
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తీస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో జరుగుతోంది. అయితే చిత్రీకరణ జరుగుతున్న టైంలో రహస్యంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీన్ని చూసిన చాలామంది ఏకంగా కథ ఇదే అని కొన్ని చెప్పేస్తున్నారు.
లీకైన వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుండగా.. డిఫరెంట్ గా ఉండే వీల్ ఛైర్ లో పృథ్వీరాజ్ కూర్చుని ఉంటాడు. కాసేపటికి మహేశ్ ని మోకాళ్లపై కూర్చోబెడతారు. వీడియో ఇంతవరకే ఉంది. కానీ పలువురు నెటిజన్స్ మాత్రం కథ ఏమై ఉంటుందా అని చెప్పి అల్లేస్తున్నారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?)
పృథ్వీరాజ్ ఏదో నిధి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే నడవలేని స్థితికి వెళ్తాడని.. దీంతో మహేశ్ బాబుని ఆ నిధి వెతికేందుకు ఒప్పిస్తాడని.. ఇలా నోటికొచ్చినదంతా మాట్లాడుతూ సోషల్ మీడియాలో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే సినిమా మాత్రం జంగిల్ అడ్వెంచర్ అని మాత్రం తెలుసు.
రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారని.. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోందని.. త్వరలో వైజాగ్, శ్రీలంక, కెన్యా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment