టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మరొకొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ. కొన్ని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. మహేష్ బాబును కొత్త అవతార్‌లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు తన పాత్ర కోసం కఠినమైన శిక్షణను మహేశ్ పొందుతున్నాడు.
ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మహేశ్ -రాజమౌళి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను SSRMB అని రాజమౌళి సెట్ చేశారట. ఇలా మహేశ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అనేక రూమర్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.
SSMB29 రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయబడిందని ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడ్డాడు. జంగిల్ అడ్వెంచర్ ఫిలిం కావడంతో ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో కూడా చిత్రీకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment