మహేశ్‌ సినిమా కోసం హాలీవుడ్‌ను దింపుతున్న జక్కన్న | Mahesh Babu And Rajamouli Movie Heroine Is Confirmed, Know Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Mahesh Babu - Rajamouli: మహేశ్‌ సినిమా కోసం హాలీవుడ్‌ను దింపుతున్న జక్కన్న

Published Sun, Feb 11 2024 3:31 PM | Last Updated on Fri, Feb 16 2024 3:01 PM

Mahesh Babu And Rajamouli Movie Heroine Is Confirmed - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మరొకొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం  కఠోరమైన శిక్షణ పొందుతున్నాడు మహేశ్‌. ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటిని ఎంపిక చేసినట్లు పుకార్లు వస్తున్నాయి.

మహేశ్‌ ప్రాజెక్ట్‌లోకి థోర్‌
ఆస్ట్రేలియాకు చెందిన 'క్రిస్ హెమ్స్‌వర్త్‌' SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ చిత్రాలలో ఆయన చాలా పాపులర్‌ యాక్టర్‌. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ఆయన 31వ స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్‌ గతంలో ప్రకటించింది.2011లో 'థోర్' చిత్రం ద్వారా ఆయనకు భారత్‌లో కూడా విపరీతమైన క్రేజ్‌ దక్కింది.

ఆ తర్వాత ఎవెంజర్స్ ఫ్రాంచైజీస్‌, ట్రాన్స్‌ఫార్మర్స్ ,ఎక్స్‌ట్రాక్సన్‌,MIB వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. అలాంటి హీరోను SSMB29 ప్రాజెక్ట్‌లోకి రాజమౌళి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే నిజం అయితే మహేశ్‌ సినిమా హాలీవుడ్‌లో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు.

SSMB29లో ఇండోనేషియా నటి?
ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బాహుబలి ఫ్రాంచైజీతో పాటు RRR వరకు బ్యాక్-టు-బ్యాక్ హిట్లు కొట్టాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం విదేశీ నటీనటులను ఆయన ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని నిశితంగా పరిశీలిస్తే..  ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని ఆమె ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆమె SSMB29 లో కీలక పాత్ర పోషిస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.  అయితే చెల్సియా ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబును అనుసరించడం లేదని గమనించాలి.కానీ బాలీవుడ్‌ హీరోయిన్లు అయిన దిశా పటానీ, దీపికా పదుకొణ్‌లను ఆమె ఫాలో అవుతుంది.

SSMB29 రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయబడిందని ఈ ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్‌ బాబు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్‌ తీసుకోకుండా ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement