'ఒబామా నన్ను వైట్హౌస్కు పిలిచారు' | Obama invited me to White House: Rayapati | Sakshi
Sakshi News home page

'ఒబామా నన్ను వైట్హౌస్కు పిలిచారు'

Published Tue, Jan 27 2015 11:04 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

'ఒబామా నన్ను వైట్హౌస్కు పిలిచారు' - Sakshi

'ఒబామా నన్ను వైట్హౌస్కు పిలిచారు'

గుంటూరు: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన నివాసం వైట్హౌస్కు ఆహ్వానించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో రాయపాటి సాంబశివరావు... అగ్ర రాజ్య అధినేత ఒబామాను కలసి... తిరుపతి లడ్డూ ప్రసాదంతోపాటు ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువాను బహుకరించారు.

అలాగే అపురూపమైన ముత్యాల హారాన్ని మిసెస్ ఒబామాకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఒబామా దంపతులు రాయపాటికి కృతజ్ఞతలు తెలిపారు. వైట్హౌస్కు వచ్చి... తమ ఆతిథ్యం అందుకోవాలని రాయపాటిని ఒబామా ఆహ్వానించారు. 2010లో భారత్లో పర్యటించిన ఒబామాకు బంగారంతో తయారు చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని పార్లమెంట్లో రాయపాటి సాంబశివరావు బహుకరించిన సంగతి తెలిసిందే.

ఇప్పటీకీ ఆరుసార్లు అమెరికా వెళ్లానని... కానీ ఈ సారీ అమెరికా ప్రయాణం తనకు అత్యంత ప్రత్యేకమైందని రాయపాటి వెల్లడించారు.  ఈ మేరకు ఎంపీ రాయపాటి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement