
సంక్రాంతి హిట్ బొమ్మ డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రానుంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్‌లో అదరగొట్టిన ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 21న) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. అయితే ఇటీవల ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఊర్వశి రౌతేలాను మిస్ చేయడంతో ఫ్యాన్స్ ఫైరయ్యారు. దీంతో మరో పోస్ట్‌లో ఊర్వశి రౌతేలా సహా డాకు మహారాజ్ మూవీలో నటించిన ప్రధాన పాత్రలు అందరూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.
ఊర్వశికి అన్యాయం?
ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ మూవీలో కేవలం ఐటం సాంగ్‌లో ఆడిపాడటమే కాకుండా ఓ కీలక పాత్రలోనూ నటించింది. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌కూ హాజరైంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆమెకు మరోసారి భంగపాటు ఎదురుకానుందట! ఆమె నటించిన సీన్లు ఓటీటీలో కనిపించవంటూ ప్రచారం జరుగుతోంది. ఊర్వశి నటించిన సన్నివేశాలను నెట్‌ఫ్లిక్స్ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోందని రూమర్లు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడిందని, ప్రతి ప్రమోషన్‌కు హాజరైందని, అలాంటి తనకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
డాకు మహారాజ్
అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. థియేటర్‌లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని యథాతథంగా ఓటీటీలోనూ విడుదల చేస్తున్నారట. అంటే ఊర్వశితో బాలయ్య నటించిన సన్నివేశాలు, డ్యాన్స్ స్టెప్పులు ఓటీటీలోనూ చూడొచ్చన్నమాట! డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment