Rashtrapathi Bhavan
-
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్ల మార్పు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లోని ముఖ్యమైన రెండు హాళ్ల పేర్లను కేంద్రం మార్చింది. పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లను పేర్లను.. ఇకపై ‘గణతంత్ర మండపం’,‘అశోక్ మండపం’గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ గురువారం వెల్లడించింది. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా ఈ పేర్లు మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్లో జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. గతంలో ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. అయితే భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది. గణతంత్ర అనే పదం స్వతంత్ర భారతంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపంగా మారుస్తున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఇకపోతే ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండపం’ అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది.‘ అశోక్ హాల్ నిజానికి ఒక బాల్రూమ్. అశోక్ అంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థం. అలాగే 'అశోక' అనేది అశోక్ చక్రవర్తిని సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక పదం భారతీయ మత సంప్రదాయాలు, కళలు, సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా దానికి అశోక్ మండపం అని మార్చినట్లు వివరించింది. -
‘‘రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చింది పులి కాదు.. పిల్లి’’
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలోకి వచ్చిన జంతువు చిరుతపులి కాదని కేవలం పిల్లి అని తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం(జూన్10) క్లారిటీ ఇచ్చారు.మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్‌లో నడుస్తూ లైవ్ కెమెరాలకు చిక్కింది ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టింది.ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇవేవీ నిజం కావని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కన్నులపండువగా జరిగింది. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు.. ఇలా ఎందరో ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. వారిలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్.. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఉన్నారు. ఓఆర్ఎస్ తాగుతూ..పక్కపక్కనే కూర్చున్న వీళ్లిద్దరూ ఓఆర్ఎస్ డ్రింక్‌తో దర్శనమిచ్చారు. ఇంకేముంది.. వారిని క్లిక్‌మనిపించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ధనవంతులైన వీరు ఖరీదైన డ్రింక్స్‌కు బదులుగా దాదాపు రూ.30 ఉంటే ఓఆర్ఎస్ డ్రింక్ తాగుతున్నారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదే బెటర్'సోడా సహా ఇతర డ్రింక్స్ కంటే ఇదే నయం.. ఇప్పుడున్న వాతావరణానికి ఓఆర్ఎస్ తాగితేనే బెటర్. పైగా ఈ మధ్యే షారూఖ్‌కు వడదెబ్బ తగిలింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే', 'హే.. ఈరోజు నేను కూడా ఇదే ఓఆర్ఎస్ తాగాను' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గత నెల షారూఖ్ వడదెబ్బ కారణంగా అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ORS 👍 pic.twitter.com/C24eNG6UYx— sonal. (@sonaluwu) June 9, 2024 HQ pictures of Shah Rukh Khan & Mukesh Ambani at Rashtrapati Bhavan earlier today for PM Narendra Modi's Oath Ceremony ♥️#ShahRukhKhan pic.twitter.com/HlUE9lV7PU— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) June 9, 2024చదవండి: నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి -
ప్రధాని మోదీ సరికొత్త రికార్డు..
-
వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన మోదీ
-
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వినయంగా ఉండండి.. కష్టపడి పని చేయండి
న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించకుండా వినయంగా ఉన్న నాయకులనే ప్రజలు అభిమానిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే వినయంగా ఉండాలని నూతన మంత్రులకు సూచించారు. రుజువర్తన, పారదర్శకత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అన్నారు. మీకు అప్పగించిన పనిని నిజాయతీగా పూర్తి చేయండి అని సూచించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరికీ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రులు అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను గౌరవించాలని చెప్పారు. అందరిని కలుపుకొనిపోవాలని, బృంద స్ఫూర్తితో పని చేయాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎరుపు రంగు ధగధగల్లో రాష్ట్రపతి భవన్
-
ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు ఏపీ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ పి.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జాతీయ సేవా పథకం కింద వివిధ సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2021–22గానూ కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పురస్కారాలను ప్రకటించిందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ పరిధిలోని జగన్స్ డిగ్రీ–పీజీ కళాశాలకు చెందిన పెళ్లకూరు సాత్విక, అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీకి చెందిన కురుబ జయమారుతి ఉత్తమ వలంటీర్లుగా ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఇద్దరు వలంటీర్లకు రూ.లక్ష నగదు, మెడల్, సర్టిఫికెట్తో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. -
జడ్జిపై టీడీపీ నేతల పోస్టులు.. రాష్ట్రపతి భవన్ నుంచి సీరియస్ లేఖ
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదస్పదంగా వ్యవహరించారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామానుజరావు ఫిర్యాదు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు. ఇది కూడా చదవండి: ‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు -
ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణేం విడుదల
సాక్షి, ఢిల్లీ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ నట దిగ్గజం, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నందమూరి తారకరామారావు పేరిట రూ.100 స్మారణ నాణేం విడుదల అయ్యింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవల గుర్తింపుగా నాణేం విడుదల చేశారు. ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన అనంతరం రాష్ట్రపతి దౌపది ముర్ము మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌గారు రామాయణ ,మహాభారతాలకు అనేక పాత్రలలో ఎన్టీఆర్ జీవించారు. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో ఇచ్చారు. రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఆహ్వానం ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ కారణంగా మనవడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. -
రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌జీ, గురుమా
ఉగాది వేళ క్లీన్ ద కాస్మోస్ Clean the Cosmos క్యాంపెయిన్ టీమ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నారు. క్లీన్ ద కాస్మోస్ ప్రచారం ద్వారా విశ్వంలో సానుకూల పరిస్థితులను తీసుకువచ్చేందుకు తమ టీమ్ చేస్తున్న యత్నాలను సద్గురు రమేష్ జీ, గురుమా.. రాష్ట్రపతి ముర్ముకి వివరించారు. క్లీన్ ద కాస్మోస్ అనేది ఆధ్మాత్మిక, దైవ ప్రచారం. మానవ జాతి సంక్షేమం కోసం సద్గురు రమేష్ జీ దీనిని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మానవ మెదళ్లు అతి తీవ్రమైన నెగిటివిటీతో సతమతమవుతున్నాయి. ఆలోచనలు మాత్రమే కాదు భావోద్వేగాలూ అదే రీతిలో ఋణాత్మకతను విశ్వంలోకి జారవిడుస్తున్నాయి. తిరిగి ఈ విశ్వం నుంచి మానవజాతి దానిని స్వీకరిస్తుండంతో నేరాలు, నెగిటివ్‌చర్యలైన టెర్రరిజం, ప్రతీకారం, కోపం, యుద్ధాలు, హత్యలు, డిప్రెషన్ లాంటివి కనిపిస్తున్నాయి. దీంతో ప్రతికూలత, ప్రతికూల ప్రకంపనలు, ప్రతికూల చర్యల యొక్క దుర్మార్గపు చక్రంలో చిక్కుకున్నాము. మనం వీలైనంత త్వరగా ఈ నెగిటివిటీ నుంచి బయట పడాల్సి ఉంది. దీనికి ఉన్న ఒకే ఒక్క పరిష్కారం పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఈ విశ్వాన్ని నింపడం. సానుకూల అంశాలు, ప్రార్థనలతో మనం అత్యంత ఆప్రమప్తంగా పాజిటివ్ వైబ్రేషన్స్‌ను విశ్వంలోకి విడుదల చేయాలని క్లీన్ ద కాస్మోస్ క్యాంపెయిన్ టీమ్ రాష్ట్రపతికి వివరించింది. సరాసరిన, మానవ మెదడులో 60–80 వేల ఆలోచనలు వస్తుంటాయి. వీటిలో 90% నెగిటివ్ ఆలోచనలు ఉండటంతో పాటుగా పునరావృతమూ అవుతుంటాయి. అంతర్జాతీయంగా సమస్యలైనటువంటి డిప్రెషన్, ఆత్మహత్యలు, టెర్రరిజం, క్రూరమైన నేరాలు, మతపరమైన అల్లర్లు, హింస, యుద్ధాలు, ద్వేషం, అహం వంటివి ఈ తీవ్రమైన ప్రతికూల ప్రకంపనల ఫలితం. ప్రపంచవ్యాప్తంగా ఈ క్లీన్ ద కాస్మోస్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని తీసుకువెళ్లేందుకు సహాయం చేయాలని టీమ్ రాష్ట్రపతిని అభ్యర్ధించింది. సద్గురు రమేష్‌జీ , రమేష్ జైన్‌గా ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు. అనంతర కాలంలో ఆధ్యాత్మికవేత్తగా మారారు. హఠ యోగ, కుండలిని యోగ క్రియ యోగాలో అత్యున్నత నైపుణ్యం కలిగిన ఆయన శ్రీ స్వామి పూర్ణానంద జ్ఞాన బోధలతో ఆయనకు శిష్యునిగా మారి, ఆశీస్సులు పొందారు. ప్రజలు సంతోషంగా జీవించడంలో సహాయపడటానికి తన జీవితం అంకితం చేసిన గురూజీ, వారిని ఆధ్యాత్మిక దిశగా తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన బోధనలను చేస్తున్న ఆయన యూట్యూబ్, సోషల్ మీడియా ఛానెల్స్‌లో వేలాది వీడియోలు, ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. సద్గురు రమేష్‌జీ రెండు అత్యంత ప్రశంసనీయమైన పుస్తకాలు సోల్ సెల్ఫీ, సోల్ మంత్రను రచించారు. ఆయన ఇటీవలే క్లీన్ ద కాస్మోస్ ప్రచారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు సమీపంలో జన్వాడ వద్ద పూర్ణ ఆనంద ఆశ్రమాన్ని ఆయన ప్రారంభించారు. -
Padma Awards: అట్టహాసంగా 2023 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి, ఢిల్లీ: 2023 ఏడాదికిగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇవాళ(బుధవారం మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కర్తో పాటు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ అందుకోగా.. ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సింగర్ సుమన్ కళ్యాణ్పూర్లు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. పాండ్వానీ సింగర్ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత.. బదులుగా ఆయన తనయుడు సుబ్రతా దెబ్బర్మా), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ ప్రీతికాకా గోస్వామి, ప్రముఖ బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. ప్రముఖ కళాకారుడు దిల్షద్ హుస్సేన్, పంజాబీ స్కాలర్ డాక్టర్ రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(దివంగత.. బదులుగా ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా అవార్డును అందుకున్నారు), మ్యూజిక్ ఆర్టిస్ట్ మంగళ కాంతా రాయ్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి చింతల పాటి వెంకట పతి రాజు( కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం), తెలంగాణకి చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్ ), బి.రామకృష్ణరెడ్డి (సాహిత్యం) పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. #WATCH | Former Union Minister SM Krishna receives the Padma Vibhushan from President Droupadi Murmu. pic.twitter.com/WqA5b0YH1i — ANI (@ANI) March 22, 2023 LIVE: President Droupadi Murmu presents Padma Awards 2023 at Civil Investiture Ceremony-I at Rashtrapati Bhavan https://t.co/jtEQQtx1DP — President of India (@rashtrapatibhvn) March 22, 2023 -
రాష్ట్రపతి భవన్లో ఘనంగా క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం(నవంబర్ 30న) కన్నుల పండువగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకోగా.. 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకున్నారు. వీరిలో బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింట్న్ స్టార్ హెచ్ ప్రణయ్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, ఆకుల శ్రీజ తదితరులు ఉన్నారు. ఇక 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు.భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది క్రీడా అవార్డులను నవంబర్ 14న ఈ అవార్డులను ప్రకటించింది. విజేతల జాబితా: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్) ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్) జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ సింగ్ (హాకీ), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్) President Droupadi Murmu presents the Arjuna award to Badminton players Lakshya Sen and Prannoy HS at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/Tv4QLAPbtj — ANI (@ANI) November 30, 2022 President Droupadi Murmu presents the Arjuna award to Chess player R Praggnanandhaa at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/1OPxS7DaoW — ANI (@ANI) November 30, 2022 చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు -
రాష్ట్రపతి భవన్ లో గవర్నర్ల సదస్సు
-
సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రమణ ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జీలు, కేంద్రమంత్రులు, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ 2022 ఆగస్ట్ 26వ తేదీ వరకు కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ కావడం విశేషం. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966– 67 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక తెలుగు వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేశాక చీఫ్ జస్టిస్ రమణ నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేశారు. 2014లో సుప్రీంకోర్టుకు... సీజేఐ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27 న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000 సంవత్సరం జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. 2013 మార్చి 10వ తేదీ నుంచి 2013 మే 20 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం 2013 సెప్టెంబర్ 2వ తేదీన జస్టిస్ రమణకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. 2014 ఫిబ్రవరి 17న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసులను విచారించిన ధర్మాసనాలకు నేతృత్వం వహించగా, కొన్నింటిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2020 జనవరి 10వ తేదీన కశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేయడాన్ని వెంటనే సమీక్షించాలని జస్టిస్ రమణ తీర్పు ఇచ్చారు. 2019 నవంబర్ 13న సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన చారిత్రక ధర్మాసనంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. గృహిణులు ఇంట్లో చేసే పని, కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తక్కువేం కాదని జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. -
రాష్ర్టపతి భవన్లో మరోసారి కరోనా కల్లోలం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో సీనియర్ పోలీస్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆయనను ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో భవన్లో పనిచేస్తున్న అనేక మంది పోలీసులు, ఇతర సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచినట్లు అధికారిక వర్గాల సమాచారం. గత నెలలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో దాదాపు 115 కుటుంబాలను ఐసోలేషన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో ఏప్రిల్ 13న ఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరికి పాజిటివ్ రాగా, మిగిలిన ఆరుగురికి నెగిటివ్ అని తేలింది. (కరోనా పోరు: మాస్కులు కుట్టిన రాష్ట్రపతి సతీమణి ) ఇక కరోనాపై పోరుకు తనవంతు సాయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే తన నెల జీతాన్ని విరాళంగా అందజేయగా, తాజాగా తన జీతంలో 30 శాతం డబ్బును ఏడాదిపాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కరోనా సంక్షోభంలో రాష్ట్రపతి భవన్లో ఖర్చులను తగ్గించడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం పది కోట్ల విలువైన విలాసవంతమైన లిమోసిస్ కారు కొనుగోలును వాయిదా వేశారు. అలాగే విందులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయరాదని, పరిమిత సంఖ్యలో ఆహారపదార్థాలను ఉంచాలని నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున జరిగే పూల అలంకరణలు లాంటి డెకరేషన్ వస్తువులను పరిమితం చేయాలని ఓ ప్రకటన విడుదల చేశారు. (ఖర్చు ఆదా చేసే పనిలో రాష్ట్రపతి భవన్ ) -
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ దంకర్... త్రిపుర గవర్నర్ గా రమేష్ బైస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌ను ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా...బిహార్ గవర్నర్‌గా పనిచేస్తున్న లాల్ జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా కేంద్రం బదిలీ చేసింది. అదే విధంగా బిహార్ గవర్నర్‌గా పగు చౌహాన్... నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్ ఎన్ రవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. -
రాష్ట్రపతి నిలయం సందర్శనకు అవకాశం
బొల్లారం: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం నుంచి ప్రజల సందర్శనకు ఆవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో వర్షాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పది రోజుల పాటు ఇక్కడ గడిపి తిరిగి వెళ్లారన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శనకు అనుమతించనున్నట్లు చెప్పారు. -
'ఒబామా నన్ను వైట్‌హౌస్‌కు పిలిచారు'
గుంటూరు: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన నివాసం వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో రాయపాటి సాంబశివరావు... అగ్ర రాజ్య అధినేత ఒబామాను కలసి... తిరుపతి లడ్డూ ప్రసాదంతోపాటు ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువాను బహుకరించారు. అలాగే అపురూపమైన ముత్యాల హారాన్ని మిసెస్ ఒబామాకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఒబామా దంపతులు రాయపాటికి కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్‌కు వచ్చి... తమ ఆతిథ్యం అందుకోవాలని రాయపాటిని ఒబామా ఆహ్వానించారు. 2010లో భారత్‌లో పర్యటించిన ఒబామాకు బంగారంతో తయారు చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని పార్లమెంట్లో రాయపాటి సాంబశివరావు బహుకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటీకీ ఆరుసార్లు అమెరికా వెళ్లానని... కానీ ఈ సారీ అమెరికా ప్రయాణం తనకు అత్యంత ప్రత్యేకమైందని రాయపాటి వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ రాయపాటి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.