SSMB29
-
SSMB 29: మహేశ్‌కి జక్కన్న కండీషన్.. నిర్మాతకు రూ. కోటి సేఫ్!
రాజమౌళి(SS Rajamouli )తో సినిమా అంటే నటీనటులు ఎంత ఇష్టపడతారో అంతే భయపడతారు కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు.. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన్న పెట్టే కండీషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు మహేశ్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి… ఖర్చుల దగ్గర జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనవసరపు ఖర్చులు తగ్గించి, ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో జక్కన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్లో ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేదించారట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ని సెట్లోకి అనుమతించట్లేదట. మహేశ్‌బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్‌ని పాటించాల్సిందేనట.నిర్మాతలకు రూ.కోటి వరకు సేఫ్రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్లో రోజుకు దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటున్నారట. అంత మందికి వాటర్ బాటిళ్లు అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేయిస్తున్నారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు దీనితోనే నీళ్లు తాగాలట. పర్సనల్‌గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని చెప్పారట. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడలని చెప్పారట. వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని నిషేదించాలని యూనిట్‌ని ఆదేశించారట. దీని వల్ల నిర్మాతకు దాదాపు రూ. కోటి వరకు సేఫ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బు ఆదా అవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని జక్కన్న ప్యామిలీ భావిస్తుందట. ఈ ఆలోచన కీరవాణి సతీమణి వల్లీకి వచ్చిందట. ఆమె చెప్పడంతోనే రాజమౌళి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించారట.మహేశ్ సినిమాకు టైటిల్ కష్టాలు..మహేశ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేశ్‌తో సినిమా చేస్తున్నానని రాజమౌళి ప్రకటించినప్పటికీ.. కథ అప్పటికీ ఫిక్స్ కాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజైన కొద్ది రోజులకి ఈ కథపై దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం జక్కన్నకు ఇంకా క్లారిటీ రాలేదట. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా... ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన్న టీమ్. టైటిల్ పెట్టే వరకు మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించొద్దని రాజమౌళి ఆదేశించారట. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్‌ని ప్రారంభించారు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చిన్న టీజర్‌ని రిలీజ్ చేస్తూ టైటిల్‌ని వెల్లడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. -
19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్
సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఇండస్ట్రీలోకి వస్తారు. అవకాశాల కోసం ఎదురు చూసి..చాన్స్ వచ్చినప్పుడే తమను తాము నిరూపించుకుంటారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించి వచ్చినవాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు అయితే చాలా ‘ఇబ్బందులను’ ఎదుర్కొవాల్సి వస్తోంది. అవకాశాల పేరుతో మోసం చేసేవాళ్లు కొంతమంది అయితే.. అవకాశం ఇచ్చి అవమానించే వారు మరికొంతమంది. ఇలాంటి వాళ్లను తట్టుకొనే ఈ స్థాయికి వచ్చానని అంటోంది గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, 19 ఏళ్ల వయసులోనే ఓ డైరెక్టర్ తన గురించి చెడుగా ప్రవర్తించాడని, ఆయన అన్న మాటలకు డిప్రెషన్లోకి వెళ్లాని చెప్పింది. నీచంగా మాట్లాడాడుతాజాగా జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో ప్రియాంక పాల్గొని కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. ‘19 ఏళ్ల వయసులో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పటికే చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓ సినిమా కోసం సెట్లోకి వెళ్లాను. దర్శకుడిని కలిసి ఇప్పుడు నాకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి మా కాస్ట్యూమ్ డిజైనర్‌కి చెప్పండి’ అని అడిగాను. అతను నా ముందే స్టైలిస్ట్ ఫోన్ చేసి నీచంగా మాట్లాడాడు.అలాంటి దుస్తులే వేసుకోవాలిఆ డైరెక్టర్ నా స్టైలిస్ట్‌కి ఫోన్ చేసి.. ‘హీరోయిన్ లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. కాబట్టి ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి. తన లోదుస్తులు కనిపించాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ పదే పదే ఆ పదాన్నే ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పడు నీచంగా అనిపించిది. చాలా బాధ కలిగింది. డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి అతడు నన్ను అంత చిన్నచూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేను అని చెప్పేశాను. ఆ మరుసటి రోజే వెళ్లి నేను ఈ సినిమా చేయలేనని చెప్పాను. ఇప్పటికీ ఆ దర్శకుడితో నేను కలిసి పని చేయలేదు. నన్ను ఎలా చూపించుకోవాలని అనేది నా ఛాయిస్. దృష్టికోణం అనేది నిజం. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.మహేశ్‌కి జోడీగాబాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంక..పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి తన మకాంని మార్చింది. 'క్వాంటికో' టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి అక్కడ అగ్ర హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈ గ్లోబల్ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
ఆ విషయంలో ప్రభాస్ గ్రేట్.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సలార్ సినిమాతో తెలుగులోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాది ద గోట్ లైఫ్ (ఆడుజీవితం), గురువాయూర్ అంబలనడయిల్ చిత్రాలతో రెండు హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. SSMB29 (మహేశ్‌బాబు- రాజమౌళి కాంబో) సినిమాలోనూ పృథ్వీరాజ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్-రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్?తాజాగా దీనిపై పృథ్వీరాజ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నాకంటే ఎక్కువ మీ అందరికే బాగా తెలిసినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు ఇంకా ఏదీ ఫైనలవలేదు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అంతా ఫిక్సయ్యాక అప్పుడు చూద్దాం.. అన్నాడు. సలార్ 2 (Salaar 2 Movie) గురించి మాట్లాడుతూ.. సలార్ సీక్వెల్ ఉందని మాత్రమే నేను చెప్పగలను. ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. అది అయిపోయిన వెంటనే సలార్ 2 మొదలుపెడ్తాం.ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలిప్రభాస్ (Prabhas) గురించి చెప్పాలంటే తన స్టార్డమ్ తనకు తెలియదు. ఆయన సోషల్ మీడియాలో లేడనుకుంటాను. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని అతడు మాత్రం హ్యాండిల్ చేయడు. సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు. పబ్లిక్‌లో ఉండటానికి బదులు ప్రైవేట్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడు. అది నిజంగా గ్రేట్. ఇది ప్రభాస్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన అంశం అని చెప్పాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు, సింగర్ కూడా! లూసిఫర్, బ్రో డాడీ చిత్రాలకు ఈయనే దర్శకత్వం వహించాడు. మలయాళంలో పలు పాటలు ఆలపించాడు.చదవండి: ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్ రోషన్ తండ్రి -
మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ కాదా..!
-
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్‌బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్‌కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక
మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.మహేశ్‌బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్‌ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్‌కు కామెంట్ బాక్స్‌లో మహేశ్‌బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్‌లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్‌పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రాహీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్‌కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
SSMB29 కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ప్రియాంక చోప్రా...!
-
మహేశ్‌బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్ ప్రారంభం
మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ సినిమా ప్రారంభమైంది . గురువారం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అధికారికంగా 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. అయితే, హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఒక వార్త భారీగా వైరల్ అయింది.ఈ సినిమాలో మహేశ్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం చాలా రోజులుగా ఆయన కసరత్తులు కూడా చేస్తున్నారు. ఈ సమ్మర్లో చిత్రీకరణ కూడా రాజమౌళి ప్రారంభించనున్నారు. అందుకోసం ఆయన ఇప్పటికే పలు లొకేషన్స్ కూడా సెర్చ్ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాతో పాటు ఆఫ్రికా వంటి అడవుల్లో ఆయన పర్యటించారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
మహేశ్‌బాబు - రాజమౌళి సినిమాలో స్టార్ హీరోయిన్
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.గ్లోబల్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
రాజమౌళి-మహేశ్ మూవీలో ఇంటర్నేషనల్ బ్యూటీ!
బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, హీరో మహేశ్‌బాబుకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. అయితే ‘సిటాడెల్ సీజన్– 1’లో నటించిన ఆమె సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇక అబ్దుల్ మాజిద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళన్’ (2002) మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియాంక చోప్రా తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించకుండా కేవలం బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అయితే రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. ఒకవేళ ఆమె మహేశ్‌బాబు–రాజమౌళి కాంబో చిత్రంలో నటిస్తారన్న వార్త నిజమైతే అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. -
SSMB 29: మహేశ్‌కి జోడీగా హాలీవుడ్ భామ.. ఎవరీ నవోమీ?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బి 29’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్‌కు చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారాయన. అందులో భాగంగా మహేశ్‌బాబుకి జోడీగా హాలీవుడ్ నటి నవోమీ స్కాట్‌ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవోమీకి భారత మూలాలుగతంలో ‘ఎస్ఎస్ఎమ్బి 29’ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమీ స్కాట్‌ని ఎంపిక చేయనున్నారని భోగట్టా. ఇంగ్లాండులో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్ గుజరాత్ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట. ‘ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్’ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. షూటింగ్ ఎప్పుడంటే..?‘ఎస్ఎస్ఎమ్బి 29’లో నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి... మహేశ్‌బాబుకి జోడీగా నవోమీ స్కాట్ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. -
మహేశ్ బాబు విరాళం.. డిస్కషన్ మాత్రం వాటి గురించి
హీరో మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రిపరేషన్లో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ నడుస్తోంది. మూవీలోని తన పాత్ర కోసం మహేశ్ లుక్ మొత్తం మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయంగా రూ.50 లక్షల విరాళం అందజేశాడు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించాడు. ఏఎంబీ తరఫున మరో రూ.10 లక్షలు కూడా విరాళమిచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)మహేశ్ విరాళం ఇచ్చాడు. అయితే డబ్బులు సాయం చేశాడు అనే విషయం కంటే అతడు లుక్ హైలెట్ అవుతోంది. జూలపాల జట్టు, గుబురు గడ్డంలో మహేశ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు మహేశ్ ప్రయోగాలు చేయలేదు, మాస్‌గా కనిపించలేదు అని ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ఇప్పుడు డిఫరెంట్‌గా కనిపిస్తున్న మహేశ్‌ని చూసి ఫిదా అయిపోతున్నారు.దాదాపు నాలుగేళ్ల క్రితం మహేశ్‌తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. ఈయన తీసిన 'ఆర్ఆర్ఆర్' వచ్చి కూడా రెండేళ్లకు పైనే అయిపోయింది. అలాంటిది ఓ అప్డేట్ కూడా రాలేదు. ఇప్పట్లో వస్తాదనే గ్యారంటీ కూడా లేదు. కానీ వచ్చే ఏడాది షూటింగ్ మొదలవ్వొచ్చని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
హిందీ డబ్బింగ్ కి నో చెప్పిన మహేష్ బాబు.. ఎందుకో తెలుసా !?
-
#SSMB29 : పూనకాలు లోడింగ్.. మహేష్ బాబు నయా లుక్ చూశారా? (చిత్రాలు)
-
మహేశ్-రాజమౌళి సినిమా: టైటిల్ ఇదేనా? ఆ పోస్ట్ అర్థం ఏంటి?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. ఈ సినిమాపై రోజు ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మొన్నటికి వరకు ఈ సినిమాలో నటించబోయే నటీనటులు గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా టైటిల్‌పైనే ఓ రూమర్ వచ్చింది. దానికి విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టే కారణం. (చదవండి: ‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!)తాజాగా విజయన్ తన ఇన్‌స్టా స్టోరీలో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కల ఫోటోని షేర్ చేస్తూ దానికి #SSMB29, #SSMB29DIARIES హ్యాష్ ట్యాగ్‌లను జత చేశాడు. దీంతో ఇది కచ్చితంగా మహేశ్-రాజమౌళి సినిమా అప్డేటే అని, ఈ చిత్రానికి ‘గరుడ’ అని టైటిల్ పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: స్త్రీ-2 దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. బద్దలవుతున్న రికార్డులు!)ఈ టైటిల్‌ని రాజమౌళి చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడ’ అనే సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత గరుడ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మహేశ్‌తో తీయబోయే సినిమాకు ఈ టైటిల్‌నే పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్‌ని సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడట. ఇప్పటికే మహేశ్ తన లుక్‌ని మార్చేశాడు. సినిమా కోసం జట్టు, గడ్డాన్ని పెంచేశాడు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. -
SSMB 29 లో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
-
SSMB 29.. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!
-
మహేష్ బాబు - రాజమౌళి సినిమా ఇప్పట్లో లేనట్లేనా..
-
హీరో మహేశ్ బాబుకి యాక్టింగ్ క్లాసులు.. కొత్తగా ఆ విషయాల్లో?
సూపర్ స్టార్ మహేశ్ బాబుకి యాక్టింగ్ మళ్లీ కొత్తగా యాక్టింగ్ క్లాసులా? ఎందుకు ఏమైందని అనుకుంటున్నారా? ఈ మధ్య వెకేషన్ ముగించుకుని ఇంటికొచ్చేసిన మహేశ్.. ప్రస్తుతం రాజమౌళి మూవీకి జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్లో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే మహేశ్ కొత్తగా కొన్ని విషయాల్లో మారేందుకు రెడీ అయిపోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్... రాజమౌళితో కలిసి ఇప్పుడు పనిచేయబోతున్నాడు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. అంటే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సరికొత్త మహేశ్‌ని చూడబోతున్నమాట.ఇదిలా ఉండగా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 గురించి రాజమౌళి చెప్పబోతున్నారు. గతంలో ఓసారి మాట్లాడుతూ 'గ్లోబ్‌ట్రాటింగ్' స్టోరీగా ఉండబోతుందని చెప్పారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న రాజమౌళి.. మహేశ్‌తో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?) -
ప్రిన్స్ బర్త్ డే రోజున రాజమౌళి అదిరిపోయే ట్రీట్?
-
మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడుతున్నాడు. తన లుక్‌ను కూడా మార్చుకున్నాడు. పాత్రకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నారు.(చదవండి: టాలీవుడ్లో హాలీవుడ్ భామ.. 'నిన్ను వదలను' అంటోన్న బ్యూటీ!)ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టాడు రాజమౌళి. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ పుకారు బయటకు వచ్చింది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా విలన్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మహేశ్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంపిక చేశారట. ఈ విషయానన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటకీ..లీకుల వీరులు బయటకు వదిలేశారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్విరాజ్.. ‘సలార్’తో పాన్ ఇండియా నటుడయ్యాడు. ఆ చిత్రంలో పృథ్విరాజ్ ప్రభాస్‌తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జక్కన్న భావిస్తున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? పృథ్విరాజ్ వెంటనే ఓకే చెప్పేశాడట. అన్ని సెట్ అయితే.. మహేశ్ బాబును ఢీకొట్టే విలన్‌గా పృథ్విరాజ్‌ను చూడొచ్చు. -
ఎట్టకేలకు రాజమౌళి-మహేశ్ మూవీ అప్డేట్.. బయటపెట్టిన కీరవాణి
'ఆర్ఆర్ఆర్' రిలీజై రెండేళ్లయింది. అప్పటి నుంచి రాజమౌళి మహేశ్ సినిమా మీదే పనిచేస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారు. కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పట్లేదు. మే చివరన కృష్ణ జయంతి సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందనుకుంటే.. అస్సలు సౌండ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ గురించి కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పేశారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్‌లో నాటకం)'మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అని కీరవాణి చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే షూటింగ్ మొదలయ్యేసరికి ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది అయిపోవచ్చు.రాజమౌళి సినిమా అంటే ఫెర్ఫెక్ట్ ఉండాలి. అదీ కాక 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ వచ్చింది కాబట్టి.. ఇప్పుడు చేయబోయే మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. దీంతో కచ్చితంగా పూర్తవడానికి నాలుగైదేళ్లు పట్టేస్తుందేమో? ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ విషయంలో గతంలో రకరకాల రూమర్స్ వచ్చాయి. ఏదైనా అప్డేట్ వస్తే గానీ అసలేం జరుగుతుందనేది క్లారిటీ రాదు. చూడాలి మరి ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే ఆగస్టులో మహేశ్ పుట్టినరోజు నాటికైనా అప్డేట్ ఇస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) -
మహేష్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ జక్కన్న ప్లాన్ మామూలుగా లేదులే..
-
SSMB 29: మహేశ్ బాబుకి జోడీగా ఆ బాలీవుడ్ బ్యూటీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్‌బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్‌బాబు లుక్‌ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోలా మహేశ్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు మహేశ్-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే దీని గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్. మరోవైపు ఈ మూవీ మొదలవడానికి ముందే బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఒక దానిపై నిర్మాతలే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏంటది?(ఇదీ చదవండి: వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా)మహేశ్‌తో మూవీ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే రాజమౌళి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కానీ హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండోనేసియా నటిని హీరోయిన్ గా తీసుకున్నారని, ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నటించబోతుందని అన్నారు. అలానే నాగార్జున కీలక పాత్ర చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.అయితే పైన వచ్చిన రూమర్స్ వేటికి స్పందించని నిర్మాణ సంస్థ.. వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ తమతో కలిసి పనిచేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ రూమర్స్ ఎప్పుడొచ్చాయా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా విషయాల కంటే పర్టిక్యూలర్‌గా ఈ విషయం కోసం ఎందుకు నోట్ రిలీజ్ చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. చేస్తే చేశారు గానీ అలానే మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే అప్డేట్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ అయిన ఖుషీ అయ్యేవారు!(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్) -
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో సినిమా అంటే హాలీవుడ్ హీరోలు కూడా రెడీ అంటారు. కానీ జక్కన్న మాత్రం తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమా చేసి హిట్ కొడుతున్నాడు. అంతేకాదు తన సినిమాలను నిర్మించే అవకాశం టాలీవుడ్ ప్రొడ్యుసర్లకే ఇస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో తనతో సినిమా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలకే అవకాశం ఇస్తున్నాడు. తాజాగా మహేశ్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యలతను ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణకు అప్పగించాడు. 15 ఏళ్ల క్రితం తనకు ఇచ్చిన మాటను రాజమౌళి- మహేశ్ బాబు నిలబెట్టుకున్నారని నారాయణ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా చేయాలని 15 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే నా బ్యానర్(దుర్గా ఆర్ట్స్)లో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఇద్దరి స్థాయి పెరిగిపోయింది. వీళ్లతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా.. ‘దుర్గా ఆర్ట్స్ బ్యానర్’లో సినిమా చేస్తున్నామని వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. వాటిని రిజెక్ట్ చేసి మరీ నాతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో షూటింగ్ప్రారంభం అవుతుంది. బడ్జెట్ఎంత అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నారు. -
మహేశ్ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్‌లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. SSR about #SSMB29 We've finished writing and are now in pre-production. Only the, protagonist SuperStar @urstrulyMahesh , is confirmed and he's incredibly handsome. Hoping to expedite the filming process and have him join us for promotion during the release #MBSSR pic.twitter.com/JZAx3oP6cu — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
మహేశ్ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. SSMB29 ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ నటీనటులు కూడా భాగస్వామ్యం కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న వారికి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు. వంటి అంశాల గురించి సోషల్‌మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం డైరెక్టర్ రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఈ ప్రాజెక్ట్‌కు బదులుగా సినిమాలో వాటా తీసుకోబోతున్నారని ప్రచారం నడుస్తోంది. రాజమౌళి సినిమా కలెక్షన్స్ అంటే వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ఈ లెక్కన సినిమాలో నటించే వారికంటే కూడా ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ అందే ఛాన్స్ ఉంది. మహేశ్ బాబు కూడా సినిమా కోసం భారీ మొత్తంలో అందుకుంటున్నట్లు టాక్.. రెమ్యునరేషన్‌తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో ఆయన కొంత వాటా తీసుకునే ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది. -
మహేష్ నయా లుక్..రాజమౌళి మూవీ కోసమేనా (ఫొటోలు)
-
మహేష్ బాబు లుక్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు
-
SSMB29 స్టోరీ రివీల్.. రాజమౌళి గట్స్ కి హ్యాట్సాఫ్..!
-
SSMB 29 టైటిల్ లీక్ ?
-
రాజమౌళి సెన్సేషన్.. SSMB 29 టైటిల్ ఫిక్స్..?
-
రాజమౌళి- మహేశ్ సినిమా టైటిల్ ఇదేనా..?
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 మరొకొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ. కొన్ని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. మహేష్ బాబును కొత్త అవతార్‌లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు తన పాత్ర కోసం కఠినమైన శిక్షణను మహేశ్ పొందుతున్నాడు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మహేశ్ -రాజమౌళి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను SSRMB అని రాజమౌళి సెట్ చేశారట. ఇలా మహేశ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అనేక రూమర్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. SSMB29 రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయబడిందని ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడ్డాడు. జంగిల్ అడ్వెంచర్ ఫిలిం కావడంతో ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో కూడా చిత్రీకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం. -
మహేష్ బాబు కోసం రంగంలోకి హాలీవుడ్ నటి
-
మహేశ్ సినిమా కోసం హాలీవుడ్‌ను దింపుతున్న జక్కన్న
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 మరొకొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం కఠోరమైన శిక్షణ పొందుతున్నాడు మహేశ్. ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటిని ఎంపిక చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. మహేశ్ ప్రాజెక్ట్‌లోకి థోర్ ఆస్ట్రేలియాకు చెందిన 'క్రిస్ హెమ్స్‌వర్త్' SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ చిత్రాలలో ఆయన చాలా పాపులర్ యాక్టర్. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ఆయన 31వ స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ గతంలో ప్రకటించింది.2011లో 'థోర్' చిత్రం ద్వారా ఆయనకు భారత్‌లో కూడా విపరీతమైన క్రేజ్ దక్కింది. ఆ తర్వాత ఎవెంజర్స్ ఫ్రాంచైజీస్, ట్రాన్స్ఫార్మర్స్ ,ఎక్స్‌ట్రాక్సన్,MIB వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి హీరోను SSMB29 ప్రాజెక్ట్‌లోకి రాజమౌళి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే నిజం అయితే మహేశ్ సినిమా హాలీవుడ్లో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. SSMB29లో ఇండోనేషియా నటి? ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బాహుబలి ఫ్రాంచైజీతో పాటు RRR వరకు బ్యాక్-టు-బ్యాక్ హిట్లు కొట్టాడు. ఆర్ఆర్ఆర్ కోసం విదేశీ నటీనటులను ఆయన ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని నిశితంగా పరిశీలిస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని ఆమె ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆమె SSMB29 లో కీలక పాత్ర పోషిస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే చెల్సియా ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబును అనుసరించడం లేదని గమనించాలి.కానీ బాలీవుడ్ హీరోయిన్లు అయిన దిశా పటానీ, దీపికా పదుకొణ్లను ఆమె ఫాలో అవుతుంది. SSMB29 రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయబడిందని ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Chelsea Elizabeth Islan (@chelseaislan)