Michael Bracewell
-
PAK Vs NZ: పాక్‌తో నాలుగో టీ20.. ఫిన్ అలెన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మార్చి 23) జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, బ్రేస్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ సుడిగాలి ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ తొలి నాలుగు ఓవర్లలో 54 పరుగులు చేసింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం సీఫర్ట్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టి సీఫర్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు.అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉండిన అలెన్.. సీఫర్ట్ ఔట్ కాగానే జూలు విదిల్చాడు. హరీస్ రౌఫ్ మినహా ప్రతి పాక్ బౌలర్‌ను ఎడాపెడా వాయించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అలెన్ విధ్వంసం తారా స్థాయికి చేరింది. ఈ ఓవర్లో అతను వరుసగా 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అలెన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో ఇది ఎనిమిదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక న్యూజిలాండ్ స్కోర్ ఒక్కసారిగా మందగించింది. 11 నుంచి 16వ ఓవర్ వరకు పాక్ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. 10వ ఓవర్ తర్వాత 134 పరుగులున్న న్యూజిలాండ్ స్కోర్ 16 ఓవర్ల తర్వాత 166 పరుగులుగా మాత్రమే ఉంది. ఈ 6 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ మూగబోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను మేల్కొలిపాడు. బ్రేస్‌వెల్ వచ్చీ రాగానే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాదిన బ్రేస్‌వెల్ ఆతర్వాత మరో అఫ్రిది (అబ్బాస్) వేసిన ఓవర్లోనూ అదే సీన్‌ను రిపీట్ చేశాడు. ఆ ఓవర్లో బ్రేస్‌వెల్‌తో పాటు డారిల్ మిచెల్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్‌కు 23 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో డారిల్ మిచెల్ ఔట్ కావడంతో స్కోర్ మళ్లీ నెమ్మదించింది. ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయి. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో బ్రేస్‌వెల్ మరోసారి విరుచుకుపడటంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 220 పరుగుల వద్ద ముగిసింది. 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన బ్రేస్‌వెల్ అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్ 24, డారిల్ మిచెల్ 29, నీషమ్ 3, హే 3 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20 ఇది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తొలి రెండు న్యూజిలాండ్ గెలువగా.. మూడో టీ20లో పాక్ విజయం సాధించింది. 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. -
నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్
పాకిస్తాన్ యువ బ్యాటర్ హసన్ నవాజ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. మూడో టీ20లో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని అన్నాడు. పాక్ గెలుపులో క్రెడిట్ మొత్తం అతడికే ఇవ్వాలని పేర్కొన్నాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. మొదటి రెండు మ్యాచ్‌లలో ఆతిథ్య కివీస్ విజయం సాధించింది. అయితే, శుక్రవారం జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అక్లాండ్ వేదికగా టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేసింది. 204 పరుగులకు ఆలౌట్‌ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మార్క్ చాప్మన్ (44 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కెప్టెన్ బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలా 2 వికెట్లు తీశారు.ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 16 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు నాటౌట్) కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా... కెప్టెన్ సల్మాన్ ఆఘా (31 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొహమ్మద్ హరీస్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ ఒక వికెట్ పడగొట్టాడు.రెండు డకౌట్ల తర్వాత... నవాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్... తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినా మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచి మూడో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వగా... తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు. అతడి దూకుడుతో భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తొలి ఓవర్లో రెండు సిక్సర్లతో హెచ్చరికలు జారీచేసిన హరీస్... రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. మొదట హరీస్‌కు అండగా నిలిచిన నవాజ్... ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం హరీస్ అవుట్ కాగా... పవర్ ప్లే (6 ఓవర్లలో) ముగిసేసరికి పాకిస్తాన్ 75/1తో నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. 2016లో ఇంగ్లండ్‌పై చేసిన 73 పరుగులు రెండో స్థానానికి చేరింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా రాకతో పాక్ దూకుడు మరింత పెరిగింది. వీలు చిక్కినప్పుడల్లా నవాజ్ సిక్సర్లతో చెలరేగగా... అతడికి సల్మాన్ అండగా నిలిచాడు. ఈ క్రమంలో నవాజ్ 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఇదే వేగవంతమైన శతకం. 2021లో దక్షిణాఫ్రికాపై బాబర్ ఆజమ్ (49 బంతుల్లో) చేసిన సెంచరీ రెండో స్థానంలో ఉంది. ‘గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యా. ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యా. దీంతో బాగా ఒత్తిడికి గురయ్యా. అయినా మేనేజ్మెంట్ నాకు మరో అవకాశం ఇచ్చింది.తొలి పరుగు చేసినప్పుడు భారం తీరినట్లు అనిపించింది. దీంతో స్వేచ్ఛగా ఆడి జట్టును గెలిపించాలనుకున్నా’ అని నవాజ్ అన్నాడు. ఇక నవాజ్, సల్మాన్ అబేధ్యమైన రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోపు పూర్తి చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఓవరాల్‌గా పాకిస్తాన్‌కు ఇది రెండో పెద్ద ఛేదన. కెప్టెన్ సల్మాన్ కూడా ఈ మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు.అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫలితం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నవాజ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అతడు నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విషయంలో అతడికి తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి.మేము 20 ఓవర్ల పాటు ఆడలేకపోయాం. పొట్టి క్రికెట్లో ఇదొక నేరం లాంటిదే. చాప్మన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ అతడు అవుటైన తర్వాత మేము మరో రెండు ఓవర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 230 పరుగుల మేర సాధించేవాళ్లం. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో కనీసం మరో పదిహేను పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది’’ అని పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ -
న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు జాక్‌పాట్
నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ జాక్‌పాట్ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్ రన్నరప్ సధరన్ బ్రేవ్ దక్కించుకోగా.. నూర్ అహ్మద్‌ను మాంచెస్టర్ ఒరిజినల్స్ సొంతం చేసుకుంది. బ్రేస్‌వెల్ త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈసారి డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్, నూర్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ను లండన్ స్పిరిట్.. మరో ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను ట్రెంట్ రాకెట్స్ సొంతం చేసుకున్నాయి. నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్ సైనింగ్ ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ది. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్ స్పిరిట్ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్, ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది. ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మహిళల డ్రాఫ్ట్ విషయానికొస్తే.. సోఫి డివైన్, జార్జియా వాల్, పెయిజ్ స్కోల్ఫీల్డ్ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్ డ్రాఫ్ట్ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్ లీగ్-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ తలపడతాయి.హండ్రెల్ లీగ్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీల జట్లు..బర్మింగ్హమ్ ఫీనిక్స్పురుషుల విభాగం: లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్*, జాకబ్ బెథెల్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే*, డాన్ మౌస్లీ, టిమ్ సౌథీ*, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, అనేరిన్ డోనాల్డ్, జో క్లార్క్, హ్యారీ మూర్, టామ్ హెల్మ్.మహిళలు: ఎల్లీస్ పెర్రీ*, అమీ జోన్స్, ఎమిలీ ఆర్లాట్, మేగాన్ షుట్*, హన్నా బేకర్, చారిస్ పావెలీ, స్టెర్ కాలిస్, ఐల్సా లిస్టర్, జార్జియా వాల్*, ఎమ్మా లాంబ్, జార్జీ బోయ్స్, మేరీ కెల్లీ, బెథాన్ ఎల్లిస్.లండన్ స్పిరిట్పురుషుల విభాగం: జామీ స్మిత్, లియామ్ డాసన్, డేనియల్ వొరాల్, కేన్ విలియమ్సన్*, రిచర్డ్ గ్లీసన్, ఓల్లీ స్టోన్, ఓల్లీ పోప్, కీటన్ జెన్నింగ్స్, జేమీ ఓవర్టన్, డేవిడ్ వార్నర్*, ల్యూక్ వుడ్, ఆష్టన్ టర్నర్*, జాఫర్ చోహన్, వేన్ మాడ్సెన్.మహిళలు: గ్రేస్ హారిస్*, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, చార్లీ డీన్, దీప్తి శర్మ*, జార్జియా రెడ్మైన్*, ఎవా గ్రే, కార్డెలియా గ్రిఫిత్, తారా నోరిస్, సోఫీ మున్రో, హీథర్ నైట్, ఇస్సీ వాంగ్, రెబెక్కా టైసన్.మాంచెస్టర్ ఒరిజినల్స్పురుషులు: జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్*, మాథ్యూ హర్స్ట్, స్కాట్ క్యూరీ, జోష్ టంగ్, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్‌వాల్, నూర్ అహ్మద్*, రాచిన్ రవీంద్ర*, లూయిస్ గ్రెగొరీ, బెన్ మెక్‌కిన్నీ, జార్జ్ గార్టన్.మహిళలు: అమేలియా కెర్*, సోఫీ ఎక్లెస్టోన్, బెత్ మూనీ*, లారెన్ ఫైలర్, మహికా గౌర్, ఈవ్ జోన్స్, కాథరిన్ బ్రైస్, ఫై మోరిస్, డేనియల్ గ్రెగొరీ, డియాండ్రా డాటిన్*, సెరెన్ స్మాల్, ఎల్లా మెక్‌కాఘన్, ఆలిస్ మోనాఘన్.నార్తర్న్ సూపర్చార్జర్స్పురుషుల విభాగం: హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, డేవిడ్ మిల్లర్*, మిచెల్ సాంట్నర్*, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, బెన్ డ్వార్షుయిస్*, గ్రాహం క్లార్క్, పాట్ బ్రౌన్, టామ్ లావెస్, జాక్ క్రాలే, డాన్ లారెన్స్, మైఖేల్ పెప్పర్, డేవిడ్ మలన్.మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్*, అన్నాబెల్ సదర్లాండ్*, జార్జియా వేర్హామ్*, కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, హోలీ ఆర్మిటేజ్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, గ్రేస్ బలింగర్, డేవినా పెర్రిన్, గ్రేస్ పాట్స్, లూసీ హిఘం, ఎల్లా క్లారిడ్జ్.ఓవల్ ఇన్విన్సిబుల్స్పురుషుల విభాగం: సామ్ కర్రాన్, విల్ జాక్స్, టామ్ కర్రాన్, జోర్డాన్ కాక్స్, రషీద్ ఖాన్*, సాకిబ్ మహమూద్, సామ్ బిల్లింగ్స్, గస్ అట్కిన్సన్, నాథన్ సౌటర్, డోనోవన్ ఫెర్రీరా*, తవాండా ముయేయ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్*, మైల్స్ హామండ్.మహిళలు: మారిజాన్ కాప్*, ఆలిస్ కాప్సే, లారెన్ విన్ఫీల్డ్-హిల్, అమాండా-జేడ్ వెల్లింగ్టన్*, మెగ్ లాన్నింగ్*, టాష్ ఫారెంట్, రైనా మెక్‌డోనాల్డ్-గే, సోఫియా స్మాల్, జో గార్డ్నర్, రాచెల్ స్లేటర్, పైజ్ స్కోల్ఫీల్డ్, ఫోబ్ ఫ్రాంక్లిన్, కలియా మూర్.సదరన్ బ్రేవ్పురుషులు: జేమ్స్ విన్స్, జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, క్రిస్ జోర్డాన్, ఫాఫ్ డు ప్లెసిస్*, ల్యూస్ డు ప్లూయ్, క్రెయిగ్ ఓవర్టన్, లారీ ఎవాన్స్, ఫిన్ అల్లెన్*, డానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్, మైఖేల్ బ్రేస్‌వెల్*, రీస్ టోప్లీ, జోర్డాన్ థాంప్సన్.మహిళలు: లారా వోల్వార్డ్*, డానీ వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్*, క్లోయ్ ట్రయాన్*, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం.ట్రెంట్ రాకెట్స్పురుషుల విభాగం: జో రూట్, మార్కస్ స్టోయినిస్*, టామ్ బాంటన్, జాన్ టర్నర్, సామ్ కుక్, సామ్ హైన్, టామ్ అల్సోప్, కాల్విన్ హారిసన్, డేవిడ్ విల్లీ, లాకీ ఫెర్గూసన్*, మాక్స్ హోల్డెన్, జార్జ్ లిండే*, ఆడమ్ హోస్, రెహాన్ అహ్మద్.మహిళలు: ఆష్ గార్డ్నర్*, నాట్ స్కైవర్-బ్రంట్, అలానా కింగ్*, హీథర్ గ్రాహం*, బ్రయోనీ స్మిత్, గ్రేస్ స్క్రీవెన్స్, కిర్స్టీ గోర్డాన్, అలెక్సా స్టోన్‌హౌస్, నటాషా వ్రైత్, కాసిడీ మెక్‌కార్తీ, జోడి గ్రూకాక్, ఎమ్మా జోన్స్, ఎల్లీ థ్రెల్కెల్డ్.వెల్ష్ ఫైర్పురుషుల విభాగం: క్రిస్ వోక్స్, స్టీవ్ స్మిత్*, జానీ బెయిర్‌స్టో, టామ్ కోహ్లర్-కాడ్మోర్, టామ్ అబెల్, ల్యూక్ వెల్స్, స్టీఫెన్ ఎస్కినాజీ, డేవిడ్ పేన్, పాల్ వాల్టర్, రిలే మెరెడిత్*, క్రిస్ గ్రీన్*, సైఫ్ జైబ్, జోష్ హల్, మాసన్ క్రేన్.మహిళలు: హేలీ మాథ్యూస్*, టామీ బ్యూమాంట్, జెస్ జోనాసెన్*, షబ్నిమ్ ఇస్మాయిల్*, సారా బ్రైస్, జార్జియా ఎల్విస్, ఫ్రెయా డేవిస్, జార్జియా డేవిస్, ఎమిలీ విండ్సర్, బెత్ లాంగ్స్టన్, సోఫియా డంక్లీ, కేటీ జార్జ్, కేటీ లెవిక్. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు రివార్డు.. న్యూజిలాండ్ కెప్టెన్‌గా బ్రేస్‌వెల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు గానూ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు రివార్డు లభించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బ్రేస్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ జాతీయ జట్టు పగ్గాలు చేపట్టడం బ్రేస్‌వెల్‌కు ఇది మొదటిసారి. గతేడాది బ్రేస్‌వెల్ ఇదే పాకిస్తాన్‌పై (పాకస్తాన్‌లో) ఓ సారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పడు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఈసారి కూడా పాక్‌తో జరుగబోయే సిరీస్ కోసం ఎంపిక చేసిన న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు లేరు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన న్యూజిలాండ్ జట్టులో నుంచి కేవలం ఏడుగురు మాత్రమే ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విశ్రాంతి తీసుకోవడంతో బ్రేస్‌వెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాక్‌తో సిరీస్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రతో పాటు స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఎంపిక కాలేదు. ఈ ముగ్గురికి న్యూజిలాండ్ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన పేసర్ లోకీ ఫెర్గూసన్ కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఫెర్గూసన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. విదేశీ లీగ్‌ల కమిట్మెంట్స్ కారణంగా గత సిరీస్‌కు దూరంగా ఉన్న టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, జేమ్స్ నీషమ్ పాక్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. లంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన పేసర్ బెన్ సియర్స్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా పేసర్లు కైల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కీ తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపికయ్యారు. కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల బ్రేస్‌వెల్ ఆనందం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవమని అన్నాడు. టీ20ల్లో పాక్ బలమైన ప్రత్యర్థి అని, వారిని ఎదుర్కొనేందుకు ఆతృతగా ఉన్నాయని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడటంతో ఆటగాళ్లు కాస్త నిరుత్సాపడ్డారని.. పాక్‌తో సిరీస్ సమయానికి మామూలు స్థితికి వస్తారని పేర్కొన్నాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా సాంట్నర్ లెగసీకి కొనసాగిస్తానని తెలిపాడు. కాగా, న్యూజిలాండ్‌లో పాక్ పర్యటన మార్చి 16న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధిన్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్) -
చెలరేగిన కివీస్ బౌలర్లు.. 236 పరుగులకే పరిమితైన బంగ్లాదేశ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లా టాపర్డర్‌ను దెబ్బతీశాడు. బ్రేస్‌వెల్‌ను ఎదుర్కోలేక బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ కివీ స్టార్ స్పిన్నర్ తన 10 ఓవర్ల కోటాలో 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధిస్తే సెమీస్‌కు ఆర్హత సాధిస్తుంది.న్యూజిలాండ్‌తో పాటు భారత్ కూడా అధికారికంగా గ్రూపు-ఎ నుంచి సెమీస్ అడుగుపెడుతోంది. భారత్ ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓడిపోతే, పాకిస్తాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. తమ సెమీస్ ఆశలను బంగ్లాపైనే పెట్టుకుంది. అయితే కివీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉండడంతో పాక్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టేట్లే కన్పిస్తోంది.చదవండి: అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్ -
కివీస్ జట్టు ప్రకటన: 18 నెలల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ?
అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. యువ ఫాస్ట్ బౌలర్లు విలియం ఓ'రూర్కే, బెన్ సియర్స్లకు తొలిసారి కివీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు వారిద్దరని ఎంపిక చేశారు. అదే విధంగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ మైఖల్ బ్రేస్‌వెల్ తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. బ్రేస్‌వెల్ చివరగా గతేడాది మార్చిలో కివీస్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. కాగా న్యూజిలాండ్ భారత్‌లోని నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. అనంతరం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంకకు కివీస్ జట్టు వెళ్లనుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.అఫ్గాన్, లంకతో సిరీస్‌లకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ -
Pak Vs NZ: ఉత్కంఠ పోరులో పాక్ చిత్తు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!
సొంతగడ్డపై పాకిస్తాన్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో స్వల్ప తేడాతో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-1తో పాక్‌పై పైచేయి సాధించింది.కాగా బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో పాక్ గెలిచింది.అయితే, మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్(36 బంతుల్లో 51), టామ్ బ్లండెల్ (15 బంతుల్లో 28), వన్‌డౌన్ బ్యాటర్ ఫాక్స్‌క్రాఫ్ట్(26 బంతుల్లో 34), కెప్టెన్ మిచెల్ బ్రాస్‌వెల్(20 బంతుల్లో 27) రాణించారు.పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. ఆమిర్, ఉసామా మిర్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ ఆమిర్, జమాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే సయీమ్ ఆయుబ్(20), బాబర్ ఆజం(5), ఉస్మాన్ ఖాన్(16) వికెట్లు కోల్పోయింది. అయితే, ఫఖర్ జమాన్ పట్టుదలగా నిలబడి 45 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఇఫ్తికర్ అహ్మద్(20 బంతుల్లో 23), ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు. కానీ ఆఖరి బంతికి పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఇమాద్ వసీం జెమ్మీ నీషం బౌలింగ్‌లో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓటమిపాలైంది. దీంతో లాహోర్ ప్రేక్షకుల హృదయాలు ముక్కలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 22 ఏళ్ల పేసర్ విలియం రూర్కీకి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఏప్రిల్ 18-27 మధ్యలో పాకిస్తాన్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 3) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ 15 మంది సభ్యుల బృందాన్ని పాకిస్తాన్‌కు పంపనుంది. ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్లు ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో న్యూజిలాండ్ సెలెక్టర్లు ద్వితియ శ్రేణి జట్టును పాక్‌కు పంపనున్నారు. ఈ జట్టుకు మైఖేల్ బ్రేస్‌వెల్ సారధ్యం వహించనున్నాడు. ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి లాంటి గుర్తింపు పొందిన ఆటగాళ్లు మినహా మిగతావన్నీ కొత్త ముఖాలే. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కని వారికి ఈ సిరీస్ కీలకంగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్‌లో రాణిస్తే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లు రావల్పిండిలో జరుగనుండగా.. ఆఖరి రెండు లాహోర్‌లో జరుగనున్నాయి. పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్కాన్చీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్క్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్), ఐష్ సోధి షెడ్యూల్.. తొలి టీ20: ఏప్రిల్ 18 (రావల్పిండి) రెండో టీ20: ఏప్రిల్ 20 (రావల్పిండి) మూడో టీ20: ఏప్రిల్ 21 (రావల్పిండి) నాలుగో టీ20: ఏప్రిల్ 25 (లాహోర్) ఐదో టీ20: ఏప్రిల్ 27 (లాహోర్) -
ఇదేం బంతిరా బాబు.. బ్యాటర్ అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయ భేరి మోగించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఫాలోఆన్ ఆడిన శ్రీలంక, తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెస్‌వేల్ రెండు, డాగ్ బ్రెస్‌వేల్ , హెన్రీ తలా వికెట్ సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆట సందర్భంగా ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 121 ఓవర్ వేసిన స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఓ బంతి.. భారీ గాలుల కారణంగా ఆనూహ్యంగా టర్న్ అయ్యి వైడ్‌గా వెళ్లింది. అతడు బౌలింగ్ వేసే సమయంలో ఒక్క సారిగా గాలి రావడంతో.. బంతి పిచ్‌కు చాలా దూరంగా పడింది. ఇది చూసిన శ్రీలంక బ్యాటర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని రోజులగా న్యూజిలాండ్‌లో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చదవండి: SL vs NZ: డబ్ల్యూటీసీ ఫైనల్ కాదు.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా! శ్రీలంకను చిత్తు చేసిన కివీస్ Just when you think you’ve seen it all in cricket. High winds so single end coverage in Wellington. Here’s the supporting evidence… pic.twitter.com/AzQerm4h9b — Rob Williams (@robwilliams_tv) March 20, 2023 -
IPL 2023: కివీస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ప్రకటించిన ఆర్సీబీ! ధర ఎంతంటే
IPL 2023- RCB- Michael Bracewell: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ ఐపీఎల్-2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్ స్థానంలో బ్రేస్‌వెల్ ఆర్సీబీకి ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐపీఎల్-2023లో విల్ జాక్స్ స్థానాన్ని న్యూజిలాండ్‌కు చెందిన మైకేల్ బ్రేస్‌వెల్ భర్తీ చేయనున్నాడు. 32 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ కివీస్ భారత పర్యటనలో టీ20 సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్. అదే విధంగా వన్డే మ్యాచ్‌లో 140 పరుగులతో అద్భుత పోరాటపటిమ కనబరిచాడు’’ అంటూ బ్రేస్‌వెల్‌కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో అతడి ఫొటో షేర్ చేసింది. లేట్ ఎంట్రీ.. అయినా.. కాగా ఎడమచేతి వాటం గల బ్యాటర్, రైట్ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన బ్రేస్‌వెల్ కివీస్ తరఫున 16 టీ20లు ఆడి 113 పరుగులు చేశాడు. అదే విధంగా 21 వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌తో వన్డేతో 2022లో 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఆల్‌రౌండర్.. ఈ ఏడాది మార్చి ఆరంభంలో చివరిసారిగా శ్రీలంకతో టెస్టు ఆడాడు. ఇదిలా ఉంటే.. విల్ జాక్స్‌ను ఆర్సీబీ 3.2 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతడు దూరం కావడంతో బ్రేస్‌వెల్‌కు అవకాశం ఇచ్చింది. కనీస ధర కోటితో వేలంలో తన పేరు నమోదు చేసుకున్న బ్రేస్‌వెల్‌ను అదే ధరతో ఆర్సీబీ సొంతం చేసుకోనుంది. కాగా బ్రేస్‌వెల్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్ కావడం విశేషం. ఇక ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌తో ఆర్సీబీ ఈ ఏడాది తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్ Ravindra Jadeja: నా దృష్టిలో నిజమైన హీరో జడేజానే! నువ్వేనా ఈ మాట అన్నది? నిజమా! 🔊 ANNOUNCEMENT 🔊 Michael Bracewell of New Zealand will replace Will Jacks for #IPL2023. The 32-year-old all-rounder was the top wicket taker for Kiwis during the T20I series in India, and scored a fighting 140 in an ODI game. 🙌#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/qO0fhP5LeY — Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2023 -
ఆర్సీబీలోకి విధ్వంసకర ఆల్‌రౌండర్.. ఇక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలే!
ఐపీఎల్-2023 సీజన్‌కు ఆరంభానికి ముందు రాయల్ ఛాలంజర్స్ బెంగళూరుకు మరో బిగ్ షాక్ తగిలింది. వేలంలో రూ.3.2 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లీష్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ జాక్స్.. సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అతడు ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. ఆర్సీబీలోకి మైఖేల్ బ్రేస్‌వెల్.. ఇక విల్ జాక్స్ స్థానాన్ని న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌తో భర్తీ చేయాలని ఆర్సీబీ మెనెజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రేస్‌వెల్‌తో ఆర్సీబీ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కాగా బ్రెస్‌వెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కివీస్ భారత పర్యటనలో భాగంగా బ్రేస్‌వెల్ అద్భుతంగా రాణించాడు. హైదరాబాద్ వేదికగా టీమిండియా జరిగిన తొలి వన్డేలో బ్రెస్‌వెల్.. కేవలం 78 బంతుల్లోనే 140 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అదే విధంగా బంతితో కూడా బ్రెస్‌వెల్ అకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బ్రేస్‌వెల్‌పై ఆర్సీబీ కన్నేసింది. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఫీల్డింగ్ కోచ్‌గా మారిన ద్రవిడ్! వీడియో వైరల్ -
ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా?
New Zealand vs England, 2nd Test: రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తోంది న్యూజిలాండ్. పర్యాటక ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆతిథ్య కివీస్ 209 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్ ఆడించింది. అనూహ్య రీతిలో అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని ఇంగ్లండ్‌కు షాకిచ్చింది న్యూజిలాండ్. ఓపెనర్లు టామ్ లాథమ్(83), డెవాన్ కాన్వే(61)లకు తోడు వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బ్యాట్ ఝులిపించడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. కేన్ 132 పరుగులు చేయగా.. డారిల్ మిచెల్(54), టామ్ బ్లండెల్(90) కూడా అర్ధ శతకాలతో రాణించడంతో 483 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ రనౌట్ అయిన తీరు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మరీ ఇంత బద్ధకమా? 158.2 ఓవర్లో ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో బ్లండెల్ షాట్ బాది... బ్రేస్‌వెల్‌తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, మూడో పరుగుకు ఆస్కారం ఉండటంతో మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తగా.. బ్రేస్‌వెల్ రనౌట్ అయ్యాడు. క్రీజు దగ్గరికి చేరినప్పటికీ బ్రేస్‌వెల్ బద్దకం ప్రదర్శించాడు. బ్యాట్, బ్రేస్‌వెల్ కాలు గాల్లోనే ఉండటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ లిప్తపాటులో బంతిని వికెట్లకు గిరాటేశాడు. దీంతో కివీస్ మరో వికెట్ కోల్పోయింది. అయితే, విలియమ్సన్ సహా మిగతా బ్యాటర్లు జట్టును గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రదర్శించగా.. బ్రేస్‌వెల్ ఇలా రనౌట్ కావడంతో ఫ్యాన్స్ అతడిని విమర్శిస్తున్నారు. ఇంత బద్దకమా.. ఇంత తేలికగా వికెట్ పారేసుకోవడం ఏమిటి? నీ తీరు అస్సలు బాగోలేదు’’ అని మండిపడుతున్నారు. రెండు టెస్టుల్లోనూ విఫలం బ్రేస్‌వెల్ తొలి టెస్టులో 7 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి వైఫల్యాన్ని కొనసాగించాడు. ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన కివీస్.. ఇంగ్లండ్‌కు 258 పరుగుల టార్గెట్ విధించింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. చదవండి: Kane Williamson: పార్ట్‌టైమ్ పేసర్ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా.. పాపం కేన్ మామ! వీడియో వైరల్ Ind Vs Aus 3rd Test: నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు! కళ్లన్నీ అతడిపైనే.. This is why you run your bat in 😬 A wicket manufactured from out of nowhere! #NZvENG pic.twitter.com/i52FQVyw2H — Cricket on BT Sport (@btsportcricket) February 27, 2023 -
గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన మూడో టీ20లో 168 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేవలం 63 బంతులు ఎదుర్కొన్న గిల్ 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరచగా.. అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మావి తలా రెండు వికెట్లు సాధించాడు. కివిస్ బ్యాటర్లలో మిచెల్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంచలన బంతితో మెరిసిన ఉమ్రాన్ ఈ మ్యాచ్‌లో భారత స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చేరిగాడు. తన స్పీడ్‌తో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు బ్రేస్‌వెల్‌ను ఓ అద్భుతమైన బంతితో మాలిక్ పెవిలియన్‌కు పంపాడు. గంటకు 150 కిమీ వేగంతో మాలిక్ వేసిన డెలివరీని బ్రేస్‌వెల్ ఆపే లోపే బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. ఉమ్రాన్ స్పీడ్‌కు స్టంప్‌పైన ఉన్న బెయిల్ ఎగిరి ఏకంగా 30 యార్డ్ సర్కిల్ బయటపడటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మాలిక్ 9 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. Umran Malik comes into the attack and Michael Bracewell is bowled for 8 runs. A beauty of a delivery from Umran 💥 Live - https://t.co/1uCKYafzzD #INDvNZ @mastercardindia pic.twitter.com/nfCaYVch4b — BCCI (@BCCI) February 1, 2023 చదవండి: Suryakumar: ఒకే స్టైల్లో రెండు స్టన్నింగ్ క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు -
కుటుంబమంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాత్మకంగా! ‘ఈరోజు’ నీది కాదంతే!
Who Is Michael Bracewell: మైకేల్ బ్రేస్‌వెల్.. గతేడాది నెదర్లాండ్స్‌తో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం.. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.. అయితే, ఒక వికెట్ మాత్రం తీయగలిగాడు ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్. అదే ఏడాది జూన్‌లో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుతో అర్ధ శతకం చేసే అవకాశం చేజార్చుకున్నాడు. అయితే, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20లలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల బ్రేస్‌వెల్.. ఇప్పటి వరకు తన కెరీర్లో సాధించినవి రెండు సెంచరీలు. అది కూడా వన్డేల్లో! మొదటిది ‘పసికూన’ ఐర్లాండ్‌పై! మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఐరిష్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల ‘భారీ’ స్కోరు చేసింది. పర్యాటక కివీస్‌కు అంత తేలికగా గెలిచే అవకాశమూ ఇవ్వలేదు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మినహా అర్ధ శతకం(51) మినహా టాపార్డర్‌లో అందరూ చేతులెత్తేశారు. ఒక్క వికెట్ తేడాతో.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రేస్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 127 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బ్రేస్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ చలువ వల్ల న్యూజిలాండ్ ఎట్టకేలకు ఒక్క వికెట్ తేడాతో గెలుపొందగలిగింది. ఆ తదుపరి రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి సిరీస్‌ను గెలిచింది. బ్యాట్ ఝులిపించి.. ఇక రెండో వన్డే సెంచరీ.. కివీస్ మ్యాచ్ ఓడినా.. బ్రేస్‌వెల్ కెరీర్లో మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. సొంతడ్డపై.. పటిష్టమైన టీమిండియాపై.. అదీ కొండంత లక్ష్యం ముందున్న వేళ.. సహచరులు వరుసగా 40, 10, 18, 9, 24, 11 పరుగులకే పెవిలియన్ చేరిన తరుణంలో.. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ బ్రేస్‌వెల్ బ్యాట్ ఝులిపించాడు. ఫలితం తారుమారయ్యేదే! 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 140 పరుగులతో చెలరేగాడు. సులువుగానే మ్యాచ్ గెలుస్తామని భావించిన టీమిండియాకు చెమటలు పట్టించాడు. ఓటమిని ఒప్పుకోలేక ఆఖరి ఓవర్ వరకు అసాధారణ పోరాటం చేశాడు. నిజానికి శార్దూల్ ఠాకూర్ గనుక బ్రేస్‌వెల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే ఉప్పల్ మ్యాచ్ ఫలితం తారుమారయ్యేదే! అదృష్టవశాత్తూ అలా జరుగలేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా అంతా ఫిదా అయితే, ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీకి ఫిదా అయినట్లే.. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా.. మ్యాచ్ మన నుంచి లాగేసుకుంటాడనే భయం వెంటాడినా టీమిండియా అభిమానులు సైతం అతడిని ప్రశసించకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు. బ్రేస్‌వెల్ పోరాటపటిమకు మన ఆటగాళ్లు కూడా ముగ్ధులుకాకుండా ఉండలేకపోయారు. కానీ.. దురదృష్టం బ్రేస్‌వెల్‌ను వెక్కిరించింది. వెరసి జట్టు ఓటమిపాలైంది. దీంతో కివీస్ అభిమానులు హృదయాలు ముక్కలయ్యాయి. బ్రేస్‌వెల్ పరిస్థితి కూడా అదే! ‘‘భారీ స్కోరు చేసిన టీమిండియాను ఓడించడం అంత తేలికేం కాదు. కానీ దురదృష్టవశాత్తూ మేము ఈరోజు పని పూర్తి చేయలేకపోయాం. ఆఖరి వరకు పోరాడాం. కానీ.. ఈరోజు నాది కాదు.. నిజంగా ఈ రోజు నాది కాకుండా పోయింది’’ అని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశాడు. క్రికెటర్ల కుటుంబం.. లేట్ అయినా.. మైకేల్ బ్రేస్‌వెల్ తండ్రి మార్క్ కూడా క్రికెటరే! డొమెస్టిక్ లెవల్లో ఆడాడు. అంతేకాదు మైకేల్ అంకుల్స్ బ్రెండన్ బ్రేస్‌వెల్, జాన్ బ్రేస్‌వెల్‌లు కూడా క్రికెట్ ఆడినవాళ్లే. ఇక మైకేల్ కజిన్ డగ్ బ్రేస్‌వెల్ కూడా న్యూజిలాండ్‌కు ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి అండర్-19 జట్టు ఆడారు. అయితే, డగ్ 2011లో ఎంట్రీ ఇవ్వగా.. మైకేల్‌కు చాలా కాలం పట్టింది. ఉప్పల్ మ్యాచ్‌లో డగ్ బెంచ్‌కు పరిమితం కాగా.. మైకేల్ ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఇదిలా ఉంటే.. చిన్ననాటి నుంచే క్రికెట్ వాతావరణంలో పెరిగిన మైకేల్‌కు ఐదేళ్ల వయసు నుంచే ఆటపై మక్కువ పెరిగిందట. అయితే, క్రికెట్‌తో పాటు రగ్బీ, బాస్కెట్‌బాల్‌పై కూడా అతడికి ఇష్టం ఎక్కువే. బ్రేస్‌వెల్ మరో కజిన్ మిలానీ బ్రేస్‌వెల్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు. ఇంట్లో ఎంతమంది క్రికెటర్లు ఉన్నా మైకేల్ బ్రేస్‌వెల్‌కు మాత్రం ఆసీస్ దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ ఆరాధ్య ఆటగాడు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రేస్‌వెల్ 2019లో లారెన్ రాల్స్టన్ను పెళ్లాడాడు. ఈ జంటకు కుమారుడు లెనాక్స్ సంతానం. నాన్న మాటే వేదం 1991 ఫిబ్రవరి 14న వయారరపలో జన్మించిన మైకేల్ బ్రేస్‌వెల్.. ఫస్ట్‌క్లాస్‌లో అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆలస్యమైనా.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నాడు. ఆడిన నాలుగో వన్డేలోనే శతకం బాది సత్తా చాటాడు. తండ్రి మాటకు విలువనిస్తాడు బ్రేస్‌వెల్. ‘‘నేను అందరితో అంత తొందరగా కలిసిపోలేను. అయితే, కాస్త సమయం దొరికినా మా నాన్నతో మాట్లాడుతూనే ఉంటా. నాకు రెండేళ్ల వయసున్నప్పటి నుంచి ఆయన నాకు సలహాలు ఇస్తున్నారు. నేను వాటిని పాటిస్తున్నా’’ అని బ్రేస్‌వెల్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా.. Hashim Amla Facts In Telugu: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు -
కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. సిరాజ్ భావోద్వేగ ట్వీట్
India vs New Zealand, 1st ODI- Mohammed Siraj: ఉప్పల్ స్టేడియంలో పరుగుల ఉప్పెన ఎగిసింది. మధ్యాహ్నం ఎండలో.. సాయంత్రం చలిగాలిలో... రాత్రి చుక్కల ఆకాశంలో... అభిమానులు ప్రతి పరుగునూ, ప్రతి బంతినీ ఆస్వాదించారు. ముందుగా శుబ్‌మన్ గిల్ పరుగుల వరదకు... అనంతరం ‘లోకల్ బాయ్’ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు... చివర్లో న్యూజిలాండ్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ పోరాట పటిమకు ముగ్ధులయ్యారు. వెరసీ.. హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ సూపర్ హిట్ అయ్యింది. నువ్వా.. నేనా అంటూ చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠ పోరు కొనసాగింది. అభిమానులు వెచ్చించిన ప్రతి పైసాకు ఫుల్ వినోదం లభించింది. మ్యాచ్‌ను వీక్షిస్తున్న సిరాజ్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు భాగ్యనగరంలో న్యూజిలాండ్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోలేదు. ఈసారీ అదే ఆనవాయితీని టీమ్ ఇండియా కొనసాగించింది. తన అజేయ రికార్డును నిలబెట్టుకుంది. 12 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. భావోద్వేగ ట్వీట్ ఇక ఈ మ్యాచ్‌లో లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 46 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు తీశాడు. కాగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సిరాజ్‌కు టీమిండియా తరఫున ఇది తొలి మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం సిరాజ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నా కుటుంబ సభ్యులు, స్నేహితుల కోలాహలం నడుమ సొంతమైదానంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఉప్పల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సహా న్యూజిలాండ్ బ్యాటర్ బ్రేస్‌వెల్‌ను సిరాజ్ ఈ సందర్భంగా అభినందించాడు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ IND vs NZ: బ్రెస్‌వెల్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా IND vs NZ: టీమిండియాకు ‘శుబ్’ ఘడియలు వచ్చేశాయి.. The @mdsirajofficial effect! 🔥🔥 Middle stump out of the ground 👌 Live - https://t.co/IQq47h2W47 #INDvNZ @mastercardindia pic.twitter.com/mxYajNShmC — BCCI (@BCCI) January 18, 2023 Indeed a special feeling to play my first international match at my home ground while my family & friends were cheering for me. Long way ahead 🙏 and top knock today @ShubmanGill. Even Bracewell 👏 pic.twitter.com/ciRNUl9OFb — Mohammed Siraj (@mdsirajofficial) January 18, 2023 -
టీమిండియాను వణికించిన మైఖేల్ బ్రేస్‌వెల్ (ఫొటోలు)
-
నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత్ గెలుపొందినప్పటికీ.. న్యూజిలాండ్ లోయార్డర్ బ్యాటర్ మైఖేల్ బ్రెస్‌వెల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో భయపెట్టాడు. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ఓ దశలో 200 పరుగులలోపే ఆలౌట్ అవుతందని అంతా భావించారు. కానీ బ్రెస్‌వెల్ తన పోరాట పటిమతో న్యూజిలాండ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకువచ్చాడు. ఆఖరి ఓవర్లో కివీస్ విజయానికి 20 పరుగుల కావల్సిన నేపథ్యంలో.. శార్థూల్ ఠాకూర్‌కు రోహిత్ శర్మ బంతిని అందించాడు. తొలి బంతినే బ్రెస్‌వెల్ స్టాండ్స్‌కు తరలించాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్క సారిగా నిశ్భబ్దం అయిపోయింది. అనంతరం రెండో బంతిని శార్థూల్ వైడ్‌గా వేశాడు. న్యూజిలాండ్ విజయానికి 5 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో శార్థూల్ అద్భుతమైన బంతితో బ్రెస్‌వెల్‌ను ఔట్ చేశాడు. దీంతో అంతా ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం 78 బంతులు ఎదుర్కొన్న బ్రెస్‌వెల్ 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్, బ్రెస్వెల్పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే బ్రెస్‌వెల్ బ్యాటింగ్ చేసే విధానం, అతడి షాట్ సెలక్షన్ అద్భుతం. ఓ దశలో ఓటమి తప్పదని అనుకున్నాను. ఈ మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేస్తే మేము విజయం మాదేనని, బంతితో రాణించకపోతే కష్టమవుతుందనే విషయం మాకు ముందే తెలుసు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. టాస్ సమయంలోనే నేను చెప్పాను. బౌలర్లకు సవాలు విసిరేందుకు తొలుత బ్యాటింగ్ తీసుకున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. డెత్‌ఓవర్లలో బౌలర్లు తెలిపోవడం మళ్లీ పునరావృతమైంది" అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక గిల్ గురించి మాట్లాడుతూ.. "గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఈ సిరీస్‌తో పాటు శ్రీలంక సిరీస్‌కు కూడా అతడికి జట్టులో అవకాశమిచ్చాం. అదే విధంగా సిరాజ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం వన్డే క్రికెట్లోనే కాకుండా రెడ్‌బాల్, టీ20 ఫార్మాట్లలో కూడా సిరాజ్ అదరగొడుతున్నాడు అని హిట్‌మ్యాన్ అన్నాడు. చదవండి: IND vs NZ: బ్రెస్‌వెల్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా -
బ్రెస్‌వెల్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా
హైదరాబాద్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓ దశలో టీమిండియా సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అటువంటి సమయంలో న్యూజిలాండ్ లోయార్డర్ బ్యాటర్ మైఖేల్ బ్రెస్‌వెల్ తన సంచలన ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 78 బంతులు ఎదుర్కొన్న బ్రెస్‌వెల్ 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు సాధించాడు. అయితే ఆఖరి ఓవర్లో శార్థూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రెస్‌వెల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఛేజింగ్‌లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా లోయార్డర్‌లో(ఏడో లేదా అంతకంటే తక్కువ)బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన మూడో ఆటగాడిగా శ్రీలంక ఆల్‌రౌండర్ తిషార పెరీరాతో కలిసి బ్రెస్‌వెల్ సంయుక్తంగా నిలిచాడు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్
ఎవరన్నారు వన్డేలకు కాలం చెల్లిందని... ఎవరన్నారు 100 ఓవర్లు చూడటమంటే బోరింగ్, సమయం వృథా అని... హైదరాబాద్ స్టేడియంలో బుధవారం మ్యాచ్ చూసిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే... భారీగా పరుగులు, సిక్సర్ల వరద, రికార్డులు, ఉత్కంఠ, ఉద్వేగం... ఒక్కటేమిటి అన్ని భావాలు ఉప్పల్ మైదానంలో కనిపించాయి. అతి సునాయాస విజయం అనుకున్నది కాస్తా ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. శుబ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ సాధించి అరుదైన ఆటగాళ్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకొని తొలి సగం ఆటలో హైలైట్‌గా నిలిచాడు. అయితే భారత్ భారీ స్కోరు చేయగానే గెలుపు ఖాయం కాలేదు. 21.2 ఓవర్లలో ఏకంగా 219 పరుగులు చేయాల్సిన సుదూర లక్ష్యం ముందుండగా... న్యూజిలాండ్ టి20 తరహాలో మెరుపు షాట్లతో పోరాడింది. మైకేల్ బ్రేస్‌వెల్ వీర బాదుడుకు భారత శిబిరంలో అలజడి రేగింది. ఒకదశలో టీమిండియా ఓటమి దిశగా కూడా వెళుతున్నట్లు అనిపించింది. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... రెండో బంతికి ఆఖరి వికెట్ తీసి భారత్ ఊపిరి పీల్చుకుంది. మొత్తంగా అభిమానులకు ఫుల్ వినోదం అందింది. సాక్షి, హైదరాబాద్: హోరాహోరీ సమరంలో పైచేయి సాధించిన భారత్ వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం చివరి ఓవర్ వరకు ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. మైకేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా, మిచెల్ సాన్‌ట్నర్ (45 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 17 ఓవర్లలోనే 162 పరుగులు జోడించడం విశేషం. సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన పేసర్ మొహమ్మద్ సిరాజ్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లోని రెండో వన్డే ఈనెల 21న రాయ్‌పూర్‌లో జరుగుతుంది. కోహ్లి విఫలం... భారత్‌కు రోహిత్ శర్మ (38 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్ మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు సాధించడంతో తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. అయితే తక్కువ వ్యవధిలో రోహిత్, కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5)లను అవుట్ చేసి న్యూజిలాండ్ ఆధిక్యం ప్రదర్శించింది. మరోవైపు గిల్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (38 బంతుల్లో 28; 3 ఫోర్లు) తగిన సహకారం అందించారు. గిల్ నాలుగో వికెట్‌కు సూర్యతో 65 పరుగులు, ఐదో వికెట్‌కు హార్దిక్‌తో 74 పరుగులు జోడించాడు. కవర్స్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి సూర్య వెనుదిరగ్గా... వివాదాస్పద రీతిలో హార్దిక్ అవుటయ్యాడు. బంతి హార్దిక్ బ్యాట్‌ను తాకకుండానే కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లుగా, కీపర్ చేతులతోనే బెయిల్స్ కదిలినట్లుగా టీవీ రీప్లేలో కనిపించింది. అయితే దీనిపై స్పష్టత లేకపోగా, హార్దిక్‌ను అంపైర్ బౌల్డ్‌గా ప్రకటించాడు. 40 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 251 పరుగులకు చేరింది. అయితే కివీస్ బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. ఒక దశలో 40–47 ఓవర్ల మధ్య ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే వచ్చాయి. అయితే చివర్లో గిల్ సునామీ బ్యాటింగ్ ఒక్కసారిగా ఆటను మార్చేసింది. చివరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు సాధించింది. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే... గిల్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. 45 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కీపర్ లాథమ్, అదే బంతికి స్టంపింగ్ చేసే సునాయాస అవకాశాన్ని కూడా చేజార్చాడు. ఆ తర్వాత షిప్లీ తన బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ వదిలేసినప్పుడు గిల్ స్కోరు 122 పరుగులు. మెరుపు భాగస్వామ్యం.... భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మొదటి నుంచీ తడబడింది. ఏ దశలోనూ టీమ్ గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించలేదు. ఆరంభంలోనే ఒకదశలో వరుసగా 23 బంతుల పాటు కివీస్ పరుగు తీయలేకపోయింది. ఫిన్ అలెన్ (39 బంతుల్లో 40; 7 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం స్వేచ్ఛగా ఆడుతూ హార్దిక్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, సిక్స్ కొట్టడం విశేషం. అనంతరం మిడిలార్డర్లో 19 పరుగుల వ్యవధిలో జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞుడైన కెప్టెన్ టామ్ లాథమ్ (24) కూడా ప్రభావం చూపలేకపోయాడు. స్కోరు 131/6కు చేరడంతో కివీస్ కుప్పకూలేందుకు ఎంతో సమయం లేదనిపించింది. అయితే ఈ దశలో బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్ భారత బౌలర్లను ఆడుకున్నారు. కొరకరాని కొయ్యలుగా మారిపోయిన వీరిద్దరు చక్కటి షాట్లతో, సమన్వయంతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. సాన్‌ట్నర్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, 57 బంతుల్లోనే బ్రేస్‌వెల్ శతకం అందుకున్నాడు.ఎట్టకేలకు 17 ఓవర్ల భాగస్వామ్యం తర్వాత సాన్ట్నర్ను సిరాజ్ అవుట్ చేయడంతో భారత్ ఊరట చెందింది. అయితే మరో ఎండ్‌లో పోరాటం కొనసాగించిన బ్రేస్‌వెల్ విజయానికి చేరువగా తీసుకు రాగలిగాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మిచెల్ (బి) టక్నర్ 34; గిల్ (సి) ఫిలిప్స్ (బి) షిప్లీ 208; కోహ్లి (బి) సాన్‌ట్నర్ 8; ఇషాన్ కిషన్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 5; సూర్యకుమార్ (సి) సాన్‌ట్నర్ (బి) మిచెల్ 31; హార్దిక్ (బి) మిచెల్ 28; సుందర్ (ఎల్బీ) (బి) షిప్లీ 12; శార్దుల్ (రనౌట్) 3; కుల్దీప్ (నాటౌట్) 5; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 349. వికెట్ల పతనం: 1–60; 2–88; 3–110; 4–175; 5–249; 6–292; 7–302; 8–345. బౌలింగ్: షిప్లీ 9–0–74–2, ఫెర్గూసన్ 10–0–77–1, టిక్నర్ 10–0–69–1, సాన్‌ట్నర్ 10–0–56–1, బ్రేస్‌వెల్ 6–0–43–0, మిచెల్ 5–0–30–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి) (సబ్) షహబాజ్ (బి) శార్దుల్ 40; కాన్వే (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 10; నికోల్స్ (బి) కుల్దీప్ 18; మిచెల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 9; లాథమ్ (సి) సుందర్ (బి) సిరాజ్ 24; ఫిలిప్స్ (బి) షమీ 11; బ్రేస్‌వెల్ (ఎల్బీ) (బి) శార్దుల్ 140; సాన్‌ట్నర్ (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 57; షిప్లీ (బి) సిరాజ్ 0; ఫెర్గూసన్ (సి) గిల్ (బి) హార్దిక్ 8; టిక్నర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 337 వికెట్ల పతనం: 1–28, 2–70, 3–78, 4–89, 5–110, 6–131, 7–293, 8–294, 9–328, 10–337. బౌలింగ్: షమీ 10–1–69–1, సిరాజ్ 10–2–46–4, హార్దిక్ 7–0–70–1, కుల్దీప్ 8–1–43–2, శార్దుల్ 7.2–0–54–2, సుందర్ 7–0–50–0. –సాక్షి క్రీడా ప్రతినిధి -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన బ్రేస్‌వెల్..
3 వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఓ దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుండగా, మైఖేల్ బ్రేస్‌వెల్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో టీమిండియాను గడగడలాడిస్తున్నాడు. అతనికి జతగా మరో ఎండ్‌లో మిచెల్ సాంట్నర్ (40 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా చెలరేగుతుండటంతో టీమిండియా డిఫెన్స్‌లో పడింది. 44 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 57 బంతుల్లో శతకం పూర్తి చేసిన బ్రేస్‌వెల్.. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో మూడో ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, తలో వికెట్ దక్కించుకున్నారు. -
Pak Vs NZ: న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం.. సిరీస్‌లో ముందంజ
Pakistan vs New Zealand, 1st ODI- Naseem Shah: న్యూజిలాండ్ జట్టుతో కరాచీలో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 256 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (77 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (66; 5 ఫోర్లు, 1 సిక్స్), ఫఖర్ జమాన్ (56; 7 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దెబ్బకొట్టిన నసీం షా అంతకుముందు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది. నసీమ్ షా (5/57) కివీస్‌ను దెబ్బ తీశాడు. ఇక కివీస్ ఇన్నింగ్స్లోబ్రాస్వెల్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టామ్ లాథమ్ 42 పరుగులు చేశాడు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నసీం షాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముందంజలో పాక్ కాగా టెస్టు, వన్డే సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ పాక్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే స్కోర్లు టాస్: పాకిస్తాన్- బౌలింగ్ న్యూజిలాండ్: 255/9 (50) పాకిస్తాన్: 258/4 (48.1) ఆరు వికెట్ల తేడాతో పాక్ విజయం చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం? Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్ తర్వాత! A maximum to finish things off! 💥 9️⃣th ODI win in a row 🇵🇰👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/z15eS9qvxD — Pakistan Cricket (@TheRealPCB) January 9, 2023 -
కివీస్‌తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
Pakistan vs New Zealand, 1st Test: టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్ టెస్టు చాంపియన్సషిప్ 2021-23 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం(డిసెంబరు 26) ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు నమోదైంది. టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ.. బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో బంతిని అజాజ్ పటేల్ చేతికి ఇవ్వగా.. స్పిన్‌తో తిప్పేశాడు. ఈ బాల్‌ను అంచనా వేయడంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7) విఫలం కాగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండల్ అతడిని స్టంపౌట్ చేశాడు. 145 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇక ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లోనూ వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(3)ను ఇదే రీతిలో బ్లండల్ స్టంపౌట్ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదైంది. 145 ఏళ్ల పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా తొలి రెండు వికెట్లు స్టంపౌట్ ద్వారా లభించడం ఇదే మొదటిసారి కాగా.. ఓవరాల్‌గా రెండోసారి. గతంలో.. 1976లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జమైకాలో జరిగిన టెస్టులో తొలిసారి ఈ ఫీట్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ మారీ కార్నిష్ నాలుగు వికెట్లు(టూయీస్ బ్రౌనీ, జాస్మిన్ సామీ, గ్లోరియా గిల్) తీయగా.. అందులో మూడు స్టంపౌట్లే ఉండటం విశేషం. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ Mohammad Rizwan: వైస్ కెప్టెన్‌పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు -
తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..!
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బ్రేస్‌వెల్ ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన బ్రేస్‌వెల్.. మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుస వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా తన టీ20 కెరీర్లో ఇదే అతడికి తొలి ఓవర్. మూడో బంతికి మార్క్ అడైర్ బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగగా.. నాలుగో బంతికి మెక్ గ్రాతీ, ఐదో బంతికి క్రెగ్ యంగ్ పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 బంతులే వేసిన అతడు ఐదు పరుగులతో పాటు మూడు వికెట్లు సాధించాడు. కాగా జూలై 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్‌కు ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా బ్రేస్‌వెల్ నిలిచాడు. అంతకుమందు జాకబ్ ఓరమ్,టిమ్ సౌథీ ఈ ఘనత సాధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌ను 88 పరుగుల తేడాతో కివీస్ చిత్తు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 91 పరుగులకే కుప్ప కూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోధి, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. జాకబ్ డఫీ రెండు, లాకీ ఫెర్గూసన్ ఒక్క వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో మార్క్ అడైర్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ క్లీవర్ 78 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఇక మూడు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో కివీస్ సొంతం చేసుకుంది. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..! Michael Bracewell can't Do anything Wrong Hat-trick in his First Over of T20 Internationals is just amazing and Unbelievable 🥵pic.twitter.com/nIPmvgCmjM — ⚡ (@Visharad_KW22) July 20, 2022