
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్‌కు చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారాయన. అందులో భాగంగా మహేశ్‌బాబుకి జోడీగా హాలీవుడ్ నటి నవోమీ స్కాట్‌ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
నవోమీకి భారత మూలాలు
గతంలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమీ స్కాట్‌ని ఎంపిక చేయనున్నారని భోగట్టా. ఇంగ్లాండులో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్ గుజరాత్ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట. ‘ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్’ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
షూటింగ్ ఎప్పుడంటే..?
‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’లో నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి... మహేశ్‌బాబుకి జోడీగా నవోమీ స్కాట్ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ
నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment