
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ న్యూ జాయినీ ఇషాన్ కిషన్ విధ్వంసం మొదలైంది. ఎస్‌ఆర్‌హెచ్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో పాకెట్ డైనమైట్ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మెరుపు అర్ద సెంచరీలు సాధించాడు. తాజాగా జరిగిన ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 22 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
అంతకుముందు ఓ మ్యాచ్‌లో 19 బంతుల్లో 49.. మరో మ్యాచ్‌లో 30 బంతుల్లో 70.. ఇంకో మ్యాచ్‌లో 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభానికి ముందు ఇషాన్ అరివీర భయంకర ఫామ్ చూసి సన్‌రైజర్స్ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇషాన్ మరో విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ప్రారంభించే అవకాశం ఉంది.
ఇషాన్, అభిషేక్ తమ సహజ శైలిలో చెలరేగితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆపడం ఎవరి తరమూ కాదు. ఇషాన్‌ను ఈ సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ రూ. 11.25 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్.. ఆ జట్టు విజయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఇషాన్, అభిషేక్, హెడ్, క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీశ్ కుమార్ రెడ్డితో కూడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. గత సీజన్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్ ఈసారి ఆ స్కోర్లను కూడా అధిగమించే అవకాశం ఉంది.
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లోనే 260, 270 పరుగులను సునాయాసంగా చేస్తున్న ఆరెంజ్ ఆర్మీ.. అస్సలు మ్యాచ్‌ల్లో 300 స్కోర్‌ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ ఆర్సీబీపై 287 (ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్), ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది.
గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్‌లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది.
ఈ సీజన్‌లో బ్యాటింగ్‌తో పాటు సన్‌రైజర్స్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు ఈ సీజన్‌లో కొత్తగా షమీ, ఉనద్కత్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.
2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..
పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్
Comments
Please login to add a commentAdd a comment