Shah Rukh Khan
-
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్‌గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్‌కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్‌తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్‌ను సింగిల్ టేక్‌లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్‌కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
షారుక్ మరోసారి తీన్మార్ ?
-
షారుఖ్ ఖాన్ సినిమా రీమేక్ లో ప్రభాస్
-
'ఈ వయసులో మీలా చేయలేను'.. సౌత్ హీరోలపై షారూఖ్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు. .@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025 -
సఖి.. ఫస్ట్ ఆ హీరోహీరోయిన్లతో తీద్దామనుకున్నా: మణిరత్నం
సఖి సినిమా (Sakhi Movie) అప్పట్లో సెన్సేషనల్ హిట్. పేరుకే డబ్బింగ్ మూవీ కానీ తెలుగులోనూ ఈ సినిమాను తెగ ఆరాధించారు. ఇంతకీ ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ ఏదో తెలుసా..? అలై పాయుతే (Alai Payuthey Movie). అలై పాయుతే అనే తమిళ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఆర్ మాధవన్, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. థియేటర్లలో వంద రోజులకు పైనే ఆడిన ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట రీమేక్ చేశారు. ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అయింది.మాధవన్‌కు బదులుగా..తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోహీరోయిన్లను అనుకున్నట్లు తెలిపాడు. మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఫస్ట్ షారూఖ్, కాజోల్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారూఖ్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికి క్లైమాక్స్ సరిగ్గా కుదర్లేదు. అందుకని దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్‌తో దిల్సే సినిమా చేశాను. ఆ మూవీ అయిపోయేసమయానికి సఖి క్లైమాక్స్‌ను ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచన తట్టింది అని చెప్పుకొచ్చాడు. మణిరత్నం చివరగా పొన్నియన్ సెల్వన్ 2 తెరకెక్కించాడు.చదవండి: సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్! -
షారూఖ్ ఖాన్ చేతికి అరుదైన గోల్డ్ వాచ్.. ధర ఎంతో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించారు. ఆ సమయంలో ఆయన చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇంతకీ అది ఏ బ్రాండ్ వాచ్ అని చాలామంది సెర్చ్ చేయడం కూడా మొదలెట్టేసారు.షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్.. ఆడేమర్స్ పిగుఎంట్ (Audemars Piguet) బ్రాండ్ అని తెలుస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఎందుకంటే ఇలాంటి వాచీలు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 250 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 76 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించిన షారుఖ్ ఖాన్.. నలుపు రెండు డ్రెస్సులో ఆకర్షణీయంగా కనిపించారు. ఈయన చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించి ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాచ్ ప్రత్యేకతలుషారుఖ్ ఖాన్ చేతికున్న ఆడేమర్స్ పిగుఎంట్ వాచ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది 18 క్యారెట్ల సాండ్ గోల్డ్‌తో తయారైనట్లు తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉంది. View this post on Instagram A post shared by SHAH RUKH KHAN (@shahrukh__khan__fanclub)షారుఖ్ ఖాన్ వాచ్ కలెక్షన్నటుడు షారుఖ్ ఖాన్ వద్ద ఆడేమర్స్ పిగుఎంట్ బ్రాండ్ వాచ్ మాత్రమే కాకుండా.. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ క్రోనోగ్రాఫ్ 5968ఏ, పాటెక్ ఫిలిప్పే నాటిలస్ 58811/1జీ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ 2640ఐపీఓ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ పర్ఫెటుల్ క్యాలెండర్, బెల్గరి ఆక్టో రోమా టూర్‌బిల్లాన్ సఫైర్ 103154, ట్యాగ్ హ్యూయర్ క్యాలిబర్ 1887 స్పేస్ఎక్స్, ట్యాగ్ మొనాకో సిక్స్టీ నైన్ సీడబ్ల్యు911 వంటి ఖరీదైన వాచీలు చాలానే ఉన్నాయి.ఇదీ చదవండి: 80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే.. -
షారుఖ్ ఖాన్‌కి రూ.9 కోట్లు వెనక్కి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.ఇంద్ర భవనమే!బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. -
IIFA అవార్డ్స్ విలేకరుల సమావేశంలో షారుఖ్ ఖాన్,నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
-
ఆ స్టార్ హీరో ఇంట్లో చోరీకి ప్లాన్.. వర్కవుట్ కాకపోవడంతో సైఫ్ ఫ్లాట్‌లో!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడట! షారూఖ్ నివాసమైన మన్నత్‌లో జనవరి 14న చోరీకి పథకం రచించాడట! కానీ అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతడు పటిష్ట భద్రత లేని సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు.ఏం జరిగిందంటే?బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దూరాడు. సైఫ్ చిన్న కుమారుడు జెహ్ (Jehangir Ali Khan) గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను గమనించిన పనిమనిషి బిగ్గరగా కేకలు వేసింది. ఆ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్‌ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆరు కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. దీంతో నటుడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో తండ్రిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. దుండగుడి డిమాండ్ ఏంటంటే.? -
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్‌కు, ఈవెంట్స్‌కు, ప్రమోషన్స్‌కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్‌తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్‌ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్‌ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
పెళ్లిలో డ్యాన్స్.. షారూఖ్ ఎంత తీసుకున్నాడేంటి?
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఇటీవల ఢిల్లీలో ఓ పెళ్లికి హాజరయ్యాడు. వధూవరులతో ముచ్చటించడంతో పాటు స్టేజీపై డ్యాన్స్ కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పెళ్లికూతురి మేకప్ ఆర్టిస్ట్ అమృత కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కాగా పెళ్లికూతురు ఎంతో అదృష్టవంతురాలని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.అతిథిగానా? లేదా..ఓ వ్యక్తి.. వివాహ వేడుకకు వచ్చేందుకు షారూఖ్ ఎంత తీసుకున్నాడు? అని అడగ్గా అతడు ఫ్యామిలీ ఫ్రెండ్ అని అమృత బదులిచ్చింది. అతడు అతిథిగా వచ్చాడా? లేదా స్టేజీపై పర్ఫామ్ చేయడానికి వచ్చాడా? అని మరొకరు ప్రశ్నించగా అఫ్కోర్స్.. స్టేజీపై సందడి చేసేందుకే వచ్చాడని అమృత రిప్లై ఇచ్చింది.సినిమాసినిమాల విషయానికి వస్తే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారూఖ్ కూతురు సుహానా కూడా భాగం కానుంది. అలాగే ముఫాసా: ద లయన్ కింగ్ అనే యానిమేటెడ్ సినిమాలో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Amrit kaur (@amritkaur_artistry) చదవండి: వీడియో లీక్‌పై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్ -
పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్స్.. 12 గంటల్లోనే షారూఖ్ సినిమాను దాటేసింది!
మరో మూడు రోజుల్లో థియేటర్స్ షేక్ కానున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడేళ్ల కష్టం ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనుంది. 2021లో సృష్టించిన రికార్డులన్నీ మొదటి రోజే బద్దలయ్యేలా కనిపిస్తోంది. పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కించిన పుష్ప-2 ఈనెల 5న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే ఓవర్సీస్ టికెట్స్ బుకింగ్స్ పూర్తి కాగా.. ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా ఒక రోజు గడవకముందే రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. టికెట్స్ విడుదలైన కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అధిగమించింది.పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్ కొన్ని గంటల్లో రూ.10 కోట్లను దాటేసింది. పుష్ప 2 బుకింగ్ మొదలైన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి 2 లక్షల టిక్కెట్లు మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. పుష్ప- 2 కన్నడ బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్-2ను సైతం మించిపోయింది. 2022లో ఈ మూవీ టికెట్స్ 12 గంటల్లో 1.25 లక్షలు మాత్రమే సేల్స్ సాధించింది. యష్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ-సేల్స్‌లో రూ.80 కోట్లు వసూలు చేసింది.రాజమౌళి బాహుబలి-2 తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.90 కోట్ల వసూళ్ల మేర టికెట్స్ విక్రయించారు. తొలి 12 గంటల అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే పుష్ప- 2 హిందీలో రూ.5.5 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే తొలి రోజు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులను అధిగమించే ఛాన్స్ ఉంది. -
పుష్పకు ఆదరణ కరువు.. రూ.1 కోటి కూడా రాలే!
క్లాసిక్, బ్లాక్‌బస్టర్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ పుష్పను ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్ క్లాసిక్ కరణ్ అర్జున్ కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది.ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్ ట్రెండ్‌లో కరణ్ అర్జున్, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమా కూడా నవంబర్ 15న రీరిలీజ్ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.పుష్ప 2ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. -
తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్ కూతురిపై ట్రోలింగ్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు. పైగా వారి అంచనాలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి. వాటిని అందుకోవడానికి సెలబ్రిటీ కిడ్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది.ఆదిలోనే ట్రోలింగ్ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ కాన్ కూతురు సుహానా గతేడాది 'ద ఆర్చీస్' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తను పోషించిన వెరోనికా పాత్రకు గానూ విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా సుహానా ఓ సెల్‌ఫోన్ యాడ్‌లో నటించింది. ఇందులో ఆమె ఓ డైలాగ్ చెప్పి తర్వాత వచ్చే మ్యూజిక్కు స్టెప్పులేస్తుంటుంది. ఇప్పుడు మరోసారిఈ యాడ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తండ్రికున్న చరిష్మా కూతురికి లేదని విమర్శిస్తున్నారు. 'తన స్క్రీన్ ప్రెసెన్సే నెగెటివ్‌గా అనిపిస్తోంది, 10 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆ యాడ్ చూడలేకపోతున్నా..', 'తను సైడ్ క్యారెక్టర్లకే పనికొస్తుంది తప్ప ప్రధాన పాత్రలకు కాదు' అని హేళన చేస్తున్నారు. అందరి నోళ్లు మూయిస్తుంది!కొందరు మాత్రం తన హెయిర్ స్టైల్ బాగోలేదని, డైరెక్షన్ కూడా సెట్టవలేదని.. అందుకు పూర్తిగా సుహానాదే తప్పని నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సుహానా ప్రస్తుతం తన తండ్రితో కలిసి కింగ్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో అయినా తనను విమర్శించేవారి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్
చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకోవడాన్ని మించిన బాధ మరొకటి లేదంటున్నాడు హీరో షారూఖ్ ఖాన్. ద గ్లోబల్ ఫ్రెయిట్ సమ్మిట్ వేదికలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. నా చిన్నతనంలోనే అమ్మానాన్న మరణించారు. నాన్న 14 ఏళ్ల వయసులో, అమ్మ 24 ఏళ్ల వయసులో చనిపోయారు. పదేళ్ల వ్యవధిలోనే ఇద్దర్నీ కోల్పోయాను. ఎక్కడికెళ్లాలో తెలియలేదు. పేరెంట్స్ కోసం కష్టపడ్డా..నాతో పాటు అక్క కూడా ఉంది. మా ఇద్దరినీ ఈ ప్రపంచంలో వదిలేసి పోయారు. ఆకాశంలోని నక్షత్రాల్లో కలిసిపోయారు. ఎప్పటికైనా ఆ నక్షత్రాల్ని అందుకోవాలనుకునేవాడిని. బహుశా అక్కడ కూడా వాళ్లు మా గురించి కంగారుపడేవారేమో! అందుకనే జీవితంలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడ్డాను. ఎక్కడున్నా నా పేరెంట్స్ బాధపడకూడదని ప్రయత్నించాను. చివరకు అనుకున్నది సాధించాను. గిల్టీగా ఫీల్ అయ్యేవాడినివాళ్లకన్నా ముందు నేను చనిపోయుంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను తిరిగి రాలేనన్న బాధలో నుంచి వారు బయటపడేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ చివరగా డంకీ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి షారూఖ్ కూతురు సుహానా ఖాన్‌తో పాటు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.చదవండి: విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే? -
ఇదేం పిచ్చి సామీ.. హీరో కోసం 95 రోజులుగా!
సినీ ఇండస్ట్రీలో హీరోలకు క్రేజే వేరు. హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వీరికే ఉంటుంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా ఒకరు. ఆయనకు వరల్డ్ వైడ్‌గా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలవడం కోసం చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను షారూఖ్ ఖాన్‌ను కలిసేందుకు దాదాపు 95 రోజుల పాటు ఆయన నివాసమైన మన్నత్ బయటే ఉన్నాడట. జార్ఖండ్‌కు చెందిన వీరాభిమాని షారూఖ్‌ను కలవాలన్న ఆశతో ఇంటి బయటే వేచి చూశాడు. చివరికీ షారూఖ్‌ను కలిసి తన కోరిక నెరవేర్చుకున్నాడు. అభిమాన హీరోతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నవంబర్ 2న షారూక్ ఖాన్ తన 59వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు.గతేడాది బ్యాక్-టు-బ్యాక్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్ కింగ్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటించనున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ
సినిమాలో ఏ హీరోయిన్ను సెలక్ట్ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ 'జుడ్వా', షారూఖ్ ఖాన్ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.హీరోలే డిసైడ్ చేస్తున్నారుఒక సినిమాలో ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్ఫుల్ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్ను తీసుకుంటారు.ట్రెండింగ్‌లో ఉన్నవారే కావాలి!ఎక్కువగా హీరోలు ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్ ఖేల్ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.చదవండి: ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..? -
ఇండియన్ రిచ్చెస్ట్ హీరో 'షారుఖ్ ఖాన్' ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఇండియన్ రిచ్చెస్ట్ సినీ నటుడు ఎవరని అడిగితే వెంటనే షారుఖ్ పేరే చెబుతారు. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా దంపతులకు ఆయన జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్తోనే కెరియర్ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్ బాలీవుడ్ బాద్షా అవడమే కాకుండా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇండియాలోమ రిచ్చెస్ట్ హీరోగా షారుఖ్ ఉన్నారు.ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోషారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 7300 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు.18 ఏళ్ల వయసులోనే ప్రేమ.. హిందూ సాంప్రదాయంలో పెళ్లిషారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్‌ను 1991లో సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్ తమ ప్రేమకథను పంచుకున్నారు. షారుక్ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్ గౌరీ ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు. -
పడిలేచిన కెరటం.. చిల్లిగవ్వ లేకుండా ముంబైకి.. ఇప్పుడేమో వేలకోట్లు ఆస్తి! (ఫొటోలు)
-
సినిమాలు మానేద్దామని అనుకున్నా.. అంతా షారూఖ్ వల్లే: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ చిత్రంలో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆదిపురుష్ భామ కృతి సనన్ కూడా నటిస్తోంది. తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజోల్ అలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్‌తో తనతో చెప్పిన అనుభవాన్ని వివరించింది.సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ తెలిపింది. నా మూడో సినిమాకే చాలా అలసిపోయినట్లు అనిపించింది.. దీంతో నటనకు గుడ్ బై చెప్పాలనుకున్నా అని వెల్లడించింది. కానీ షారూఖ్ ఖాన్ మాటల వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్నానని పేర్కొంది.కాజోల్ మాట్లాడుతూ..' చాలా ఏళ్ల క్రితం ఉధార్ కి జిందగీ అనే సినిమా చేశా. అదే నా మూడో సినిమా. ఆ సమయంలో ఇండస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు నా వయసు దాదాపు 18 ఏళ్లు ఉంటుంది. నేను ఆ సినిమాను పూర్తి చేశా. ఇప్పటికీ నాకు గుర్తుంది. నీకు నటన తెలుసు.. కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి' అని సలహా ఇచ్చారని తెలిపింది.కాగా.. కాజోల్ 1992లో బేఖుడి మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాజీగర్ , కరణ్ అర్జున్ , దిల్వాలే దుల్హనియా లే జాయేంగే , గుప్త్ , ఇష్క్ , కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం దోపట్టి మూవీతో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
పెళ్లి కోసం షారుఖ్ ఖాన్ పేరునే మార్చుకున్నాడా?
బాలీవుడ్ లో అందమైన జంటలలో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. విరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1991లో షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. ఓ పార్టీలో గౌరిని చూసిన షారుఖ్.. తొలి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. తన భార్యగా గౌరీనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడట. అప్పటికి షారుఖ్ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. చాలా కాలం తర్వాత షారుఖ్ ప్రేమను గౌరి అంగీకరించింది. అయితే వీరి వివాహానికి గౌరి ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో షారుఖ్ పేరుని అభినవ్‌గా మార్చి ఫ్యామిలీ వాళ్లకి పరిచయం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని గౌరీ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పింది.‘ఇద్దరి మతం వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో రిజిస్ట్రైషన్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్‌కి అభినవ్ అని పేరు మార్చి ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాను. అలా పరిచయం చేస్తే షారుఖ్ హిందువు అని భావించి.. పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నాను. అది చాలా సిల్లీ, చైల్డీష్ ఆలోచన’ అని గౌరి ఓ ఇంటర్యూలో చెప్పింది.చాలా గొడవల షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. 1991 అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత గౌరి మతం మార్చుకుంటుందని అంతా భావించారు. కానీ ఆమె మారలేదు. షారుఖ్ కూడా ఈ విషయంలో గౌరిని బలవంతం పెట్టలేదు. ‘నాలాగే షారుఖ్ కూడా అన్ని మతాలకు గౌరవం ఇస్తాడు. తన మతంలోని మారమని ఎప్పుడూ నన్ను అడగలేదు’అని ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ చెప్పొచ్చింది. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. ఆర్యన్ ఖాన్ , సుహానా, అబ్రం ఖాన్. పెళ్లి తర్వాత గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియాలోని టాప్ ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఖాన్ ఒకరు. -
‘వాచ్’ దిస్ ట్రెండ్ : కాలం కలిసొస్తోంది
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేతికి ఒకసారి సుమారు 4.75 కోట్ల విలువ చేసే నీలంరంగు ఆడెమర్స్ పిగ్యూట్ వాచ్‌తో మెరిపించాడు. కోట్ల నుంచి ఐదు లక్షల విలువ చేసే టగ్ హెయర్ వరకు ఏడెనిమిది వాచ్‌లతో కనిపిస్తాడు ఎస్ఆర్కే. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే నాలుగు కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె ఎఫ్ 1లో టైమ్ చూసుకుంటాడు. రామ్‌చరణ్ దగ్గర మూడు కోట్ల విలువ చేసే రిచర్డ్ మిల్లె నుంచి ఆరు లక్షల విలువ చేసే రోలెక్స్ యాచ్ మాస్టర్ వరకు అరడజనుకు పైగా వాచ్లున్నట్లు సమాచారం. ఇక నటీమణుల విషయానికి వస్తే నయనతార కోటికి పైగా ధర పలికే రిచర్డ్ మిల్లె ఆర్ ఎమ్ 11 వాచ్‌తో కాలాన్ని వాచ్ చేస్తుంది.స్మార్ట్ ఫోన్ వచ్చినా రిస్ట్ వాచ్లకు ‘కాలం’ చెల్లలేదు. నిజమే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రిస్ట్ వాచ్లకు కాలం చెల్లిందనిపించింది. ఓ దశాబ్దం పాటు వాచీల మార్కెట్ డీలా పడిన మాట కూడా నిజమే. అయితే ఆ రోజుల్లో కూడా సెలబ్రిటీలు, సంపన్నులు, తరచూ విదేశీ టూర్లు చేసే వాళ్లు లక్షల ఖరీదు చేసి వాచ్‌లు పెట్టుకోవడం మాత్రం కొనసాగింది. మన సినీ సెలబ్రిటీలైతే రిచర్డ్ మిల్లె, టగ్ హెయర్, హబ్లాట్, ఫ్రాంక్ ముల్లర్, ఆడెమర్స్ పిగ్యూట్, రాడో, పటేక్ ఫిలిప్పె, ఓమెగా, రోలెక్స్ నుంచి ఐడబ్ల్యూసీ వరకు ఐదు కోట్ల విలువ చేసే వాచ్‌ల నుంచి ఐదు లక్షల రూ΄ాయల వాచ్‌లు వాడుతున్నారు. ఈ ట్రెండ్ సెలబ్రిటీల దగ్గరే ఆగి΄ోకుండా గడచిన రెండేళ్లుగా కామన్ మ్యాన్ వరకు విస్తరించింది. ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి కూడా యాభై వేల నుంచి లక్షల రూ΄ాయల రిస్ట్ వాచ్‌లు కొనుగోలు చేస్తోంది. ప్రపంచ గడియారాల తయారీ కేంద్రం స్విట్జర్లాండ్ నుంచి మనదేశానికి దిగుమతి అవుతోన్న వాచ్‌ల సంఖ్య ఏడాదకేడాదికీ పెరుగుతోంది. 2026 నాటికి స్విస్ నుంచి వాచ్‌లు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ టాప్‌టెన్‌లో ఉంటుందని చెబుతున్నారు ఆ దేశ మార్కెట్ నిపుణులు. ఉంగరంలా మనదేశంలో 40 ఏళ్లుగా వేళ్లూనుకుని ఉన్న టైటాన్‌తో΄ాటు దాదాపు 30 కంపెనీలున్నాయి. వీటి మార్కెట్ వీటికి ఉంది. మనదేశీయ కంపెనీలు వందల నుంచి లక్షల విలువ చేసే గోల్డ్ వాచ్‌లు కూడా తయారు చేస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సంపన్న మహిళలు బంగారు వాచ్ ధరించి మురిసి΄ోయేవాళ్లు. ఇప్పుడు రోలెక్స్, రాడో కపుల్ వాచ్‌లు, రోజ్‌గోల్డ్ మీద మనసు పడుతున్నారు. యూఎస్‌కి చెందిన ఫాజిల్ కంపెనీ మహిళల కోసం తయారు చేస్తున్న రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వాచ్‌ల మీద మనసు పారేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇండియా నుంచి యూఎస్‌కి మైగ్రేషన్ ఎక్కువ కావడమే. యూఎస్‌లో సెటిలైన యువత వాళ్ల తల్లులకు ఈ వాచ్‌లను బహుమతిగా ఇస్తున్నారు. దాంతో వేడుకల్లో మహిళల మణికట్టుకు రోజ్‌గోల్డ్ వాచ్ మెరుస్తోంది. మొత్తానికి మనదేశంలో వాచ్‌ల ప్రేమికులు ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వాచ్‌లు కొంటున్నారు. యువతులు మాత్రం వాచ్ అంటే మణికట్టుకే ఎందుకు పెట్టుకోవాలంటూ వేలికి ఉంగరంలా ధరించే వాచ్లకు మొగ్గుచూపుతున్నారు.– వి.ఎమ్.ఆర్. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
‘ధూమ్ 4’లో విలన్‌గా సూర్య.!
-
IIFA అవార్డ్స్ 24వ ఎడిషన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
షారూఖ్.. లుంగీ డ్యాన్స్ సాంగ్ తనకు నచ్చలేదన్నాడు
చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని పాటలన్నీ హిట్టే! అందులోని లుంగి డ్యాన్స్ సాంగ్ అయితే మరింత స్పెషల్.. అయితే ఈ పాట చేయడానికి షారూఖ్ ఖాన్ నిరాకరించాడంటున్నాడు సింగర్ హనీ సింగ్. తాజా ఇంటర్వ్యూలో మరెన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హనీ సింగ్ మాట్లాడుతూ.. నేను, గిప్పీ కలిసి ఆంగ్రేజీ బీట్ అనే మ్యూజిక్ వీడియోను థాయ్‌లాండ్‌లో షూట్ చేశాం. ఈ సాంగ్‌లో దాదాపు 400 మంది అమ్మాయిలు బికినీలో కనిపిస్తారు. రేపు నా ఇంటిమీదకొస్తే..అయితే అప్పటికే పంజాబ్‌లో(అసభ్యకరమైన లిరిక్స్ వాడుతున్నానంటూ) నామీద కోపంతో నా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. దీంతో గిప్పి ఈ ఆంగ్రేజీ బీట్‌ను పక్కన పడేద్దామన్నాడు. నువ్వు ఢిల్లీలో ఉంటావు, కాబట్టి నీ దిష్టిబొమ్మలు తగలబెట్టినా బేఖాతరు చేస్తున్నావు. కానీ నేను పంజాబ్‌లోనే ఉంటాను. వాళ్లు మా ఇంటికి వచ్చి గొడవ చేసినా చేస్తారని భయపడ్డాడు. ఈ వీడియోను రిలీజ్ చేయకుండా ఆపేద్దామన్నాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించా..దానికోసం అంత ఖర్చు పెట్టింది ఇలా ఆపేయడానికా? అని చాలాసేపు వాదించాను. పంజాబ్‌లో తిరస్కరిస్తారేమో కానీ బెంగళూరు, హైదరాబాద్, వారణాసి.. ఇలా ఇతర నగరాల్లో కచ్చితంగా ఆదరిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అతడు మాత్రం ఆ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే నాతో మాట్లాడనని శపథం చేశాడు. దీంతో ఆ మ్యూజిక్ వీడియోను పక్కన పడేయక తప్పలేదు.రెండూ సూపర్ హిట్ఆంగ్రేజీ బీట్ లాంటిదే ఓ సాంగ్ కావాలని కాక్టైల్ సినిమాటీమ్ అడిగింది. అలాంటిది వద్దని పార్టీ ఆల్ నైట్ కంపోజ్ చేసిచ్చాను. కానీ వాళ్లు మాత్రం ఆంగ్రేజీ బీట్‌నే తీసుకున్నారు. పార్టీ ఆల్ నైట్ మరొకరు కొనుక్కున్నారు. రెండూ సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఇలాంటిదే ఇంకోటి కావాలని చెన్నై ఎక్స్‌ప్రెస్ టీమ్ అడిగింది. సరేనని లుంగీ డ్యాన్స్ కంపోజ్ చేశాను.షారూఖ్‌కు నచ్చలేదుకానీ షారూఖ్ ఖాన్ అది తనకు నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. నేను నిరాశతో నిర్మాత భూషణ్ కుమార్ దగ్గరకు వెళ్లి సాంగ్ వినిపించాను. అప్పుడతడు ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నాడు. నిజానికి ఈ పాటను ప్రైవేట్‌గా రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమా కోసం తీసుకున్నారు అని చెప్పాడు. బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఐఎండీబీలో...రెండో స్థానంలో శోభిత... మూడో స్థానంలో షారుక్
ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ (2013) విజేతగా, మోడల్‌గా ‘గూఢచారి, మేజర్’ వంటి తెలుగు చిత్రాలతో, హిందీ ‘రామన్ రాఘవ్ 2.ఓ’ చిత్రంతో, ‘మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి సిరీస్‌లతో... ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులార్టీ సంపాదించుకున్నారు. అయితే హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్‌గా నిలిచారామె.అందుకు నిదర్శనం ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) తాజాగా రిలీజ్ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా. ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు. గత వారానికి సంబంధించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ (‘ముంజ్యా’ మూవీ ఫేమ్) తొలి స్థానంలో నిలవగా, శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి మూడో స్థానం దక్కింది. నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ కారణంగా గత వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు శోభిత. ఇక ‘ఐఎండీబీ’ జాబితాలో కాజోల్ నాలుగో స్థానం, జాన్వీ కపూర్ ఐదో స్థానం, బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆరు, దీపికా పదుకోన్ ఏడు, విజయ్ సేతుపతి ఎనిమిది, మృణాల్ ఠాకూర్ తొమ్మిది, ఐశ్వర్యా రాయ్ పదో స్థానాల్లో నిలిచారు. -
ఫిల్మ్ ఫెస్టివల్లో షారూఖ్ సందడి.. హీరో తీరుపై నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్షా నిలిచారు. అయితే ఈవెంట్ పాల్గొన్న తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహిళలను డీగ్రేడ్ చేసి చూపించే చిత్రాల్లో నటించడం తనకు ఇష్టముండదని చెప్పారు.అయితే ఈవెంట్లో బాలీవుడ్ బాద్షా చేసిన పనికి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వేదికపై ఉన్న ఓ పెద్దాయనను పక్కకు తోసివేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షారూఖ్ తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీ అయి ఉండి ఓ పెద్దాయనతో ఇలా ప్రవర్తించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే షారూక్ కావాలని అలా చేయలేదని.. ఏదో సరదాగా అలా చేశారని కింగ్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ బాద్షా చివరిసారిగా డుంకీ చిత్రంలో కనిపించారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో తాప్సీ, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. . #ShahRukhKhan he pushed that old man!!! Shame on you @iamsrk pic.twitter.com/eA1g3G66xb— Azzmin✨ SIKANDAR🗿 (@being_azmin) August 10, 2024 -
బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ సొంతం! (ఫొటోలు)
-
అలా చేస్తే డైరెక్ట్‌గా చావును అమ్మినట్లే: జాన్ అబ్రహం కామెంట్స్!
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం యాక్షన్-థ్రిల్లర్ వేదా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో.. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది.ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ మసాలా యాడ్స్‌లో నటిస్తున్న హీరోలపై విమర్శలు చేశారు. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ఉత్పత్తులను ప్రచారం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అభిమానులకు తాను రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకుంటానని తెలిపారు.జాన్ అబ్రహం మాట్లాడుతూ.. 'నేను నిజాయితీగా జీవిస్తేనే రోల్ మోడల్‌గా ఉంటా. ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేస్తే తొందరగా దాన్ని గుర్తిస్తారు. ఇక్కడ కొందరు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు. కానీ అదే వ్యక్తులు పాన్ మసాలా గురించి ప్రచారం చేస్తారు. నేను నా సహ నటులందరినీ గౌరవిస్తా. ఇక్కడ కేవలం నా గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మరణాన్ని అమ్మాలనుకోవడం లేదు. మనదేశంలో పాన్ మసాలా వార్షిక టర్నోవర్ రూ.45 వేల కోట్లు అని మీకు తెలుసా? అంటే ప్రభుత్వం కూడా దీనికి మద్దతిస్తోంది. అందుకే ఇక్కడ చట్టవిరుద్ధం కాదు. వీటి గురించి ప్రచారం చేసే సెలబ్రిటీలు ఇన్‌డైరెక్ట్‌గా చావును ప్రజలకు అమ్మినట్లే. అలా వచ్చిన డబ్బులతో మీరెలా బతుకుతున్నారు' అని విమర్శించారు. కాగా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటనలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇలాంటి యాడ్స్‌లో పాల్గొనబోనని అక్షయ్ ప్రకటించాడు. కాగా.. జిస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహం.. ఆ తర్వాత ధూమ్, గరం మసాలా, టాక్సీ నెం 9211, దోస్తానా, ఫోర్స్, దేశీ బాయ్జ్, రేస్ 2, పఠాన్ వంటి చిత్రాల్లో నటించారు. -
పంజాబ్ కింగ్స్ ఓనర్‌తో షారుక్ ఖాన్ తీవ్ర వాగ్వాదం.. కారణమిదే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని బుధవారం( జులై 31) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో ఆయా ప్రాంఛైజీల ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా ముగ్గురు ఆన్ క్యాప్డడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఒకట్రెండు ఫ్రాంచైజీల ఓనర్ల మినహా దాదాపు అందరూ అంగీకరించినట్లు వినికిడి. అయితే ఇదే విషయంపై కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. షారుక్ ఖాన్ కచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పట్టు పట్టినట్లు సమాచారం. కానీ నెస్ వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు కల్పించవద్దని, మెగా వేలం వైపు మెగ్గు చూపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశముంది. -
విలన్‌గా అభిషేక్ బచ్చన్.. షారుఖ్‌తో ఢీ!
షారుక్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుక్ ఖాన్ , ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ తెరకెక్కనుంది. (చదవండి: ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్‌లో నటిస్తే.. ఇది అదే)ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీలో విలన్ రోల్ కొత్తగా ఉంటుందట. ఈ రోల్‌కు అభిషేక్ బచ్చన్‌ను సంప్రదించారట సుజోయ్ ఘోష్. నెగటివ్ రోల్ కావడంతో మొదట కాస్త విముఖతను వ్యక్తం చేసిన అభిషేక్.. పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఫైనల్‌గా ఓకే చె΄్పారని బాలీవుడ్ సమాచారం. -
బాలీవుడ్ బాద్షాకు ప్రతిష్టాత్మక అవార్డ్!
బాలీవుడ్ బాద్షా గతేడాది జవాన్, పఠాన్, డుంకీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. జవాన్, పఠాన్ బ్లాక్‌బస్టర్ హిట్ కాదగా.. డిసెంబర్లో రిలీజైన రాజ్ కుమార్ హిరానీ చిత్రం డుంకీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం షారుక్ ఎలాంటి ప్రాజెక్ట్‌లోను నటించడం లేదు. తాజాగా మన బాలీవుడ్ హీరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కెరీర్ అచీవ్మెంట్ అవార్డ్‌కు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని ఫెస్టివల్ సైట్ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసినందుకు అవార్డ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన జరగనున్న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు. అంతేకాకుండా ఈ వేడుకలో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన దేవదాస్ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతంలో సాయ్ మింగ్-లియాంగ్, క్లాడియా కార్డినాలే, జానీ టో, ఫ్రాన్సిస్కో రోసీ, హ్యారీ బెలాఫోంటే, జేన్ బిర్కిన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. -
ఈఎమ్ఐ కట్టకపోవడంతో షారూఖ్ కారు తీసుకెళ్లారు: హీరోయిన్
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షారూఖ్ ఖాన్. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ, పంటి కింద బాధల్ని భరిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. సినిమాల్లోకి రావాలనుకునే చాలామందికి ఆయనొక ఇన్స్పిరేషన్. ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదని, తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాడంటోంది హీరోయిన్ జుహీ చావ్లా.నాకు ఇప్పటికీ గుర్తు..ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. షారూఖ్ ఇబ్బంది పడ్డ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. తనకు ముంబైలో ఇల్లు లేదు. ఢిల్లీ నుంచి వచ్చేవాడు. తనకు వంట చేసేవారు లేరు. ఎక్కడ ఉండేవాడో తెలీదు. సెట్లో అందరి కోసం చేసిన వంటను ఆరగించేవాడు. సెట్లోని వారితో కలివిడిగా ఉండేవాడు. ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుండేవాడు.గడియారంతో పోటీపడుతూ..అప్పట్లో తనకు జిప్సీ కారుండేది. అందులోనే వచ్చేవాడు. మూడు షిఫ్టుల్లోనూ పని చేసేవాడు. మేమిద్దరం రాజు బన్‌గయా జెంటిల్మెన్, దిల్ ఆష్నా హై సినిమాల్లో కలిసి పని చేశాం. అప్పుడే దివ్య భారతితో మరో మూవీ చేశాడు. గడియారంతో పోటీపడి వర్క్ చేసేవాడు. ఏదో కారణాల వల్ల తన కారు ఈఎమ్ఐ కట్టలేకపోయాడు. ఇప్పుడీ స్థాయిలో..దీంతో అతడి కారును తీసుకెళ్లిపోయారు. అప్పుడు దిగాలుగా సెట్‌కు వచ్చాడు. నువ్వేం బాధపడకు.. భవిష్యత్తులో ఎన్నో కార్లు కొనే స్థాయికి ఎదుగుతావు.. చూస్తూ ఉండు అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో మీరూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. కాగా షారూఖ్ కారును తీసుకెళ్లిన సమయంలో జుహీ చావ్లా తన కారును వాడుకోమని ఇచ్చింది.చదవండి: అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్ -
లండన్‌లో బాలీవుడ్ బాద్షా ఇల్లు.. వీడియో వైరల్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అత్యధిక పారితోషకాలు తీసుకునే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. షారుఖ్‌కు లండన్‌లో ఉన్న ఇంటికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్‌లో బయటకు వచ్చింది.షారుఖ్ ఖాన్ లండన్ ఇల్లు ఇదేనంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ వీడియోను పోస్ట్ చేశారు. 'ఇది లండన్ లోని షారుఖ్ ఖాన్ ఇల్లు' అని లండన్ లోని పార్క్ లేన్ లోని 117లో ఉన్న ఈ ఇంటి వీడియోను షేర్ చేస్తూ ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చాడు. 'ఇల్లు మొత్తం తనది కాదు.. అతని ఫ్లాట్ కింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది' అని కామెంట్స్ సెక్షన్ లో ఓ యూజర్ పేర్కొన్నారు. లండన్ లోని విలాసవంతమైన మేఫేర్ పరిసరాల్లో షారుఖ్‌కు అనేక ఆస్తులు ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు.ఎంతకు కొన్నాడంటే..మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్‌లో 2009లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ పార్క్ లేన్ లోని ఈ అపార్ట్ మెంట్‌ను 20 మిలియన్ పౌండ్లు పెట్టి కొన్నారు. భారత్ బయట ఒక ప్రాపర్టీ కోసం ఏ బాలీవుడ్ స్టార్ ఇంత అధిక మొత్తం వెచ్చించలేదని నివేదిక పేర్కొంది. View this post on Instagram A post shared by Asif Iqbal (Ovee) | London & Travel 🛫 (@beingovee) -
స్టార్ హీరో సరసన సమంత.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అందుకే ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. ఇటీవలే ఇషా ఫౌండేషన్‌లో సామ్ మెరిసింది. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. పూర్తిగా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.అయితే తాజాగా సమంత ఓ క్రేజీ కాంబోలో పని చేయనున్నట్లు వార్త తెగ వైరలవుతోంది. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సరసన నటించనుందని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొచ్చాయి. కాగా.. గతేడాది ఆయన డైరెక్షన్లో వచ్చిన డుంకీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే షారూఖ్ సరసన సమంత నటిస్తోందన్న వార్తలను రాజ్ కుమార్ హిరానీ సన్నిహితులు కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ రాసే దశలోనే ఉన్నారని తెలిపారు. ఈ సినిమాకు నటీనటులను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. ఈ వార్తలన్నీ ఫేక్ అని డైరెక్టర్ సన్నిహితులు వెల్లడించారు. ఏ ప్రాజెక్ట్‌కి సంబంధించి షారుఖ్, సమంతతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.కాగా.. 2022 ఇంటర్వ్యూలో సమంత ఒకసారి షారుఖ్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన డ్రీమ్ కో-స్టార్స్ ఎవరని అడిగినప్పుడు.. మహేష్ బాబు, సూర్య, షారూఖ్ పేర్లను సామ్ చెప్పింది. నేను ఇప్పటికీ షారుఖ్ ఖాన్‌తో కలిసి పని చేయలేదు.. నా కల ఇప్పటికీ నిజం కాలేదు సమంత వ్యాఖ్యానించింది.మరోవైపు షారూక్ తదుపరి చిత్రం ది కింగ్‌లో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి నటించనున్నాడు. దీనికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
ఎస్ఆర్కె సినిమాకి ఎస్?
షారుక్ ఖాన్ని బాలీవుడ్లో ఎస్ఆర్కె అని పిలుస్తాంటారని అందరికీ తెలిసిన విషయమే. ఎస్ఆర్కే సరసన సమంత హీరోయిన్గా నటించనున్నారన్నది తాజా టాక్. ఈ చిత్రంలో నటించడానికి సమంత దాదాపు ‘ఎస్’ చెప్పారట. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా పోందనుందని టాక్.దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ అడ్వంచరస్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఆగస్ట్ 15న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. కాగా... ఇప్పటికే సమంత ఫలానా హిందీ చిత్రంలో నటించనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. కానీ ఎస్ఆర్కె–సమంత కాంబినేషన్ సినిమా నిజం అవుతుందని హిందీ చిత్రసీమ అంటోంది. -
రూ. 6300 కోట్లతో రిచెస్ట్ హీరోగా షారూఖ్ : మరి ఐకాన్ స్టార్ సంపద ఎంత?
బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. దశాబ్దాల కరియర్లో అనేక బ్లాక్ బ్లస్టర్లు, సూపర్‌హిట్ మూవీలతో బాక్సాఫీసు కలెక్షన్లలో దుమ్ము రేపి రారాజుగా నిలిచాడు. ఇటీవలి కాలంలో కొన్ని ఫ్లాప్ మూవీలు, సౌత్ సినిమా హవా ఉన్నప్పటికీ, 'జవాన్' ,పఠాన్' సినిమాల విజయవంతంతో షారుఖ్ ఖాన్ నికర విలువ గణనీయంగా పెరిగింది. అందుకే సంపాదనలో టాప్‌లో నిలిచాడు.ఇటీవల, IMDb డేటా సహాయంతో, ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తర ,దక్షిణ భారత నటీనటులు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 6300 కోట్ల నికర విలువో షారూఖ్ ఖాన్ టాప్‌లో నిలిచాడు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి ఇతర నటీనటులు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. షారూఖ్ కరియర్లో జవాన్, పఠాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.20000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘డుంకీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది..ఇక ఈ లిస్ట్‌లో రూ. 2900 కోట్ల నికర సంపదతో స్టార్హీరో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. సల్మాన్ చిత్రం ‘టైగర్ 3’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 466.63 కోట్లను వసూలు చేసింది.అక్షయ్ కుమార్ నికర విలువ దాదాపు 2500 కోట్లు ఉంటుందని అంచనా. 'OMG 2' కుమార్ అతిథి పాత్రను చూసింది , ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ నటుడు తరువాత చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్.'ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్1862 కోట్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ నికర విలువ దాదాపు రూ. 474 కోట్లుగా లెక్కించారు. రజనీకాంత్ నికర విలువ దాదాపు 430 కోట్లు. టాలీవుడ్‌కి సంబంధించి పుష్ప సినిమాతో కలెక్షన్ల సునామీ రేపిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లుగా ఉండగా, ప్రభాస్ నికర విలువ 241 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్ నికర విలువ రూ.196 కోట్లు. కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలతో 10వ స్థానంలో నిలిచారు. -
షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్? బిగ్‌బీని తక్కువ చేసి..
ఫలానా హీరోకు టెక్కు ఎక్కువ.. ఆ దర్శకుడికి ముక్కు మీద కోపం.. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కైతే పొగరు.. ఇలా ఇండస్ట్రీలోని తారల గురించి నెగెటివ్‌గా చాలామంది మాట్లాడుకుంటారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధమనేది ఎవరికీ తెలియదు. అలా షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్ అని తానూ విన్నానంటున్నాడు బాలీవుడ్ నటుడు దేవన్ భోజని.యాటిట్యూడ్..తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జో జీతా వోహి సికిందర్ సినిమా తర్వాత ఓ మూవీలో షారూఖ్ ఫ్రెండ్‌గా నాకు ఛాన్స్ వచ్చింది. అప్పటికే తనకు యాటిట్యూడ్ ఉందని విన్నాను. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ గురించి కూడా చెడుగా మాట్లాడతాడని ఎక్కడో చూశాను. ఫస్ట్ డే సెట్‌కు వెళ్లగానే నన్ను నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అయితే షారూఖ్ దగ్గరకు వెళ్లాలనేసరికి మాత్రం అవసరమా? అనిపించింది. నేనెవరనేది తెలుసునా పేరు దేవన్ అని పరిచయం చేసినప్పుడు అయితే ఏంటి? అని వెటకారంగా మాట్లాడతాడేమోనని ఏదేదో ఊహించుకున్నాను. ఇంతలో వెనక్కు తిరిగేసరికి తనే నిలబడ్డాడు. హాయ్, నేను షారూఖ్.. జో జీతా వోహి సికిందర్ సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని మెచ్చుకున్నాడు. నేనెవరనేది తనకు తెలుసా? అని ఆశ్చర్యపోయాను.ప్రశంసలునా సినిమా చాలా నచ్చిందన్నాడు. తన గురించి విన్నదంతా పచ్చి అబద్ధమేనని అప్పుడర్థమైంది. తను చాలా బాగా కలిసిపోతాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా దేవన్, షారూఖ్ 1994లో యే లంహే జుడాయికె సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం చాలా ఆలస్యంగా 2004లో విడుదలైంది.చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్ బాబు -
అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లి.. రణ్వీర్, షారుఖ్‌లకు వెనక్కు నెట్టి..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారత దేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. సెలబ్రిటి బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక (KROLL) ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో రూ. 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గతేడాది కోహ్లి ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29 శాతం మేర పెరిగింది. 2022లో రెండో స్థానంలో నిలిచిన కోహ్లి.. గతేడాది బాలీవుడ్ స్టార్లు రణ్వీర్ సింగ్ (రూ. 1693 కోట్లు), షారుఖ్ ఖాన్‌లను (రూ. 1001 కోట్లు) అధిగమించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించాడు. కోహ్లి 2017 నుంచి వరుసగా (మధ్యలో 2022లో రెండో స్థానం) ఆరు సార్లు భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.క్రికెట్‌కు సంబంధించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు.ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ 2024తో బిజీగా ఉన్న కోహ్లి గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలువడంతో పాటు ఆ ఏడాదంతా పలు బ్యాటింగ్ రికార్డులు కొల్లగొట్టాడు. 35 ఏళ్ల కోహ్లి ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. ఈ పరుగుల యంత్రం 2024 ఐపీఎల్ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి 2023 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్ ఆశించిన మేర రాణించనప్పటికీ టీమిండియా సూపర్-8కు చేరింది. సూపర్-8లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. -
చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్..
పాఠాలు నేర్పిన గురువు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కానీ అభిమాని పేరు చెప్పగానే కదల్లేని స్థితిలో ఉన్న ఆయన కళ్లలో ఒక మెరుపు. అది చూసిన కాంగ్రెస్ లీడర్ సజరిత లైఫ్‌లాంగ్.. ఎలాగే ఆ శిష్యుడిని గురువు ముందు హాజరుపర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం అలాగైనా ఆయన ఆరోగ్య పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నారు.క్షీణిస్తున్న ఆరోగ్యంఆ శిష్యుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ గురువు ఎరిక్ డిసౌజ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ విషయాన్ని డిసౌజ సోదరి సజరిత లైఫ్‌లాంగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'నా సోదరుడు ఎరిక్ డిసౌజ హెల్త్ కండీషన్ దిగజారుతోంది. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ప్లీజ్ షారూఖ్.. ఒక్కసారి ఆయనను చూడటానికి రా.. క్షణాలు గడిచేకొద్దీ తనకేం జరుగుతుందోనని భయంగా ఉంది. ముంబై నుంచి గోవా రావడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. కొన్ని నిమిషాలు చాలుఒక అరగంటలో వచ్చేయొచ్చు. కేవలం కొన్ని నిమిషాల సమయం తన కోసం కేటాయించు. ఇప్పుడాయనకు మీరే ప్రపంచం. మీ రాక వల్ల తను కోలుకునే అవకాశం ఉంది. లేదంటే తన కళ్లముందు కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి లభించి శాంతి చేకూరవచ్చు. చివరిసారిగా అడుగుతున్నాను.. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాను' అని అభ్యర్థించారు. షారూఖ్‌కు, ఎరిక్ డిసౌజకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ పాత వీడియోను సైతం షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు షారూఖ్.. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన గురువును చూసేందుకు వెళ్లాలని కోరుతున్నారు. This feels like my final plea, my last attempt to reach out to @iamsrk to humbly request his presence by the side of Brother Eric S D'Souza. Each day, Brother 's health weakens, his condition worsening with every passing moment. Mumbai, just an hour away by flight, holds the… pic.twitter.com/9HaCjp5gLv— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 14, 2024 https://t.co/6QcjlFVvLj— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 15, 2024చదవండి: 'మహారాజ'.. విజయ్ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి -
షారూఖ్ ఖాన్ కంటే నేనే ఎక్కువ సంపాదించా..
షారూఖ్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించానంటోంది కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి.. ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే షారూఖ్ ఖాన్ తొలిసారి వెండితెరపై కనిపించింది దీవానా చిత్రంలో! ఈ మూవీతోనే అతడి కెరీర్ ఆరంభమైంది. నిజానికి అతడు ఫస్ట్ సంతకం చేసింది కబీ హా కబీ నా సినిమాకు.. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఈ సినిమాకే! ఈ సినిమాకు ఫరా ఖాన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది.నాకే ఎక్కువ..తాజాగా ఫరా ఖాన్ ఆ సినిమా విశేషాలను చెప్పుకొచ్చింది. కబీ హా కబీ నా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాకుగానూ షారూఖ్ ఖాన్‌కు రూ.25,000 ఇచ్చారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ నాకే ఇచ్చారు. అదెలాగంటే.. ఒక్క పాటకు రూ.5,000 చొప్పున ఆరు పాటలకుగానూ రూ.30,000 ఇచ్చారు. అప్పట్లో అసిస్టెంట్‌ను పెట్టుకునేంత సీన్ కూడా లేదు.ఫ్రెండ్షిప్కాబట్టి ఆ జీతం అంతా నేను మాత్రమే తీసుకున్నాను. పైగా ఆనా మేరే ప్యార్ కో పాట కోసం బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లకు బదులుగా గోవాలో ఉన్న జనంతోనే షూటింగ్ కానిచ్చేశాం అని తెలిపింది. ఈ సినిమా నుంచే షారూఖ్- ఫరా ఖాన్ మధ్య స్నేహ బంధం బలపడింది. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారూఖ్.. మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: రాజకీయాల కంటే సినిమాలే నయం: కంగనా రనౌత్ -
మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కన్నులపండువగా జరిగింది. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు.. ఇలా ఎందరో ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. వారిలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్.. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఉన్నారు. ఓఆర్ఎస్ తాగుతూ..పక్కపక్కనే కూర్చున్న వీళ్లిద్దరూ ఓఆర్ఎస్ డ్రింక్‌తో దర్శనమిచ్చారు. ఇంకేముంది.. వారిని క్లిక్‌మనిపించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ధనవంతులైన వీరు ఖరీదైన డ్రింక్స్‌కు బదులుగా దాదాపు రూ.30 ఉంటే ఓఆర్ఎస్ డ్రింక్ తాగుతున్నారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదే బెటర్'సోడా సహా ఇతర డ్రింక్స్ కంటే ఇదే నయం.. ఇప్పుడున్న వాతావరణానికి ఓఆర్ఎస్ తాగితేనే బెటర్. పైగా ఈ మధ్యే షారూఖ్‌కు వడదెబ్బ తగిలింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే', 'హే.. ఈరోజు నేను కూడా ఇదే ఓఆర్ఎస్ తాగాను' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గత నెల షారూఖ్ వడదెబ్బ కారణంగా అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ORS 👍 pic.twitter.com/C24eNG6UYx— sonal. (@sonaluwu) June 9, 2024 HQ pictures of Shah Rukh Khan & Mukesh Ambani at Rashtrapati Bhavan earlier today for PM Narendra Modi's Oath Ceremony ♥️#ShahRukhKhan pic.twitter.com/HlUE9lV7PU— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) June 9, 2024చదవండి: నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి -
నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తాజాగా ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, షార్ప్ షూటర్ సిఫ్త్ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో మెరిసింది. మంచి నటీనటులు ఎందరో..మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్ శర్మ.. నువ్వు ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్ ఖాన్ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది.ఆ హీరోలైతేనే..షారుక్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు! -
ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ప్రేమించే వ్యక్తిని వెతుక్కోవాల్సిన స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. కాగా సానియా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే.ఎంతగానో ప్రేమించి.. ఆటంకాలను ఎదురించి పెళ్లాడిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆమెను మోసం చేశాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయని విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.అయితే, వీరిద్దరూ ఈ విషయంపై నేరుగా నోరు విప్పలేదు. కానీ.. షోయబ్ మాలిక్ ఏకంగా నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. ఫొటోలతో షాకిచ్చాడు. దీంతో సానియా- షోయబ్‌ల బంధం ముక్కలైందని అందరికీ తెలిసిపోయింది.ఈ క్రమంలో సానియా మీర్జా కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. సానియా తనంతట తానుగా షోయబ్ నుంచి విడాకులు తీసుకుందని స్పష్టం చేసింది. ఏదేమైనా అతడి జీవితం బాగుండాలని సానియా ఆశిస్తున్నట్లు తెలిపింది.ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌తో కలిసి దుబాయ్‌లో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘సానియా బయోపిక్ తీసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ కుదిరితే నేనే ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే తనకు జంట(ప్రియుడి)గా కూడా నటిస్తాను’’ అని పేర్కొన్నాడు.ఈ క్రమంలో వ్యాఖ్యాత కపిల్ తాజాగా షారుక్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇందుకు బదులుగా.. ‘‘ముందుగా నేను నా ప్రేమను కనుగొనాలి(ప్రేమించే వ్యక్తి) కదా’’ అని సానియా మీర్జా సమాధానమిచ్చారు.ఈ నేపథ్యంలో సానియా జీవితంతో రెండో అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అదే నిజమైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రతి ఒక్క స్త్రీకి తన జీవితాన్ని అందంగా మలచుకునే అవకాశం ఉందని.. మోసగాళ్ల కోసం తమ లైఫ్‌ను పణంగా పెట్టాల్సిన పనిలేదని కామెంట్లు చేస్తున్నారు. -
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్‌ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్‌లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్‌తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్‌తోనే కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్‌ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్‌దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్‌ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్‌ను వెనకేసుకురావడంలోనూ గంభీర్‌దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్‌ను వెన్నుతట్టి.. వెంకటేశ్‌పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్‌కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్‌కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్‌ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్‌గా గంభీర్‌కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్‌గా కేకేఆర్‌కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. కేకేఆర్ కెప్టెన్‌గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్‌కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్‌కు టైటిల్‌ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ దద్లానీ చేసిన పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.తాజాగా షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె చెప్పింది. షారుఖ్‌పై ఫ్యాన్స్ చూపించే ప్రేమ, ప్రార్ధనలు ఆయనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు అని ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది. కేకేఆర్ ఫైనల్స్ ఆడేటప్పుడు స్టాండ్స్‌లో నుంచి జట్టును ఉత్సాహపరుస్తాడని జట్టు సహ-యజమాని జుహీ చావ్లా తెలిపింది. -
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.కాగా.. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. కోల్‌కతా జట్టుకు యజమానిగా ఉన్న షారూఖ్ ఖాన్ టీమ్‌కు మద్దతుగా స్డేడియంలో సందడి చేశారు. దీంతో అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లిన బాద్షా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో షారుక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. Due to heat stroke dehydration, but sir is fine now and he’s been discharged, nothing to worry.Love You @iamsrk ❤️#ShahRukhKhan https://t.co/5k5S5z1ixD— Sudhir Kothari (@sudhirkothari03) May 22, 2024 -
కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..!
ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ విజయంతో ఆ టీమ్‌సభ్యులు, అభిమానులు విజయానందంలో మునిగిపోయారు. తన టీమ్ సక్సెస్‌ను కళ్లారా చూసిన బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. వెంటనే అలర్ట్ అయి..మ్యాచ్ అనంతరం వెంటనే మైదానంలోకి వెళ్లి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు నడిచాడు. అయితే అక్కడ మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, పార్థీవ్ పటేల్, సురేశ్ రైనా జరిగిన మ్యాచ్ గురించి లైవ్‌లో మాట్లాడుతూ ఉన్నారు. వారిని చూసుకోకుండా తన భార్య, కుమారుడితో ఎంతో హుషారుగా ముందుకు నడిచాడు షారూఖ్. వెంటనే అక్కడ లైవ్ ఎపిసోడ్ జరుగుతుందని గమనించి వాళ్లకు రెండు చేతులు జోడించి సారీ చెప్పి హగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అంత ఖుషీగా ఉండటం చూసి మురిసిపోతున్నారు.షారూఖ్ సినిమాల విషయానికి వస్తే.. కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన షారూఖ్ గతేడాది ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మేనియాలో ఉన్న ఈ హీరో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. తన టీమ్ కేకేఆర్ ఆడే అన్ని మ్యాచులకు హాజరవుతానని మాటిచ్చిన షారూఖ్ దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు. జూలై లేదా ఆగస్టులో అతడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. King Is So Happy 💜#shahrukhkhan #srk #KKRvsSRH pic.twitter.com/fZiHHBoPcp— __𝕊𝕣𝕜𝕚𝕒𝕟__ (@Kashif_srk_fan_) May 22, 2024 చదవండి: తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి? -
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
నిమా హీరోలు ఒక్క హిట్టు కొడితేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఒకటీరెండు కాదు.. ఏకంగా మూడు చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నాడు. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాను సృష్టించాడు. రెస్ట్ కోసం..ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షారుక్ మాట్లాడుతూ.. నాకు కాస్త విశ్రాంతి అవసరమనిపించింది. గతేడాది మూడు సినిమాల కోసం శారీరకంగా చాలా కష్టపడ్డాను. అందుకే కొంత బ్రేక్ తీసుకున్నాను. అలాగే నా ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు అన్ని మ్యాచులకు వస్తానని మాటిచ్చాను. ఆ మజానే వేరుఆ మాట మీద నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. అయినా స్టేడియంలో ఉంటే ఆ మజానే వేరు! సినిమాలంటారా..? నా కొత్త ప్రాజెక్టులు జూలై, ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు క్రికెట్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తాను అని షారుక్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆరుగురు హీరయిన్లతో ‘హీరామండి’..ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతంటే? -
షారుఖ్ ఖాన్ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వెంటనే..
కోల్‌కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.అంతేకాదు.. ఆప్యాయంగా దాదాను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు. షారుఖ్ చర్యతో తొలుత ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకుని హర్షం వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్- ఢిల్లీ తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3/16) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోగా.. పేసర్లలో మిచెల్ స్టార్క్(1/43), వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/28), స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్(1/24) రాణించారు.వీరిలో స్టార్క్ ఒక్కడు ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్(33 బంతుల్లో 68) సొంతగడ్డపై ఢిల్లీ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ వెనుక నుంచి వెళ్లి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీని హత్తుకున్నాడు. వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆప్యాయత ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. the way Shah Rukh Khan ran up to Sourav Ganguly to hug and kiss him, such a wholesome moment, KKR reunion 💜 pic.twitter.com/9I0yenj0V4— sohom (@AwaaraHoon) April 29, 2024 కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్‌కు తొమ్మిదింట ఇది ఆరో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ పదకొండింటికి ఐదు మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో నేను రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్‌తో పాటు ఆర్యన్ కూడా సోషల్‌మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్ చిట్ దక్కింది. -
వీరోచిత శతకంతో రాజస్తాన్‌ను గెలిపించిన బట్లర్ (ఫొటోలు)
-
షారుఖ్ స్టైల్లో సీఎం కేజ్రీవాల్ డైలాగ్.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశం పంపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్టైల్లో ‘మై నేమ్ ఈజ్ అరవింద్ కేజ్రీవాల్.. ఐయామ్ నాట్ టెర్రరిస్ట్’ అంటూ పంపిన ఆ మెజేస్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్‌పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. VIDEO | Here's what BJP leader Manoj Tiwari (@ManojTiwariMP) said reacting to Delhi CM Arvind Kejriwal sending a message to people that he's not a terrorist. "Nobody is calling him a terrorist. We're calling him corrupt. He has made senior citizens cry for pension, poor cry for… pic.twitter.com/fztGHhjCds — Press Trust of India (@PTI_News) April 16, 2024 ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై మనోజ్ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు. దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. देश के बेटे अरविंद केजरीवाल का जेल से देश की जनता को संदेश - मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं। -@SanjayAzadSln pic.twitter.com/9VpPOpnLXa — AAP (@AamAadmiParty) April 16, 2024 -
IPL 2024 : విశాఖలో కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
IPL 2024 : విశాఖలో కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
షారుఖ్ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్ : నెటిజన్ల జోక్స్ వైరల్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్, కోట్లాది రూపాయల సంపద, ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. తాజాగా కింగ్ ఖాన్ లగ్జరీ వాచ్ వార్తల్లో నిలిచింది. నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు. అయితే ఈ వాచ్ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్‌టాపిక్‌గా లిచాయి ఆడెమర్స్ పిగెట్ బ్రాండ్‌కు చెందిన రాయల్ ఓక్ వాచ్‌ను తన బ్లాక్‌బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం రూ. 8 వేలకు చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆడెమర్స్ వెబ్సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్ వెర్షన్ కూడా. ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ T20 సందర్భంగా కూడా ఈ వాచ్‌తో దర్శమనిచ్చాడు షారుఖ్. అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్‌లో 200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్‌లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్ కలెక్షన్లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది. నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్ఎంఏసీసీ ఈవెంట్లో కింగ్ ఖాన్ దీన్ని ధరించాడు. దీని ధర రూ. 31.1 లక్షలు. -
ఏంటి హీరో.. నువ్వే ఇలా చేస్తే ఎలా? షారుక్‌పై సెటైర్లు
ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్ ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమైంది. శనివారం సన్‌రైజర్స్ - కోల్‌కతా నైట్ రైజర్స్ మధ్య పోటీ జరిగింది. తన జట్టుకు మద్దతు తెలిపేందుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. కోల్‌కతాలోని స్టేడియంలో అడుగుపెట్టాడు. ఇతడిని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇదిలా ఉంటే మ్యాచ్ వీక్షించేటప్పుడు షారుక్ పొగ తాగాడంటూ చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ, స్టేడియంలో ఇలాంటి పాడుపనులేంటని విమర్శిస్తున్నారు. కనీసం అక్కడ ఉన్నంతసేపైనా దమ్ము కొట్టకుండా ఉండొచ్చుగా.. అంత బానిసైపోయాడా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. షారుక్ సినిమాల సంగతికొస్తే.. గతేడాది పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస బ్లాక్బస్టర్లు కొట్టాడు. టైగర్ 3 మూవీలో అతిథి పాత్రలో మెరిశాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠగా జరిగిన పోరులో సన్ రైజర్స్‌ను ఓడించి కేకేఆర్ విజయం సాధించింది. Cameraman ki timing 😂😭 What a timing Bakra 😂😂#ShahRukhKhan #IPL2024 #KKRvSRH https://t.co/JUYnHKIdwd — Our darling (@Our_darling___) March 24, 2024 చదవండి: విరూపాక్ష సినిమా హీరోగా నన్నే అనుకున్నారు.. కానీ! -
షారుక్ అలా ఫిక్సయిపోయాడు.. కానీ కమల్.. : దర్శకురాలు
ఫరాఖాన్.. బాలీవుడ్లో పేరు మోసిన కొరియోగ్రాఫర్. దర్శకరచయితగా, నిర్మాతగానూ పేరు తెచ్చుకుంది. ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించిన తొలి చిత్రం మై హూనా. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే విలన్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఫరా ఖాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మై హూనా మూవీలో విలన్ కోసం ఎంతోమందిని సంప్రదించాను. కమల్ ఒప్పుకుంటాడని షారుక్ ధీమా కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు.. నసీరుద్దీన్ షాను అడిగితే చేయనన్నాడు. కమల్ హాసన్ దగ్గరకు వెళ్లాను.. ఆయన కచ్చితంగా చేస్తాడని, తానంటే కమల్ సర్‌కు ఎంతో ఇష్టమని, ఇద్దరం కలిసి ఇదివరకే హే రామ్ అనే సినిమా కూడా చేశామని షారుక్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కానీ ఆయన కూడా తిరస్కరించాడు. నానా పటేకర్‌ను కలిశా.. వారం రోజులకు ఆయన కూడా చేయనని చేతులెత్తేశాడు. షారుక్ నిర్మాతగా తొలి మూవీ చివరకు సునీల్ శెట్టి ఆ పాత్ర చేశాడు' అని ఫరా ఖాన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షారుక్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో తెరకెక్కిన తొలి చిత్రం కావడం విశేషం. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తర్వాత ఫరా ఖాన్- షారుక్ ఖాన్ కాంబినేషన్లో ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలు రూపొందాయి. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్.. -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్‌కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్‌కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్‌చరణ్‌కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్‌లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్‌తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్‌గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 'ఇడ్లీ లొల్లి'.. అసలు ఈ ఇడ్లీ కథేంటంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులు జరిగిన ఈ వేడుకల్లో సిని ప్రముఖులంతా ఆడి పాడి సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ని ఇడ్లీ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ ఫన్నీగా పిలిచారనుకుందామన్న అంత పెద్ద వేడుకలో పిలవడం చాలమందికి నచ్చలేదు. నార్త్ ఇండియన్ హీరోలకు దక్షిణాది హీరోలంటే చులకనే అంటూ రచ్చ మొదలయ్యింది. సరదా సంబోధన కాస్త సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూగా చర్చలకు తెరలేపింది. దక్షిణాది కాబట్టి ఇడ్డీ వడ అని షారుక్ హేళనగా సంబోధించినప్పటికీ..ఇడ్డీ భారతదేశ వంటకం మాత్రం కాదు. వివాదాస్పదంగా మారిన ఈ ఇడ్లీ వ్యాఖ్య నేపథ్యంలో అసలు ఇడ్లీ వంటకం మూలం ఏమిటీ? ఎక్కడ నుంచి ఈ అల్పహారం భారతదేశానికి వచ్చిందో చూద్దామా!. మన భారతీయులకు ముఖ్యంగా దక్షిణాది వాళ్లు వేడి వేడి ఇడ్లీ, అందులోకి మంచి కొబ్బరి చట్నీ, వేడి వేడి సాంబార్ ఉంటే ప్రాణం లేచొస్తుందన్నట్లు భావిస్తారు. ఇది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం కూడా. అయితే ఈ ఇడ్డీ వంటకం భారతీయ వంటకం కాదు. దాని మూలం భారతదేశానికి చెందింది ఎంత మాత్రం కాదు. కాస్త శరీరంలో నలతగా ఉన్న ఇడ్డీ తింటే తేలిగ్గా అరుగుతుందంటారు. ముఖ్యంగా వైద్యులు కూడా రోగులకు ఈ అల్పాహారాన్ని ప్రివర్ చేస్తారు. అలాంటి ఇడ్డీ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం గురించి కర్ణాటకకు చెందని ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, పోషకాహార నిపుణుడు, కెటీ ఆచార్య సవివరంగా వెల్లడించారు. ఇడ్లీ క్రీస్తూ పూర్వం 7 లేదా 12వ శతాబ్దంలో ఇండోనేషియాల్లో ఈ వంటకాన్ని చేసేవారట. వాళ్లు ఈ వంటాకాన్ని కెడ్లీ లేదా కేదారి అనిపిలిచేవారట. అయితే మన మన హిందూ రాజులు ఈ ఇండోనేషియాని పాలించడంతో సెలవుల్లో బంధువులను కలవడానికి భారత్‌కి వచ్చేవారట. అలా వస్తూ వస్తూ..తమ తోపాటు రాజ్యంలో ఉండే వంటవాళ్లను కూడా వెంటపెట్టుకుని తీసుకువెళ్లేవారట. అలా ఈ ఇండోనేషియ వంటకం భారత్‌లోకి వచ్చి ఇడ్లీగా స్థిరపడింది. చరిత్రను పరిశీలిస్తే.. చారిత్రాత్మకంగా అరబ్బులు కూడా ఇడ్లీ వంటకంతో సంబంధం ఉందని మరో కథ చెబుతోంది. 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ అనే పుస్తకంలోనూ, 'సీడ్ టు సివిలైజేషన్ - ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే మరో పుస్తకంలో భారతదేశంలో స్థిరపడ్డ అరబ్బులు హలాల్ ఆహారాల తోపాటు రైస్‌బాల్స్ తినేవారని, వాటిని కొబ్బరి గ్రేవీతో తినేవారని ఉంది. ఇక్కడ అరబ్బులు ఇడ్లీలను రైస్‌బాల్స్ అని పిలిచే వారని తెలుస్తోంది. అలా ఇడ్లీలు మన భారతీయ వంటకాల్లో భాగమయ్యాయి. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఏడోవ శతాబ్దాపు కన్నడ రచన "వద్దరాధనే" అనే గ్రంథంలో ఇడ్డీల గురించి ప్రస్తావించబడింది. వాటిని 'ఇద్దాలి'గా పిలిచినట్లు వాటి తయారీ గురించి సవివరంగా ఉంది. అలాగే పదవ శతాబ్దపు తమిళ వచనం పెరియ పురాణంలో కూడా ఈ వంటకం గురించి ప్రస్తావించబడి ఉంది. ఇది శైవ సాధువుల సముహం అయిన 63 నాయిర్ల జీవిత కథను వివరిస్తూ.. ఈ వంటకం వచ్చిన విధానం గురించి రాసి ఉంది. ఇక మరో చారిత్రక ఆధారం ప్రకారం..క్రీస్తూ శకం 10వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం దాడి తర్వాత సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఇడ్లీ వంటకాన్ని కనుగొనడం జరిగింది. దానికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఉంది. వీటన్నింటి బట్టి చూస్తే ఇడ్డీ అనే వంటకం మూలం భారత్ కాదని పేర్లు మార్చుకుంటూ మన దేశానికి వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇడ్లీ వంటకం మన దేశంలోని భారతీయల మనసులను దోచుకుని ఇష్టమైన వంటకంగా స్థిరపడిపోయిందనే విషయం గ్రహిస్తే మంచిది. (చదవండి: నిమ్మచెక్కతో వంటింటి సమస్యలకు చెక్‌పెట్టండి) -
అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్
జామ్ నగర్లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా అయ్యాయి. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు అందరూ పాల్గొన్నారు. బాలీవుడ్ మొత్తం అంబానీ ఈవెంట్లో కనిపించింది. టాలీవుడ్ నుంచి మాత్రం రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఇదే వేడుకలో రామ్ చరణ్‌ని షారుక్ ఖాన్ అవమానించిన విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్టు బయటపెట్టింది. 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. ఎంతలా అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లు. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ అంటున్నారు. అలానే 'ఆర్ఆర్ఆర్' పాటకు ఆస్కార్ రావడంతో చరణ్.. నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. అందులో భాగంగానే తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆహ్వానం మేరకు పాల్గొన్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?) 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు' పాటకు సల్మాన్-షారుక్-ఆమిర్ ఖాన్‌లతో స్టేజీపై రామ్ చరణ్ స్టెప్పులు కూడా వేశాడు. ఇది అందరికీ తెలుసు. అయితే స్టేజీపైకి పిలిచే క్రమంలోనే చరణ్‌ని 'ఇడ్లీ-వడ' అని సంభోదించి షారుక్ పిలిచారని, దీంతో కోపమొచ్చి స్టేజీ దిగిపోయానని ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్ చెప్పింది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. దీంతో అందరూ షాకవుతున్నారు. అదే టైంలో బాలీవుడ్ హీరోల్ని 'వడాపావ్', 'భేల్ పూరి' అని పిలిస్తే ఊరుకుంటారా అని ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు. ఏదేమైనా ఫన్నీగా అయినా సరే షారుక్.. చరణ్‌ని ఇలా పిలవడంపై మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అలానే బాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకా లోపల మంట అలానే ఉన్నట్లుంది. అందుకే ఇలా పిలిచి ఉంటాడని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహిళల ఐపీఎల్.. సందడి చేసిన షారుక్ ఖాన్
మహిళల ఐపీఎల్ (WPL) 2024 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్ర, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ సందడి చేశారు. SOUND ON 😍 𝙎𝙝𝙖𝙝 𝙍𝙪𝙠𝙝 𝙆𝙝𝙖𝙣 👑 showcases his aura at the #TATAWPL Opening Ceremony 🤩🤩@iamsrk pic.twitter.com/WLjSmCxVXL — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 వీరిలో షారుక్ ఖాన్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. షారుక్ ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లతో కలియదిరుగుతూ వారితో స్పెప్పులు వేయించి ఫోటోలకు పోజులిచ్చాడు. Bengaluru erupts with joy to welcome Shahid Kapoor to the #TATAWPL Opening Ceremony 😃🙌@shahidkapoor pic.twitter.com/C2LckHvV2D — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 మిగతా హీరోలు ఒక్కో ఫ్రాంచైజీ తరఫున ఆడి, పాడారు. కార్తీక్ ఆర్యన్ గుజరాత్ జెయింట్స్‌ను, సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీ క్యాపిటల్స్‌ను, టైగర్ ష్రాఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును, వరుణ్ ధావన్ యూపీ వారియర్స్‌ను, షాహిద్ కపూర్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను రిప్రజెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సీ (ఇంగ్లండ్) 75 పరుగులు చేసి క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 31, షఫాలీ వర్మ 1, జెమీమా రోడ్రిగెజ్ 42, మారిజన్ కప్ 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ర్, నాట్ సీవర్ బ్రంట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్ ఇస్మాయిల్ ఓ వికెట్ దక్కించుకుంది. -
'స్టార్డమ్ పక్కనపెట్టి నాకోసం ఫ్రీగా సినిమా చేశాడు'
స్నేహం కోసం కొందరు ఏదైనా చేస్తారు. ఫ్రెండ్షిప్ కంటే తమకు ఏదీ ఎక్కువ కాదంటారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. తన స్నేహితుడి కోసం స్టార్డమ్ పక్కనపెట్టి ఫ్రీగా సినిమా చేశాడు. అది కూడా స్క్రిప్ట్ వినకుండానే! ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఆ విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు నిర్మాత వివేక్ వాస్వామి. ఈయన 2010లో దుల్హ మిల్ గయా అనే సినిమా నిర్మించాడు. ఇందులో ఫర్దీన్ ఖాన్, సుష్మితా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. షారుక్ కీలక పాత్రలో నటించాడు. స్క్రిప్ట్ కూడా వినకుండానే.. ఆనాటి ముచ్చట్లను తాజా ఇంటర్వ్యూలో నెమరేసుకున్నాడు వివేక్ వాస్వామి. సినిమా చేయమని వివేక్ నా దగ్గరకు రావడం ఇదే తొలిసారి. ఇంకా ఆలోచించాల్సింది ఏముంది? ఈ సినిమా చేస్తున్నాను. అందుకోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు అని షారుక్ అన్నాడు. కనీసం స్క్రిప్ట్ కూడా వినలేదు. అలా అని అతిథి పాత్రలో నటించలేదు. సినిమాలో 42 నిమిషాలు కనిపిస్తాడు. అందులో ఒక్క సన్నివేశం కూడా ఎడిట్ చేయడానికి నేను ఒప్పుకోలేదు. 42 నిమిషాలు అంటే చిన్న విషయం కాదు. ఐదు రోజుల్లో అతడి సీన్స్ షూట్ చేశాం. ఐదు రోజుల్లో షూట్ పూర్తి కథ వినలేదు. ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఇది సీన్.. అన్న వెంటనే అద్భుతంగా నటించేస్తాడు. అది అతడి గొప్పతనం. రాజు బన్‌గయా జెంటిల్మెన్ సినిమాకుగానూ అతడు రూ.50 వేలు తీసుకున్నాడు. తను రూ.10వేలకు సినిమా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో నా ఇంట్లోనే ఉండేవాడు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే కథానాయకులకు రూ.50 వేలు ఇస్తేనే గౌరవంగా ఉంటుంది. ఆ మాత్రం ఇవ్వాలి' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజు బన్‌గయా జెంటిల్మెన్ సినిమాకు వివేక్ సహనిర్మాతగా వ్యవహరించాడు. చదవండి: ప్రేమ పేరుతో సోదరుడు మోసం.. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. ఆ రెండు సినిమాలదే హవా
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. మంగళవారం రాత్రి ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే అవార్డ్స్ సొంతం చేసుకునే విషయంలో 'జవాన్', 'యానిమల్' చిత్రాలు పోటీ పడ్డాయి. పలు విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) దాదా సాహెబ్ ఫాల్కే-2024 అవార్డ్స్ లిస్ట్ ఉత్తమ నటుడు - షారుక్ ఖాన్ (జవాన్) ఉత్తమ నటి- నయనతార (జవాన్) ఉత్తమ దర్శకుడు - సందీప్ రెడ్డి వంగా (యానిమల్) ఉత్తమ నటుడు (నెగిటివ్ రోల్) - బాబీ డియోల్ (యానిమల్) క్రిటిక్స్ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్ రవిచందర్ (జవాన్) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషులు) - వరుణ్ జైన్ ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళలు) - శిల్పా రావు ఉత్తమ గీత రచయిత - జావేద్ అక్తర్ (నిక్లే ది కభి హమ్ ఘర్సే దున్కీ) ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ - యేసుదాసు ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ టీవీ కేటగిరీ టీవీ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్ ఉత్తమ నటుడు - నీల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్) ఉత్తమ నటి - రూపా గంగూలీ (అనుపమ) ఓటీటీ క్రిటిక్స్ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్ సిరీస్) (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) Congratulations @iamsrk on winning the Best Actor Award for Jawan at the #DadasahebPhalkeAward pic.twitter.com/w1FVRL1UOt — Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) February 20, 2024 Nayanthara at Dadasaheb Phalke International Film Festival Awards 2024 💛🏆✨#Nayanthara #DadasahebPhalkeAward pic.twitter.com/xdKzunByQF — WV - Media (@wvmediaa) February 21, 2024 -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో సలార్‌కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. 2023లో పఠాన్,జవాన్ చిత్రాలతో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా ఆ రెండు చిత్రాల రేంజ్లో మెప్పించలేక పోయింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్ వద్ద డంకీ ఆగిపోయింది. తాజాగా డంకీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వాస్తవంగా ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండు షారుక్ డంకీ సినిమాను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో టాలీవుడ్ సినిమాలు అయిన సలార్,యానిమల్,గుంటూరు కారం, హాయ్‌నాన్న వంటి చిత్రాలు టాప్ టెన్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. థియేటర్స్‌లో డంకీ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
Shah Rukh Khan: హాలీవుడ్ హీరోలతో షారుఖ్ పోటీ!
గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. వాటిలో పఠాన్, జవాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి, రూ.1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక డిసెంబర్లో వచ్చిన ‘డంకీ’కూడా మంచి వసూళ్లను సాధించి, షారుఖ్‌కి హ్యాట్రిక్ హిట్‌ని అందించింది. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలను రిలీజ్ చేసి, వాటిలో రెండు చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఏకైక హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించాడు. (చదవండి: చాలా ఎళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ) తాజాగా బాలీవుడ్ బాద్షా హాలీవుడ్ హీరోలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. యాక్షన్, ఫైట్స్, స్టంట్స్ విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడడానికి పఠాన్, జవాన్ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రకటించిన వల్చర్ 2023 ఆన్యువల్ స్టంట్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్‌లో షారుఖ్ నటించిన ‘జవాన్, పఠాన్ చిత్రాలు ఉన్నాయి. కేను రీవ్స్ నటించిన ‘జాన్ విక్ 4’, టామ్ క్రూజ్ హీరోగా చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ వన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ఇవి పోటీ పడనున్నాయి. (చదవండి: రొమాంటిక్ డ్రామాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ) బెస్ట్ వెహిక్యులర్ స్టంట్, బెస్ట్ స్టంట్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీల్లో జవాన్, బెస్ట్ ఏరియల్ స్టంట్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిల్లో ‘పఠాన్’ నామినేట్ అయింది. ఇక బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిలో హాలీవుడ్‌కి చెందిన ‘బెలరినా’, ‘గై రిచీస్ ది కోవనెంట్, ఎక్స్ట్రాక్షన్ 2, ఫిస్ట్ ఆఫ్ ది కోండర్’, ‘జాన్ విక్ - చాప్టర్ 4’, ‘మిషన్ ఇంపాజిబుల - డెడ్ రెకనింగ్ పార్ట్ 1’, ‘సైలెంట్ నైట్’, ‘షిన్ కామెన్ రైడర్ చిత్రాలు ఉన్నాయి. -
షారుక్ ఖాన్ నిర్మాత.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ చిత్రం
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్. వరుస సినిమాలతో ఆమె కెరియర్ ఎంతో బిజీగా ఉంది. గతేడాదిలో ఆరు సినిమాలతో మెప్పించినా ఈ బ్యూటీ కొత్త ఏడాదిలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. బదాయి దో, గోవింద నామ్ మేరాలో రెండు అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో తానూ ఒకరని మరోసారి నిరూపించుకుంది భూమి ఆమె కీలక పాత్రలో పులకిత్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘భక్షక్’ సినిమాతో ఆమె ఈ ఏడాది తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్‌ఫ్లిక్స్‌లో భక్షక్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తాజాగా విడుదుల అయిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజాలు నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్ట్ వైశాలీ సింగ్ పాత్రలో భూమి పెడ్నేకర్ కనిపించనుంది. వాస్తవ సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించాడు. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను జర్నలిస్ట్‌గా వైశాలి ఎలా గుర్తించింది..? అనేది చాలా ఆసక్తిగా ఉండనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ సాహసవంతమైన కార్యచరణలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే ఫిబ్రవరి 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే.. -
సలార్ VS డంకీ.. మొదటిసారి రియాక్ట్ అయిన ప్రశాంత్ నీల్
'ఉగ్రం' సినిమాతో దర్శకుడిగా 2014లో కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘ఉగ్రం’ తర్వాత మూడు సినిమాలే చేశాడు. కానీ ఆయన సినిమాలకు ఆదరణ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీఎఫ్ 1, 2 సినిమాల ద్వారా ఇండియన్ సినిమా మార్కెట్లో ఫేమస్ డైరెక్టర్‌గా పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అదరగొట్టేస్తున్నాడు. 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తదితరులు నటించిన సలార్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ విజయం పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సలార్ వర్సెస్ డంకీ ఫైట్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఇద్దరు టాప్ హీరోల సినిమాల మధ్య గొడవలు పడుతుంటారు. 'నేను అలాంటి వాటిని ప్రోత్సహించను. అలాంటివి వినడానికి కూడా ఇష్టపడను. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీపడరు. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ‘సలార్’, ‘డంకీ’ల మధ్య చాలా మంది అనుకుంటున్నట్లు ప్రతికూల వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. డంకీ నిర్మాతలు కూడా మనలాగే పాజిటివ్‌గా ఆలోచించాలి. మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ కాదు.' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్లో సలార్ చిత్రానికి థియేటర్లు లేకుండా చేసిన కొందరు రివ్యూలు కూడా నెగటివ్‌గానే చెప్పడం జరిగింది. సలార్ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని అలా చేసి ఉంటే మరింత వసూళ్లు వచ్చేవని కూడా వచ్చే ప్రశ్నలకు కూడా ఆయన ఇలా చెప్పారు. 'డంకీతో విడుదల కాకుండా మా సినిమా మాత్రమే విడుదలై ఉంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కావు.' అని ప్రశాంత్ నీల్ అన్నారు. సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్క్‌ను దాటింది. -
'డంకీ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత తక్కువా..? సలార్‌కు లైన్ క్లియర్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. పఠాన్, జవాన్ సినిమాలతో ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. తాజాగా డిసెంబర్ 21న 'డంకీ'తో వచ్చేశాడు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పట్ల పాజిటివ్ టాక్ ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన డంకీ చిత్రం మొదటిరోజు ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్, జవాన్ చిత్రాల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌ను డంకీ దాటలేకపోయింది. సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసులు చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 30 కోట్లు అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్ మొదటిరోజు రూ. 106 కోట్లు కలెక్ట్ చేయగా జవాన్ రూ. 129 కోట్లు రాబట్టింది. రెండు వరుస భారీ హిట్లు కొట్టిన తర్వాత వచ్చిన చిత్రం డంకీ... దీంతో ఈ సినిమా రూ. 130 కోట్ల మార్క్‌ను దాటుతుందని అందరూ అంచనా వేశారు. డంకీ చిత్రం మేకర్స్ అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ప్రకటించలేదు. ప్రభాస్ ప్లాప్ సినిమాను దాటలేకపోయిన 'డంకీ' ప్రభాస్ ప్లాప్ సినిమా అయిన ఆదిపురుష్ చిత్రం కంటే డంకీ మూవీకి కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 37 కోట్లు. బాలీవుడ్లో మొదటిరోజు వచ్చిన టాప్ కలెక్షన్స్ లిస్ట్‌లో డంకీ చిత్రం 7వ స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సలార్‌తో భారీ రికార్డ్స్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోతగిన టాక్ రాలేదు. రాజ్ కుమార్ హిరానీ కేరీర్‌లోనే వీకెస్ట్ సినిమాగా డంకి పేరు తెచ్చుకుంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వెనుకబడింది. సలార్ మాత్రం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడపోయాయని సమాచారం. సలార్‌తో ప్రభాస్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం. -
ఆనంద్ పండిట్ 60వ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
Dunki Movie Review: ‘డంకీ’ మూవీ రివ్యూ
టైటిల్: డంకీ నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్(పాటలు) సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ విడుదల తేది: డిసెంబర్ 21, 2023 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్ ఖాన్‌తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత షారుక్ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. డంకీ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్‌కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) కూడా డబ్బు సంపాదించడానికై లండన్ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్ పంపించేందుకు సహాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్‌గా ఇంగ్లండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్‌కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్‌లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్‌ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్‌స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్‌లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్‌లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కాస్త సీరియస్‌గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్‌లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్‌కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్ వెళ్లాక ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్. ఎవరెలా చేశారంటే.. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్‌తో ఇరగదీసిన షారుక్.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్‌లో షారుఖ్‌ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్ పాటలు పర్వలేదు.లుట్ ఫుట్ గయా సాంగ్ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
PVR మల్టీప్లెక్స్‌లలో కనిపించని సలార్.. కారణం 'డంకీ' సినిమానే
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ 'సలార్' సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆఫ్‌లైన్, ఆన్లైన్లో టికెట్లను విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కడంతో ఏపీలో 10 రోజులు పాటు రూ.40 పెంచుకునేందుకు, తెలంగాణలో మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65 పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూడాలంటే ఒక్కో టికెట్ రూ. 400 పైమాటే.. అయినా ఎక్కడా టికెట్లు దొరకడం లేదు. తాజాగా నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో 'సలార్' సినిమాను విడుదల చేయకూడదని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాకు ఈ థియేటర్లు ఇచ్చిన ప్రాముఖ్యతే అని చెప్పవచ్చు. సలార్ సినిమా విడుదలకు ముందే ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లతో హోంబలె ఫిల్మ్స్ అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం నార్త్ ఇండియాలో 'డంకీ'తో పాటు 'సలార్'కు పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ చైన్ థియేటర్లలో సమానంగా స్క్రీన్లు కేటాయించాలి. కానీ డంకీ సినిమాకే ఎక్కువ స్క్రీన్స్‌ను ఈ రెండు మల్టీఫ్లెక్స్‌లు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో సలార్‌ను ఇవ్వకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారట. సలార్ నుంచి రెండో ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్‌ను మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. అప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్‌ను ఓపెన్ చేసి టికెట్ల కోసం రెడీగా ఉన్నారు. లక్షలాది మంది ఒక్కసారిగా యాప్‌ను ఓపెన్ చేయడంతో యాప్ సర్వర్ డౌన్ అయింది. తర్వాత అది ఓపెన్ కాగానే చూస్తే.. సలార్ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బ్లాక్‌లో టికెట్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తే.. ఒక్కో టికెట్ రూ. 2000 పై మాటే చెబుతున్నారని వారు వాపోతున్నారు. -
Dunki X Review: డంకీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత షారుఖ్ నటించిన చిత్రం కావడంతో మొదటి నుంచే డంకీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. డంకీ కథేంటి? ఎలా ఉంది? షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవోంటో చదివేయండి. ఇది కేలవం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. డంకీ చిత్రానికి ఎక్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. షారుక్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్మూవీ అని.. భరించడం కష్టమని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఎక్స్‌లో నెగెటివ్ కంటే ఎక్కువగా పాజిటివ్ పోస్టులే కనిపిస్తున్నాయి. కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణి మరోసారి తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Dunkireview Masterpiece Rating ⭐️⭐️⭐️⭐️⭐️ 5/5 Its an absolute masterpiece! The storytelling is captivating, the cinematography is stunning, and the performances are top-notch. This movie had me on the edge of my seat from start to finish.#Dunkireviews #SRK #ShahRuhkKhan pic.twitter.com/NoBdMF7FRc — komal nehta (@komalnehta) December 20, 2023 డంకీ..ఓ మాస్టర్ పీస్. కథ చెప్పిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్టన్నింగ్‌గా ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు సీట్లకు త్తుకునపోయి చూస్తారు’అని కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. #DunkiReview Raju sir + SRKs = Another 1000 cr Mark my work... What a movie man...Theater me bina rumaal aur tissue paper ke mat jana ⭐⭐⭐⭐⭐#Dunki #DunkiFirstDayFirstShow #RajkumarHirani #ShahRukhKhan pic.twitter.com/7TpZdfcsXB — AbRam Khan (@iAmDilshad07) December 21, 2023 షారుఖ్ ఖాన్ మరోసారి రూ.1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. It’s a boring fare all together. SRK acting is big let down dialogue delivery is hard to bear. Hirani has delivered it’s worst ever Wait for movie to release on OTT #Dunki #DunkiReview — Thagudam (@Neninthe___) December 21, 2023 బోరింగ్ మూవీ. షారుక్ యాక్టింగ్ బాగున్నా.. డైలాగ్ డెలివరీ భరించడం కష్టం. హిరాణీ రాజ్‌కుమార్ నుంచి వచ్చిన పేలవమైన చిత్రమిది. ఓటీటీలో రిలీజ్ అయ్యేంతవరకు ఎదురుచూడడం బెటర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #DunkiReview-⭐⭐⭐⭐⭐ It's not a Blockbuster, it's a Mega Blockbuster Movie, #ShahRukhKhan𓀠 Character is literally Blow your Mind, And Story is Top level, A Must watch 1000cr loading🔥#Dunki #DunkiStorm #stockmarketcrash#DunkiReviews #DunkiTomorrow pic.twitter.com/6SR6DhAlGb — Amit Rahangdale (@amitrahangdale4) December 21, 2023 డంకీ బ్లాక్ బస్టర్ కాదు.. మెగా బ్లాక్ బస్టర్ మూవీ. షారుక్ పాత్ర మీ మైండ్‌ని బ్లాంక్ చేస్తుంది. స్టోరీ అదిరిపోయింది. తప్పకుండా చూడండి. రూ. 1000 కోట్ల మూవీ అంటూ మరో నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. This movie is for Indian Aunties and Uncles who are settled abroad and would wish to come back home - India. Youth won’t relate to it. Watching SRK romance at this age looks creepy. He should retire now. Comedy is outdated #Dunki #DunkiReview pic.twitter.com/h2GnzpscAD — hello (@walterwhitezzz) December 20, 2023 #Dunki 5/5 ⭐️⭐️⭐️⭐️⭐️ Dunki is a fantastic blend of comedy and emotions. Shah Rukh Khan's performance is top-notch, delivering both laughs and heartfelt moments. The movie keeps you entertained throughout with its witty dialogues and touching storyline.#DunkiReview #Dunki #SRK — Nesgane (@nesgane) December 21, 2023 #Dunki #DunkiReviews https://t.co/b176wzIX2t — Raju Soni (@RajuSoni1541477) December 21, 2023 #OneWordReview...#Dunki : UNBEARABLE. Rating: ⭐️ A colossal waste of talent, big money and opportunity by director #RajuHirani. Weak story and amateur direction. #DunkiReview #ShahRukhKhan #SRK #TapseePannu pic.twitter.com/FbdWJY7PUm — Taran Adarsh (@Taran_Adaresh) December 21, 2023 OneWordReview...#Dunki: DISAPPOINTING Rating: ⭐️½#Dunki is an EPIC DISAPPOINTMENT… Just doesn’t meet the mammoth expectations… Director #RajkumarHirani had a dream cast and a massive budget on hand, but creates a HUGE MESS.#DunkiReview #ShahRukhKhan pic.twitter.com/KSFcnV5Jd3 — SANATAN THE BULL 🚩 (@being_nkm) December 21, 2023 Just finished the show. #Dunki is a cinematic gem, seamlessly blending laughter and tears. Overflowing with innocence, joy, emotions, and love, it serves as a powerful eye-opener. Shah Rukh Khan's stellar performance. RKH showcases his genius. #DunkiReview ⭐⭐⭐⭐½ — yourweirdcrush X (@Yourweirdcrush1) December 21, 2023 #Dunki wish to be a Masterpiece 🔥 #RajkumarHirani is best in Story Telling so far and wish continue with #Dunki @iamsrk performance would be another memorable ☺️ for the #ShahRuhKhan lovers pic.twitter.com/6t6m93qHzg — Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) December 21, 2023 #Dunki first half is written Blockbuster all over 💥💥🔥🔥#DunkiReview pic.twitter.com/nu1se3yaH8 — Ahmed (FAN) (@AhmedKhanSrkMan) December 21, 2023 BLOCKBUSTER PUBLIC REVIEWS! Good WoM till now💥💥#DunkiReviewpic.twitter.com/QpOylBH1do — काली🚩 (@SRKsVampire_) December 21, 2023 #DunkiReview Plz Avoid Old hindi serial drama , Head ache comdey scenes 2 scenes well written remaining totally dispointed, weakest work from Hirani sir #Dunki ⭐⭐ / 5 👎👎 pic.twitter.com/1ZQHMqGEP6 — Vamsivardhan PKVK (@Vamsivardhan_2) December 20, 2023 -
‘డంకీ’ అంటే ఏంటి? ఎందుకంత స్పెషల్?
ఈ ఏడాది కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్‌దే అని చెప్పాలి. ఆయన నటించిన రెండు చిత్రాలు(పఠాన్, జవాన్) సూపర్ హిట్‌గా నిలిచాయి. ఒక్కో సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే డంకీ. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా మరికొద్ది గంటల్లో(డిసెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం... ► రాజ్ కుమార్ హిరాణీ-షారుక్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత షారుఖ్ నటించిన చిత్రమిది. ఆ రెండు చిత్రాలు యాక్షన్ జానర్లో తెరకెక్కాయి. డంకీ మాత్రం కామెడీ డ్రామా ఎంటర్టైనర్. అభిమానుల కోసం కాకుండా తనకోసం నటించిన చిత్రమిదని షారుఖ్ అన్నారు. దీన్ని బట్టి షారుక్‌కి ఈ కథ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ► సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని, కామెడీ యాంగిల్లో దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణీ ప్రత్యేకత. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. ఆయన కెరీర్లో ఇంతవరకు ప్లాప్ చిత్రమే లేదు. అందుకే డంకీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ► భారత్ నుంచి అక్రమంగా ప్రయాణించి యూకేలోకి ప్రవేశించిన స్నేహితుల కథే ఇది. ఈ చిత్రానికి తొలుత ‘రిటర్న్ టికెట్’ లేదా ‘టాస్ ’అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. కానీ చివరకు డంకీ అని ఖరారు చేశారు. ► దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీ వాళ్లు దాన్ని డంకీ అంటారు. ఈ కథ నేపథ్యం కూడా అక్రమ చొరబాటుకు సంబంధించినదే కావడంతో డంకీ సరైన టైటిల్ అని మేకర్స్ భావించారట ► ఈ మూవీ షూటింగ్ 75 రోజుల్లో పూర్తయింది. దాదాపు 60 రోజుల పాటు షారుక్ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల క్రితమే ఈ చిత్రం పనులు ప్రారభం అయ్యాయి. ప్రీప్రొడక్షన్ వర్క్ పకడ్బందీగా పూర్తి చేయడంతో షూటింగ్ త్వరగా పూర్తయిందట. ముంబై, జైపూర్, కశ్మీర్, లండన్, బుడాపెస్ట్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ► ఈ చిత్రం నిడివి 2.41 గంటలు. బడ్జెట్ రూ.120 కోట్లు. షారుఖ్ గత ఆరేళ్లలో నటించిన చిత్రాల్లో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇదే. ► సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం. షారూక్ సైతం లుట్ పుట్ గయా.., ఓ మాహి.. పాటలకు డాన్స్ చేసి అలరించాడు. ఈవెంట్లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు. ►హీరోయిన్ తాప్సికి షారుఖ్‌తో తొలి సినిమా ఇది. విక్కీ కౌశల్ అతిథి పాత్ర పోషించాడు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత సీనియర్ నటుడు సతీశ్ షా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ►ఈ సినిమాను తొలుత డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ మూవీ విడుదల కానుండడంతో డంకీ ప్రీపోన్ అయింది. -
రజనీకాంత్ సినిమాకు నో చెప్పిన షారుక్ ఖాన్