
జట్టు ప్రయోజనాల కోసం కేఎల్ రాహుల్ మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా, మూడో నంబర్ ఆటగాడిగా, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్.. ఐపీఎల్-2025లో తన కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా మంచి సక్సెస్ సాధించిన రాహుల్.. జట్టు అవసరాల దృష్ట్యా ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్నాడు.
రాహుల్ మిడిలార్డర్ బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది. జట్టు ఏదైనా ప్రయోజనాలే ముఖ్యమనుకునే రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని సైతం వద్దనుకున్నాడు. సాధారణ ఆటగాడిగా కొనగేందుకే ఇష్టపడ్డాడు. రాహుల్ కాదనుకుంటే అక్షర్ పటేల్‌ను ఢిల్లీ కెప్టెన్సీ వరిచింది. అక్షర్ జూనియర్ అయినా అతని అండర్‌లో ఆడేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశాడు.
గత మూడు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ వద్దనుకుంటే ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అక్కును చేర్చుకుంది. రాహుల్‌ను డీసీ మేనేజ్‌మెంట్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్ మెగా వేలంలో తన సహచరులంతా (శ్రేయస్, పంత్) భారీ మొత్తాలు దక్కించుకున్నా రాహుల్ ఏ మాత్రం బాధపడటం లేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటున్నాడు.
రాహుల్ మిడిలార్డర్‌లో వస్తే జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తారు. అభిషేక్ పోరెల్ లేదా కరుణ్ నాయర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగితే అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఆతర్వాతి స్థానాల్లో వస్తారు.
ఢిల్లీ ఈ సీజన్‌లో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్.. బౌలింగ్‌లో దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్‌లతో ఆ జట్టు అత్యంత బలీయంగా కనిపిస్తుంది.
ఈ జట్టును చూసి ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు ఈ సీజన్‌లో ఢిల్లీ టైటిల్ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మరి కొత్త సారథి అక్షర్ పటేల్ అండర్‌లో ఢిల్లీ తమ తొలి టైటిల్ గెలుస్తుందేమో చూడాలి.
ఈ సీజన్‌లో ఢిల్లీ మే 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌తో మొదలవుతుంది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..
అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్
Comments
Please login to add a commentAdd a comment