పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రావల్పిండి వేదికగా నిన్న (ఏప్రిల్ 18) జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. భారీ వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వర్షం ప్రారంభమయ్యే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 0.2 ఓవర్లలో 2/1గా ఉండింది. ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (0) షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టిమ్ సీఫర్ట్, మార్క్ చాప్‌మన్ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనకు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బయల్దేరింది. కివీస్ స్టార్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండగా.. కొందరు గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. పాక్ కెప్టెన్సీ తిరిగి చేపట్టాక ఈ సిరీస్ బాబర్‌కు మొదటిది.
Comments
Please login to add a commentAdd a comment