అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. యువ ఫాస్ట్ బౌలర్లు విలియం ఓ'రూర్కే, బెన్ సియర్స్‌లకు తొలిసారి కివీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు వారిద్దరని ఎంపిక చేశారు.
అదే విధంగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ మైఖల్ బ్రేస్‌వెల్ తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. బ్రేస్‌వెల్ చివరగా గతేడాది మార్చిలో కివీస్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు.
కాగా న్యూజిలాండ్ భారత్‌లోని నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. అనంతరం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంకకు కివీస్ జట్టు వెళ్లనుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
అఫ్గాన్, లంకతో సిరీస్‌లకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
Comments
Please login to add a commentAdd a comment