ఏప్రిల్ 18-27 మధ్యలో పాకిస్తాన్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 3) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ 15 మంది సభ్యుల బృందాన్ని పాకిస్తాన్‌కు పంపనుంది. ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్లు ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో న్యూజిలాండ్ సెలెక్టర్లు ద్వితియ శ్రేణి జట్టును పాక్‌కు పంపనున్నారు.
ఈ జట్టుకు మైఖేల్ బ్రేస్‌వెల్ సారధ్యం వహించనున్నాడు. ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి లాంటి గుర్తింపు పొందిన ఆటగాళ్లు మినహా మిగతావన్నీ కొత్త ముఖాలే. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కని వారికి ఈ సిరీస్ కీలకంగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్‌లో రాణిస్తే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లు రావల్పిండిలో జరుగనుండగా.. ఆఖరి రెండు లాహోర్‌లో జరుగనున్నాయి.
పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్‌కాన్చీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్క్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్), ఐష్ సోధి
షెడ్యూల్..
- తొలి టీ20: ఏప్రిల్ 18 (రావల్పిండి)
- రెండో టీ20: ఏప్రిల్ 20 (రావల్పిండి)
- మూడో టీ20: ఏప్రిల్ 21 (రావల్పిండి)
- నాలుగో టీ20: ఏప్రిల్ 25 (లాహోర్)
- ఐదో టీ20: ఏప్రిల్ 27 (లాహోర్)
Comments
Please login to add a commentAdd a comment