వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేశ్‌బాబు.. వీడియో వైరల్‌ | Mahesh Babu Return From Italy With Family | Sakshi
Sakshi News home page

వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేశ్‌బాబు.. వీడియో వైరల్‌

Apr 15 2025 11:49 AM | Updated on Apr 15 2025 12:04 PM

Mahesh Babu Return From Italy With Family

మ‌హేశ్‌బాబు- రాజ‌మౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 భారీ ప్రాజెక్ట్ పనులు స్పీడ్‌గానే జరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే, షూటింగ్‌ పనులకు కాస్త గ్యాప్‌ రావడంతో ఎప్ప‌టి మాదిరిగానే  త‌న ఫ్యామిలీతో ఇటలీ టూర్‌కి మహేశ్‌ వెళ్లారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. తాజాగా శంశాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్‌బాబు దిగగానే ఫ్యాన్స్‌ ఫోటోల కోసం ఎగబడ్డారు. దీంతో విమానాశ్రయంలో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.

ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో ఉండే హిస్టారికల్ ప్రదేశాలను ఆయన సందర్శించారు. సితార‌, న‌మత్ర చిల్ అవుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఏడాదిలో కనీసం రెండు లేదా మూడు ఫారెన్ ట్రిప్స్ మహేశ్‌బాబు వేస్తారని తెలిసిందే. SSMB29 ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ముందు జక్కన్న లాక్కున్న పాస్‌పోర్ట్‌ను చూపుతూ మహేశ్‌ వెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఆయన ఇట‌లీ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో ఫోటోల కోసం ఫ్యాన్స్‌ ఎగబడటం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

దర్శకుడు రాజమౌళి కూడా కొద్దిరోజుల క్రితం జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే.. 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' డాక్యుమెంటరీ ప్రచారం కోసం తన కుటుంబంతో పాటు వెళ్లారు. మరో రెండురోజ్లులో ఆయన కూడా ఇండియాకు తిరిగిరావచ్చు.  SSMB29 షూటింగ్‌ పనులు మళ్లీ షురూ కాబోతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement