మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్‌ ఫోటో వైరల్‌ | Mukesh Ambani, Shah Rukh Khan with Rs 31 ORS packets at PM Modi oath ceremony | Sakshi
Sakshi News home page

మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారూఖ్‌ ఏం చేశారో తెలుసా?

Published Mon, Jun 10 2024 11:23 AM | Last Updated on Mon, Jun 10 2024 11:34 AM

Mukesh Ambani, Shah Rukh Khan with Rs 31 ORS packets at PM Modi oath ceremony

భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. జూన్‌ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కన్నులపండువగా జరిగింది. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు.. ఇలా ఎందరో ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. వారిలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌.. పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఉన్నారు. 

ఓఆర్‌ఎస్‌ తాగుతూ..
పక్కపక్కనే కూర్చున్న వీళ్లిద్దరూ ఓఆర్‌ఎస్‌ డ్రింక్‌తో దర్శనమిచ్చారు. ఇంకేముంది.. వారిని క్లిక్‌మనిపించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ధనవంతులైన వీరు ఖరీదైన డ్రింక్స్‌కు బదులుగా దాదాపు రూ.30 ఉంటే ఓఆర్‌ఎస్‌ డ్రింక్‌ తాగుతున్నారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే బెటర్‌
'సోడా సహా ఇతర డ్రింక్స్‌ కంటే ఇదే నయం.. ఇప్పుడున్న వాతావరణానికి ఓఆర్‌ఎస్‌ తాగితేనే బెటర్‌. పైగా ఈ మధ్యే షారూఖ్‌కు వడదెబ్బ తగిలింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే', 'హే.. ఈరోజు నేను కూడా ఇదే ఓఆర్‌ఎస్‌ తాగాను' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గత నెల షారూఖ్‌ వడదెబ్బ కారణంగా అహ్మదాబాద్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే!

 

 

చదవండి: నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement