగా నిరాశపరచగా.. మిచ్ హే(10), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(9), నాథన్ స్మిత్(9), ఇష్ సోధి(0), జాకోబ్ డఫీ(4 నాటౌట్).. లంక బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. దీంతో 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఇక.. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక మూడు, మహీశ్ తీక్షణ, చరిత్ అసలంక చెరో రెండు, జాఫ్రీ వాండర్సే ఒక వికెట్ కూల్చారు. భారీ శతకంతో మెరిసిర కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!కాగా 2015 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా గత 12 వన్డేల్లోనూ లంక కివీస్‌పై వన్డేలో గెలవడం ఇదే తొలిసారి. కాగా 2015, డిసెంబరులో న్యూజిలాండ్ గడ్డపైనే కివీస్‌ను లంక వన్డే మ్యాచ్‌లో చివరగా ఓడించింది. ఇక 2024లో ఇప్పటి వరకు సొంతగడ్డపై 13 వన్డేలు ఆడిన శ్రీలంకకు ఇది పదో విజయం.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
కివీస్‌తో సిరీస్‌లకు లంక జట్ల ప్రకటన.. వాళ్లకు మరోసారి మొండిచేయి
న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో టీ20, వన్డేలకు పదిహేడు మందితో కూడిన జట్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. చరిత్ అసలంక వన్డే జట్టుకు సారథిగా కొనసాగనుండగా.. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఈ జట్టులో స్థానం లభించలేదు.వారికి మొండిచేయిఇక వరల్డ్‌కప్-2023 తర్వాత కుశాల్ పెరీరా తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. మహ్మద్ షిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. షనకతో పాటు పేసర్ దుష్మంత చమీరాకు మరోసారి మొండిచేయి ఎదురుకాగా.. భనుక రాజపక్స కూడా జట్టుతో కొనసాగనున్నాడు.టీమిండియా, విండీస్లపై వరుస సిరీస్ విజయాలుకాగా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రీలంక వన్డేల్లో అద్వితీయ విజయాలు సాధించింది. స్వదేశంలో తొలుత టీమిండియాను 2-1తో చిత్తు చేసి సిరీస్ గెలుచుకున్న లంక.. తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది.ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు అసలంక బృందం సిద్ధమైంది. కాగా ఇటీవల శ్రీలంకలో పర్యటించిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే, వెంటనే ఇండియా టూర్లో 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు తిరిగి రానుంది. ఇందులో భాగంగా రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబరు 8, 10 తేదీల్లో లంక- కివీస్ మధ్య టీ20లకు డంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 13, 17, 19 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో వన్డేలకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక, మహ్మద్ షిరాజ్. న్యూజిలాండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక, పాతుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండీమాల్, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, నువాన్ తుషార, మతీషా పతిరానా, బినూరా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్
నవంబర్ 9 నుంచి శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. ఈ సిరీస్‌లలో మిచెల్ సాంట్నర్ కివీస్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత న్యూజిలాండ్ ఆడుతున్న మొదటి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లలో సాంట్నర్ న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ మిచ్ హే తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫెర్గూసన్, జాకబ్ డఫీ, జాక్ ఫోల్క్స్ పేసర్లుగా.. ఐష్ సోధి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా.. గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా.. మార్క్ చాప్మన్, హెన్రీ నికోల్స్, టిమ్ రాబిన్సన్, జోష్ క్లార్క్సన్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.ఈ సిరీస్‌ల కోసం టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విలియమ్ ఓరూర్కీ, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్లను పరిగణలోకి తీసుకోలేదు. వీరంతా ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్నారు. భారత్‌తో సిరీస్ ముగిసిన అనంతరం వీరు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.కాగా, రెండు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. నవంబర్ 9న డంబుల్లా వేదికగా తొలి టీ20, నవంబర్ 10న అదే డంబుల్లా వేదికగా రెండో టీ20 జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 13న డంబుల్లా వేదికగానే తొలి వన్డే, నవంబర్ 17, 19 తేదీల్లో క్యాండీ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి.శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు..మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్‌కీపర్), హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్, ఐష్ సోధి, విల్ యంగ్చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు గాయం -
NZ Vs SL: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో లంక క్లీన్ స్వీప్ చేసింది. 514 పరుగుల భారీ వెనకంజతో ఫాలోఆన్ ఆడిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 360 పరుగులకు ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పీరిస్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కివీస్ బ్యాటర్లలో కాన్వే(61), టామ్ బ్లండెల్(60), గ్లెన్ ఫిలిప్స్(78), మిచెల్ శాంట్నర్(67) హాఫ్ సెంచరీలు చేశారు.88 పరుగులకే కివీస్ ఆలౌట్..ఇక రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాట పటిమ చూపిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం దారుణమైన ప్రదర్శన కనబరిచింది. కేవలం 88 పరుగులకే ఆలౌటై ఘోర ఆ ప్రతిష్టతను మూటకట్టుకుంది. లంక బౌలర్లు దాటికి కివీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (10), డారిల్ మిషెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్ లాథమ్ (2), డ్వేన్ కాన్వే (9), కేన్ విలియమ్సన్ (7), ఎజాజ్ పటేల్ (8), టామ్ బ్లండెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ మూడు వికెట్లు పడగొట్టారు.లంక భారీ స్కోర్..ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కమిందు మెండిస్(182), చండీమాల్(116), కుశాల్ మెండిస్(106) అద్భుతమైన సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్లాక్‌క్యాప్స్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే ఆలౌట్ కావడంతో.. శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన కివీస్.. ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: IND vs BAN: టీమిండియా ఓపెనర్‌గా సంజూ శాంసన్..? -
SL vs NZ: సెంచరీలతో కదం తొక్కిన శ్రీలంక బ్యాటర్లు
Sri Lanka vs New Zealand, 2nd Test Day 2 Score Final Update: న్యూజిలాండ్‌తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలిరోజు దినేశ్ చండీమల్ శతకం సాధించగా, రెండో రోజు ఆటలో కమిందు మెండిస్ (250 బంతుల్లో 182 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (149 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 163.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ స్కోరు 306/3తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన లంక బ్యాటర్లలో ఎంజెలో మాథ్యూస్ (185 బంతుల్లో 88; 7 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి నిష్క్రమించాడు. దీంతో తొలి సెషన్ ఆరంభంలోనే 328 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూలింది. ఈ దశలో మరో ఓవర్‌నైట్ బ్యాటర్ కమిందు మెండిస్ కు జతయిన కెప్టెన్ ధనంజయ డిసిల్వా (80 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో పర్యాటక బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జట్టు స్కోరు 400 మైలురాయి దాటాక ఎట్టకేలకు తొలిసెషన్ ముగిసే దశలో ధనంజయను ఫిలిప్స్ పెవిలియన్ చేర్చాడు. అరుదైన రికార్డుఅతను అవుటైన 402 స్కోరువద్దే లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. కుశాల్ మెండిస్ క్రీజులోకి రాగా... రెండో సెషన్ మొదలైన కాసేపటికే కమిందు మిండిస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మిడిలార్డర్ బ్యాటర్ అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు.అరంగేట్రం చేసిన టెస్టు నుంచి ఇప్పటివరకు (తాజా 8వ టెస్టు) ప్రతి మ్యాచ్‌లో సెంచరీ, లేదంటే అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘనతకెక్కాడు. మరోవైపు అతనికి జతయిన కుశాల్ కూడా కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో రెండో సెషన్ అసాంతం కష్టపడినా వికెట్ తీయలేకపోయింది. 519/5 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. 602/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ఆ తర్వాత మొదలైన మూడో సెషన్లోనూ ఈ జోడీ క్రీజు వదలకపోవడంతో పాటు పరుగుల్ని అవలీలగా సాధించింది. కమిందు 150 పరుగులు పూర్తి చేసుకోగా... కుశాల్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 602/5 వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. కుశాల్, కమిందు ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు సరిగ్గా 200 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. శ్రీలంక కంటే 580 పరుగులు వెనుకబడి ఉంది. ఇరు జట్ల మధ్య శనివారం మూడో రోజు మొదలైంది. కాగా తొలి టెస్టులోశ్రీలంక కివీస్‌ను 63 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..!
శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ టెస్ట్ క్రికెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. కమిందు టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ అరంగేట్రం నుంచి ఇన్ని మ్యాచ్‌ల్లో వరుసగా 50 ప్లస్ స్కోర్లు చేయలేదు. పాక్ ఆటగాడు సౌద్ షకీల్ అరంగేట్రం నుంచి వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఆతర్వాత న్యూజిలాండ్ ఆటగాడు బెర్ట్ సచ్‌క్లిఫ్, పాక్‌కు చెందిన సయీద్ అహ్మద్, భారత్‌కు చెందిన సునీల్ గవాస్కర్ అరంగేట్రం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు.శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.టెస్ట్ అరంగేట్రం నుంచి ఎనిమిది మ్యాచ్‌ల్లో కమిందు చేసిన స్కోర్లు.. - 61 vs AUS.- 102 & 164 vs BAN.- 92* vs BAN.- 113 vs ENG.- 74 vs ENG.- 64 vs ENG.- 114 vs NZ.- 51* vs NZ. చదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..! -
చండీమల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఆ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.తుది జట్లు..శ్రీలంక: పథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్), మిలన్ రత్నాయక్, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పెరిస్, అసిత ఫెర్నాండోన్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..! -
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్
శ్రీలంక వెటరన్ బ్యాటర్ దినేశ్ చండీమల్ టెస్ట్ క్రికెట్లో రెండేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చండీమల్ ఎట్టకేలకు సెంచరీ మార్కు తాకాడు. చండీమల్ 2022, మేలో చివరిసారిగా (బంగ్లాదేశ్‌పై) టెస్ట్‌ల్లో మూడంకెల స్కోర్ చేశాడు. చండీమల్కు ఈ సెంచరీ చాలా ప్రత్యేకం. చండీమల్ సెంచరీ చేసిన తొమ్మిదో దేశం న్యూజిలాండ్. చండీమల్ తన కెరీర్లో ఇప్పటివరకు తొమ్మిది వేర్వేరు దేశాలపై (బంగ్లాదేశ్‌పై 5, భారత్‌పై 2, ఆస్ట్రేలియాపై 2, వెస్టిండీస్‌పై 2, ఇంగ్లండ్‌పై 1, ఆఫ్ఘనిస్తాన్పై 1, ఐర్లాండ్‌పై 1, పాకిస్తాన్‌పై 1, న్యూజిలాండ్‌పై 1) 16 సెంచరీలు చేశాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే (46) ఔట్ కాగా.. చండీమల్ (106), ఏంజెలో మాథ్యూస్ (35) క్రీజ్‌లో ఉన్నారు. నిస్సంక వికెట్ సౌథీకి దక్కగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు. చదవండి: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్‌మైర్ -
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
సెప్టెంబర్ 26 నుంచి గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన రమేశ్ మెండిస్, లహీరు కుమార స్థానాల్లో అన్ క్యాప్డ్ ప్లేయర్ నిషాన్ పెరిస్, మిలన్ రత్నాయకే తుది జట్టులోకి వచ్చారు. స్పిన్నర్ రమేశ్ మెండిస్ తొలి టెస్ట్‌లో ఆరు వికెట్లు తీసినప్పటికీ అతన్ని తుది జట్టు నుంచి తప్పించడం ఆసక్తికరం. రమేశ్ తొలి టెస్ట్‌లో వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని రెండో టెస్ట్ నుంచి తప్పించి ఉండవచ్చు. పేసర్ లహీరు కుమార విషయానికొస్తే.. ఇతను తొలి టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపించ లేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అందుకే రెండో టెస్ట్‌లో ఇతని స్థానాన్ని మరో పేసర్ మిలన్ రత్నాయకేతో భర్తీ చేసింది శ్రీలంక మేనేజ్మెంట్.న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు శ్రీలంక తుది జట్టు..దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, దినేశ్ చండీమల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కుసాల్ మెండిస్, నిషాన్ పెరిస్, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, అశిత ఫెర్నాండోకాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కమిందు మెండిస్ సెంచరీతో ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్ -
SL vs NZ: ప్రత్యర్థులకు దడ పుట్టించే లంక బౌలర్ ఎంట్రీ!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందరర్భంగా శ్రీలంక ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌కి జట్టులో చోటిచ్చింది. విశ్వ ఫెర్నాండో గాయపడిన కారణంగా అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ నిషాన్ పెరిస్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. గాలె వేదికగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో లంక కివీస్‌ను చిత్తు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపులెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలం కారణంగా శ్రీలంకకు ఈ విజయం సాధ్యమైంది. ఇక ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో నిషాన్ పెరిస్ను జట్టులోకి తీసుకున్నట్లుశ్రీలంక బోర్డు తెలిపింది.33 ఏళ్ల విశ్వ ఫెర్నాండో ప్రాక్టీస్ సమయంలో తొడకండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడని.. అతడిస్థానాన్ని నిషాన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా నిషాన్‌కు 2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అకిల ధనుంజయ గాయపడటంతో మూడో మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేశారు.ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనతకానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలోనూ జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి కూడా అరంగేట్రం చేసే అవకాశం కనిపించడం లేదు. కాగా నిషాన్ పెరిస్ 41 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 172 వికెట్లు పడగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనత సొంతం చేసుకున్నాడు.ఇందులో 12సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. ఇక 61 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు తీశాడు. ఒకవేళ నిషాన్‌ను గనుక తుదిజట్టులోకి ఎంపిక చేస్తే మరో భయంకర స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు కివీస్ సిద్ధపడాల్సిందే!న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు శ్రీలంక జట్టుదిముత్ కరుణరత్నే, పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, మిలన్ ప్రియనాథ్ రాత్నాయక్, సదీర సమరవిక్రమ, జెఫ్రీ వాండర్సే, ఓషద ఫెర్నాండో, నిషాన్ పెరిస్.చదవండి: మోర్నీ పనికిరాడన్నట్లు చూశారు.. తామే గొప్ప అనుకుంటారు: పాక్ మాజీ క్రికెటర్ -
ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించిన శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 63 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ చివరి రోజు న్యూజిలాండ్ గెలవాలంటే 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ఈ దశలో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు (207/8) మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి, మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. ఆఖరి రోజు తొలి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ చేతులెత్తేయడం నిరాశ కలిగించింది.ఓవర్‌నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (91) పోరాడతాడని అంతా అనుకున్నారు. అయితే అది జరగలేదు. అతను ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో పరుగు మాత్రమే జోడించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రభాత జయసూర్య రచిన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చివరి వికెట్ విలియమ్ ఓరూర్కీను కూడా జయసూర్యనే క్లీన్ బౌల్డ్ చేశాడు. 344 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 211 పరుగుల వద్ద ముగిసింది.ప్రభాత జయసూర్య ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. రమేశ్ మెండిస్ 3, అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రచిన్‌తో పాటు టామ లాథమ్ (28), కేన్ విలియమ్సన్ (30), టామ్ బ్లండెల్ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రాణించిన కరుణరత్నే, చండీమల్, మాథ్యూస్అంతకుముందు శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్ (61), ఏంజెలో మాథ్యూస్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్ పటేల్ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టాడు. విలియమ్ ఓరూర్కీ 3, సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.లాథమ్, విలియమ్సన్, మిచెల్ ఫిఫ్టీలున్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్), రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్ (114) సెంచరీ.. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, అజాజ్ పటేల్ తలో 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
శ్రీలంకతో తొలి టెస్టు.. పటిష్ట స్థితిలో న్యూజిలాండ్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అదరగొడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లంక కంటే ఇంకా 50 పరుగులు వెనకంజలో ఉంది.క్రీజులో డార్లీ మిచెల్(41), బ్లాండెల్(18) పరుగులతో ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టామ్ లాథమ్(70), కేన్ విలియమ్స్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దనుంజయ డి సిల్వా 2 వికెట్లు పడగొట్టగా.. మెండిస్, జయసూర్య తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 302/7 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి 305 పరుగులకు ఆలౌటైంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (114) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: IND vs BAN: చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూపర్ సెంచరీ -
147 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి..!
శ్రీలంక స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాడు. జూలై 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తాను ఆడిన తొలి ఆరు మ్యాచ్‌లలో యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టులోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు వచ్చింది. ఈ క్రమంలో గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ చేయగా.. టాపార్డర్ తేలిపోయింది. దిముత్ కరుణరత్నె(2), పాతుమ్ నిసాంక(27), దినేశ్ చండిమాల్(30) నిరాశపరిచారు.కమిందు మెండిస్ సంచలన శతకంఏంజెలో మాథ్యూస్(36), కుశాల్ మెండిస్(50) రాణించగా.. కమిందు మెండిస్ శతకంతో చెలరేగాడు. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు సాధించాడు. తద్వారా కమిందు మెండిస్ సౌద్ షకీల్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. కెరీర్లో వరుసగా తొలి ఏడు టెస్టుల్లో యాభైకి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తొలుత ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ కమిందుకే ఈ ఘనత సాధ్యమైంది. ఈ క్రమంలో అతడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్‌ను కూడా అధిగమించాడు. గావస్కర్, సయీమ్ అహ్మద్(పాకిస్తాన్), బసిల్ బుచర్(వెస్టిండీస్), బర్ట్ సచ్లిఫ్(న్యూజిలాండ్) తమ తొలి ఆరు టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించారు.ఐదు వికెట్లతో చెలరేగిన రూర్కీఇక కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు సాధించింది. కమిందు, కుశాల్ మెండిస్ (68 బంతుల్లో 50; 7 ఫోర్లు) కలిసి ఆరో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. ఇతర ప్లేయర్లలో దినేశ్ చండీమల్ (30), ఏంజెలో మాథ్యూస్ (36), పాథుమ్ నిసాంక (27) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు.ఇక రెండో రోజు ఆటలో టెయిలెండర్లు రమేశ్ మెండిస్(14), ప్రబాత్ జయసూర్య(0), అసిత ఫెర్నాండో(0) పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా 91.5 ఓవర్లలో శ్రీలంక 305 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో రూర్కీ ఐదు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ టామ్ లాథమ్ ఒకటి, అజాజ్ పటేల్ , గ్లెన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు కూల్చారు. కమిందు మళ్లీ మెరిసేనా?ఇక గురువారం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కాగా కమిందు మెండిస్ ఇప్పటి వరకు ఆరు టెస్టులు పూర్తి చేసుకుని 695 పరుగులు సాధించాడు. ఏడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన ఈ ఆల్‌రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు బాదాలని పట్టుదలగా ఉన్నాడు.చదవండి: చెత్త షాట్ సెలక్షన్!.. కోహ్లి అవుట్.. రోహిత్ రియాక్షన్ వైరల్ -
SL vs NZ: శతక్కొట్టిన కమిందు.. లంక తొలి ప్లేయర్‌గా..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ కుదేలైన తరుణంలో చిక్కుల్లో పడిన జట్టును తన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో శ్రీలంకను మెరుగైన స్థితిలో నిలిపాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది.టాపార్డర్‌ను పడేసిన కివీస్ పేసర్లుఈ క్రమంలో గాలే వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడం విశేషం. కివీస్ యువ ఫాస్ట్‌బౌలర్ ఒ రూర్కీ దిముత్ కరుణరత్నె(2)ను పెవిలియన్‌కు పంపి తొలి వికెట్ తీశాడు.అనంతరం మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(27)ను కూడా రూర్కీ అవుట్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్(30)ను కివీస్ కెప్టెన్ వెనక్కిపంపాడు. ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్‌తో కలిసి కమిందు మెండిస్ లంక ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. స్కోరు 106-4 వద్ద ఉన్న వేళ ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 72 పరుగులు జతచేశారు.కమిందు- కుశాల్ జోడీ సెంచరీ భాగస్వామ్యంఅయితే, రూర్కీ మరోసారి ప్రభావం చూపాడు. మాథ్యూస్‌ను 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ కమిందుకు తోడయ్యాడు. ఈ క్రమంలో కమిందు సెంచరీ పూర్తి చేసుకోగా.. కుశాల్ కేవలం 68 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. కమిందుతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ కుశాల్‌ను అవుట్‌చేసి.. ఈ జోడీని విడదీయడంతో లంక ఇన్నింగ్స్ నెమ్మదించింది.మరోవైపు.. స్పిన్నర్ అజాజ్ పటేల్ కమిందు మెండిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది. రమేశ్ మెండిస్ 14, ప్రభాత్ జయసూర్య 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.కమిందు మెండిస్ సరికొత్త చరిత్రకివీస్తో తొలి టెస్టులో 173 బంతుల్లో కమిందు మెండిస్ 114 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి. కాగా కమిందుకు ఇది టెస్టుల్లో సొంతగడ్డపై తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా నాలుగోది.ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా టెస్టుల్లో నాలుగు శతకాలు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్‌లలో కమిందు ఈ ఘనత సాధించగా.. మైకేల్ వాండార్ట్(21 మ్యాచ్‌లలో), ధనంజయ డి సిల్వ(23మ్యాచ్‌లలో) అతడి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తరుణంలో కమిందు మరో రికార్డు సాధించాడు.మరో అరుదైన ఘనతవరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కమిందు కంటే ముందు పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమిందు మెండిస్ అద్బుతంగా రాణించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ టెస్టులో శతకంతో అలరించాడు.చదవండి: Ind vs Ban: తుదిజట్టులో వారికి చోటు లేదు.. కారణం చెప్పిన గంభీర్ View this post on Instagram A post shared by Sri Lanka Cricket (@officialslc)A century at home, no less in your hometown, always special🙌🏽 #SLvNZ 🎥 SLC pic.twitter.com/eqwnFMPutm— Estelle Vasudevan (@Estelle_Vasude1) September 18, 2024 -
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన
సెప్టెంబర్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (సెప్టెంబర్ 16) ప్రకటించారు. ఈ సిరీస్‌లో ధనంజయ డిసిల్వ శ్రీలంకను లీడ్ చేయనున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ ఒషాడా ఫెర్నాండో చాలాకాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, కుసాల్ మెండిస్ వంటి సీనియర్ సభ్యులు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల కలయికగా ఉంది. సీనియర్లతో పాటు యువ సంచలనాలు పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ తిరిగి జట్టులోకి వచ్చారు. బౌలింగ్ విషయానికొస్తే.. ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్‌ల కాంబినేషన్‌తో ఈ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. వీరితో పాటు పేస్ బౌలర్లు అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వా (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండీమల్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఒషాడా ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయక్శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 18-23 వరకు తొలి టెస్ట్ (గాలే)సెప్టెంబర్ 26-30 వరకు రెండో టెస్ట్ (గాలే)ఇదిలా ఉంటే, శ్రీలంక ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో శ్రీలంక ఓడినా చివరి టెస్ట్‌లో అద్భుత విజయం సాధించింది. ఈ సిరీస్‌తో పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ స్టార్లుగా మారిపోయారు. న్యూజిలాండ్ సిరీస్‌లో శ్రీలంక వీరిద్దరి ప్రదర్శనపై ఆధారపడి ఉంది. స్వదేశంలో ఆడుతున్న సిరీస్ కావడంతో నిస్సంక, కమిందు మ్యాచ్ విన్నర్లుగా మారవచ్చు. -
NZ vs SL: అంతర్జాతీయ క్రికెట్లో 6 రోజుల టెస్టు మ్యాచ్..
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల పాటు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్లో, అనాధకరిక టెస్టు మ్యాచ్‌లు నాలుగు రోజులు పాటు కూడా జరగుతాయి. కానీ గతంలో ఆరు రోజుల టెస్టు మ్యాచ్‌లు కూడా జరిగేవి ఉన్న విషయం మీకు తెలుసా?1980లు, 90ల్లో 6 రోజుల టెస్టు మ్యాచ్ బాగా పాపులర్. ఇంగ్లండ్‌లో అనేక మ్యాచ్‌లు ఆరు రోజుల పాటు జరిగాయి. చివరగా అంతర్జాతీయ క్రికెట్లో ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగింది. అయితే ఇదింతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.16 ఏళ్ల తర్వాత తొలిసారి..?అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల తర్వాత తొలిసారి ఆరు రోజుల మ్యాచ్ జరగనుంది. ఈ అరుదైన ఘట్టానికి సెప్టెంబర్ 18 నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కానున్న తొలి టెస్టు వేదిక కానుంది. వచ్చె నెలలలో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంకకు రానుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆరు రోజుల పాటు జరగనుంది. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 21 న మ్యాచ్ జరగడం లేదు. ఆ రోజును విశ్రాంతిగా ప్రకటించారు. తొలి రెండు రోజుల తర్వాత ఒక్క రోజు(సెప్టెంబర్ 21 )ను రెస్ట్ డేగా ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ 22, 23, 24 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతుంది. అయితే రెండో టెస్టు మాత్రం యధావిధిగా 5 రోజుల పాటే జరగనుంది. కాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.అప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు శ్రీలంకలోశ్రీలంక చివరగా ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో ఆడింది. ఆ ఏడాది శ్రీలంక క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగింది. బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఆరు రోజుల పాటు టెస్టును షెడ్యూల్ చేశారు. డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆ టెస్టు మ్యాచ్ కొనసాగింది. మళ్లీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక ఆరు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. -
కివీస్ జట్టు ప్రకటన: 18 నెలల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ?
అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. యువ ఫాస్ట్ బౌలర్లు విలియం ఓ'రూర్కే, బెన్ సియర్స్లకు తొలిసారి కివీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు వారిద్దరని ఎంపిక చేశారు. అదే విధంగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ మైఖల్ బ్రేస్‌వెల్ తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. బ్రేస్‌వెల్ చివరగా గతేడాది మార్చిలో కివీస్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. కాగా న్యూజిలాండ్ భారత్‌లోని నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. అనంతరం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంకకు కివీస్ జట్టు వెళ్లనుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.అఫ్గాన్, లంకతో సిరీస్‌లకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ -
NZ vs Pak: షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్-2025కి కివీస్ స్టార్స్ దూరం?
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 2025 ఏడాదికి గానూ తమ హోం షెడ్యూల్‌ను ప్రకటించింది. స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్లతో సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, శ్రీలంక- పాకిస్తాన్లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, పాక్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. కివీస్ జట్టు ఇప్పటికే సౌతాఫ్రికా- పాకిస్తాన్‌తో ట్రై సిరీస్ ఆడేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి సన్నాహకంగా ముందుగా ఈ త్రైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్ పాల్గొననుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది.న్యూజిలాండ్ మెన్స్ షెడ్యూల్(2024- 2025)వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్👉మొదటి టెస్టు- నవంబరు 28- డిసెంబరు 2- క్రైస్ట్‌చర్చ్👉రెండో టెస్టు- డిసెంబరు 6- 10- వెల్లింగ్టన్👉మూడో టెస్టు- డిసెంబరు 14- 18- హామిల్టన్శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు👉తొలి టీ20- డిసెంబరు 28- తౌరంగ👉రెండో టీ20- డిసెంబరు 30- తౌరంగ👉మూడో టీ20- జనవరి 2- నెల్సన్👉తొలి వన్డే- జనవరి 5- వెల్లింగ్టన్👉రెండో వన్డే- జనవరి 8- హామిల్టన్👉మూడో వన్డే- జనవరి 11- ఆక్లాండ్పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్‌లు👉మొదటి టీ20- మార్చి 16- క్రైస్ట్‌చర్చ్👉రెండో టీ20- మార్చి 18- డునెడిన్👉మూడో టీ20- మార్చి 21- ఆక్లాండ్👉నాలుగో టీ20- మార్చి 23- తౌరంగ👉ఐదో టీ20- మార్చి 26- వెల్లింగ్టన్తొలి వన్డే- మార్చి 29- నేపియర్👉రెండో వన్డే- ఏప్రిల్ 2- హామిల్టన్👉మూడో వన్డే- ఏప్రిల్ 5- తౌరంగ.చదవండి: మీరంటే నేను.. నేనంటే మీరు: గంభీర్ భావోద్వేగం -
బాగా ఎంజాయ్ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా?
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటిన న్యూజిలాండ్ పాకిస్తాన్ అవకాశాలను గల్లంతు చేసింది. లీగ్ దశలో ఆఖరిగా శ్రీలంకతో మ్యాచ్‌లో 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మొత్తంగా 10 పాయింట్లు తమ ఖాతాలో జమచేసుకుంది. దీంతో పాక్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే, కివీస్- లంక మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత కూడా బాబర్ ఆజం బృందం సెమీస్ రేసులో నిలవాలని భావిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం జరగాల్సిందే. అద్భుతం జరగాల్సిందే పాకిస్తాన్ తమకు మిగిలిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలిస్తే న్యూజిలాండ్ మాదిరే 10 పాయింట్లు సాధిస్తుంది. కానీ రన్‌రేటు పరంగా ఎంతో ముందున్న కివీస్ జట్టును దాటాలంటే.. కోల్‌కతాలో శనివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పాక్ ఏకంగా 287 పరుగుల తేడాతో గెలవాలి. కర్మకాలి ఇంగ్లండ్ గనుక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటే అక్కడే పాక్ కథ ముగిసిపోతుంది. ఎందుకంటే.. ఇంగ్లండ్ ఎంతటి లక్ష్యం విధించినా దానిని మూడు ఓవర్లలోపే పాక్ ఛేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనైతే కాదు! కాబట్టి భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్-2023 నుంచి పాక్ అనధికారికంగా నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ జట్టును తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. సురక్షితంగా వెళ్లండి.. బైబై ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా.. ‘‘బై బై పాకిస్తాన్’’ అని రాసి ఉన్న అక్షరాల ఫొటోను హైలైట్ చేస్తూ..‘‘పాకిస్తాన్ జిందా‘భాగ్’(పారిపోండి అన్న అర్థంలో) ! మీరింతే.. ఇక్కడి దాకా రాగలరంతే! ఇక్కడి బిర్యానీ రుచి, ఆతిథ్యాన్ని పూర్తిగా ఆస్వాదించారనే అనుకుంటున్నా. విమానంలో సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నా. బై బై పాకిస్తాన్’’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దాయాది జట్టును ఉద్దేశించి ఈ మాజీ ఓపెనర్ చేసిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు తొలుత హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ జట్టుకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల అభిమానానికి ఫిదా అయిన కెప్టెన్ బాబర్ ఆజం, పేసర్ షాహిన్ ఆఫ్రిది తదితరులు కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఇక ఆ తర్వాత వెళ్లిన ప్రతిచోటా హోటల్ నుంచి కాకుండా పాక్ ఆటగాళ్లు.. బయట నుంచి బిర్యానీలు ఆర్డర్ చేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో వరుస ఓటముల నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ ఆశలు గల్లంతైన తరుణంలో సెహ్వాగ్ ఈ మేరకు పోస్టు పెట్టడం గమనార్హం. మీ స్థాయికి తగునా? అయితే, చాలా మంది నెటిజన్లు వీరేంద్ర సెహ్వాగ్ తీరును తప్పుబడుతున్నారు. ‘‘శత్రువుకు కూడా ప్రేమను పంచే దేశానికి మీరు.. మీ స్థాయిని మరచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు సర్. గొప్ప క్రికెటర్‌గా చరిత్రలో స్థానం సంపాదించిన మీకు ఆటను ఆటలాగే చూడాలని తెలియదా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరి వాళ్లు అన్నపుడు ఏం చేశారు? అయితే, వీరూ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘భయ్యా అన్నదాంట్లో తప్పేముంది? మన జట్టును ఉద్దేశించి పాక్ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు మీకు కనిపించవా?’’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. పాక్ మాజీ సారథి మహ్మద్ హఫీజ్ విరాట్ కోహ్లిని సెల్ఫిష్ అంటూ చేసిన కామెంట్లు, భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇచ్చారన్న రజా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా సెహ్వాగ్ చేసిన పోస్టు నెట్టింట ఇలా చర్చకు దారితీసింది. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
శ్రీలంకకు మరో భారీ షాక్! ఘోర పరాభవంతో నిష్క్రమణ.. అదొక్కటేనా?
ICC WC 2023- NZ vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో మాజీ చాంపియన్ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో తాజా ప్రపంచకప్ ఎడిషన్‌లో ఏడో పరాజయాన్ని చవిచూసింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ-2025 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కాగా భారత్ వేదికగా జరుగుతున్న ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక తొలుత క్వాలిఫయర్స్ ఆడింది. జింబాబ్వేలో జరిగిన ఈ ఈవెంట్లో గెలిచి.. నెదర్లాండ్స్‌తో కలిసి టాప్-10లో చేరి ప్రపంచకప్-2023లో అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 102 పరుగులతో చిత్తుగా ఓడిన శ్రీలంకను తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన లంక తర్వాత ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది. మళ్లీ పాత కథే తర్వాత నెద్లాండ్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా మళ్లీ పాత కథనే పునరావృతం చేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తై భంగపడింది. ఇక ఈ టోర్నీలో అన్నింటికంటే శ్రీలంకకు అతిపెద్ద ఓటమి ఎదురైంది మాత్రం టీమిండియా చేతిలోనే! ఆసియా కప్-2023 ఫైనల్లో కొలంబోలో లంకను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. ప్రపంచకప్‌లో ముంబై వేదికగా మరోసారి మట్టికరిపించింది. ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించి ఆధిపత్యం చాటుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి.. ఈ దెబ్బకు సెమీస్ అన్న మాటను పూర్తిగా మరిచిపోయిన లంకన్ టీమ్.. కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025కైనా అర్హత సాధించాలని భావించింది. లీగ్ దశలో తమకు మిగిలిన మ్యాచ్‌లో గెలుపొందాలని బెంగళూరులో బరిలోకి దిగింది. అయితే, న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం కావడం.. 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 23.2 ఓవర్లలోనే ఛేదించడంతో మరోసారి ఓటమే ఎదురైంది. ఆ మ్యాచ్ ఫలితం తేలిన తర్వాతే దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదోస్థానంలో నిలిచింది శ్రీలంక. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్ల జాబితా నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్, ఇంగ్లండ్- పాకిస్తాన్, ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచ్‌ల ఫలితం తర్వాత శ్రీలంక భవితవ్యం పూర్తిగా తేలనుంది. రన్‌రేటు పరంగానూ వెనుకబడి ఉన్న కారణంగా ఈ మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా శ్రీలంక ఆశలు వదులుకోవాల్సిందే! వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన శ్రీలంకను గాయాల సమస్య వేధించింది. కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. మాజీ చాంపియన్‌కు అవమానకరరీతిలో ఇలాంటి తరుణంలో పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ నాయకుడిగా సఫలం కాలేకపోయాడు. వరుస ఓటములతో డీలా పడ్డ జట్టును పరాజయాల ఊబి నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కాక చేతులెత్తేశాడు. కాగా వరల్డ్‌కప్-1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన శ్రీలంక ట్రోఫీ గెలిచింది. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది. కానీ ఈసారి ఇలా.. అవమానకరరీతిలో ఇంటిబాట పట్టింది. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! నాడు పాక్‌లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్ కావాలనుకున్న రషీద్ ఇప్పుడిలా -
శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్ బెర్త్ ఖారారు!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్ బెర్త్‌ను కివీస్ దాదాపు ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు నాలుగో జట్టుగా కివీస్ అర్హత సాధించే ఛాన్స్ ఉంది. అయితే అఫ్గానిస్తాన్- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-పాకిస్తాన్ మ్యాచ్‌ల ఫలితాల తర్వాత సెమీస్‌కు వచ్చే నాలుగో జట్టు ఏదో అధికారికంగా తేలనుంది. 172 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్లు(45), రచిన్ రవీంద్ర(42) పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మిచెల్(43) పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. లంక బౌలర్లలో మాథ్యూస్ రెండు వికెట్లు సాధించగా.. థీక్షణ,చమీరా ఒక్క వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్, శాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరెరా(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో థీక్షణ(38) పరుగులతో రాణించాడు. చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. సచిన్ రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. సచిన్ రికార్డు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో 25 ఏళ్ల వయస్సులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో రవీంద్ర ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర 42 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. సచిన్ రికార్డు బద్దలు.. ఈ మెగా టోర్నీలో రవీంద్ర ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 565 పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరట ఉండేది. 1996 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో సచిన్ 523 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ 27 ఏళ్ల రికార్డును రచిన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రవీంద్రనే ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి. -
వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్ మామ
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తీసుకున్న రివ్యూ నవ్వులు పూయించింది. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కేవలం 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ పేస్ బౌలర్ లూకీ ఫెర్గూసన్‌ను మరోసారి బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. లంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన ఫెర్గూసన్ మూడో బంతికి కరుణరత్నేను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చమీరాకు ఫెర్గూసన్.. నాలుగో బంతిని ఫుల్‌టాస్‌గా సంధించాడు. అయితే బంతి ఇన్్సైడ్ ఎడ్జ్ తీసుకుని చమీరా ప్యాడ్‌కు తాకింది. కానీ న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎల్బీకి అప్పీలు చేశారు. ఈ క్రమంలో ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న డార్లీ మిచెల్ మాత్రం కాన్ఫిడెన్స్‌తో రివ్యూ తీసుకోమని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సూచించాడు. దీంతో సీనియర్ ఆటగాడి మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో క్లియర్‌గా బాల్ బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన కివీస్ ప్లేయర్స్ ఒక్కసారిగా నవ్వుకున్నారు. కివీస్ కెప్టెన్ నవ్వు అపుకోలేక తన చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ View this post on Instagram A post shared by ICC (@icc) pic.twitter.com/xdW1vDR2kv — Cricket Videos Here (@CricketVideos98) November 9, 2023 pic.twitter.com/xdW1vDR2kv — Cricket Videos Here (@CricketVideos98) November 9, 2023 -
సెమీస్ లక్ష్యంగా! న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ.. లంక 171 ఆలౌట్
ICC Cricket World Cup 2023- New Zealand vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించారు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. నాలుగో స్థానం కోసం కివీస్ పోరాడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఓపెనర్ పాతుమ్ నిసాంక(2)ను టిమ్ సౌథీ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(6)ను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. అంతేకాదు.. నాలుగో స్థానంలో వచ్చిన సమరవిక్రమ(1), ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక(8)ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ కుశాల్ పెరీరా పట్టుదలగా నిలబడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో అర్థ శతకం సాధించి.. లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి పెరీరాకు సహకారం కరువైంది. దీంతో లంక స్కోరు బోర్డు నత్తనడకన సాగుతుండగా.. పెరీరా వికెట్ తీసి లాకీ ఫెర్గూసన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్ మూడో బంతికి ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరీరా వెనుదిరిగాడు. దీంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడు. పవర్ ప్లే ముగిసే లోపే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ కుశాల్ పెరీరా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 74 పరుగులు చేసిన శ్రీలంకను.. ఆ తర్వాత కివీస్ బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు పడగొట్టారు. అయితే మహీశ్ తీక్షణ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 46.4 ఓవర్లలో 171 పరుగులకు లంక ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ మూడు, ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. సౌథీకి ఒక వికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని వీలైనన్ని తక్కువ బంతుల్లో ఛేదించి రన్‌రేటు మెరుగుపరచుకోవడంపైనే న్యూజిలాండ్ దృష్టి సారించింది. అయితే, ఓవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు.. గత ముఖాముఖి పోరు ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు ప్రస్తుతానికి వరుణుడు, లంక బౌలర్ల ప్రదర్శన తీరుపైనే ఆధారపడి ఉన్నాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్.. తొలి కివీస్ బౌలర్‌గా
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50కు పైగా వికెట్లు సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా బౌల్ట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో కుశాల్ మెండిస్‌ను ఔట్ చేసిన బౌల్ట్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో టోర్నీలో బౌల్ట్ ఇప్పటివరకు 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా బౌల్ట్ నిలిచాడు. బౌల్ట్ కంటే ముందు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు వసీం అక్రమ్, మిచిల్ స్టార్క్ ఈ ఘనత సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన లిస్ట్‌లో బౌల్ట్ ఆరో స్ధానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్(71 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్(68), స్టార్క్(59), లసిత్ మలింగ(56), వసీం అక్రమ్(55) ఉన్నారు. చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ View this post on Instagram A post shared by ICC (@icc) -
శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టి
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌పై శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరెరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై పెరెరా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టి చేసిన ఆటగాడిగా పెరీరా నిలిచాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హెడ్ రికార్డును కుశాల్ బద్దలు కొట్టాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన పెరీరా.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో కేవలం 105 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు, సౌథీ, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించాడు. చదవండి: అందుకే కోహ్లిని ప్రతిసారి ‘సెల్ఫిష్’ అంటున్నావా?: పాక్ మాజీ కెప్టెన్‌కు కౌంటర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు లంక విలవిల.. నామమాత్రపు స్కోరు
CWC 2023- NZ vs SL Updates: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 171 పరగులకు ఆలౌట్ అయింది. కివీస్‌తో మ్యాచ్.. కష్టాల్లో శ్రీలంక జట్టు 32.1: రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి చమీర అవుట్(1). 33 ఓవర్లలో లంక స్కోరు: 132-9 ► 25 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు: 114-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 23.3: ఫెర్గూసన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నె అవుట్(6). లంక స్కోరు: 113/8 (23.3) 19 ఓవర్లు ముగిసే సరికి స్కోరు: 105-7 ►18.3: సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ధనంజయ(19) ►16.4: సాంట్నర్ బౌలింగ్‌లో మథ్యూస్(16) అవుట్.. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక పవర్ ప్లేలో అతడొక్కడే న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక రెండు పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 6 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధ శతకం(51) సాధించగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన సమర విక్రమ 1, చరిత్ అసలంక 8, పరుగులు మాత్రమే చేశారు. దీంతో పవర్‌ప్లే(10 ఓవర్లు) ముగిసే సరికి లంక కేవలం 74 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ ఒక్కో వికెట్ పడగొట్టారు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (నవంబర్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ఇష్ సోధి స్థానంలో లోకీ ఫెర్గూసన్ కివీస్ తుది జట్టులోకి రాగా.. కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నే లంక ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తుది జట్లు.. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక -
శ్రీలంకతో మ్యాచ్.. కివీస్‌ను కలవరపెడుతున్న గతం.. మరోవైపు..
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 9) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంకకు నామమాత్రమే కాగా.. సెమీస్ రేసులో ఉన్న న్యూజిలాండ్‌కు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఇందులో న్యూజిలాండ్ భారీ తేడాతో గెలిస్తే పాక్, ఆఫ్ఘనిస్తాన్లతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది. బలాబలాలు, ప్రస్తుత ఫామ్ ప్రకారం కివీస్‌తో పోలిస్తే శ్రీలంక బలహీనమైన ప్రత్యర్దిగా ఉంది కాబట్టి, ఈ మ్యాచ్‌లో కివీస్ గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌ను రెండు అంశాలు కలవరపెడుతున్నాయి. అందులో ఒకటి వరుణ గండం కాగా.. రెండోది శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్. వరుణ గండం విషయానికొస్తే.. లంకతో మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం ఒకటి, రెండుసార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అ యితే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడం కివీస్‌కు అంత మంచిది కాదు. పూర్తి మ్యాచ్ జరిగితేనే ఆ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉంటాయి. కివీస్ ఎంత బాగా ఆడినా వరుణుడు అడ్డుతగిలితే ఏమవుతుందో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మనం చూశాం. అందుకే ఈ మ్యాచ్ పూర్తిగా సాగాలని కివీస్ కోరుకుంటుంది. మరోవైపు వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్ కివీస్‌ను భయపెడుతుంది. 2007, 2011 వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంక.. కివీస్ పాలిట కొరకరాని కొయ్యలా ఉండింది. ఈ రెండు వరల్డ్‌కప్ ఎడిషన్ల సెమీస్‌లో శ్రీలంక కివీస్‌ను మట్టికరిపించింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని కివీస్ అభిమానులు కలవరపడుతున్నారు. దీనికి తోడు మెగా టోర్నీల్లో దురదృష్టం, కీలక ఆటగాళ్ల గాయాలు కివీస్‌కు ప్రతికూలంగా మారాయి. వరుణ గండాన్ని, సెంటిమెంట్‌ను అధిగమించి లంకపై భారీ తేడాతో గెలవాలని కివీస్ ఆటగాళ్లు అనుకుంటున్నారు. -
CWC 2023 Semis Race: కివీస్.. శ్రీలంక చేతిలో ఓడినా పర్లేదు.. !
వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇవాళ (నవంబర్ 9) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో శ్రీలంక,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీస్ రేసులో ముందువరుసలో ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. లంకపై కివీస్ భారీ తేడాతో గెలిస్తే, సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పోటీ ఉండదు. ఆయా జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. లంక చేతితో ఓడినా సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది.. ఒకవేళ ఇవాళ జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్.. శ్రీలంక చేతిలో ఓడినా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదెలా అంటే.. సెమీస్ రేసులో ఉన్న మిగతా రెండు జట్లు తమతమ ప్రత్యర్దుల చేతుల్లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్, పాక్, ఆఫ్ఘనిస్తాన్‌కు సమానంగా 8 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. ఎవరు గెలిచినా సెమీస్‌లో టీమిండియానే ప్రత్యర్ధి.. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న మూడు జట్లలో (కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్) ఏ జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించినా అక్కడ వారి ప్రత్యర్ది టీమిండియానే అవుతుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తలపడాల్సి ఉంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు మరో సెమీస్‌లో తలపడతాయి. ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే నిలుస్తుంది. అలాగే రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సైతం మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ.. గెలుపోటములు వారి స్థానాలపై ప్రభావం చూపవు. కాబట్టి రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖరారైపోయింది. సెమీస్ ఎప్పుడు, ఎక్కడ అంటే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో సెమీస్‌లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. తొలి సెమీస్‌లో భారత్‌తో తలపడబోయే జట్టు ఏదో తేలాల్సి ఉంది. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్లలో ఏ జట్టు సెమీస్‌కు చేరినా ముంబై వేదికగా నవంబర్ 15న భారత్‌తో తలపడాల్సి ఉంటుంది. కోల్‌కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖాయమైపోయింది. ఈ రెండు సెమీస్‌లలో గెలిచే జట్లు నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
న్యూజిలాండ్‌కు షాక్ తప్పదా? బ్యాడ్‌న్యూస్ ఏమిటంటే..?
WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4లో నిలిచేందుకు న్యూజిలాండ్, పాకిస్తాన్లతో పాటు.. అఫ్గనిస్తాన్ కూడా పోటీ పడుతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ మూడు జట్లు నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే, రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లను దాటి నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో ఈ మూడు జట్లకు మిగిలిన ఒక్క మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో న్యూజిలాండ్, పాక్, అఫ్గన్ విజయం సాధిస్తే రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్‌లో అడుగుపెడుతుంది. ముందుగా న్యూజిలాండ్ బరిలోకి ఈ క్రమంలో ముందుగా... న్యూజిలాండ్ శ్రీలంకతో గురువారం మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో కివీస్ భారీ విజయం గనుక సాధిస్తే సులువుగానే సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే, వర్షం రూపంలో కివీస్ జట్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. accuweather సైట్ వివరాల ప్రకారం గురువారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా.. లేదంటే దురదృష్టవశాత్తూ లంక చేతిలో ఓడినా కివీస్‌కు ఎదురుదెబ్బ తప్పదు. అలా అయితే పాక్, అఫ్గన్ మరింత ముందుకు కాగా వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే కివీస్, లంకకు చెరో పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే అపుడు కివీస్ ఖాతాలో 9 పాయింట్లు మాత్రమే ఉంటాయి. వర్షం పడక అంతా సవ్యంగా సాగి గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అయినప్పటికీ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాల తర్వాతే సెమీస్ బెర్తు ఖాయమైంది లేనిదీ తెలుస్తుంది. అయితే, శ్రీలంకతో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం అఫ్గన్, పాకిస్తాన్ రేసులో మరో ముందడుగు వేస్తాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ -
WC 2023: వన్డే వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆటగాళ్లు.. 10 జట్ల పూర్తి వివరాలివే
ICC ODI World Cup 2023 All Final Squads: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా అక్టోబరు 5న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరుతో మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. పుష్కరకాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్.. మొత్తంగా పది జట్లు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచే వామప్ మ్యాచ్‌లు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే వరల్డ్‌కప్-2023 కోసం ఆయా మేనేజ్మెంట్లు ఖరారు చేసిన ఫైనల్ టీమ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్. పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం. అఫ్గనిస్తాన్ హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా జుర్మతి, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ ఇసాఖిల్, ఇక్రమ్ అలీ ఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ అర్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లకన్వాల్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్ రహ్మానీ, నవీన్ ఉల్ హక్ మురీద్. ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ కుమర్ దాస్, తన్జిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తవ్హిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసూమ్ అహ్మద్, షేక్ మహేదీ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్. ఇంగ్లండ్ జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లెయిన్, వెస్లీ బారెసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్. న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. సౌతాఫ్రికా తెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్. శ్రీలంక దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీషా పతిరానా, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ -
WC 2023: ఈసారి వరల్డ్‌కప్ ఫేవరెట్లు ఆ ఐదు జట్లే! కానీ..
ICC World Cup 2023: వన్డే వరల్డ్‌కప్-2023కి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 5న ఈ ఐసీసీ ఈవెంట్ 13వ ఎడిషన్ మొదలుకానుంది. పుష్కర కాలం తర్వాత భారత్ ఆతిథ్య ఇస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ తదితర పది జట్లు పాల్గొనబోతున్నాయి. 2011లో.. తర్వాత మళ్లీ ఇప్పుడే ఇక సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆసియా వన్డే కప్-2023 గెలిచి జోరు మీదున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ రాకతో మరింత పటిష్టంగా మారగా.. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బార్డ్) వరల్డ్‌కప్-2023లో ఫేవరెట్లు ఎవరన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ ఐదు జట్లు ఫేవరెట్.. కానీ ‘‘వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే ఇండియా టాప్ ర్యాంకులో ఉంది. అదీగాకుండా ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగనుంది. కాబట్టి వాళ్లకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక ఇంగ్లండ్.. డిఫెండింగ్ చాంపియన్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు అపార అనుభవం ఉంది. కాబట్టి ఆసీస్ జట్టు కూడా ఎప్పుడూ బలమైన పోటీదారే. పాకిస్తాన్ కూడా తనదైన రోజున అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. పాక్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా కూడా గత కొన్నేళ్లుగా మెరుగ్గా ఆడుతోంది. సమతూకమైన జట్టుగానూ ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక కూడా సవాల్ విసరగలుగుతాయి. అయితే, ఐసీసీ వరల్డ్‌కప్ విజేత ఎవరన్న అంశంపై అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్ దృష్ట్యానే ఈ టీమ్‌లను ఎంచుకోవడం జరిగింది’’ అని బార్డ్ సమాధానమిచ్చింది. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
శ్రీలంకతో న్యూజిలాండ్ మూడో టీ20.. మ్యాచ్ మధ్యలో విమానం
NZ VS SL 3rd T20: క్వీన్స్టౌన్లోని జాన్ డేవిస్ మైదానంలో ఇవాళ (ఏప్రిల్ 10) న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ మరో బంతి మిగిల్చి లక్ష్యాన్ని చేరుకుంది (19.5 ఓవర్లలో 183/6). న్యూజిలాండ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. చాప్మన్ తొలి బంతికే సిక్సర్ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ.. కివీస్ మరుసటి 3 బంతులకు 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది. అయితే 19వ ఓవర్ ఐదో బంతికి రచిన్ రవీంద్ర 2 పరుగులు తీయడంతో న్యూజిలాండ్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లంక బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగానే, ఇంచుమించు చేతికందేంత ఎత్తులో ఓ విమానం టేకాఫ్ అయ్యింది. ఇది పెద్దగా పట్టించుకోకుండా ఆటగాళ్లు ఆటను కొనసాగించగా.. మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఏమాత్రం బెరుకు లేకుండా ఆటను ఆస్వాధిస్తూ కనిపించారు. విమానం మ్యాచ్ మధ్యలో టేకాఫ్ అవుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవగా.. విషయం తెలియని వారు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. జనాలకు ఇంత దగ్గరలో విమానాలు వెళితే ఎంత ప్రమాదమని కొందరంటుంటే, ఇంకొందరేమో ఇది కెమెరా ట్రిక్ అని లైట్‌గా తీసుకుంటున్నారు. వాస్తవ విషయం ఏంటంటే, జాన్ డేవిస్ మైదానం పక్కనే ఎయిర్పోర్ట్ రన్‌వే ఉంది. అనునిత్యం ఇక్కడి నుంచి విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. గతంలో చాలా సందర్భాల్లో మ్యాచ్‌లు జరుగుతుండగా విమానలు టేకాఫ్ అయ్యాయి. -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్‌లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్‌నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య కివీస్‌కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్‌దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్‌ను గెలుపుబాట పట్టించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్
శ్రీలంకతో రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ ఆడం మిల్నే దుమ్ము రేపాడు. ఐదు వికెట్లతో చెలరేగి లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల బ్యాటింగ్ కోటా పూర్తి చేసిన మిల్నే.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్లు కూల్చాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(9)ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి కివీస్‌కు శుభారంభం అందించిన మిల్నే.. కుశాల్ పెరెరా(35), చరిత్ అసలంక(24) సహా ఆఖర్లో ప్రమోద్ మదుషాన్(1), దిల్షాన్ మదుషంక(0)లను పెవిలియన్‌కు పంపాడు. మిల్నే విజృంభణ.. దంచి కొట్టిన సీఫర్ట్ మిల్నే విజృంభణతో డునెడిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య కివీస్ .. లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసి టార్గెట్‌ను ఛేదించింది. దసున్ షనక విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 14.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. టిమ్ సీఫర్ట్ 43 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా 9 వికెట్లతో గెలుపొంది.. తొలి టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది ఇదిలా ఉంటే.. తన అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆడం మిల్నే.. సూపర్ డెలివరీతో పాతుమ్ నిసాంక బ్యాట్‌ను విరగ్గొట్టిన తీరు ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే ఈ మేరకు తన పేస్ పదును చూపించాడు మిల్నే. తొలి ఓవర్లోనే మిల్నే దెబ్బకు పాతుమ్ నిసాంక బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా న్యూజిలాండ్- శ్రీలంక రెండో టీ20లో మిల్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 8న నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. చదవండి: వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు 🚨 BROKEN BAT 🚨 Adam Milne with a ☄️ breaking Nissanka’s bat 😮 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/F2uI6NiUni — Spark Sport (@sparknzsport) April 5, 2023 Pathum Nissanka's bat 🤯#SparkSport #NZvSL pic.twitter.com/t2cLh9w9Iq — Spark Sport (@sparknzsport) April 5, 2023 -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్‌కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది. -
పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్‌లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్లో
ఆక్లాండ్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 థ్రిల్లర్ సినిమాను తలపించింది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అంతిమంగా విజయం శ్రీలంకనే వరించింది. 197 విజయ లక్క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 196 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌ను వేసే బాధ్యత లంక కెప్టెన్ స్పిన్నర్ తీక్షణకు అప్పజెప్పాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక 9 పరుగుల లక్క్ష్యంతో దిగిన శ్రీలంక.. మూడు బంతుల్లోనే ఛేదించింది. లంక బ్యాటర్ అసలంక సిక్స్, ఫోర్‌తో మ్యాచ్ ఫినిస్ చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అసలంక, పెరీరా సూపర్ ఇన్నింగ్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(45 బంతుల్లో 53), అసలంక(41 బంతుల్లో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 197 పరుగుల లక్క్ష్య చేధనలో కివీస్ కూడా ధీటుగా బదులిచ్చింది. డారిల్ మిచెల్(66), ఆఖరిలో సోధి(4 బంతుల్లో 10 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ మ్యాచ్‌ను టైగా ముగించింది. అయితే సూపర్ ఓవర్లో మాత్రం విజయం లంకవైపే నిలిచింది. ఇక ఈ ఏడాది కివీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి లంక బదులు తీర్చుకున్నట్లైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డునెడిన్ వేదికగా ఏప్రిల్ 5న జరగనుంది. చదవండి: భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మృతి -
WC 2023: 44 ఏళ్ల తర్వాత.. తొలిసారి! లంకకు ఏంటీ దుస్థితి? కివీస్ వల్లే..
Sri Lanka Failed To Qualify ICC ODI WC 2023 Directly: 1996 వరల్డ్‌కప్ ఛాంపియన్స్.. 2007, 2011 ప్రపంచకప్ రన్నరప్.. ఇవీ వన్డే క్రికెట్లో శ్రీలంక సాధించిన అద్బుతాలు. అయితే ఇదంతా గతం. కట్‌చేస్తే .. 2023 వన్డే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించని జట్టుగా లంక అప్రతిష్టను మూటగట్టుకుంది. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, చమిందా వాస్ సహా ఎందరో హేమాహేమీలను అందించిన శ్రీలంక క్రికెట్ ఇప్పుడు కనీసం వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమవ్వడం అందరిని విస్మయపరిచింది. 44 ఏళ్ల తర్వాత లంక మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టడం కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. వరుస ఓటములు లంక అవకాశాలను దెబ్బకొట్టాయి. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడలా.. ఇప్పుడిలా అడ్డుకున్న కివీస్ ఇందులో భాగంగా రెండు టెస్టుల్లో పోరాడి ఓడిన లంక జట్టు.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఫలితం నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో కేవలం రెండు వికెట్లతో ఓటమి పాలైన కరుణ రత్నె బృందం.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లిన కివీస్.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో నేరుగా అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసింది. తొలి వన్డేలో 198 పరుగులతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. షనక బృందం అవుట్ కాగా రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 2-0తో సొంతం చేసుకుంది. దీంతో వన్డే సిరీస్ కోల్పోయిన దసున్ షనక బృందం ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశం కూడా చేజార్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వేలో జూన్‌లో జరుగనున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. కాగా కివీస్‌తో మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు సౌతాఫ్రికా నుంచి ప్రమాదం పొంచి ఉంది. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో సత్తా చాటితే ప్రొటిస్ విండీస్‌ను వెనక్కినెట్టి రేసులో మరో ముందడుగు వేస్తుంది. కాగా భారత్ వేదికగా అక్టోబరులో వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ ఆరంభం కానుంది. చదవండి: IPL 2023 Captains Salaries: సూపర్ క్రేజ్.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్ కెప్టెన్ల ‘బలగం’.. బలం! వీరి గురించి తెలుసా? పాపం అతడొక్కడే! -
శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు.. కివీస్‌తో రెండో వన్డే వర్షార్పణం, అంతలోనే మరో షాక్
2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు. 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన ఆ జట్టును ఆతిధ్య దేశం చావుదెబ్బకొట్టగా.. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తే, ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి వన్డేలో ఓటమిపాలై వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న శ్రీలంక.. కివీస్‌తో ఇవాళ (మార్చి 28) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం కావడంతో వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే అశలను పూర్తిగా వదిలేసుకుంది. ఇంతలోనే ఆ జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. కివీస్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఐసీసీ ఆ జట్టుకు ఓ పాయింట్ కోత విధించింది. దీంతో శ్రీలంక అధికారికంగా వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చిన్న జట్లతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో శ్రీలంక సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే తొలి వన్డేలో నెగ్గిన కివీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2 వన్డేల అనంతరం 1-0 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ శ్రీలంక ఆఖరి వన్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుందే తప్ప, ఒరిగేదేమీ ఉండదు. మూడో వన్డే మార్చి 31న హామిల్టన్ వేదికగా జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. -
న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్.. ఇద్దరు క్రికెటర్ల ఎంట్రీ!
శ్రీలంక, పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లకు రెండు వెర్వేరు జట్లను న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ రెండు సిరీస్‌లకు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ దూరమయ్యారు. ఐపీఎల్లో పాల్గొనేందుకు వీరిద్దరూ భారత్‌కు రానుండడంతో ఈ సిరీస్‌లకు దూరమయ్యారు. ఇక ఈ రెండు సిరీస్‌లకు కివీస్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. అదే విధంగా చాడ్ బోవ్స్, షిప్లీ తొలి సారి న్యూజిలాండ్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా న్యూజిలాండ్ స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఏప్రిల్ 2న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం కివీస్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో కివీస్ ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 14 నుంచి 24 వరకు జరగనుంది. శ్రీలంక సిరీస్‌కు కివీస్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. పాకిస్తాన్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. డేన్ క్లీవర్, కోల్ మెక్కాన్చీ, బ్లెయిర్ టిక్నర్. చదవండి: BCCI: భువనేశ్వర్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! -
క్లియర్‌గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కివీస్ పేసర్ల దాటికి కేవలం 76 పరుగులకే కూప్పకూలింది. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్, టిక్నర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఆడిన కరుణరత్నే వెంటనే సింగిల్ తీయడానికి తీయడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న కివీస్ ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేశాడు. బంతిని అందుకున్న టిక్నర్ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్కు చేశాడు. రిప్లేలో టిక్నర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రీజుకు దూరంలో ఉన్నాడు. దీంతో కరుణరత్నే ఔట్ అని అంతా భావించారు. అయితే ఇక్కడే కరుణరత్నేని అదృష్టం వెంటాడింది. బంతి స్టంప్స్ తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్ వెలగలేదు. వాటిలో బ్యాటరీలు అయిపోయాయి. దీంతో రూల్స్ ప్రకారం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయం చూసిన కివీస్ ఆటగాళ్లు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రనౌట్ విషయంలో బెయిల్స్ వెలగకపోవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Virat Kohli: ఇంగ్లీష్ పరీక్షలో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్ Not out 🏏 due to dead battery 😂#SparkSport #NZvSL pic.twitter.com/tYE044lemd — Spark Sport (@sparknzsport) March 25, 2023 -
కివీస్ చేతిలో ఓటమి.. వరల్డ్‌కప్ రేసు నుంచి శ్రీలంక ఔట్..!
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 198 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పరుగుల పరంగా శ్రీలంకపై కివీస్‌కు ఇది అతి పెద్ద విజయం. ఈ గెలుపుతో న్యూజిలాండ్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై కావాలన్న శ్రీలంక ఆశలు ఆవిరయ్యాయి. శ్రీలంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా న్యూజిలాండ్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఫలితం రాకపోగా.. 15 గెలిచి, ఐదింటిలో ఓడింది. దీంతో ఆ జట్టు ఖాతాలోకి 160 పాయింట్లు చేరాయి. New Zealand have topped the @MRFWorldwide ICC Men’s @cricketworldcup Super League table 💥#NZvSL report 👇https://t.co/PyjYWvuA3G — ICC (@ICC) March 25, 2023 న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లండ్ (155), ఇండియా (139), బంగ్లాదేశ్ (130), పాకిస్తాన్ (130), ఆస్ట్రేలియా (120), ఆఫ్ఘనిస్తాన్ (112) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్‌కప్-2023కు ఈ 7 జట్లు నేరుగా క్వాలిఫై కాగా.. మిగిలిన మరో స్థానం కోసం శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌లు పోటీపడుతున్నాయి. సీజన్ ముగిసే సమయానికి 8వ స్థానంలో ఉండే జట్టు నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. తొలి వన్డేలో కివీస్ చేతిలో భారీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో శ్రీలంక 10వ స్థానానికి పడిపోయి వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఒకవేళ లంకేయులు కివీస్‌పై రెండు, మూడు వన్డేల్లో గెలిచినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ ఛాన్సస్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం స్టాండింగ్స్‌లో ఉన్న 9వ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. త్వరలో నెదర్లాండ్స్‌తో జరుగబోయే రెండు వన్డేల్లో విజయం సాధిస్తే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం శ్రీలంకతో పాటు 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్, 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ కూడా వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా కోల్పోయాయి. ఒకవేళ సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై అయితే వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్ తదితర జట్లతో కలిసి క్వాలిఫయర్ పోటీల్లో తలపడాల్సి ఉంటుంది. ఈ పోటీలు జూన్ 8న మొదలవుతాయి. -
నిప్పులు చెరిగిన షిప్లే.. వణికిపోయిన లంకేయులు
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 25) జరిగిన తొలి వన్డేలో ఆతిధ్య న్యూజిలాండ్ 198 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ యువ పేసర్ హెన్రీ షిప్లే నిప్పులు చెరిగాడు. 7 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా 275 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. షిప్లే ధాటికి లంక ఆటగాళ్లు వణికిపోయారు. ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టాడు. A maiden international five-wicket bag for Henry Shipley! Watch play LIVE on @sparknzsport or TVNZ Duke LIVE scoring https://t.co/nudAdDPipf #CricketNation #NZvSL pic.twitter.com/VJv6zEepHG — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 మెరుపు వేగంతో షిప్లే సంధించిన బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొనేందుకు లంక ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. షిప్లే నిస్సంకను క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. షిప్లేకు జతగా డారిల్ మిచెల్ (2/12), బ్లెయిర్ టిక్నర్ (2/20) కూడా రాణించడంతో 20 ఓవర్లలోపే లంకేయుల ఖేల్ ఖతమైంది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. What a ball Mr Shipley 👏 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport#SparkSport #NZvSL pic.twitter.com/zHv8yZvr4M — Spark Sport (@sparknzsport) March 25, 2023 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ (51) హాఫ్ సెంచరీతో రాణించగా.. డారిల్ మిచెల్ (47), గ్లెన్ ఫిలిప్స్ (39), రచిన్ రవీంద్ర (49) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో చమిక కరుణరత్నే 4 వికెట్లు పడగొట్టగా.. రజిత, లహీరు కుమార తలో 2 వికెట్లు, మధుశంక, షనక చెరో వికెట్ దక్కించుకున్నారు. A special moment at @edenparknz. A Moment of Acknowledgment at the 14.2 over mark to honour all those affected by Cyclone Gabriel and the floods - along with those helping with the recovery. Text DONATE to 540 to donate to the @NZRedCross Disaster Relief Fund. #CricketNation pic.twitter.com/QfSepLT1ma — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 ఈ మ్యాచ్ ద్వారా లభించే మొత్తాన్ని కివీస్ క్రికెటర్లు ఇటీవల విధ్వంసం సృష్టించిన గాబ్రియెల్ సైక్లోన్ బాధితులకు అందజేయనున్నారు. తుఫాను బాధితులకు సంఘీభావంగా ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు 14.2 ఓవర్ తర్వాత లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా కివీస్ ఆటగాడు బ్లెయిర్ టిక్నర్ కంటతడి పెట్టుకోవడం అందరిని కలచివేసింది. -
NZ Vs SL: దెబ్బకు వికెట్ ఎగిరి అంతదూరాన పడింది! షాక్‌లో నిసాంక
New Zealand vs Sri Lanka, 1st ODI: శ్రీలంకతో తొలి వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే విశ్వరూపం ప్రదర్శించాడు. అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దసున్ షనక బృందం షిప్లే దెబ్బకు అల్లాడిపోయింది. దెబ్బకు బౌల్డ్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లంక ఓపెనర్ నవనీడు ఫెర్నాండో రనౌట్(2.1 ఓవర్లో) అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ తొలి వికెట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇక ఆ తర్వాత కివీస్ యువ పేసర్ షిప్లే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 3.3 ఓవరల్లో మరో ఓపెనర్ పాతుమ్ నిసాంకను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. గంటకు 132.5 కిలోమీటర్ల వేగంతో షిప్లే విసిరిన బంతికి దెబ్బకు వికెట్ ఎగిరి అంతదూరాన పడింది. షిప్లే దెబ్బకు అవాక్కైన నిసాంక బిక్కమొహం వేసి క్రీజును వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లంకకు ఘోర పరాభవం ఇక 10 ఓవర్లలోపే షిప్లే.. నిసాంక(0) సహా కుశాల్ మెండిస్(0), చరిత్ అసలంక(9), కెప్టెన్ దసున్ షనక(0), చమిక కరుణరత్నె(11) వికెట్లు కూల్చాడు. తద్వారా కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల హాల్ సాధించాడు. ఇదిలా ఉంటే.. కివీస్ బౌలర్ల దెబ్బకు లంక 76 పరుగులకే ఆలౌట్ అయింది. 198 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తొలి వన్డేలో విజయంతో కివీస్ 1-0తో ముందంజలో నిలిచింది. What a ball Mr Shipley 👏 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport#SparkSport #NZvSL pic.twitter.com/zHv8yZvr4M — Spark Sport (@sparknzsport) March 25, 2023 A maiden international five-wicket bag for Henry Shipley! Watch play LIVE on @sparknzsport or TVNZ Duke LIVE scoring https://t.co/nudAdDPipf #CricketNation #NZvSL pic.twitter.com/VJv6zEepHG — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 -
NZ Vs SL: పాపం రచిన్ రవీంద్ర! షిప్లే విశ్వరూపం.. 10 ఓవర్లలోనే లంక..
New Zealand vs Sri Lanka, 1st ODI: శ్రీలంకతో తొలి వన్డేలో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. ఆక్లాండ్ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ అర్ధ శతకంతో రాణించగా.. అరంగేట్ర ఆటగాడు రచిన్ రవీంద్ర తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. కాగా సొంతగడ్డపై లంకతో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ఇరు జట్ల మధ్య మొదటి వన్డేలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే అరంగేట్ర ఓపెనర్ చాడ్ బౌస్(14 పరుగులు) వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్(26)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. పాపం రచిన్ రవీంద్ర ఇక నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 47 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ టామ్ లాథమ్(5)విఫలమయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులు సాధించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 49 పరుగులు చేసిన అతడు.. ఒక్క పరుగు తేడాతో అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. కసున్ రజిత బౌలింగ్‌లో షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. షిప్లే విశ్వరూపం ఈ క్రమంలో 49.3 ఓవర్లలో కివీస్ 274 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో చమిక కరుణరత్నె అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. కసున్ రజిత రెండు, లాహిరు కుమార రెండు, కెప్టెన్ దసున్ షనక ఒకటి, దిల్షాన్ మధుషంక ఒక్కో వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన లంకను కివీస్ పేసర్ షిప్లే అల్లాడిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి షిప్లే నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్ నవనీడు ఫెర్నాండో రనౌట్ రూపంలో వెనుదిరగడంతో లంక మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. చదవండి: Ben Stokes: అడుగుపెట్టిన కాసేపటికే బరిలోకి.. బ్యాట్‌తో విధ్వంసం IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే సాధ్యం! A big finish to the over from Rachin Ravindra! Watch play LIVE on @sparknzsport or TVNZ Duke LIVE scoring https://t.co/nudAdDPipf #CricketNation #NZvSL pic.twitter.com/AgC0GDAUoO — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 -
99వ పుట్టినరోజుకు సిద్ధం.. వీరాభిమానికి కేన్ మామ సర్ప్రైజ్! ఫొటో వైరల్
Kane Williamson- IPL 2023: న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వీరాభిమానికి అదిరిపోయే బహుమతి అందించాడు. 99వ పుట్టినరోజు వేడుకకు సిద్ధమవుతున్న ‘తాతయ్య’కు తన సంతకంతో కూడిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేగాక ఆయనతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి పెద్దాయనను ఖుషీ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘సూపర్ కేన్ మామ.. ఆయన ముఖం సంతోషంతో నిండిపోయేలా చేశావు. త్వరలోనే మళ్లీ నీ బ్యాటింగ్‌ను చూడబోతున్నాం. ఆల్ ది బెస్ట్’’ అని విష్ చేస్తున్నారు. లంకతో సిరీస్‌లో సూపర్‌హిట్ కాగా ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో కేన్ విలియమ్సన్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మొత్తంగా 337 పరుగులు సాధించిన ఈ స్టార్ బ్యాటర్.. లంకను కివీస్ 2-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఐపీఎల్-2023లో కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగిన కేన్ మామను వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ తరఫున ఈ క్రమంలో మినీ వేలంలో భాగంగా గుజరాత్ టైటాన్స్ 2 కోట్ల రూపాయల కనీస ధరకు విలియమ్సన్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో కేన్ ఆడునున్నాడు. ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా మార్చి 31న గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌తో క్యాష్‌రిచ్ లీగ్ పదహారవ సీజన్‌కు తెరలేవనుంది. చదవండి: Ben Stokes: 'నేను వచ్చేశా'.. సీఎస్కే ఫ్యాన్స్‌లో జోష్ Asia Cup 2023: ఓటమి భయం.. అందుకే రానంటున్నారు! అంత సీన్ లేదులే గానీ! -
ఐపీఎల్ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు టూ టైమ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను సమస్య కారణంగా ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లీగ్ మొత్తానికే దూరం కాగా.. తాజాగా స్టార్ బౌలర్, న్యూజిలాండ్ ఆటగాడు లోకీ ఫెర్గూసన్ గాయం (హ్యామ్‌స్ట్రింగ్) బారిన పడ్డాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్‌కు ముందు ఫెర్గూసన్ గాయం వార్త వెలుగు చూసింది. దీంతో అతను మార్చి 25న జరిగాల్సిన తొలి వన్డే బరి నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో కివీస్ క్రికెట్ బోర్డు ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంకతో తొలి వన్డేకు మాత్రం ఫెర్గూసన్ దూరంగా ఉంటాడని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే, ఫెర్గూసన్ గాయం తీవ్రతపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కానీ కేకేఆర్ యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ ఫెర్గూసన్ గాయం బారిన పడకుండి ఉంటే, తొలి వన్డే తర్వాత ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు పయనమవ్వాల్సి ఉండింది. ఫెర్గూసన్ గాయంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో కేకేఆర్ యాజమాన్యం కలవర పడుతుంది. ఇప్పటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేవలు కోల్పోయిన ఆ జట్టు, ఫెర్గూసన్ సేవలను కూడా కోల్పోతే భారీ మూల్యం తప్పదని భావిస్తుంది. ఫెర్గూసన్ కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా పేస్ బౌలింగ్ భారమంతా టిమ్ సౌథీపై పడుతుంది. ఐపీఎల్ 2023 ప్రారంభానికి మరో 8 రోజులు మాత్రమే ఉన్నా కేకేఆర్ ఇప్పటికీ తమ నూతన కెప్టెన్ పేరును (శ్రేయస్ రీప్లేస్మెంట్) ప్రకటించలేదు. కాగా, ఫెర్గూసన్ గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2023 వేలంలో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. కేకేఆర్ ఏప్రిల్ 2న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. -
శ్రీలంక కెప్టెన్ సంచలన నిర్ణయం
శ్రీలంక టెస్ట్ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 28 మధ్యలో 2 టెస్ట్‌లు) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇవాళ (మార్చి 20) ప్రకటించాడు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు కూడా తెలియజేసినట్లు వెల్లడించాడు. కరుణరత్నే నిర్ణయంపై ఎస్ఎల్సీ స్పందించాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన నిమిషాల వ్యవధిలోనే కరుణరత్నే రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేసిన కరుణరత్నే.. కొత్త టెస్ట్ సైకిల్‌కు (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25) కొత్త కెప్టెన్‌ని నియమించడం మంచిదని సెలెక్టర్లకు తెలిపినట్లు పేర్కొన్నాడు. 2019లో తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టిన కరుణరత్నే.. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే (సౌతాఫ్రికాపై) చారిత్రక సిరీస్ సాధించాడు. 26 టెస్ట్‌ల్లో లంక జట్టు సారధిగా వ్యవహరించిన కరుణరత్నే.. 10 విజయాలు, 7 డ్రాలు, 9 పరాజయాలను ఎదుర్కొన్నాడు. టెస్ట్ కెరీర్లో 84 మ్యాచ్‌లు ఆడిన కరుణరత్నే.. 39.94 సగటున డబుల్‌సెంచరీ, 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో 6230 పరుగులు చేశాడు. లంక తరఫున 34 వన్డేలు ఆడిన కరుణరత్నే.. 6 అర్ధశతకాల సాయంతో 767 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ ముగియగా.. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఐదో స్థానంలో, న్యూజిలాండ్ ఆరో స్థానంలో నిలిచాయి. -
ఇదేం బంతిరా బాబు.. బ్యాటర్ అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయ భేరి మోగించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఫాలోఆన్ ఆడిన శ్రీలంక, తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెస్‌వేల్ రెండు, డాగ్ బ్రెస్‌వేల్ , హెన్రీ తలా వికెట్ సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆట సందర్భంగా ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 121 ఓవర్ వేసిన స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఓ బంతి.. భారీ గాలుల కారణంగా ఆనూహ్యంగా టర్న్ అయ్యి వైడ్‌గా వెళ్లింది. అతడు బౌలింగ్ వేసే సమయంలో ఒక్క సారిగా గాలి రావడంతో.. బంతి పిచ్‌కు చాలా దూరంగా పడింది. ఇది చూసిన శ్రీలంక బ్యాటర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని రోజులగా న్యూజిలాండ్‌లో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చదవండి: SL vs NZ: డబ్ల్యూటీసీ ఫైనల్ కాదు.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా! శ్రీలంకను చిత్తు చేసిన కివీస్ Just when you think you’ve seen it all in cricket. High winds so single end coverage in Wellington. Here’s the supporting evidence… pic.twitter.com/AzQerm4h9b — Rob Williams (@robwilliams_tv) March 20, 2023 -
డబ్ల్యూటీసీ ఫైనల్ కాదు.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా! శ్రీలంకను చిత్తు చేసిన కివీస్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ ఆహ్వానం మెరకు ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 58 పరుగులు వెనుకబడిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెస్‌వేల్ రెండు, డాగ్ బ్రెస్‌వేల్ , హెన్రీ తలా వికెట్ సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అంతకుముందు లంకేయులు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 164 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 584/4 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(215), హెన్రీ నికోల్స్(200) అద్భుతమైన డబుల్ సెంచరీలతో చెలరేగారు. ఇక రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణించిన కేన్ విలియమ్సన్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. అదే విధంగా ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన నికోల్స్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంక.. ఇప్పుడు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా లంక జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IND vs AUS: మూడో వన్డేకు సూర్యకుమార్‌ను తప్పిస్తారా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ -
డబ్ల్యూటీసీ ఫైనల్ అన్నారు.. ఇప్పుడేమో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితి..!
NZ VS SL 2nd Test: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతున్న లంకేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు. శ్రీలంక.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు (580/4) ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 26/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మైఖేల్ బ్రేస్‌వెల్ (3/50), మ్యాట్ హెన్రీ (3/44), సౌథీ (1/22), డౌగ్ బ్రేస్‌వెల్ (1/19), టిక్నర్ (1/21) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాపచుట్టేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ పిలుపు మేరకు ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ కరుణరత్నే (51) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ పోరాడుతున్నాడు. సౌథీ, డౌగ్ బ్రేస్‌వెల్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి, భారత్‌ను వెనక్కునెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరాలని కలలు కన్న శ్రీలంక ప్రసుత్తం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్థితిలో ఉంది. తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో శ్రీలంక విజయావకాశాలను దెబ్బకొట్టిన విలియమ్సన్ ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టును గెలవకుండా చేశాడు. -
New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ ఆ దేశం తరఫున అరుదైన ఘనత సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీలు సాధించిన తొలి కివీస్ ద్వయంగా గుర్తింపు పొందారు. వీరిద్దరి జోరుతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (296 బంతుల్లో 215; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్ (240 బంతుల్లో 200 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) ద్విశతకాలతో చెలరేగారు. మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన వీరిద్దరు ఈ క్రమంలో పలు కొత్త రికార్డులు నమోదు చేశారు. టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న విలియమ్సన్... ఈ మైలురాయిని దాటిన తొలి కివీస్ బ్యాటర్‌గా నిలవడంతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ దేశం తరఫున అత్యధిక సెంచరీలు (41) సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అనంతరం శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన విలియమ్సన్, హెన్రీ నికోల్స్... ద్రవిడ్- లక్ష్మణ్‌తో పాటు..
New Zealand vs Sri Lanka, 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ చరిత్ర సృష్టించారు. కివీస్ టెస్టు చరిత్రలో అధికసార్లు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా నిలిచారు. అదే విధంగా.. ఓవరాల్‌గా రెండు లేదంటే ఎక్కువసార్లు ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో జోడీగా ఘనత సాధించారు. ద్రవిడ్- లక్ష్మణ్‌లతో పాటు స్వదేశంలో శ్రీలంకతో రెండో టెస్టు రెండో రోజు సందర్భంగా 300 పైచిలుకు భాగస్వామ్యంతో ఈ రికార్డు అందుకున్నారు. వీరు ఈ ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి. తద్వారా మహేళ జయవర్ధనే- కుమార సంగక్కర, డాన్ బ్రాడ్‌మన్- విల్ పోన్స్‌ఫోర్డ్, మైకేల్ క్లార్క్- రిక్కీ పాంటింగ్, మహ్మద్ యూసఫ్- యూనిస్ ఖాన్, రాహుల్ ద్రవిడ్- వీవీఎస్ లక్ష్మణ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో జోడీగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆఖరి బంతికి విజయం అందుకున్న కివీస్.. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిచింది. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(215), నాలుగో స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో రాణించారు. పటిష్ట స్థితిలో వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ఇద్దరూ కలిసి 363 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి లంక రెండు వికెట్లు నష్టపోయి 26 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య కివీస్‌కు 554 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2023: కేకేఆర్‌కు మరో బిగ్‌షాక్.. స్టార్ ఆటగాళ్లు దూరం! IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ -
డబుల్ సెంచరీలు బాదిన కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలొ న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) ద్విశతకాలతో విరుచుకుపడ్డారు. ఫలింతగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డెవాన్ కాన్వే (78) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ లాథమ్ (21), డారిల్ మిచెల్ (17) తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, ధనంజయ డిసిల్వ, ప్రభాత్ జయసూర్య తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కేన్ మామకు ఆరోది, నికోల్స్‌కు తొలి ద్విశతకం.. 285 బంతుల్లో కెరీర్లో ఆరో ద్విశతకం పూర్తి చేసిన విలియమ్సన్.. దిగ్గజ ఆటగాళ్లు మర్వన్ ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావిద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్‌ల రికార్డును సమం చేశాడు. విలియమ్సన్ సహా వీరందరూ టెస్ట్‌ల్లో ఆరు డబుల్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అధిక డబుల్ సెంచరీల రికార్డు దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 52 టెస్ట్‌ల్లో ఏకంగా 12 ద్విశతకాలు బాదాడు. మరోవైపు విలియమ్సన్తో పాటు మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన హెన్రీ నికోల్స్ కూడా డబుల్ బాదాడు. 240 బంతుల్లో 200 పరుగులతో అజేయంగా నిలిచిన నికోల్స్‌కు ఇది కెరీర్లో తొలి ద్విశతకం. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) మెరిసిన కేన్ మామ.. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా డబుల్ సెంచరీతో (215) చెలరేగాడు. కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132). -
హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన కేన్ మామ
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిధ్య న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. వర్షం, వెలుతురులేమి కారణంగా తొలి రోజు కేవలం 48 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా, రెండో రోజు ఆట నిర్దిష్ట సమయానికి ప్రారంభమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసిన న్యూజిలాండ్.. రెండో రోజు ఆటలో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) తన జట్టుకు అపురూప విజయాన్నందించిన కేన్ విలియమ్సన్ ఐదు రోజుల వ్యవధిలో మరో సెంచరీతో (188 నాటౌట్) మెరిశాడు. కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132). మరోవైపు కేన్ మామతో హెన్రీ నికోల్స్ (113 నాటౌట్) సైతం సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ పోటాపోటీ శతకాలతో విరుచుకుపడటంతో 106 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 425/2గా ఉంది. విలియమ్సన్ (188), హెన్రీ నికోల్స్ (114) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో డెవాన్ కాన్వే (78) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ లాథమ్ (21) పర్వాలేదనిపించాడు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
శెభాష్.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే!
New Zealand vs Sri Lanka, 1st Test: న్యూజిలాండ్ గడ్డ మీద కివీస్‌ను ఓడించడం అంత తేలికేమీ కాదు! టీమిండియాతో ఫైనల్ రేసులో ముందంజ వేయాలని శ్రీలంక ఉవ్విళ్లూరుతోంది! పటిష్ట కివీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేయడం సాధ్యమమ్యే పనేనా!? లంకేయులు మరీ ఎక్కువగా ఆశపడుతున్నారేమో! న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో లంక జట్టు గురించి వినిపించిన మాటలు! న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం కఠినతరమే కానీ అసాధ్యం కాదు! లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ఒక్కడిలోనే కాదు దిముత్ కరుణరత్నె బృందం అందరిలోనూ అదే ఆత్మవిశ్వాసం.. అందుకు తగ్గట్లే తొలి టెస్టులో కివీస్‌ను అల్లల్లాడించింది శ్రీలంక జట్టు.. ఆఖరి బంతి వరకు అసాధారణ పోరాటం కనబరిచింది.. అయితే, అదృష్టం మాత్రం కివీస్ వైపు ఉంది. కేన్ విలియమ్సన్ అద్భుత డైవ్‌తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి న్యూజిలాండ్‌కు విజయం అందించాడు. ఆశలు ఆవిరి దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలన్న లంక ఆశలు ఆవిరైపోయాయి. వెరసి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అభిమానులు భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే శ్రీలంక అద్భుత పోరాటాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఓడించినంత పనిచేశారు ‘‘దేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన వేళ ధైర్యంగా ముందడుగు వేసి ఆసియా కప్ గెలిచారు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్ గడ్డపై అసాధారణ పోరాటం చేశారు. కివీస్‌తో తొలి టెస్టులో తృటిలో గెలుపు చేజారింది. అంతమాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటలో గెలుపోటములు సహజం. విజయం కోసం ఆఖరి బంతి వరకు మీరు పోరాడిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టెస్టు క్రికెట్లో అసలైన మజా అందించారు’’ అంటూ లంక ఆటగాళ్లను కొనియాడుతున్నారు. ‘‘ఓడినా మనసులు గెలిచారు.. మరేం పర్లేదు’’ అంటూ నిరాశలో మునిగిపోయిన కరుణరత్నె బృందానికి సోషల్ మీడియా వేదికగా సానుభూతి ప్రకటిస్తున్నారు. కేన్ మామ వల్లే కాగా మార్చి 9-13 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్ సెంచరీతో మెరిశాడు. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడిన వేళ న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ 121 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆటను ఐదో రోజు వరకు తీసుకువచ్చిన మరో సెంచరీ వీరుడు డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మార్చి 17 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Axar Patel: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశ్విన్‌కూ సాధ్యం కానిది.. Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ BGT 2023: గత నాలుగు సిరీస్‌ల్లో ఆసీస్‌కు ఇదే గతి..! Test cricket, you beauty! ❤️#WTC23 | #NZvSL pic.twitter.com/7l7Yjmzraz — ICC (@ICC) March 13, 2023 -
NZ Vs SL: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు!
New Zealand vs Sri Lanka, 1st Test- Kane Williamson: మార్చి 13, 2023.. క్రైస్ట్‌చర్చ్.. హాగ్లే ఓవల్ మైదానం.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 70వ ఓవర్.. క్రీజులో కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు.. అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్.. బౌలర్ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్.. క్రీజులోకి నీల్ వాగ్నర్.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. నరాలు తెగే ఉత్కంఠ న్యూజిలాండ్ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్‌బాల్.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్.. షాట్ ఆడేందుకు కేన్ విలియమ్సన్ ప్రయత్నం.. వాగ్నర్‌కు కాల్.. సింగిల్ తీసేందుకు క్రీజు వీడిన కేన్ మామ.. లంక ఆశలపై నీళ్లు.. కేన్ మామపై ప్రశంసల జల్లు ఆలోపే బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్‌కు అనుకూలంగా థర్డ్ ఎంపైర్ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్‌ను గెలిపించిన కేన్ విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు.. అప్పుడు ఇంగ్లండ్ లంక ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా.. ఇలా నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌తో ఓ అరుదైన రికార్డు నమోదైంది. టెస్టు మ్యాచ్‌లో ఆఖరి బంతి(బైస్ రూపంలో)కి విజయం అందుకున్న రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. అంతకుముందు 1948లో డర్బన్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ (లెగ్‌బైస్) రూపంలో పరుగు సాధించి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో దాదాపు 75 ఏళ్ల తర్వాత కివీస్ ఈ అత్యంత అరుదైన ఫీట్ నమోదు చేసింది. నాడు క్లిఫ్ గ్లాడ్విన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇంగ్లండ్ గెలుపు అందుకోగా.. తాజా మ్యాచ్‌లో విలియమ్సన్ కారణంగా కివీస్‌కు విజయం లభించింది. చదవండి: WTC Final- Ind Vs Aus: అప్పుడు అడ్డుకున్న న్యూజిలాండ్.. ఈసారి ఇలా! టీమిండియాకు.. Ind vs Aus- Ahmedabad Test: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా మరెన్నో.. A thriller in Christchurch. #NZvSL pic.twitter.com/7hv2j4bEjJ — BLACKCAPS (@BLACKCAPS) March 13, 2023 -
WTC Final: అప్పుడు అడ్డుకున్న న్యూజిలాండ్.. ఈసారి ఇలా! టీమిండియాకు..
World Test Championship Final 2023 India Vs Australia: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియాకు శుభవార్తను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్ సేనకు మార్గం సుగమం చేసింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ మొదటి టెస్టులో ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో లంకపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్ గడ్డపై సర్వశక్తులు ఒడ్డిన లంక ఆశలపై ఆఖరి నిమిషంలో నీళ్లు చల్లింది. ఈ ఓటమితో శ్రీలంక పోటీ నుంచి నిష్క్రమించగా టీమిండియాకు డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్ బెర్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అప్పుడలా.. ఇప్పుడిలా అంతర్జాతీయ క్రికెట్ మండలి 2019- 21 సీజన్‌కు గానూ తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాలతో ఫైనల్ చేరుకుంది. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ సైతం డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో గల ది రోస్ బౌల్ స్టేడియంలో టీమిండియా- కివీస్ మధ్య జూన్ 18-23 వరకు ఫైనల్ జరిగింది. నాడు ఓడించి.. నేడు పరోక్షంగా సాయపడి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కోహ్లి సేనపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడి మురిసిసోయింది. నాటి మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టిన కైలీ జెమీషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక నాడు టీమిండియా ట్రోఫీ గెలవకుండా అడ్డుకున్న న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఈసారి మాత్రం ఆటగాడిగా తమ జట్టును గెలిపించడంతో పాటు భారత జట్టును ఫైనల్ చేర్చడంలో పరోక్షంగా ప్రధాన పాత్ర పోషించాడు. కేన్ మామకు జై ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కేన్ బాదిన ఫోర్ లంక ఫైనల్ ఆశలను చిదిమేయగా.. అషిత ఫెర్నాండో బైస్ రూపంలో ఎక్స్ట్రా పరుగు ఇచ్చాడు. దీంతో లంక ఓటమి ఖరారు కాగా.. టీమిండియా దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7- 11 వరకు ఆస్ట్రేలియా- భారత్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. రోహిత్ సేనకు ఆల్ ది బెస్ట్ జూన్ 12ను రిజర్వ్‌డేగా నిర్ణయించారు. ఈ క్రమంలో వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా ఈసారైనా ట్రోఫీ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రోహిత్ శర్మ డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచి ఇండియాకు ఐసీసీ ట్రోఫీ అందిస్తే చూడాలని ఉందని పేర్కొంటున్నారు. చదవండి: Virat Kohli- Steve Smith: కోహ్లి విషయంలో స్మిత్ మొన్న అలా.. నిన్న ఇలా! బీసీసీఐ ట్వీట్ వైరల్ 21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్ A thriller in Christchurch. #NZvSL pic.twitter.com/7hv2j4bEjJ — BLACKCAPS (@BLACKCAPS) March 13, 2023 -
శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత్
డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్ సెంచరీ సాధించిన కేన్ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. India have qualified for the World Test Championship final! They'll take on Australia at The Oval for the #WTC23 mace! More: https://t.co/75Ojgct97X pic.twitter.com/ghOOL4oVZB — ICC (@ICC) March 13, 2023 ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేన్ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి, తన జట్టును 2 వికెట్ల తేడాతో గెలిపించుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. New Zealand scurry to a famous Test win running a bye off the final ball! Sri Lanka's push for a spot in the #WTC23 final falls agonisingly short!#NZvSL Scorecard: https://t.co/p873rNARKS pic.twitter.com/CnFWN8xBti — ICC (@ICC) March 13, 2023 మరోపక్క ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లడంతో, న్యూజిలాండ్-శ్రీలంక తొలి టెస్ట్ ఫలితంపై డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఆధారపడి ఉండింది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ శ్రీలంక గెలిచి ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది. Test century No.27 for Kane Williamson! Has he done enough to guide New Zealand to a Test victory at Hagley Oval? Watch the #NZvSL series live with a Black Caps Pass on https://t.co/CPDKNxpgZ3 📺 pic.twitter.com/hNYkPKh8bt — ICC (@ICC) March 13, 2023 అయితే, తొలి టెస్ట్‌లోనే లంక ఓటమిపాలుకావడంతో ఆసీస్‌తో నాలుగో టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. A thriller in Christchurch. #NZvSL pic.twitter.com/7hv2j4bEjJ — BLACKCAPS (@BLACKCAPS) March 13, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక నిర్ధేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (121 నాటౌట్), డారిల్ మిచెల్ (81) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆఖరి బంతికి విజయాన్ని ఖరారు చేసుకుంది. ముఖ్యంగా కేన్ మామ అన్నీ తానై వ్యవహరించి, చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్‌కు విన్నింగ్ రన్ ఎక్స్ట్రా (బై) రూపంలో రావడం విశేషం. స్కోర్ వివరాలు.. శ్రీలంక: 355 & 302 న్యూజిలాండ్: 373 & 285/8 ఫలితం: 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం -
WTC Final: ఏంజెలో మాథ్యూస్ సెంచరీ! టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక
New Zealand vs Sri Lanka, 1st Test Day 4- WTC Final Scenario: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టేందుకు శ్రీలంక టీమిండియాతో పోటీ పడుతోంది. తుదిపోరుకు అర్హత సాధించే రేసులో తాము కూడా ఉన్నామంటూ దూసుకొస్తోంది. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. అంచనాలు తలకిందులు చేస్తూ కివీస్‌తో తొలి టెస్టులో హోరాహోరీ తలపడుతోంది. కాగా ఓవర్‌నైట్ స్కోరు 162/5తో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంకపై 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. డారైల్ మిచెల్ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, మాట్ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఈ మేర ఆధిక్యం సాధ్యమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది. ఏంజెలో మాథ్యూస్ సెంచరీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఏంజెలో మాథ్యూస్ పట్టుదలగా నిలబడి సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో చండీమాల్ 42, ధనంజయ డి సిల్వ 47(నాటౌట్) రాణించారు. దీంతో లంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 302 పరుగుల వద్ద ముగించింది. 279 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్ అద్భుతం చేస్తుందా? ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే(5)ను స్వల్ప స్కోరుకే అవుట్ చేసి కసున్ రజిత దెబ్బకొట్టాడు. టామ్ లాథమ్ 11, వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సరికి కివీస్ విజయానికి 257 పరుగుల దూరంలో ఉండగా.. ఆఖరి రోజు లంక తొమ్మిది వికెట్లు తీస్తే గెలుస్తుంది. ఇంకా 90 ఓవర్ల ఆట మిగిలి ఉన్న క్రమంలో ఈ పరిణామాలు కివీస్- లంక మ్యాచ్ టీమిండియా ఫ్యాన్స్‌ను మరింత ఉత్కంఠలోనికి నెట్టాయి. టీమిండియా, శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?! ►స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టును టీమిండియా గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ►ఒకవేళ న్యూజిలాండ్ లంకను తొలి టెస్టులో ఓడించినా, కనీసం ఒక్క మ్యాచ్ డ్రా చేసుకున్నా రోహిత్ సేన తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ►ఇక లంక.. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడాలంటే న్యూజిలాండ్‌ను 2-0తో వైట్‌వాష్ చేయడం సహా టీమిండియాపై ఆఖరి టెస్టులో ఆసీస్ విజయం సాధించాలి. -
తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న లంకేయులు.. టీమిండియాకు ఊహించని షాక్ ఇస్తారా?
క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యటక శ్రీలంక పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు కీలక వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మిచెల్(40), బ్రేస్వేల్(9) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. తొలత బ్యాటింగ్ పరంగా కివీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక.. ఇప్పుడు బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు. లంక బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగుల మెరుగైన స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (87) పరుగలతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ కరుణరత్నె (50), ఏంజెలో మాథ్యూస్ (47), ధనుంజయ డిసిల్వ (46) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు. ఒక వేళ ఈ మ్యాచ్ శ్రీలంక విజయం సాధిస్తే.. ఆ ప్రభావం వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ రేసుపై పడుతోంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకోగా మరో స్థానం కోసం టీమిండియా,శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించినా, డ్రాగా ముగించినా.. శ్రీలంక గెలుపోటములతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలై.. కివీస్ సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే, అప్పడు లంకేయులు డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెడతారు. కానీ శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడినా చాలు.. వారి డబ్ల్యూటీసీ కథ ముగిస్తోంది.! చదవండి: IND Vs AUS: చరిత్ర సృష్టించిన ఖవాజా.. 43 ఏళ్ల రికార్డు బద్దలు! ఏకైక ఆటగాడిగా.. -
పెళ్లి చేసుకున్న హసరంగ.. ఫొటోలు వైరల్! జంట ఎలా ఉందంటే!
Wanindu Hasaranga Marriage Pics Goes Viral: శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. వింధ్య అనే యువతిని పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. అత్యంత సన్నిహితుల నడుమ గురువారం వనిందు హసరంగ- వింధ్య పెళ్లి జరిగింది. PC: Instagram జంట ఎలా ఉందంటే! తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ ఆల్‌రౌండర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. PC: Instagram టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. అయితే, పెళ్లి పనులతో బిజీ అయిపోయిన వనిందు హసరంగ కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. పరిమిత ఓవర్ల సిరీస్ ఆరంభమయ్యే నాటికి ఈ కొత్త పెళ్లికొడుకు జట్టుతో కలిసే అవకాశం ఉంది. కాగా మార్చి 9 నుంచి న్యూజిలాండ్- లంక మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. ఐపీఎల్లో ఇరు జట్ల మధ్య మార్చి 25- 31 మూడు వన్డేలు, ఏప్రిల్ 2- 8 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో వనిందు హసరంగ రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 తాజా సీజన్లో ఈ ఆల్‌రౌండర్ ఆర్సీబీకి కీలకంగా మారనున్నాడు. లంక తరఫున ఇక 25 ఏళ్ల ఈ యువ ఆల్‌రౌండర్ లంక తరఫున జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 4 టెస్టులు, 37 వన్డేలు, 55 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 196 పరుగులు చేసి, 4 వికెట్లు.. వన్డేల్లో 710 పరుగులు సాధించి.. 39 వికెట్లు.. టీ20లలో 503 పరుగులు చేసి.. 89 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఐపీఎల్లో 18 మ్యాచ్‌లు ఆడి 39 పరుగులు చేయడంతో పాటు 26 వికెట్లు తీశాడు. చదవండి: IND Vs AUS: విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా? BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు.. -
వెటోరీని అధిగమించిన సౌథీ.. రెండో స్థానానికి ఎగబాకిన కివీస్ కెప్టెన్
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ సారధి టిమ్ సౌథీ ఓ రేర్ ఫీట్‌ను సాధించాడు. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో 3 వికెట్లు పడగొట్టిన సౌథీ ( తొలి రోజు ఆటలో).. న్యూజిలాండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2nd on the list! Tim Southee (362 wickets) becomes the second highest wicket-taker in Tests for New Zealand. Southee (706) now has the most international wickets for a New Zealander 🏏 #StatChat #NZvSL pic.twitter.com/2oXxxKw5ty — BLACKCAPS (@BLACKCAPS) March 9, 2023 93 టెస్ట్‌ల్లో 362 వికెట్లు పడగొట్టిన సౌథీ.. డేనియల్ వెటోరీని (112 టెస్ట్‌ల్లో 361) అధిగమించి, రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సౌథీ న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు (మూడు ఫార్మాట్లతో కలిపి) పడగొట్టిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 354 మ్యాచ్‌లు ఆడిన సౌథీ 706 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సౌథీ తర్వాత వెటోరీ (696), హ్యాడ్లీ (589), బౌల్డ్ (578), కెయిన్స్ (419), మిల్స్ (327), మోరిసన్ (286), చాట్‌ఫీల్డ్ (263), బాండ్ (259), వాగ్నర్ (258) టాప్-10లో ఉన్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన ఏంజెలో మాథ్యూస్
శ్రీలంక వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఆ దేశ క్రికెట్‌కు సంబంధించి ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 47 పరుగులు చేసిన మాథ్యూస్.. శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో 7000 పరుగుల మార్కును అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. Angelo Mathews goes past Sanath Jayasuriya and become the 3rd Sri Lankan player to reach 7️⃣0️⃣0️⃣0️⃣ Test runs 🙌 #NZvSL pic.twitter.com/Y56YdYctaj — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 9, 2023 ఈ క్రమంలో అతను ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు. జయసూర్య 110 టెస్ట్‌ల్లో 6973 పరుగులు చేస్తే.. మాథ్యూస్ 101 టెస్ట్‌ల్లోనే 7000 పరుగుల మార్కును అందుకున్నాడు. లంక తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర (134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్ధనే (149 టెస్ట్‌ల్లో 11814 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. A landmark achievement 👏 🇱🇰 Angelo Mathews becomes the third after @KumarSanga2 and @MahelaJay to 7000 Test runs for Sri Lanka pic.twitter.com/LYWnxSceVd — ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2023 లంక తరఫున టెస్ట్‌ల్లో 6000 అంతకంటే ఎక్కువ పరుగులు (ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో) చేసిన ఆటగాళ్లలో మాథ్యూస్ తర్వాత దిముత్ కరుణరత్నే (83 టెస్ట్‌ల్లో 6073) మాత్రమే ఉన్నాడు. ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తొలుత బ్యాటంగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన ఉండటంతో శ్రీలంక ఈ మ్యాచ్‌ను డూ ఆర్ డై అన్నట్లుగా తీసుకుంది. ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొంది. Who will join the Aussies in the World Test Championship 2023 final? 🤔 India🇮🇳 or Sri Lanka 🇱🇰? pic.twitter.com/KqBQQgYWRG — CricTracker (@Cricketracker) March 8, 2023 భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది. -
ఇరగదీసిన లంక బ్యాటర్లు.. టీమిండియా కొంపముంచుతారా ఏందీ..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొన్న విషయం విధితమే. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ ఆసక్తికర పరిస్థితుల నడుమ కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, టీమిండియా అభిమానులకు భయం పుట్టిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో భారత అభిమానుల్లో కలవరం మొదలైంది. ఒకవేళ లంక ఆటగాళ్లు ఇదే జోరును కొనసాగించి రెండో టెస్ట్‌ల్లో గెలిస్తే టీమిండియా ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయని కొందరు అభిమానులు బెంగపెట్టుకున్నారు. ఆసీస్‌పై నాలుగో టెస్ట్‌లో టీమిండియా గెలిస్తే ఈ సమస్య ఉండదు కాబట్టి, అహ్మదాబాద్ టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. -
NZ Vs SL: డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే అదొక్కటే మార్గం: లంక ఆల్‌రౌండర్
New Zealand vs Sri Lanka Test Series 2023: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా తొలి విజయం నేపథ్యంలో శ్రీలంక జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ చేరే మార్గం సుగమం చేసుకునేందుకు గొప్ప అవకాశం లభించిందంటూ లంక క్రికెటర్లు సంబరపడిపోతున్నారు. అయితే, అదే సమయంలో.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే అదృష్టం కలిసిరావడంతో పాటు కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందంటున్నారు. స్వదేశంలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. మూడో మ్యాచ్‌లో మాత్రం ఆసీస్ చేతిలో పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగించిన భారత జట్టు.. ఇండోర్‌లో అదే రీతిలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో.. ఆస్ట్రేలియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టగా.. టీమిండియా మరికొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి. అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ.. న్యూజిలాండ్- శ్రీలంక టెస్టు ఫలితం తేలిన తర్వాతే ఇంగ్లండ్‌లో ఆసీస్‌ను ఫైనల్లో ఢీకొట్టే జట్టు గురించి అధికారిక ప్రకటన వస్తుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో పదింట 5 టెస్టులు గెలిచిన శ్రీలంక.. 53.33 విజయశాతంతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ లంక ఫైనల్ చేరాలంటే ఆసీస్ చేతిలో టీమిండియా ఓడటం సహా న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్య జట్టును లంక 2-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. అయితే, అదేమీ అంత తేలికైన విషయం కాదు. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఫైనల్ చేరాలంటే అదే ఏకైక మార్గం.. కాబట్టి ‘‘న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం అంటే అత్యంత కష్టంతో కూడుకున్న పని. అయితే, గత పర్యటనలో మేము మెరుగైన ప్రదర్శన కనబరచడం సానుకూలాంశం. ఏదేమైనా ఇక్కడ గెలవాలంటే వాళ్లెలాంటి వ్యూహాలు అమలు చేస్తారో మేము కూడా అలాంటి ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. వాళ్లు మాకు కఠిన సవాలు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లండ్ దూకుడైన ఆటతో టెస్టులకు సరికొత్త నిర్వచనం చెబుతోంది. వాళ్ల శైలి వాళ్లది.. మా ఆట తీరు మాది. అయితే, మేమేమీ ఒత్తిడికి లోనుకావడం లేదు. అయితే.. ఫైనల్ చేరాలంటే మా ముందున్న ఏకైక మార్గం రెండు మ్యాచ్‌లు గెలవడమే. అందుకోసం మేము అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది’’ అని మాథ్యూస్ పేర్కొన్నాడు. కాగా మార్చి 9 నుంచి కివీస్- లంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. అంతకంటే ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓడిన సౌథీ బృందం.. రెండో టెస్టులో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సిరీస్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి పటిష్ట జట్టు, డబ్ల్యూటీసీ టైటిల్ తొలి విజేత న్యూజిలాండ్‌ను ఓడించాలంటే లంక అద్భుతం చేయాల్సి ఉంటుంది! చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? LSG New Jersey: లక్నో కొత్త జెర్సీ.. మరీ ఇంత చెత్తగా ఉందేంటి? దీని కంటే అదే నయం! -
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. అదే జరిగితే టీమిండియాకు కష్టమే!?
Ind Vs Aus- World Test Championship Final: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖరారు చేసుకుంది. డబ్ల్యూటీసీ 2021- 23 సీజన్లో 11వ విజయం సాధించిన ఆస్ట్రేలియా.. జూన్ 7న ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్ లేదా శ్రీలంకతో తలపడనుంది. మరోవైపు 10 విజయాలతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా... అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ నాలుగో టెస్టులో కూడా ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు టీమిండియా భవితవ్యం శ్రీలంకపై ఆధారపడి ఉంటుంది. కివీస్ పర్యటనకు శ్రీలంక ఈ నెలలో శ్రీలంక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియా, లంక మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అదే విధంగా శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి, మరో టెస్టు డ్రాగా ముగిసినా.. భారత జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది. అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెద్ద సవాల్ కాకపోవచ్చు. కాబట్టి ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌ను కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లి సేన రన్నరప్‌గా నిలిచింది. చదవండి: Danielle Wyatt: అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్మెంట్! -
NZ Vs SL: లంకతో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
Sri Lanka Tour New Zealand, 2023: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్వదేశంలో లంకతో తలపడనున్న జట్టులో 13 మంది సభ్యులకు చోటిచ్చింది. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైన కివీస్.. రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. లంకకు ఆ అవకాశం ఈ క్రమంలో మార్చి 9 నుంచి లంకతో పోరుకు సిద్ధమవుతోంది టిమ్ సౌథీ బృందం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో భాగంగా కివీస్- లంక మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్టన్లలో జరుగనున్న ఈ సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది. ఒకవేళ న్యూజిలాండ్‌ను గనుక లంక వైట్‌వాష్ చేయడం సహా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా- ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు కరుణరత్నె బృందానికి అవకాశాలు ఉంటాయి. అయితే, సొంతగడ్డపై కివీస్‌ను ఓడించడం లంకకు తేలికేం కాదు. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే లంక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్-2023 మార్చి 9- మార్చి 21 వరకురెండు టెస్టులు వేదికలు: క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్టన్ లంకతో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, స్కాట్ కుగ్గెలీజన్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్. చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే.. -
కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో ఫైనల్లో!
New Zealand Vs Sri Lanka 2023- Test Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. దిముత్ కరుణరత్నె సారథ్యంలోని ఈ జట్టులో లాహిరు కుమార, చమిక కరుణరత్నె, కసున్ రజిత, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తదితరులకు చోటు దక్కింది. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే క్రమంలో కివీస్‌తో సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వరుసగా రెండు టెస్టుల్లో ఓడించడం లంక పాలిట వరంలా మారింది. రోహిత్ సేన అదే జోరులో ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సహా కివీస్‌ను గనుక లంక వైట్‌వాష్ చేస్తే.. సౌతాఫ్రికా- వెస్టిండీస్ ఫలితం తమకు అనుకూలంగా వస్తే టీమిండియాతో పాటు ఫైనల్ చేరే అవకాశాలు లేకపోలేదు. అయితే, న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంకకు ఇది కత్తిమీద సాములాంటిదే. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. టాప్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా అంత ఈజీ కాదు గత రికార్డులు పరిశీలిస్తే కివీస్‌తో ముఖాముఖి తలపడిన 19 సందర్భాల్లో శ్రీలంక కేవలం రెండు టెస్టులు మాత్రమే గెలిచింది. అయితే, ప్రస్తుత కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మార్గదర్శనంలో లంక జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రతిభకు అదృష్టం తోడైతే కరుణరత్నె బృందం ఫైనల్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, గత డబ్ల్యూటీసీ విన్నర్ కివీస్‌ను ఓడించడం అది కూడా సొంత గడ్డపై వైట్‌వాష్ చేయడం అంటే ఆషామాషీ కాదు! మార్చి9 - ఏప్రిల్ 8 వరకు టూర్ ఇందుకోసం లంక సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించిన కేన్ విలియమ్సన్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. కాగా మార్చి 9- ఏప్రిల్ 8 వరకు కివీస్- లంక మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు లంక జట్టు: దిముత్ కరుణరత్నె(కెప్టెన్), ఒషాడా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వ, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, నిషాన్ మదుష్క, రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, చమిక కరుణరత్నె, కసున్ రజిత, లాహిరు కుమార, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్ననాయకె. చదవండి: T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ -
NZ VS SL: శతక్కొట్టిన ఫిలిప్స్.. శ్రీలంకను చిత్తు చేసిన కివీస్
ICC Mens T20 World Cup 2022 -New Zealand vs Sri Lanka Updates: 65 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 102 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రజిత 2 వికెట్ల పడగొట్టగా.. తీక్షణ, ధనంజయ, హసరంగ, లహిరు కుమార తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసింది. భానుక రాజపక్ష (34), దసున్ శనక (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్, సోధి తలో 2 వికెట్లు.. సౌథీ, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక బౌల్ట్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి డసున్ షనక (35) ఔటయ్యాడు. ఫలితంగా శ్రీలంక 93 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. వరుస ఓవర్లలో వికెట్లు.. 65 పరుగులకే 8 వికెట్లు డౌన్ శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. 12, 13 ఓవర్లలో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. సోధి బౌలింగ్‌లో హసరంగ (4), సాంట్నర్ బౌలింగ్‌లో తీక్షణ (0) పెవిలియన్‌కు చేరారు. దీంతో శ్రీలంక 65 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. ఆరో వికెట్ డౌన్ 10వ ఓవర్ ఆఖరి బంతికి శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి రాజపక్ష (34) పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 58/6. 24 పరుగులకే ఐదు వికెట్లు డౌన్ న్యూజిలాండ్‌తో పోరులో శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా మూడు పరుగులు చేసిన చమిక కరుణరత్నే మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు చరిత్ అసలంక(4) రూపంలో లంక నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ట్రెంట్ బౌల్ట్ చెలరేగడంతో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బౌల్ట్.. కుశాల్ మెండిస్ (4), ధనంజయ డిసిల్వా (0) పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా శ్రీలంక 2 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో నిస్సంక (0) ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. ఫలితంగా శ్రీలంక పరుగులేమీ చేయకుండానే వికెట్ కోల్పోయింది. శతక్కొట్టిన ఫిలిప్స్.. శ్రీలంక టార్గెట్ 168 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇన్ ఫామ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. శతక్కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ ఇన్ ఫామ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ కొట్టాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 19 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 153/5. గ్లెన్ ఫిలిప్స్ (103), సాంట్నర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 18వ ఓవర్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. రజిత బౌలింగ్‌లో షకనకు క్యాచ్ ఇచ్చి నీషమ్ (5) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 140/5. గ్లెన్ ఫిలిప్స్ (93), సాంట్నర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్ 15వ ఓవర్లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14.3 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 99/4. గ్లెన్ ఫిలిప్స్ ఫిఫ్టి వరుసగా 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఫిలిప్స్ 39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. మరో ఎండ్‌లో డారిల్ మిచెల్ (22) నిదానంగా ఆడుతున్నాడు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 63/3 వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. గ్లెన్ ఫిలిప్ (37), డారిల్ మిచెల్ (13) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా పరుగులు పెటిస్తున్నారు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 63/3. కట్టుదిట్టంగా శ్రీలంక బౌలింగ్ 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసిన న్యూజిలాండ్. మిచెల్, ఫిలిప్స్ క్రీజులో ఉన్నారు. పవర్‌ప్లేలో న్యూజిలాండ్ స్కోరు- 25/3 పెవిలియన్‌కు క్యూ కడుతున్న కివీస్ బ్యాటర్లు లంక బౌలర్లు కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వరుస ఓవర్లలో వికెట్లు పడగొడుతూ కివీస్‌ను కష్టాల ఊబిలోకి నెడుతున్నారు. కసున్ రజిత వేసిన నాలుగో ఓవర్లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8).. కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా ఆ జట్టు 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. న్యూజిలాండ్ రెండో వికెట్ డౌన్ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోతున్నారు. తొలి ఓవర్లోనే తీక్షణ.. ఫిన్ అలెన్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా, మూడో ఓవర్లో ధనంజయ డిసిల్వా.. డెవాన్ కాన్వేను (1) అదే తరహాలో ఔట్ చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్ 7 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) న్యూజిలాండ్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్. ట్రెంట్ బౌల్ట్ శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్ష, దసున్ శకన, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత -
అప్పుడు కెన్యా.. ఇప్పుడు లంక
కార్డిఫ్: ఓవరాల్ వరల్డ్‌కప్ చరిత్రలో న్యూజిలాండ్ మరోసారి అరుదైన ఘనతను సాధించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో విజయ సాధించడమే కాకుండా 203 బంతులు మిగిలి ఉండగానే గెలుపును అందుకుంది. ఫలితంగా ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో విజయం సాధించే క్రమంలో అత్యధిక బంతుల్ని మిగుల్చుకుని మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. గతంలో కెన్యాపై న్యూజిలాండ్ అతిపెద్ద విజయం సాధించింది. (ఇక్కడ చదవండి: కివీస్ కుమ్మేసింది..) 2011లో చెన్నైలో కెన్యాతో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ పడకుండా టార్గెట్‌ను ఛేదించి 252 బంతుల్ని అంటిపెట్టుకుంది. ఇదే నేటికీ వరల్డ్‌కప్‌లో అతిపెద్ద విజయం కాగా, మరొకసారి న్యూజిలాండ్ భారీ గెలుపును సాధించింది. శ్రీలంకపై న్యూజిలాండ్ సాధించిన విజయం మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 228 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని నమోదు చేశారు. -
కివీస్ కుమ్మేసింది..
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్ సీజన్‌ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత శ్రీలంకను కూల్చేసిన కివీస్.. ఆపై బ్యాటింగ్‌లో కుమ్మేసింది. శ్రీలంక నిర్దేశించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్( 73 నాటౌట్; 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ మున్రో( 58నాటౌట్; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు వికెట్ పడకుండా కివీస్‌కు విజయాన్ని అందించారు. పేలవమైన లంక బౌలింగ్‌పై విరుచుకుపడి 16.1 ఓవర్లలో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇది కార్డిఫ్‌లో న్యూజిలాండ్‌కు నాల్గో వన్డే విజయం కాగా, లంక ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. (ఇక్కడ చదవండి: లంక కెప్టెన్ అరుదైన ఘనత) అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 29. 2 ఓవర్లలో 136 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ బౌలింగ్ ధాటిగా ఎదురొడ్డి నిలవకలేక చేతులెత్తేసింది. లంక బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ దిముత కరుణరత్నే(52 నాటౌట్: 84 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించడం మినహా అంతా విఫలమయ్యారు. లంక ఓపెనర్ తిరుమన్నే(4) ఆదిలోనే పెవిలియన్ చేరగా, కరుణరత్నేతో కలిసి కుశాల్ పెరీరా(29) 44 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ మరుసటి బంతికే కుశాల్ మెండిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ధనుంజయ డిసిల్వా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఫెర్గ్యుసన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు డిసిల్వా. ఏంజెలో మాథ్యూస్ డకౌట్ కాగా, జీవన్ మెండిస్ పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. తిషారా పెరీరా(27) కాసేపు క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. . న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యుసన్ తలో మూడు వికెట్లతో రాణించగా, అతనికి జతగా గ్రాండ్ హోమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంత్నార్, బౌల్ట్‌లు తలో వికెట్ తీశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లంక కెప్టెన్ అరుదైన ఘనత
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే అరుదైన ఘనతను నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కరుణరత్నే(52 నాటౌట్) ఓపెనర్‌గా వచ్చి అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి కడవరకూ క్రీజ్‌లో ఉండి అజేయంగా నిలిచిన రెండో ఆటగాడిగా కరుణరత్నే ఘనత సాధించాడు. శ్రీలంక వరుసగా వికెట్లు చేజార్చుకున్నప్పటికీ కరుణరత్నే బాధ్యతాయుతంగా ఆడాడు. దాంతో శ్రీలంక 136 పరుగులు చేసింది. అంతకుముందు వెస్టిండీస్ క్రికెటర్ రిడ్లీ జాకబ్స్ ఈ ఘనత సాధించాడు. 1999 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జాకబ్స్ ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అతని సరసన కరుణరత్నే స్థానం సంపాదించాడు. కాగా, ఆనాటి మ్యాచ్‌లో జాకబ్స్ 49 పరుగులు మాత్రమే చేసి హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో నిలవగా, కరుణరత్నే హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.