
వరుస ఐటం సాంగ్స్‌తో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఇటీవల డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడి పాటతో ఓ ఊపు ఊపేయడంతో పాటు ఆ సినిమాలో చిన్న పాత్రలోనూ యాక్ట్ చేసింది. జాట్ సినిమాలోనూ టచ్ కియా అనే ఐటం సాంగ్‌తో అల్లాడించేసింది. తాజాగా ఊర్వశి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఈసారి పాట వల్లో, పాత్ర వల్లో కాదు.. తన సెల్ఫ్ డబ్బా వల్ల! బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తర్వాత ఆ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసేది తానేనని చెప్తోంది.

షారూఖ్ తర్వాత నేనే..
ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాటట్లాడుతూ.. నేను ఎప్పుడూ నా పనిగురించే ఆలోచిస్తాను. ఉదాహరణకు సినిమాలు ప్రమోట్ చేసే విషయానికి వస్తే షారూఖ్ ఖాన్ తర్వాత ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేసేది నేనేనని మీరు ఒప్పుకుని తీరాల్సిందే! హాలీవుడ్ మేకర్స్ కూడా రేచర్ మూడో సీజన్ కోసం నన్ను ప్రమోషన్స్ చేయమని అడిగారు. కాబట్టి మీరే అర్థం చేసుకోండి.. వీలైతే పొగడండి.. ఇది గర్వపడాల్సిన విషయం. అయినా ఆర్టిస్టులుగా మన సినిమాను మనం ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అని ప్రశ్నించింది.

కావాలనే ఇదంతా..
ఆమె వ్యాఖ్యలు విన్న పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఊర్వశి కావాలనే ఇదంతా చేస్తోంది. తనను ట్రోల్ చేస్తే కొంతకారం ఆమె గురించి మాట్లాడుకుంటామని, అలాగైనా వార్తల్లో ఉంటామన్నది ఆమె ప్లాన్.. జనం అంతా తన గురించి ఏదో ఒకరకంగా మాట్లాడుకోవాలని ఇలా ప్లాన్ చేసింది. ఈమె వ్యాఖ్యలు కాస్త పిచ్చిగా ఉంటాయి కానీ అందులో కూడా ఆత్మస్థైర్యం కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. ఈమె మళ్లీ మొదలెట్టిందిరా బాబూ అని తలపట్టుకుంటున్నారు.
సినిమా..
ఊర్వశి విషయానికి వస్తే.. సింగ్ సాబ్ ద గ్రేట్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సనమ్ రే, పాగల్‌పంటి, హేట్ స్టోరీ 4, వర్జిన్ భానుప్రియ, జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రాల్లో నటించింది. హిందీలో పలు ఐటం సాంగ్స్ కూడా చేసింది. తెలుగులో బాసూ వేర్ ఈజ్ ద పార్టీ (వాల్తేర వీరయ్య), కల్ట్ మామా (స్కంద), మై డియర్ మార్కండేయ (బ్రో), వైల్డ్ సాలా.. (ఏజెంట్) సాంగ్స్‌లో చిందేసింది.
చదవండి: అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవు.. బోరున ఏడ్చేసిన నటి