
గత కొన్నిరోజులు ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న మహేశ్ బాబు-రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయింది. ఈ క్రమంలో పలువురు అధికారులు, అభిమానులు టీమ్ ని కలవగా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాజమౌళి థ్యాంక్యూ నోట్ కూడా రిలీజ్ చేశాడు.
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే హైదరాబాద్ లో షూటింగ్ మొదలుపెట్టారు కానీ ప్రకటించలేదు. ఒడిశాలోని కోరాపుట్ కొండలపై మహేశ్-పృథ్వీరాజ్-ప్రియాంక చోప్రా(Priyanka Chopra) తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా ఆ మధ్య లీకైంది.

అలా వార్తల్లో నిలిచిన SSMB 29 ఇప్పుడు ఒడిశా షెడ్యూల్ ముగించుకుంది. ఈ మేరకు కోరాపుట్ హాస్పిటాలిటీకి రాజమౌళి ధన్యవాదాలు చెప్పాడు. మరిన్ని అడ్వెంచర్స్ చేసేందుకు మళ్లీ ఇక్కడికి వస్తానని అన్నాడు. దిగువన రాజమౌళి, ప్రియాంక చోప్రా సంతకాలు చేసిన ఓ నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అలానే సెట్ లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.
(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)


Comments
Please login to add a commentAdd a comment