rayapati sambasiva rao
-
చంద్రబాబు తీరుపై మాజీ ఎంపీ రాయపాటి తీవ్ర ఆగ్రహం
-
కళ్లుగప్పి.. కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. కనికట్టు చేసి బ్యాంకులను దోచేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, ఆ పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, సుజనా చౌదరిలనే మించిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కెనరా బ్యాంకు నేతృత్వంలోని ఏకంగా 14 బ్యాంకుల కన్సార్షియంనే మోసం చేసి రూ.7,926.01 కోట్లను కొల్లగొట్టినట్లు సీబీఐ ప్రాథమికంగా తేల్చినట్లు తెలిసింది. బ్యాంకుల అధికారుల సహకారం లేకుండా రాయపాటి ఇంత భారీ కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉండదనే నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. రూ.7,926.01 కోట్లు ఎగవేత పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, తిరుపతి–తిరుత్తణి–చెన్నై టోల్వేస్.. భోపాల్–బయోరా టోల్వేస్.. దిండిగల్–తెన్ని–కుమ్లి టోల్వేస్.. కృష్ణగిరి–దిండివనం హైవేస్, ఒబేదుల్లాగంజ్–బేతుల్, తిరుచ్చి–కలైకుడి టోల్వేస్ పనులు చేపట్టేందుకు రుణం ఇవ్వాలని కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియంను ట్రాన్స్ట్రాయ్ కోరింది. ఈ రుణానికి బోగస్ గ్యారంటీలను చూపింది. ఇవి నిజమైనవా కాదా అన్నది తేల్చుకోకుండా బ్యాంకుల కన్సార్షియం రూ.9,394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు 2013–2014లో అంగీకరించింది. ఈ రుణాన్ని నగదు, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ), గ్యారంటీ (బీజీ)ల రూపంలో ఇస్తామని పేర్కొంది. 2015–16 నాటికి రూ.7,926.01 కోట్ల రుణాన్ని నగదు, ఎల్వోసీ, బీజీల రూపంలో ఇచ్చింది. కానీ, తీసుకున్న రుణం చెల్లించకుండా ట్రాన్స్ట్రాయ్ మోసం చేయడంతో 2019 డిసెంబర్ 30న యూనియన్ బ్యాంక్, 2020 డిసెంబర్ 15న కెనరా బ్యాంక్ అధికారులు వేర్వేరుగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన సీబీఐ.. ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి, ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర బాబ్జీ, మరో డైరెక్టర్ ఎం.సాంబశివరావులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ప్రాథమికంగా పూర్తయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దర్యాప్తులో వెల్లడైన అంశాలివీ.. రూ.2,261.58 కోట్లు ఏ బాబు జేబులోకో.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల మేరకు ఏ సంస్థ అయినా బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన లావాదేవీలను ఆ బ్యాంకుల పరిధిలోనే నిర్వహించాలి. దీనివల్ల ఇచ్చిన రుణం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కానీ, కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.7,926.01 కోట్లలో రూ.2,261.58 కోట్లను కన్సార్షియంలోని లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), ఆర్బీఎల్లకు మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఐదు బ్యాంకుల ద్వారా మళ్లించిన మొత్తానికి ట్రాన్స్ట్రాయ్ సరైన లెక్కలు చూపకపోవడంతో.. ఆ నిధులు ఏ బాబు జేబులోకి చేరాయనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ట్రాన్స్‌ట్రాయ్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఎం.సాంబశివరావు పేరుతో యూనిక్ ఇంజనీర్స్ అనే సంస్థను ఏర్పాటు చేయించిన రాయపాటి, పోలవరం పనుల కోసం ఆ సంస్థ నుంచి కేవలం రూ.3 కోట్ల విలువ చేసే వాహనాలను మాత్రమే కొనుగోలు చేశారు. కానీ, కొన్న వాహనాలనే మళ్లీ మళ్లీ కొన్నట్లు చూపి బ్యాంకులు మంజూరు చేసిన రుణంలో యూనిక్ ఇంజనీర్స్ ఖాతాలోకి రూ.313.85 కోట్లను మళ్లించి కాజేశారు. సిమెంటు, స్టీలు వంటివి కొనకుండానే.. పోలవరం, ఇతర రహదారుల పనుల కోసం ఏప్రిల్, 2016 నుంచి మార్చి, 2017 వరకూ ట్రాన్స్ట్రాయ్ కేవలం రూ.274.36 కోట్ల విలువైన సామగ్రిని మాత్రమే ఐదు సంస్థల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. అదే మెటీరియల్‌ను మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి రూ.2,568.77 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని కాజేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఒక సంస్థ నుంచి సిమెంటు కొనుగోలు చేసినట్లు బ్యాంక్ లెడ్జర్ బుక్‌లో చూపారు. కానీ, ఆ సంస్థకు కాకుండా మరో సంస్థకు చెల్లింపులు చేసినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో తేలింది. బ్యాంక్ లెడ్జర్ బుక్కూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌కూ పొంతన లేని లావాదేవీల ద్వారా రూ.1,624.35 కోట్లను ట్రాన్స్ట్రాయ్ దోచేసింది. సక్రమంగా చెల్లింపులూ చేయని ట్రాన్స్ట్రాయ్ ట్రాన్స్ట్రాయ్ ఎక్కడ పనిచేసినా సబ్ కాంట్రాక్టర్లకు సక్రమంగా చెల్లింపులు చేయదు. పోలవరంలో చేసిన పనులకు బిల్లులు ఎగ్గొట్టడంతో 2016 నుంచి 2019 వరకూ ట్రాన్స్‌ట్రాయ్‌కి వ్యతిరేకంగా సబ్ కాంట్రాక్టర్లు నెలల తరబడి ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.794.16 కోట్లను సబ్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా ఇచ్చామని.. వాటిని తిరిగి ఇవ్వలేని దుస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉండటంతో వాటిని మాఫీ చేశామని ట్రాన్స్ట్రాయ్ లెక్కలు చెప్పడంపై సీబీఐ అధికారులే నిర్ఘాంతపోయినట్లు సమాచారం. -
రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?
సాక్షి,అమరావతి: బ్యాంకులను కొల్లగొట్టడంలో చంద్రబాబు అండ్ కో గ్యాంగ్‌స్టర్స్‌ని, స్కామ్‌స్టర్స్‌ని మించిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజమెత్తారు. విజయ్ మాల్యా, నీరవ్‌మోడీ, దావూద్ ఇబ్రహీం కంటే ఘోరంగా దేశంపై పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ట్రాన్స్ట్రాయ్ ముసుగులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పాల్పడిన రూ.7,296 కోట్ల స్కామ్‌లో చంద్రబాబుకు ఎంతిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నీడలో పెరిగిన అవినీతి వృక్షం రాయపాటి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వాటాలు లేకుంటే సీబీఐ దర్యాప్తుపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాయపాటి, ట్రాన్స్ట్రాయ్ను ఐదేళ్లు నెత్తిన పెట్టుకుని మోసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఆయన పాపాల పుట్ట ఒక్కొక్కటిగా కదులుతోందన్నారు. చంద్రబాబు బృందం అనినీతిపై విజయవాడలో ఏ సెంటర్‌లోనైనా చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించే సత్తా 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ అంటేనే కాంట్రాక్టర్ల పార్టీ.. రాయపాటి 9 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి 13 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టారని, ఈ కుంభకోణంపై సీబీఐ కూపీ లాగుతోందని జోగి రమేష్ చెప్పారు. సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్, వాకాటి నారాయణరెడ్డి, దీపక్‌రెడ్డి, బొల్లినేని రామారావు వీరంతా బాబు బినామీలేనన్నారు. టీడీపీ అంటేనే కాంట్రాక్టర్ల పార్టీ అని వ్యాఖ్యానించారు. అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి స్కామ్స్టర్లతో కూర్చుని చంద్రబాబు రోజూ ఆన్లైన్లో నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. -
రాయపాటి.. చంద్రబాబు.. ఆర్థిక సంబంధాలపై కన్ను!
సాక్షి, అమరావతి/పట్నంబజార్/నగరంపాలెం (గుంటూరు): బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. 2013లోనే తమ వద్ద రూ.300 కోట్ల రుణం తీసుకుని ట్రాన్స్ట్రాయ్ ఎగ్గొట్టిందంటూ కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు కూపీలాగుతున్నారు. అంతేకాక.. రాయపాటి సంస్థ మొత్తం రూ.8,836.45 కోట్ల రుణం తీసుకుని, ఎగ్గొట్టిందంటూ 18 బ్యాంకుల కన్సార్టియం చేసిన ఫిర్యాదుపై డిసెంబర్ 30, 2018న సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఆ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా శుక్రవారం రాయపాటి, ట్రాన్స్ట్రాయ్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్లను సీబీఐ అధికారులు విచారించి.. వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు రుణాల వసూలుకు సహకరించాలని బ్యాంకర్ల విజ్ఞప్తికి స్పందించకపోవడం.. ఎస్క్రో అకౌంట్ హామీ ఇచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.300 కోట్ల రుణం ఇప్పించడం.. అంతటితో ఆగకుండా ఖజానా నుంచి రూ.144 కోట్లను స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్ రూపంలో దోచిపెట్టడం.. ఈ వ్యవహారంలో రాయపాటి, చంద్రబాబుకు ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా సీబీఐ ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. (చదవండి: ఇదేమి నీచ రాజకీయం! ) విదేశాలకు నిధుల మళ్లింపు నిబంధనల ప్రకారం కన్సార్టియం బ్యాంకుల నుంచే ఏ సంస్థ అయినా రుణం తీసుకోవాలి. కానీ.. ట్రాన్స్ట్రాయ్ మాత్రం కన్సార్టియం బ్యాంకుల కళ్లుగప్పి ఇతర బ్యాంకుల నుంచి రూ.2,267.22 కోట్ల రుణం తీసుకుంది. కన్సార్టియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.8,836.45 కోట్లు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2,267.22 కోట్లలో సంబంధిత పనులకు కాకుండా ఇతర కార్యకలాపాలకు రూ.3,822 కోట్లను ట్రాన్స్ట్రాయ్ దారిమళి్లంచినట్లు ఈడీ ఇప్పటికే నిర్ధారించి కేసులు నమోదు చేసింది. సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, మలేసియాల్లోని సంస్థలకు ఈ నిధులను మళ్లించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో ట్రాన్స్ట్రాయ్ నుంచి నిధులు మళ్లించిన సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లపై ఇటు సీబీఐ.. అటు ఈడీ దృష్టిసారించాయి. ‘పోలవరం’తో బ్యాంకులకు టోకరా పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్.. వాటిని చూపి 2013 నుంచి 2018 వరకూ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌కి 18 బ్యాంకుల కన్సార్టియం రూ.8,836.45 కోట్ల రుణం ఇచ్చింది. నిజానికి దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ పోలవరం పనులు చేయలేదని.. దాన్ని తొలగించాలని 2014 నుంచి 2016 వరకూ అనేకమార్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సూచించినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాక.. ట్రాన్స్ట్రాయ్ తీసుకున్న రుణాలు చెల్లించడంలేదని.. పోలవరం బిల్లులు చెల్లించే సమయంలో అప్పుల వసూలుకు సహకరించాలంటూ జూలై 31, 2015న బ్యాంకుల కన్సార్టియం విజ్ఞప్తినీ సీఎం హోదాలో చంద్రబాబు తోసిపుచ్చారు. దాంతో ట్రాన్స్ట్రాయ్ ఆ రుణాలను ఎగ్గొట్టింది. ‘ఎస్క్రో’ అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని అప్పటి టీడీపీ సర్కార్ హామీ ఇస్తేనే రూ.300 కోట్ల రుణం 2017లో ఇచ్చామని.. కానీ బిల్లులను ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించకపోవడంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ట్రాన్స్ట్రాయ్ ఎగ్గొట్టిందని సీబీఐకి 2018లోనే బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సీబీఐ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. (చదవండి: టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు) -
టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్ /పట్నంబజార్/నగరంపాలెం: (గుంటూరు): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. గుంటూరు నగరం లక్ష్మీపురంలో ఉన్న ఆయన నివాసంలో ఉ.8 నుంచి మ.2.30 గంటల వరకు ఇవి కొనసాగాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, పన్నుల ఎగవేతకు సంబంధించిన నోటీసులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం తొమ్మిది మంది అధికార బృందం ఈ సోదాల్లో పాల్గొనగా అందులో ఐదుగురు సీబీఐ అధికారులు కాగా, నలుగురు కెనరా బ్యాంకు అధికారులున్నట్లు తెలిసింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ రూ.7,926.01 కోట్లు మోసానికి సంబంధించి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అసలేం జరిగిందంటే..? తాము చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు రుణాలు కావాలని ట్రాన్స్‌టాయ్ కంపెనీ పలు బ్యాంకులను సంప్రదించింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకు కెనరా బ్యాంకు నేతృత్వం వహించింది. అనంతరం.. వీరి నుంచి తీసుకున్న నిధులను తప్పుడు పత్రాలు, నకిలీ బ్యాలెన్స్ షీట్లు, మోసపూరిత స్టేట్మెంట్లు, తప్పుడు లెక్కల పుస్తకాలు, పత్రాలు చూపించి బ్యాంకు నిధులను తప్పుడు మార్గంలో మళ్లించారని.. ఫలితంగా తమకు రూ.7,926.01 కోట్లు నష్టం వాటిల్లినట్లు కెనరా బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. గతేడాది కూడా ఓ కేసు అలాగే.. వివిధ క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లను పలు దఫాల్లో వేరే ఖాతాలకు ట్రాన్స్‌టాయ్ మళ్లించిందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా వేరే ఖాతాలకు మళ్లించారంటూ హైదరాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ 2019 డిసెంబరు 30న కేసు నమోదు చేసింది. అందులో చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ఇదే కంపెనీకి చెందిన ఇండిపెండెంట్ నాన్–ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, గుర్తుతెలియని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగులనూ ఎఫ్ఐఆర్లో చేర్చింది. నిందితులు వీరే.. ఈ కేసుతో సంబంధమున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి చెందిన కార్యాలయాలు, పలువురు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్‌ను సీబీఐ పేర్కొంది. ట్రాన్స్ట్రాయ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ రాయపాటి సాంబశివరావు, అడిషనల్ డైరెక్టర్ అక్కినేని సతీష్, గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులను కూడా సీబీఐ నిందితులుగా చూపించింది. -
మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ రైడ్
సాక్షి, గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సంబంధించిన పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాయపాటి కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. -
రాయపాటికి షాకిచ్చిన సెంట్రల్ బ్యాంక్
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు రంగం సిద్ధం చేస్తున్నాయి. సుమారు రూ. 452.41 కోట్లు ట్రాన్స్ట్రాయ్ బకాయి పడటంతో ఆస్తులను వేలం వేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ పత్రికల్లో వేలం నోటీసులను జారీ చేసింది. రుణం కోసం తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది. (‘ట్రాన్స్ట్రాయ్’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ) ఇక 2017 జనవరి 9 నాటికి సెంట్రల్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్లు కాగా, వీటికి హామీదారులుగా ట్రాన్స్ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 51లో 640 చదరపు గజాల స్ధలాన్ని వేలం వేస్తున్నారు. మరోవైపు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్‌కు సంబంధించి సుమారు రూ. 300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ బకాయిలు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకులకు ట్రాన్స్ట్రాయ్ రూ. 3,694 కోట్ల మేర బకాయి పడింది. (వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం) -
‘అదే రాయపాటి సాంబశివరావుకు గౌరవం’
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఫైర్ అయ్యారు. రాయపాటికి మతిభ్రమించిందని, అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ రాయపాటి ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్కపనీ చేయలేదు. సొంత సామాజికవర్గం ఎమ్మెల్యేలే ఆయన్ను నియోజకవర్గంలో అడుగు పెట్టనీయలేదు. మరి అప్పుడు కులం గురించి ఎందుకు మాట్లాడలేదు?. రాయపాటి దగ్గరి బంధువే మా నియోజకవర్గంలో ఉద్యోగం చేస్తున్నాడు. మరి కమ్మవారికి ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఎలా మాట్లాడతారు? వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే రాయపాటికి గౌరవం ఉంటుంద’ని అన్నారు. చదవండి : ‘సీఎంపై రాయపాటి వ్యాఖ్యలు అర్థరహితం’ -
‘సీఎంపై రాయపాటి వ్యాఖ్యలు అర్థరహితం’
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయపాటి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గౌతమ్ టెక్స్టైల్స్ పార్క్‌ను ఎందుకు రద్దు చేయించారో చెప్పాలని బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. నిస్వార్థంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిపై చంద్రబాబు కులముద్ర వేయిస్తున్నారని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న జన్మభూమి కమిటీల వల్లే చంద్రబాబు 23 సీట్లుకు దిగజారారని ఆయన మండపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అది ఓర్వలేక రాయపాటిని చంద్రబాబు అస్త్రంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన చరిత్ర రాయపాటిదని అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి తామంతా అండగా ఉంటామని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హామీ ఇచ్చారు. -
వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం
సాక్షి, అమరావతి : టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గురువారం పత్రికా ప్రకటన జారీచేసింది. ఈ నేపథ్యంలో రూ.837.37 కోట్ల విలువైన రుణం బకాయి పడటంతో గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23న వేలం వేస్తున్నట్లు పేర్కొంది. గుంటూరు అరండల్‌పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న వాణిజ్య భవనంతో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్టు తెలిపింది. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ.16.44 కోట్లుగాను, ఢిల్లీలోని ఫ్లాట్ విలువను రూ.1.09 కోట్లుగా నిర్ధారించింది. ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ రుణాన్ని ట్రాన్స్ట్రాయ్ ఇండియాతో పాటు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్నారు. ఈ రుణానికి గ్యారంటెర్లుగా రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, జగన్మోహన్ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్ వెబ్సైట్ లేదా టెండర్స్ డాట్ గవ్ డాట్ ఇన్ను సంప్రదించాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు. (రాయపాటిపై ఈడీ కేసు నమోదు) -
రాయపాటికి బిగ్ షాక్
-
రాయపాటిపై ఈడీ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నిధుల మళ్లింపుపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాకి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలు రుణాలను కంపెనీ తీసుకుంది. 3,822 కోట్ల రూపాయల ఫండ్ డైవర్ట్ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్,మలేషియా,రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి. (చదవండి: ‘ట్రాన్స్ట్రాయ్’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ అక్రమబంధంపై సీబీఐ -
రాయపాటి కేసులో సీబీఐ ఆరా
-
బంగారు చీర కానుకపై సీబీఐ ఆరా!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ సంస్థ ఖాతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇతర ఖాతాలకు నిధులు మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఎంత డబ్బు రుణాల రూపంలో వచ్చింది.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించారు? అలా మళ్లించిన వాటిలో విదేశీ ఖాతాలు కూడా ఉన్నాయా? తదితర విషయాల గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సంస్థకు పోలవరం పనులు కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. 2015లో ఖాతాను స్తంభింపజేసినా.. ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, 2015లోనే బ్యాంకుల కన్సార్షియం సదరు సంస్థ ఖాతాను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ – నిరర్థక ఖాతా)గా ప్రకటించింది. దీంతో ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణ లున్నాయి. దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సీబీఐ అనుమానిస్తోంది. రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నట్లు తెలిసింది. అంత బంగారం ఎక్కడిది.? ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ పలుమార్లు ఇచ్చిన విరాళాలపైనా సీబీఐ దృష్టి సారించినట్లు సమాచారం. 2012 నవంబర్ 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు. ఆ బంగారు చీర తయారీకి ఎనిమిది కిలోల బంగారం (8086.97 గ్రాములు), 879.438 గ్రాముల వజ్రాలు, పగడాలు ఉపయోగించడం గమనార్హం. 2013 డిసెంబర్ 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. కాగా, 2013కు ముందు ఈ సంస్థ ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్ షీట్లను కూడా పరిశీలించనున్నారని సమాచారం. -
‘ఎస్క్రో’ నుంచి ఎస్కేప్.. అడ్డదారిలో బిల్లులు
ఎస్క్రో అకౌంట్ అంటే.. ప్రభుత్వం తరఫు అధికారి, ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లతో కూడిన జాయింట్ అకౌంట్‌నే ఎస్క్రో అకౌంట్ అంటారు. అన్నీ సక్రమంగా ఉంటేనే వీరందరి సంతకాలకు అవకాశం ఉంటుంది. అప్పుడే డబ్బు డ్రా చేసుకోవాలి. ఆ సమయంలో బ్యాంకుల అప్పు మినహాయించుకునే వీలుంటుంది. సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలనే కాదు.. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని తుంగలో తొక్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లించకుండా టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి నేరుగా బిల్లులు చెల్లించేలా అప్పటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పడాన్ని 14 బ్యాంకుల కన్సార్షియం సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. దీని వల్ల ట్రాన్స్ట్రాయ్ నుంచి రుణాలు వసూలు చేయకుండా చంద్రబాబు పరోక్షంగా అడ్డుకున్నట్లయ్యిందని బ్యాంకుల కన్సార్షియం వాపోతోంది. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇచ్చామని, కానీ ఆ మేరకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పును వసూలు చేయలేకపోయామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారులు సీబీఐకి వివరించినట్లు సమాచారం. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించడంతో ఎస్క్రో అకౌంట్ గుట్టు విప్పడంపై సీబీఐ దృష్టి సారించింది. పోలవరం హెడ్ వర్క్స్‌లో ట్రాన్స్ట్రాయ్ను ముందుపెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. తద్వారా లబ్ధిపొందాలని 2015లో అప్పటి ప్రభుత్వ పెద్ద స్కెచ్ వేశారు. కానీ.. ట్రాన్స్ట్రాయ్ వ్యవహార శైలిపై నమ్మకం కుదరని సబ్ కాంట్రాక్టర్లెవరూ పనులు చేయడానికి ముందుకు రాలేదు. 2015 అక్టోబర్ 10న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారి పేరుతో సంయుక్తంగా ‘ఎస్క్రో అకౌంట్’ తెరుస్తామని.. ఆ అకౌంట్ ద్వారానే చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తామని తీర్మానం చేయించారు. మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం మేరకు హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్క్రో అకౌంట్‌ను తెరిపించారు. సర్కారు హామీతో రూ.300 కోట్ల రుణం పోలవరం హెడ్ వర్క్స్‌లో చేసిన పనులకు ఎస్క్రో అకౌంట్ ద్వారానే బిల్లులు చెల్లిస్తామని.. ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇవ్వాలని అప్పటి సీఎంవోలోని కీలక అధికారి ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారులతో నాటి ప్రభుత్వ పెద్ద రాయబారాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే తాము ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు వాపోతున్నారు. హెడ్ వర్క్స్ నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ని 60సీ నిబంధన కింద పూర్తిగా తప్పించే వరకు.. అంటే 2018 జనవరి వరకు చేసిన పనులకు రూ.2,362.22 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా, మిగతా మొత్తం రూ.2,267.22 కోట్లను (ఆడిటింగ్‌లో రూ.5.64 కోట్లు తగ్గింది) నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లించారు. కమీషన్ల కోసం కేబినెట్ తీర్మానం తుంగలోకి.. ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన 14 బ్యాంకుల కన్సార్షియంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒకటి. ఆ ఖాతా ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లిస్తే.. వాటిని అప్పుల కింద కన్షార్షియం మినహాయించుకుంటుంది. దీంతో కమీషన్లు వసూలు చేసుకోవడం కష్టమవుతుందని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్ద.. మంత్రివర్గంలో ఆమోదించిన తీర్మానాన్ని తుంగలో తొక్కి, ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించేలా చక్రం తిప్పారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమన్న ఆర్థిక శాఖ అభ్యంతరాలను తోసిపుచ్చారు. పోలవరం హెడ్ వర్క్స్‌లో పనులు జరగాలంటే ట్రాన్స్‌ట్రాయ్‌కి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని.. సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే వారు పనులు చేయరని.. దాని వల్లే ఇతర బ్యాంకుల నుంచి బిల్లులు చెల్లించాలని అప్పట్లో తన నిర్ణయాన్ని చంద్రబాబు సమర్థించుకున్నారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. నిబంధనల ఉల్లంఘనలపై సీబీఐ దృష్టి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన కన్సార్షియంలోని బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలి. కానీ, ట్రాన్స్ట్రాయ్ రూ.2,261.58 కోట్ల విలువైన లావాదేవీలు ఇతర బ్యాంకుల నుంచి జరిపినట్లుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో వెల్లడైన అంశాన్ని ఆధారాలతో బ్యాంకుల కన్సార్షియం సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. ఎస్క్రో అకౌంట్ నిబంధనను కూడా తుంగలో తొక్కి.. ఆర్బీఐ నిబంధనలను తోసిపుచ్చి ప్రభుత్వం చెల్లింపులు చేసిందని స్పష్టం చేసింది. బ్యాంకుల కన్సార్షియం కన్నుగప్పి.. ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించడంలో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ఉందన్న ఫిర్యాదుపై సీబీఐ దృష్టి సారించి.. గుట్టువిప్పేందుకు కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
‘ట్రాన్స్ట్రాయ్’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డైరెక్టర్, ప్రమోటర్ చైర్మన్‌గా ఉన్న ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ రుణాల ఎగవేత కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కంపెనీకి రుణాల జాబితా పెద్దమొత్తంలోనే ఉంది. తాజాగా రూ. 264 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతపై సోమవారం సీబీఐ కేసు నమోదు చేసిన దరిమిలా..కంపెనీకి చెందిన పలు ఆర్థిక లావాదేవీలు వెలుగుచూస్తున్నాయి. 2013లో భారీగా రుణాలు పొందిన ట్రాన్స్‌టాయ్ తరువాతకాలంలో వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో ప్రస్తుత బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. 14 జాతీయ బ్యాంకుల వద్ద..: తాము పలు ఇరిగేషన్, రోడ్లు, మెట్రో, మెట్రో అండ్ రైల్వేస్, ఆయిల్ గ్యాస్‌ల ప్రాజెక్టులు చేపడతామని ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ చెబుతోంది. వాస్తవానికి ఇంతవరకూ ఈ కంపెనీ కేవలం రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులను విజయవంతంగానే పూర్తి చేసింది. మిగిలిన రంగాల్లో ఇంతవరకూ ఎలాంటి పనులు చేపట్టలేకపోయింది. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కుమరంభీమ్ ప్రాజెక్టు, అనంతపురంలోని చాగల్లు బ్యారేజ్‌లను పూర్తి చేసింది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్ ఫేస్–1 పనులను, మధ్యప్రదేశ్‌లో రెండు భారీ, తమిళనాడులో ఓ భారీ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసింది. 2013 ప్రారంభంలో ట్రాన్స్ట్రాయ్ తాను దక్కించుకున్న రూ.4,717 కోట్ల విలువైన పోలవరం హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పనులతోపాటు, ఇతర అభివృద్ధి పనులు చూపి 14 బ్యాంకుల కన్సార్షియం వద్ద వివిధ దశల్లో రూ.8,800 వరకు రుణాలు పొందింది. ఈ 14 జాతీయ బ్యాంకుల్లో రూ.990 కోట్లు వరకు అప్పిచ్చిన కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా ఉంది. తమ నుంచి నిధులను రుణాలుగా పొందినా తిరిగి చెల్లించడంలో ట్రాన్స్‌టాయ్ జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ 2015 నుంచే బ్యాంకుల కన్సార్షియం రుణాల రికవరీకి ప్రయత్నాలు ప్రారంభించాయి. అదే మే నెలలో ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ ఖాతాను ఎన్పీఏ (నిరర్ధకఖాతా)గా ప్రకటించాయి. ఇక 018 లోనే నేషనల్ కంపనీస్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను కెనరాబ్యాంకు ఆశ్రయించింది. తాజా గా తమ నుంచి తీసుకున్న రుణాల్లో రూ.264 కోట్లను వేరే ఖాతాలకు మళ్లించారన్న యూనియన్‌బ్యాంకు ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా.. ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ పలుమార్లు తానిచ్చిన విరాళాలతో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2012 నవంబరు 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన వజ్రాలు, పగడాలు పొదిగిన బంగారు చీరను కానుకగా సమర్పించారు. అప్పట్లో ఇది బాగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2013 డిసెంబరు 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు 3.42 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. -
అక్రమబంధంపై సీబీఐ
సాక్షి, అమరావతి: పోలవరం పేరుతో 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియానికి రూ.794 కోట్ల రుణం ఎగ్గొట్టిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై కేసు నమోదు చేసిన సీబీఐ మంగళవారం గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లోని ఆయన ఇళ్లలో సోదాలకు దిగడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ట్రాన్స్ట్రాయ్ రుణం తిరిగి చెల్లించకుండా మొండికేస్తోందని, వసూలుకు సహకరించాలని 2015 జూలై 31వతేదీన 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియం చేసిన అభ్యర్థనను నాటి సీఎం చంద్రబాబు తోసిపుచ్చడం వెనుక లోగుట్టును బహిర్గతం చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఆర్బీఐ నిబంధనలనను ఉల్లంఘించి పోలవరం హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకుల కన్సార్షియం ద్వారా కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించడంపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ని వీడి టీడీపీలో చేరిన రాయపాటి పోలవరం కాంట్రాక్టు ఒప్పందాన్ని చూపించి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.250 కోట్లకుపైగా చంద్రబాబుకు ముట్టచెప్పారన్న అంశంపై సీబీఐ క్షుణ్నంగా దర్యాప్తు జరుపుతోంది. ఒప్పందాన్ని చూపించి రుణం పోలవరం హెడ్‌వర్క్స్‌ను రూ.4,054 కోట్లకు దక్కించుకున్న టాన్స్‌ట్రాయ్–జేఎస్సీ–యూఈఎస్(జేవీ) 2013 మార్చి 2న నాటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ వాటా 87 శాతం కాగా రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతం మాత్రమే. ఈ ఒప్పందాన్ని చూపించి 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి ట్రాన్స్ట్రాయ్ రూ.794 కోట్ల రుణాన్ని తీసుకుంది. చిన్న తరహా ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఏకంగా 194.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాయపాటి భారీగా ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందంటూ నాడు కూడా ప్రతిపక్ష నేతగానే ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన రాయపాటి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.250 కోట్లకుపైగా చంద్రబాబుకు ముట్టచెప్పినట్లు టీడీపీ వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ని కాపాడేందుకు కేబినెట్ భేటీ.. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్పై కేంద్రం వేటు వేస్తుందని గుర్తించిన చంద్రబాబు 2015 అక్టోబర్ 10న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. 2010–11 ధరల ప్రకారం అప్పగించిన పోలవరం పనులు గిట్టుబాటు కావని, హెడ్‌వర్క్స్‌ను 2018 నాటికే పూర్తి చేయాలంటే 2015–16 ధరలను వర్తింపజేసి అంచనా వ్యయాన్ని పెంచాలని అందులో తీర్మానించారు. ఈ క్రమంలోనే పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రాన్ని పదేపదే అభ్యర్థించారు. చివరకు 2016 సెప్టెంబరు 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం గత ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,385.91 కోట్లకు పెంచేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందం గడువు ముగియకుండానే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.1,331.91 కోట్ల లాభాన్ని చేకూర్చింది. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పోలవరం పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించిన చంద్రబాబు బిల్లులు చెల్లించే సమయంలోభారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్ల కోసం కన్సార్షియం కన్నుగప్పి.. పోలవరం హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు 2018 జనవరి వరకు రూ.2,362.22 కోట్లను బిల్లుల రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈ బిల్లులు చెల్లింపు లావాదేవీలు 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియం కనుసన్నల్లోనే జరగాలి. అయితే బ్యాంకుల కన్సార్షియం ద్వారా చెల్లింపులు జరిపితే ట్రాన్స్ట్రాయ్ తీసుకున్న రుణాన్ని మినహాయించుకుని మిగతా బిల్లులను మాత్రమే బ్యాంకులు చెల్లిస్తాయి. ఇలాగైతే కమీషన్లు రావని ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన 14 బ్యాంకుల కన్సార్షియం ద్వారా కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించాలని పే అండ్ అకౌంట్స్ విభాగంపై నాడు చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో బ్యాంకుల కన్సార్షియం కన్నుగప్పి ఇతర బ్యాంకుల ద్వారా దొడ్డిదారిలో ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) ద్వారా జాతీయ బ్యాంకుల కన్సార్షియం నిర్వహించిన ఆడిటింగ్‌లో ఇదే విషయం వెల్లడి కావడంతో దీనిపై సీబీఐకి నివేదించింది. రసీదులు లేకుండా చెల్లింపులు.. పోలవరం హెడ్‌వర్క్స్ సీఈ, ఎస్ఈల నేతృత్వంలో ప్రత్యేక నిధి ఉంటుంది. డీజిల్, పెట్రోల్ కొనుగోలు, యంత్రాల మరమ్మతులు, కూలీల వేతనాల చెల్లింపు కోసమే ప్రత్యేక నిధిని వినియోగించాలి. ఈమేరకు కాంట్రాక్టర్ రసీదులు చూపితేనే ప్రత్యేక నిధి ద్వారా చెల్లింపులు చేయాలి. అనంతరం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే సమయంలో ప్రత్యేక నిధి ద్వారా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలి. అయితే ట్రాన్స్ట్రాయ్ ఎలాంటి రసీదులు చూపకున్నా ప్రత్యేక నిధి కింద రూ.170 కోట్లను చెల్లించారు. ట్రాన్స్ట్రాయ్ బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయడం ద్వారా ఎలాగోలా మొబిలైజేషన్ అడ్వాన్సులను అధికారులు వసూలు చేయగలిగారు కానీ ప్రత్యేక నిధి ద్వారా చేసిన చెల్లింపులను మాత్రం రికవరీ చేయలేకపోయారు. - పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ట్రాన్స్‌ట్రాయ్‌కి హెడ్‌వర్క్స్ పనులను చేసే సత్తా లేదని 2015 మార్చి 12న పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశంలో అప్పటి సీఈవో దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. - ట్రాన్స్‌ట్రాయ్‌కి ఎక్కడా లేని రీతిలో కాంట్రాక్టర్ రోజువారీ ఖర్చులు అంటే డీజిల్, పెట్రోల్, యంత్రాల మరమ్మతులు, కూలీల వేతనాల చెల్లింపు కోసం రూ.25 కోట్లతో ప్రత్యేక నిధి (స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్) ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. - తొలుత రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిని అంచెలంచెలుగా పలు జీవోలతో రూ.170 కోట్లకు పెంచేసిన నాటి సీఎం చంద్రబాబు ట్రాన్స్‌ట్రాయ్‌కి భారీ ప్రయోజనం చేకూర్చారు. - అధికారులు తీవ్రంగా ప్రయత్నించి అందులో రూ.26 కోట్లను తిరిగి రాబట్టగలిగినా కాంట్రాక్టర్ నుంచి మిగతా డబ్బులను తిరిగి వసూలు చేయకుండా చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. పత్తాలేని విదేశీ సంస్థలు.. పోలవరం పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకున్నాక విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ పత్తా లేవు. అంటే కేవలం ఈ కాంట్రాక్టు పనులను దక్కించుకునేందుకు అవసరమైన సాంకేతిక సహకారం కోసమే విదేశీ సంస్థలను ట్రాన్స్ట్రాయ్ కాగితాలపై చూపినట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్పై వేటు వేయాలని 2014లోనే జలవనరులశాఖ ఉన్నతాధికారులు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కూడా 2015 మార్చి 12న తొలి సారిగా నిర్వహించిన సమావేశంలో ట్రాన్స్ట్రాయ్ జేవీలో విదేశీ సంస్థలు జాడ లేకపోవటాన్ని ప్రశ్నించింది. పనుల్లో ఏ మాత్రం ప్రగతి లేకపోవడాన్ని ఆక్షేపించింది. ఈ క్రమంలో ట్రాన్స్ట్రాయ్ నుంచి రుణం వసూలుకు సహకరించాలని జాతీయ బ్యాంకుల కన్సార్షియం చేసిన అభ్యర్థనను నాటి సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు. -
హైదరాబాద్ నుంచి లాకర్ తాళాలు తెప్పించి...
సాక్షి, గుంటూరు/ హైదరాబాద్: జాతీయ బ్యాంకులకు రూ.వందల కోట్లలో రుణాల ఎగవేతకు సంబంధించి టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులపై సీబీఐ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాయపాటికి చెందిన పలు ప్రాంతాల్లోని నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరు తదితర చోట్ల ఈ సోదాలు జరిగాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు...హైదరాబాద్ కావూరి హిల్స్‌లోని ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్‌తోపాటు డైరెక్టర్, ప్రమోటర్ చైర్మన్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు, ఇండిపెండెంట్ నాన్–ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో జాబితాలో చేర్చింది. జాతీయ బ్యాంకులకు రుణాల ఎగవేతకు సంబంధించి 120 బి, రెడ్‌విత్ 420, చీటింగ్, 406, 468, 477ఏ తదితర సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఇతర ఖాతాలకు మళ్లించారంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ప్రాంతీయ విభాగాధిపతి ఎస్.కె భార్గవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా మళ్లింపు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ తనకిచ్చిన క్రెడిట్ లిమిట్స్‌ను వాడుకుని మోసానికి పాల్పడినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తొలుత తనకిచ్చిన క్రెడిట్ లిమిట్‌ని రూ.50 కోట్ల నుంచి రూ.81 కోట్లకు పెంచుకుంది. లెటర్ ఆఫ్ గ్యారంటీ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.234 కోట్లకు, లెటర్ గ్యారెంటీ లిమిట్‌ను రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెంచుకుంది. ఆంధ్రాబ్యాంకు, యూకో, యూనియన్ బ్యాంక్ తదితర 14 బ్యాంకులతో కూడిన కన్సార్టియానికి కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంకుగా వ్యవహరించింది. వివిధ క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లకుపైగా ట్రాన్స్ట్రాయ్ వేరే ఖాతాలకు మళ్లించిందని, బ్యాంకులకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. హైదరాబాద్ నుంచి లాకర్ తాళాలు తెప్పించి... గుంటూరు లక్ష్మీపురం నాలుగో లైన్‌లోని రాయపాటి నివాసానికి మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు చేరుకున్న పది మంది సీబీఐ అధికారుల బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. రాయపాటి నివాసంలో రెండు లాకర్లు ఉండగా తొలుత మొదటి లాకర్ తనిఖీ చేశారు. రెండో లాకర్ తాళాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొనడంతో తెప్పించాలని అధికారులు సూచించారు. అనంతరం రెండో లాకర్ కూడా తెరిచి అందులోని డాక్యుమెంట్లను పరిశీలించారు. రాయపాటి కుమారుడు రంగబాబుతోపాటు కుటుంబ సభ్యులను కూడా సీబీఐ అధికారులు విచారించారు. తమ ఇంట్లో డబ్బులు, వజ్రాలతోపాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి, బ్యాంకులకు మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారని అయితే ట్రాన్స్ట్రాయ్ కంపెనీతో ప్రస్తుతం తమకు ఎలాంటి సంబంధం లేదని రంగబాబు పేర్కొన్నారు. తన తల్లి జీవించి ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ట్రాయ్‌లో భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. -
రాయపాటిపై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసుకు సంబంధించి అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల అనంతరం రాయపాటిపై 120(బీ), రెడ్ విత్ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్ 13(2), రెడ్ విత్ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటితో పాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చారు. రుణాల ఎగవేతపై యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ భార్గవ్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ట్రాన్స్‌టాయ్ కార్యాలయాలతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టారు. చదవండి : రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు -
రాయపాటికి ఘోర పరాభవం
సాక్షి, గుంటూరు: రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరుగాంచిన రాయపాటి సాంబశివరావు...వైఎస్సార్ సీపీ ఫ్యాను గాలికి కొట్టుకుపోయారు. జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన ఆయన ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన విషయం విదితమే. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూస్తే ఎంతటి సీనియర్ నాయకులైన సరే... మట్టి కరవక తప్పలేదు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీకి నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం మంచి పట్టున్న ప్రాంతం. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా యువ విద్యావేత్త లావు శ్రీకృష్ణదేవరాయులు మొట్టమొదటి సారిగా పోటీ చేసి 1.53 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. జిల్లాలో అతి చిన్న వయస్సులో ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఐదు సార్లు ఎంపీగా గెలిచిన రాయపాటిపై విజయం రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది. ఆయన జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసిన విజయం ఖాయం అంటూ జిల్లావాసులే చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అటువంటి రాయపాటికి ఓ యువకుని చేతిలో ఓటమి పరాభవం తప్పలేదు. జిల్లాలో 1982 నుంచి జిల్లాలో రాజ్యసభకు, లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ ఎంపీగా చలామణి అయ్యారు. అటువంటి నాయకుడిపై 37 ఏళ్ల యువ విద్యావేత్త లావు శ్రీకృష్ణదేవరాయులు అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, మట్టి కరిపించారు. వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ నరసరావుపేట ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావుపేట ఎంపీ అసెంబ్లీ స్థానాలైన నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్ధి కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో పాటు, ఎంపీ స్థానాన్ని సైతం లక్షన్నర మెజార్టీతో గెలుపొందడం గుంటూరు చరిత్రలో ఇదే తొలిసారి. పల్నాడులో వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం రాజకీయాలకు కొత్త ముఖమైన యువకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు.. రాజకీయాల్లో పండిపోయిన కురువృద్ధుడైన రాయపాటి సాంబశివరావును ఓడించడం, జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా సంచలనం కలిగించింది. ఇందిరాగాంధీ హయాం నుంచి రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఉన్న రాయపాటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోని లేని సమయంలో సైతం గుంటూరు పార్లమెంట్ ఎంపీగా గెలుపొంది ఉనికిని చాటుతూ వచ్చారు. కరుడు కట్టిన కాంగ్రెస్‌వాదిగా ఉన్న రాయపాటి రాష్ట్ర విభజన పరిస్థితుల్లో దానికి గుడ్ చెప్పి టీడీపీలో చేరి 2014లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా రాయపాటికే టీడీపీ ప్రభుత్వం ఎంపీ స్థానాన్ని కేటాయించింది. అయితే, టీడీపీపై వ్యతిరేకంగా ఉన్న పల్నాడు ప్రాంత వాసులు దానికి బుద్ధి చెప్పి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబెట్టారు. యువ విద్యావేత్త లావు కృష్ణదేవరాయులుకు నరసరావుపేట ఎంపీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ కేటాయించడం.. 1.50లక్షల మెజార్టీతో గెలవడం లాంఛనప్రాయమైంది. లావు శ్రీకృష్ణదేవరాయులు గెలుపుతో రాయపాటి రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పడినట్లే అయిందనే పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
రాయపాటిపై ఫైర్ అవుతున్న కోడెల
సాక్షి, గుంటూరు : ఎన్నికలు దగ్గరపడుతున్నా...గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా రాయపాటి వర్గం పావులు కదిపింది. కోడెల శివప్రసాదరావు చిరకాల ప్రత్యర్థి నల్లపాటి రామును టీడీపీలో చేర్చించడమే కాకుండా, ఏకంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా వేయించారు రాయపాటి. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకూ కోడెలకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహారంపై కోడెల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా నరసరావుపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అరవింద బాబును కూడా కోడెల శివప్రసాదరావు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ ద్రోహి అరవింద్ బాబు అంటూ తన అనచరులతో ర్యాలీ కూడా చేయించారు. అయినప్పటికీ తాను నరసరావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేయాలంటే డాక్టర్ చదలవాడకు టికెట్ ఇవ్వాల్సిందేనని రాయపాటి చంద్రబాబు వద్ద పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికైనా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ చదలవాడకు టికెట్ ఇచ్చినట్లుగా కోడెల వర్గీయులు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. అయితే డాక్టర్ చదలవాడ అభ్యర్థిత్వ నిర్ణయంపై కోడెల ప్రభావం లేకుండా అధిష్టానం వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ‘నల్లపాటి’ విషయంలో రాయపాటి.. కోడెలపై పైచేయి సాధించినట్లు అయింది. -
వేలానికి రాయపాటి ఇల్లు
సాక్షి, అమరావతి: తీసుకున్న రుణాలను తిరిగి తీర్చని నేపథ్యంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఆంధ్రా బ్యాంక్ తాజాగా వేలం ప్రకటన జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–7లో ఉన్న జీ+3 వాణిజ్య భవనాన్ని 25/04/2019న వేలం వేస్తున్నట్లు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. 631 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బిల్డింగ్ కనీస ధరను రూ.7,36,14,000గా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనేవారు ధరావత్తు కింద రూ.73,61,400 జమ చేయాల్సి ఉంటుంది. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ మార్చి 20 నాటికి రూ.748.77 కోట్లు రుణాలు బకాయి ఉండటంతో కంపెనీకి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ఆ ప్రకటనలో పేర్కొంది. చదవండి....(ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డా) ఈ రుణానికి గ్యారంటర్లుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారులు రాయపాటి రంగారావు, కుమార్తెలు దేవికారాణి, లక్ష్మీలతోపాటు మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్లకుపైగా రుణాలను తీసుకుని ఎగ్గొట్టింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని అందరూ మొత్తుకున్నా సీఎం చంద్రబాబు ఆ కంపెనీకి అండగా నిలబడటమేగాక మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో భారీగా నిధులను అందజేశారు. అయితే ఎన్నికల ముందు ట్రాన్స్ట్రాయ్కు సత్తా లేదని, అందుకే పనులను నవయుగకు అప్పచెప్పినట్లు చెప్పి హడావుడి చేయడం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి రాయపాటి సాంబశివరావు మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు విజయ్‌మాల్యా లాంటి వాళ్లు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారంటూ విమర్శలు గుప్పించే సీఎం చంద్రబాబు ఇలా వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన రాయపాటికి మరోసారి ఎంపీ టికెట్ ఎలా ఇస్తున్నారంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. -
చంద్రబాబుపై రాయపాటి సాంబశివరావు ఆగ్రహం
-
చంద్రబాబుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం
-
కోడెలకు టికెట్ ఎందుకు కన్ఫామ్ చేశారు?
సాక్షి, గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు తన అబ్బాయికి ఇవ్వమని అడిగితే చూద్దాం.. ఆలోచిద్దామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కోడెలకు టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు చెప్తున్న ఆయనకు ఎందుకు కాన్ఫామ్ చేశారని ప్రశ్నించారు. తనకు టికెట్ కేటాయించకుండా దూరం పెట్టడానికి తాను చేసిన అన్యాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వేరే వారి నుంచి ఒత్తిడి ఉండటం వల్లే మూడు సార్లు మీటింగైనా సీటు సంగతి తేల్చలేదని ఆరోపించారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమేనని, కుటుంబ సభ్యులు, అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ( ఇది చదవండి : ముడుపుల గుట్టు విప్పేస్తా) -
చంద్రబాబుకు రాయపాటి ఝలక్
సాక్షి, అమరావతి: నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వానికీ.. పోలవరం ప్రాజెక్టుకూ రాయపాటి సాంబశివరావు ముడిపెట్టారు. తనకు లేదా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వని పక్షంలో పోలవరం ప్రాజెక్టులో ముడుపుల బాగోతాన్ని పూసగుచ్చినట్లు ప్రజలకు చెబుతానని సీఎం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రాయపాటి బెదిరింపులతో వెనక్కితగ్గిన చంద్రబాబు నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిత్వంపై సిట్టింగ్ ఎంపీ రాయపాటికి స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు. రాయపాటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట టీడీపీ టికెట్ తనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ (జేవీ) రూ.4,054 కోట్లకు మార్చి 3, 2013న దక్కించుకుంది. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఏమాత్రం అనుభవం లేని ట్రాన్స్ట్రాయ్కు పోలవరం పనులు ఎలా అప్పగిస్తారని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి భారీగా కమీషన్లు ముట్టాయని కూడా ఆరోపించారు. అయితే 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి సైకిలెక్కారు. తర్వాత ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో ఏమాత్రం కదలిక లేదని, కాంట్రాక్టర్‌కు పనులు చేసే సత్తా లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా.. రాయపాటి సంస్థపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరి కదా.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర సర్కార్‌కు దక్కగానే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెంచేసి ప్రయోజనం చేకూర్చారు. ఆ తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందుపెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్ల దందా గడ్కరీకి చెప్పిన రాయపాటి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేకపోవడంపై అక్టోబర్, 2017లో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ సంస్థపై కేంద్రం వేటు వేస్తోందేమోనని భయపడిన రాయపాటి.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై.. సీఎం చంద్రబాబుకు భారీ ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లే తమ సంస్థ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని, అందువల్లే పనుల్లో జాప్యం చోటుచేసుకుందని చెప్పినట్లు అప్పట్లో దుమారం రేగింది. ఆ తర్వాత చంద్రబాబు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమావేశం (2017 అక్టోబర్ 17) నిర్వహించిన గడ్కరీ.. దీనిపై చంద్రబాబును ప్రశ్నించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న కీలక అధికారి ఒకరు వెల్లడించారు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేసుకుని, వారిని ఆర్థికంగా దెబ్బతీస్తే పనులు ఎలా చేస్తారని చంద్రబాబును గడ్కరీ నిలదీయడంతో తాము ఆశ్చర్యపోయామని ఆయన వివరించారు. అయితే ఈ వ్యవహారం బయటపెట్టకుండా రాయపాటిని చంద్రబాబు ఇన్నాళ్లూ కట్టడి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు రావడం, నరసరావుపేట సీటును తనకు లేదా తన కుమారుడికి కేటాయించాలని రాయపాటి కోరుతుండగా.. చంద్రబాబు మాత్రం స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి శిద్ధా రాఘవరావుల అభ్యర్థిత్వాలను పరిశీలిస్తుండటం రాయపాటికి ఆగ్రహం తెప్పించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ముడుపుల బాగోతాన్ని తెరపైకి తెచ్చారని వివరించాయి. (చదవండి: రగిలిపోతున్న ‘రాయపాటి’) -
అక్రమ చెల్లింపులకు హైలెవల్ కుట్ర
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో మరో దోపిడీకి సీఎం చంద్రబాబు తెరతీశారు. అక్టోబర్ 7, 2016 నుంచి జనవరి, 2018 వరకూ చేసిన పనులకు అదనంగా రూ.213 కోట్లు ఇవ్వాలన్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ‘ట్రాన్స్ట్రాయ్’ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని ఉన్నత స్థాయి కమిటీపై ఒత్తిడి తెస్తున్నారు. పెంచిన అంచనా వ్యయం మేరకు ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు చెల్లించామని.. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించడానికి సంబంధించిన ప్రతిపాదనను మంగళవారం నిర్వహించే కేబినెట్ సమావేశానికి పంపాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే పోలవరం హెడ్ వర్క్స్‌ను రూ.4054 కోట్లకు ట్రాన్స్ట్రాయ్ దక్కించుకుంది. కానీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత వ్యయాన్ని రూ.5,385.91 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు ట్రాన్స్‌ట్రాయ్‌తో అక్టోబర్ 7, 2016న జలవనరుల శాఖ అనుబంధ ఒప్పందం (సప్లిమెంటరీ అగ్రిమెంట్) చేసుకుంది. అక్టోబర్ 7, 2016 నుంచి ఆ సంస్థను 60సీ నిబంధన కింద తొలగించే వరకూ.. చేసిన పనులకు రూ.2,362.22 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారు. అంటే 2015–16 ధరల ఆధారంగా పెంచేసిన అంచనా వ్యయం మేరకే బిల్లులు చెల్లించినట్లుగా స్పష్టమవుతోంది. సబ్ కాంట్రాక్టర్లకు రూ.418 కోట్ల బకాయిలు.. అంచనా వ్యయాన్ని పెంచేసిన తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి.. మట్టి పనులు త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పునాది(డయా ఫ్రమ్ వాల్)పనులు ఎల్అండ్టీ–బావర్, కాఫర్ డ్యామ్ పునాది (జెట్ గ్రౌటింగ్) పనులు కెల్లర్, కాంక్రీట్ పనులు ఫూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులు బీకెమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద సీఎం చంద్రబాబు అప్పగించారు. బిల్లులు చెల్లించేటపుడు భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. అయితే పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ప్రధాన కాంట్రాక్టర్ అయిన ట్రాన్స్ట్రాయ్ బిల్లులు చెల్లించలేదు. ఇదే అంశంపై సబ్ కాంట్రాక్టు సంస్థలు పలు సందర్భాల్లో ఆందోళన చేశాయి.. ఈ బకాయిలు సుమారు రూ.418 కోట్లకుపైగా ఉంటాయన్నది అంచనా. బకాయిలను చెల్లించకపోవడంతో జనవరి, 2018 నాటికి సబ్ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. దాంతో.. ట్రాన్స్ట్రాయ్పై 60సీ నిబంధన కింద వేటు వేసి గేట్ల పనులు బీకెమ్‌కు, మిగతా పనులన్నీ నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగించేయడం ద్వారా చంద్రబాబు భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. ట్రాన్స్ట్రాయ్ బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు ఫిర్యాదు చేసింది. డీఆర్ఐ రంగంలోకి దిగితే తన కమీషన్ల బాగోతం బయటపడుతుందని ఆందోళనకు గురైన చంద్రబాబు, ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల పంచాయతీని తేల్చడానికి గత నెల 13న ఈఎన్సీ (ఇంజనీర్–ఇన్–చీఫ్) అధ్యక్షతన నలుగురు సభ్యలతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి.. పోలవరం హెడ్ వర్క్స్‌లో తాము చేసిన పనులకు జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ల ప్రకారం అదనపు బిల్లులు ఇవ్వాలని ఇటీవల ట్రాన్స్ట్రాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సెప్టెంబరు 7, 2016న పెంచిన అంచనా వ్యయం ప్రకారం తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని పేర్కొంది. రూ.213 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని కోరింది. ఈ ప్రతిపాదనను ఉన్నత స్థాయి కమిటీకి పంపిన సీఎం చంద్రబాబు.. దానిపై ఆమోదముద్ర వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే చెల్లించామని.. అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖను ఆదేశించారు. మంగళవారం నిర్వహించే కేబినెట్లో అదనపు బిల్లులు చెల్లించడానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అదనంగా చెల్లించే బిల్లులతోనే సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన వాటిలో 50 శాతం చెల్లించి వారి మధ్య బకాయిల పంచాయతీని తేల్చేయాలని భావిస్తున్నారు. -
ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చింది. కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.489.77 కోట్లు చెల్లించకుండా ఎగవేసినందుకు ఎన్సీఎల్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) హైదరాబాద్‌కు చెందిన గోవిందరాజుల వెంకట నర్సింహారావును నియమించింది. ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియకు సంబంధించి వెంటనే పత్రికా ప్రకటన జారీ చేయాలని ఆర్పీని ఎన్సీఎల్టీ ఆదేశించింది. అలాగే ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది. ఈ నెల 10 నుంచి దివాలా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మరటోరియం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదంది. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని ట్రాన్స్ట్రాయ్ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళీ మంగళవారం తీర్పునిచ్చారు. కెనరా బ్యాంకు నుంచి రూ.725 కోట్ల రుణం తీసుకున్న ట్రాన్స్ట్రాయ్ ఇండి యా లిమిటెడ్ రూ.489.77 కోట్లు బకాయి పడింది. ఈ బకాయి వసూలు నిమిత్తం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియ కోసం కెనరా బ్యాంకు హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎస్‌సీఎల్‌టీ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ట్రాన్స్ట్రాయ్ లేదు... ఈ సందర్భంగా కెనరా బ్యాంకు తరఫు న్యాయవాది దీపక్ భట్టాచార్జీ వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్ట్రాయ్ పలు బ్యాంకుల నుంచి రూ.3694.47 కోట్ల మేర రుణం తీసుకుందన్నారు. వివాదాలు పరిష్కారమైతే రూ.6803 కోట్ల కొత్త ప్రాజెక్టులు వస్తాయనడం ఎంత మాత్రం నమ్మశక్యం కాదన్నారు. అన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు ట్రాన్స్ట్రాయ్ చెబుతోందని, అందులో నిజం ఉంటే, ఆ కంపెనీ లాభాలను ఆర్జించి ఉండేదని, అదే సమయంలో బకాయిలు కూడా తీర్చి ఉండేదని, అయితే అటువంటి పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రూ.489 కోట్ల బకాయిని ఆర్బీఐ నిరర్థక ఆస్తిగా గుర్తించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.755 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఉపయోగించుకుందని తెలిపారు. అప్పుల కంటే ఆస్తులెక్కువున్నాయి... తరువాత ట్రాన్స్ట్రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ, ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.5788 కోట్ల పనుల్లో తమ కంపెనీ భాగస్వామిగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కింద 31.22 పనులను పూర్తి చేశామన్నారు. 2019 నాటికి రూ.3981 కోట్ల విలువైన పనులు పూర్తవుతాయని వివరించారు. అలాగే పలు ప్రాజెక్టుల్లో రూ.1530 కోట్ల మేర పెట్టుబడులు పెట్టామన్నారు. అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువన్నారు. అలాగే రష్యా, చైనా కంపెనీల భాగస్వామ్యంతో పలు ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు మురళీ ట్రాన్స్ట్రాయ్ వాదనలను తోసిపుచ్చారు. ఆ కంపెనీ దివాలా ప్రక్రియకు ఆదేశాలిచ్చారు. -
భగ్గుమంటున్న హిందూ సంఘాలు
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుమల/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులను, రౌడీయిజం చేసే వారిని, ఆధ్యాత్మిక–సేవా భావం లేనివారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించారని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాది పాటు అధికారుల పాలనలో సాగిన టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియామకంపై హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు. అలాగే బోర్డులో సభ్యురాలుగా నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయంలోనూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. అలాగే తనను టీటీడీ సభ్యుడిగా నియమించడంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. తాను టీటీడీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వకుండా, సభ్యుడిగా నియమించి అవమానించారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నా మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఆమెకు టీటీడీ బోర్డులో చోటు కల్పించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బోర్డులో తమకు అవకాశం కల్పిస్తారని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆశించారు. అవకాశం రాని వారు పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డులో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమని ఆ రాష్ట్రానికి చెందిన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. -
దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ తమ వద్ద రుణంగా తీసుకున్న రూ.725 కోట్లు తిరిగి చెల్లించడం లేదని కెనరా బ్యాంకు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్రాన్స్ట్రాయ్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొంది. అలాంటి సంస్థ తరఫున పూచీకత్తు(లెటర్ ఆఫ్ కంఫర్ట్) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆర్థికరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, జల వనరులశాఖల అభ్యంతరాలను బేఖా తరు చేస్తూ గత నెల 1న కేబినెట్లో ట్రాన్స్ట్రాయ్ తరఫున బ్యాంకర్లకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇచ్చేలా సీఎం చంద్రబాబు పట్టుబట్టి తీర్మానం చేయించిన సంగతి తెలిసిందే. -
బాబుకు ఝలక్ ఇచ్చిన రాయపాటి
-
నాకు టీటీడీ చైర్మన్ కావాలని ఉంది
-
బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం
విజయవాడ: విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్లో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరులు వీరంగం సృష్టించారు. మంగళవారం ఉదయం రాయపాటి అనుచరులు ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న నాగభూషణం అనే వ్యక్తిపై వారు దాడికి చేశారు. పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. -
రాయపాటి చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనలకు అడ్డంకులు కల్పిస్తున్న అధికార పార్టీ నేతలపై సినీ హీరో పవన్ కల్యాణ్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టకూడదని రాయపాటి సాంబశివరావుకు ఆయన సూచించారు. రాయపాటి లాంటివాళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యరు, చేసేవాళ్లను చెయ్యనివ్వరని అన్నారు. పైగా కష్టపడే రైతుల పచ్చని పొలాల్లో పోలవరం కాంట్రాక్టు లాభాల కోసం మట్టిని డంప్ చేయిస్తారని చెప్పారు. ఇలాంటి వ్యాపార ధోరణితో కూడిన రాజకీయాల వల్లే తెలంగాణ యువతకు కోపం తెప్పించి.. 'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారని విమర్శించారు. దురాశ, డబ్బు, పదవీ వ్యామోహాల కోసం భావి తరాల భవిష్యత్తును పాడుచేసే హక్కు రాయపాటికి లేదన్నారు. మరోవైపు యువత పోరాట స్ఫూర్తిని కేంద్రమంత్రి సుజనాచౌదరి పందుల పందాలతో పోల్చడం చాలా బాధాకరమని పవన్ అన్నారు. ఇక నోరు జారేకొద్దీ యువతను రెచ్చగొట్టడమే అవుతుందని, అలాగే కానివ్వాలని చెప్పారు. #APDemandsSpecialStatus పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి,పెద్దలు 'రాయపాటి' గారు ఒక సారి ఆలోచించండి.. — Pawan Kalyan (@PawanKalyan) 26 January 2017 ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాల తోనే మీరు తెలంగాణా యువతకి కోపం తెప్పించి,'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతి కే తీసుకొచ్చారు — Pawan Kalyan (@PawanKalyan) 26 January 2017 #APDemandsSpecialStatus మీ దురాశలకి,డబ్బు, పదవి వ్యామోహానికి భావి తరాల భవిష్యత్తు ని పాడు చేసే హక్కు మీకు లేదు.. — Pawan Kalyan (@PawanKalyan) 26 January 2017 #APDemandsSpecialStatus pic.twitter.com/McbwjrSrJC — Pawan Kalyan (@PawanKalyan) 26 January 2017 యువత పోరాట స్పూర్తిని "సుజనా చౌదరి గారు" పందులు పందాలు తో పోల్చడం ' చాల భాదాకరం.. — Pawan Kalyan (@PawanKalyan) 26 January 2017 #APDemandsSpecialStatus ఇంక మీరు నోరు జారే కొద్ది యువత ని రెచ్చగొట్టటమే.. సరే అలాగే కానివ్వండి.. — Pawan Kalyan (@PawanKalyan) 26 January 2017 -
నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ
విజయవాడ: పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బురద అంటించుకున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ బురద కడిగేందుకు చంద్రబాబు నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఆ బురద మాకు అంటుతోందని రాయపాటి వాపోయారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల గొంతు నొక్కారని విమర్శించారు. నోట్ల రద్దు మూలంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రాయపాటి.. ఈ సమస్య ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనమంతా కాంగ్రెస్ వాళ్ల దగ్గరే ఉందని.. దాన్ని మార్చుకోలేకే వారు పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నారని రాయపాటి విమర్శించారు. -
టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్నడూలేనంత అవినీతి, అక్రమాలు: ఎంపీ రాయపాటి వినుకొండ టౌన్ : తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నాయకుల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేనంత అక్రమాలు, అవినీతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా చంద్రబాబు వద్ద ఉందని, జిల్లాలో దాదాపు అందరూ మైనస్ గ్రేడ్లలోనే ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా చంద్రబాబు తెప్పించుకున్నారన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం కష్టమని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్‌గా మార్పు చేయటం సులభమని పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన ‘గమ్మునుండు..’ అంటున్నాడన్నారు. విశాఖకు ఏ విధంగా రైల్వే జోన్ వస్తుందని, వారి పోరాటం వృథా అవుతుందని చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. -
రాయపాటిపై ‘కన్నా’ కేసు విచారణ ప్రారంభం
గుంటూరు: తన పరువు ప్రతిష్టలకు భంగం కలింగించేలా పలు పత్రికలలో ప్రకటనలు ఇచ్చారని ఆరోపిస్తూ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ నాలుగవ అదనపు జిల్లా కోర్టులో సోమవారం ప్రారంభమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అప్పటి రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలు ఉన్నారని అందులో గుంటూరుకు చెందిన మంత్రి ఉన్నారంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ కన్నా లక్ష్మీనారాయణ రూ. కోటి నష్టపరిహారం కోరుతూ తన న్యాయవాది ఆరెగకూటి సంజీవరెడ్డి ద్వారా లీగల్ నోటీసు ఇచ్చారు. అనంతరం కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సోమవారం ప్రారంభ మైంది. కన్నా లక్ష్మీనారాయణ తన సాక్ష్యాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టులో దాఖలు చేశారు. తన కేసు నిరూపణ కోసం కొన్ని డాక్యుమెంట్లు అఫిడవట్తో పాటు దాఖలు చేయగా వాటిలో పేపర్ కటింగ్లను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం న్యాయవాద కమిషనర్‌ను నియమించాలని కన్నా లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది కోరగా అందుకు రాయపాటి సాంబశివరావు తరపు న్యాయవాది నీలం రామమోహనరావు అభ్యంతరం తెలిపారు. కమిషనర్ అవసరం లేదని ఈ కేసు ప్రాముఖ్యత దృష్ట్యా కోర్టుహాల్లోనే జరగాలని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. పిటీషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తానని కేసును న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. -
సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి?
ఎటూ తేలని టీటీడీ ధర్మకర్తల మండలి భవితవ్యం జీవో ప్రకారం ముగిసిన ఏడాది పదవీ కాలం ప్రమాణస్వీకారం ప్రకారం మే ఒకటి వరకు కొనసాగే అవకాశం పొడిగింపుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి మార్పులపై సీఎం కసరత్తు, పెరిగిన ఆశావహుల ఒత్తిడి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపుపై సందిగ్ధం వీడడం లేదు. నిబంధనల ప్రకారం గత బుధవారంతోనే టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసింది.అయితే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేస్తుందా..? లేక పాత పాలకమండలినే కొనసాగిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా బోర్డులో చోటు దక్కించుకునేందుకు అధికారపార్టీ నాయకులతో పాటు, పారిశ్రామిక వేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నియామక ఉత్తర్వులు గత ఏడాది ఏప్రిల్ 26న వెలువడ్డాయి. టీటీడీ చైర్మన్‌గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఆమేరకు మే 1వ తేదీన చైర్మన్‌తోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ప్రకారం ఈ దర్మకర్తల మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 1న కాబట్టి ఈ ఏడాది మే 1 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. అందువల్లే జీవో ప్రకారం పదవీ కాలం ముగిసినా ప్రమాణస్వీకారం తేదీని దృష్టిలో ఉంచుకుని చైర్మన్‌తోపాటు సభ్యులకు అందాల్సిన మర్యాదలన్నీ గురువారం కూడా కొనసాగించారు. సాయన్నతోపాటు పలువురి మార్పులపై కసరత్తు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు రెండేళ్లు పొడిగించారు. అదే నిర్ణయానే టీటీడీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సభ్యుల్లోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలకు వరుసగా నాలుగుసార్లు హాజరుకాలేదు. ఈయన తొలగింపుపై టీటీడీ, ఎండోమెంట్ చట్టంతోపాటు న్యాయ సలహా తీసుకున్నారు. పనిలో పనిగా ఒకరిద్దరు సభ్యులు మార్పుపై కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి? టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గురువారం సీఎం చంద్రబాబును కలిసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అలాగే, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చర్చ సాగుతోంది. ఇక బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. తాజా బోర్డు ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కొత్త బోర్డుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి వరకు దీనిపై ఎటువంటి స్పష్టమైన నిర్ణయం వెలువడ లేదు. పాత బోర్డు కొనసాగింపా? కొత్త బోర్డు నియామకమా? అన్నది శుక్రవారం తేలిపోనుంది. అలా రానిపక్షంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
ఎంపీ రాయపాటి కార్యాలయంలో చోరీ
విజయవాడ : ఎంపీ రాయపాటి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో చోరీ జరిగిన సంఘటన నగరంలో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. భారతినగర్ సమీపంలో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఎంపీ రాయపాటి క్యాంపు కార్యాలయం ఉంది. సిబ్బంది రోజులాగానే శుక్రవారం రాత్రి ఆఫీసుకు లాక్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది ప్రధాన ద్వారం తెరచి ఉండడం గమనించారు. దీంతో లోనికి వెళ్లి చూడగా కార్యాలయంలోని బీరువా తెరచి ఉంది. సిబ్బంది కార్యాలయ మేనేజర్ శాస్త్రికి సమాచారం అందించారు. ఆయన వెంటనే కార్యాలయానికి చేరుకుని పరిశీలించగా ల్యాప్‌టాప్, బీరువాలో ఉండవలసిన రూ.5 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఆయన పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఏడీసీపీ రామకోటేశ్వరరావు, ఏఎస్ఐ శేషారెడ్డి, క్లూస్‌టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలు సేకరించారు. కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చి ఉండడంతో పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కార్యాలయం ఎంపీ రాయపాటి సాంబశివరావుది కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారిదని, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మాత్రమే జరుగుతాయని సిబ్బంది చెబుతున్నారు. -
టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ
గుంటూరు : భవిష్యత్‌లో సీపీఐ నేతలతో కలసి పనిచేయాలనుకుంటున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఆదివారం గుంటూరులో సీపీఐ నేతలకు ఎంపీ రాయపాటి అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడారు. టీడీపీ - బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం ప్యాకేజీలు ప్రకటిస్తుందని కానీ... నిధులు మాత్రం విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనకబడిన ప్రాంతాలకు సాయం అందించాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా రాయపాటి డిమాండ్ చేశారు. రైల్వే జోన్ విజయవాడలో ఏర్పాటు చేయాలనేదే తమ డిమాండ్ అని రాయపాటి సాంబశివరావు గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధిని కోరుతున్నట్లు రాయపాటి తెలిపారు. -
రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్
విశాఖపట్నం: తుపానొస్తే మునిగిపోయి... గాలేస్తే ఎగిరిపోయే విశాఖలో రైల్వేజోన్ ఎందుకని వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ అవసరం గురించి రాయపాటికి ఏం తెలుసునని, రైల్వే జోన్ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించబోమని అన్నారు. గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాయపాటి వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజలను బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు. భువనేశ్వర్ కేంద్రంగా సౌత్‌సెంట్రల్, ఈస్ట్‌కోస్టు రైల్వేలు ఉన్నా, విశాఖ డివిజన్ నుంచి తొంభై శాతం రైల్వేకి ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. విశాఖకే రైల్వే జోన్ ఇవ్వాలి పెందుర్తి: విశాఖకు రైల్యే జోన్ వద్దని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. శుక్రవారం ఆయన పెందుర్తిలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖకు ప్రత్యేక జోన్ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయపాటి ఎందుకు అలాంటి వాఖ్యలు చేశారో తనకు అర్థం కావడంలేదన్నారు. -
'బీజేపీకి ఆంధ్రా ప్రజల ఉసురు తగిలింది'
గుంటూరు: టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజల ఉసురు తగిలి బిహార్‌లో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. బిహార్, కశ్మీర్లకు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఏపీకి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో యమునా నది నీళ్లు, పార్లమెంటు ఆవరణ నుంచి మట్టిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన విషయం తరెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అంతకుముందు ఇచ్చిన వరాలపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. -
బట్టలూడదీసుకుని తిరగమంటారా?
-
బట్టలూడదీసుకుని తిరగమంటారా?
విజయవాడ : టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై విజయవాడలో శనివారం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సహనం కోల్పోయారు. ప్రత్యేక హోదాపై ఇంతకంటే ఏం చేయాలి? బట్టలూడదీసుకుని తిరగమంటారా? అంటూ రాయపాటి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కార్ తప్పు పని చేస్తోందని...మొదట యూపీఏ ప్రభుత్వం ప్రాథమికంగా తప్పు చేసిందని, ప్రస్తుతం బీజేపీ సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో మొండిగా ఉందని రాయపాటి అన్నారు. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ పార్టీలకు ...రెండింటికీ నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఎప్పుడున్నారని, ఆయనది విజిటింగ్ వీసా అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ముందుండి నడిపిస్తే..తాము కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని రాయపాటి అన్నారు. కాగా ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని గడిచిన 14 నెలలుగా ప్రత్యేక హోదా కోసం ఆశతో ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలపై కేంద్రం మొండిచేయి చూపింది. కొత్త రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని శుక్రవారం లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. -
రాజకీయ నిర్ణయం వాయిదా వేసుకున్నా
* వైఎస్సార్సీపీ నేతలకు క్షమాపణ * మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నా రాజకీయ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. అస లు రాజకీయాల్లో ఉంటానో లేనో చెప్పలేను’ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. శనివారం గుంటూరులోని ఏపీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వద్ద వైఎస్సార్సీపీలో చేరే ప్రతిపాదనను నేనే తీసుకువచ్చాను. ఈ నేపథ్యంలో నా రాజకీయ గురువు రాయపా టి సాంబశివరావు సలహా మేరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. ఈ విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి క్షమాపణ చెబుతున్నాను’ అని డొక్కా అన్నారు. అంబటికి కూడా క్షమాపణలు చెబుతానన్నారు. -
'చెప్పు'కోలేని పనులు..!
(వెబ్సైట్ ప్రత్యేకం) అధికారం ఉంటే చాలు! నాయకులు అవతార పురుషులవుతారు. వీరికి తమవాళ్లు తప్ప.. బహుశా మిగతావారు మనుషులుగా కనిపించరనుకుంటా.. ఎంతైతే అంత... ఏపనైతే ఆపని.. చెప్పేముందు వాళ్లు తమలాంటి మనుషులేనని, మనోభావాలతోపాటు, వారికీ ఆత్మ గౌరవం ఉంటుందని గుర్తులేక ఇలా చేస్తారో... గుర్తుంచుకొనే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారో వారి చర్యలు చూస్తే ఇట్టే బోధపడుతుంది. అడిగేవాడు లేకపోవాలేగానీ ముక్కున వేలేసుకుని ఫక్కున నవ్వే పనులు ఏవైనా చేయించుకోగల సమర్థులు వీరు. అందుకే కొందరు తమ వెంట ఉండే అధికారులకు సంబంధించిన బాధ్యతలు ఇస్తుంటే ఇంకొందరు నాయకులేమో స్వయంపాలన(సొంతసేవ)కు ఉపయోగించుకుంటున్నారు. ఈమధ్యకాలంలో నాయకుల వెంట ఉండే కొందరు అధికారుల పరిస్థితి దీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే మన అమాత్యులు... వారితో తమ చెప్పులు,బూట్లు మోయించుకుంటున్నారు... తుడిపించుకుంటున్నారు.. .. తొడిగించుకుంటున్నారు. ఇది వారి అధికారం, ఆధిపత్యం, అహంకారాన్ని స్పష్టం చేస్తోంది. ఒకవేళ అధికారంలో లేకున్నా ఆ వాసనలు మాత్రం వారిని వదిలిపెట్టవనేది వాస్తవం. అందివచ్చినంతవరకూ 'సేవ'లలో తరించటం పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ విమర్శలు వెల్లువెత్తినా నవ్విపోదురూ గాక నాకేంటి సిగ్గన్నట్లు దులుపుకోవటం చూస్తూనే ఉన్నాం. అనుచరులనే కాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పొలిటికల్ లీడర్లు వదలడం లేదు. తాజాగా ఓ మంత్రివర్యుడు ఏకంగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో షూ లేస్‌లు కట్టించుకుంటూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. మమతాబెనర్జీ ప్రభుత్వంలో ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేస్తున్న రచ్‌పాల్ సింగ్ తన వ్యక్తిగత భద్రతకు నియమించిన గార్డుతో బూటు లేసులు కట్టించుకుంటూ విమర్శల పాలయ్యారు. ఇక మన రాష్ట్రానికి వస్తే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు...రాయల్ ఠీవీ చెప్పనవసరం లేదు. బహిరంగంగానే ఆయన తన అనుచరుల సేవలను ఆస్వాదిస్తుంటారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన తన వ్యక్తిగత సహాయకుడితో కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీనే బాహాటంగా ఇలా వ్యవహరించటం చూసినవాళ్లు ముక్కున వేలేసుకున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులుగా పని చేసిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మూడు ఆకులు ఎక్కువే చదివారు. సీఎం పదవి వెలగబెట్టిన సమయంలో మాయావతి బూట్లు మురికిగా ఉన్నాయని రక్షణగా వచ్చిన ఓ ఐఏఎస్ అధికారి ఆమె బూట్లు శుభ్రం చేసిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గారు ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్ చేత బూట్లు తొడిగించుకున్నారు. అది కాస్తా వివాదం కావటంతో ఆయన గారు ఛాఛా...నేను బూట్లు తొడిగించుకోవటం ఏంటీ.., బూటు తాడును మాత్రమే ఎమ్మెల్యే ముడివేశారని వివరణతో ఆ వివాదాన్నికి తెరపెట్టేశారు. కింది స్థాయి ఉద్యోగుల చేత చెప్పులు , బూట్లూ మోయించుకుని కాళ్ళకు తొడిగించుకుంటున్నారంటే సమాజం ఎటు పోతోందని చూసిన ... అయితే అక్కడే మీడియా సిబ్బంది ఉండడంతో మంత్రి గారి అనుచరులు బూట్లను దూరంగా పడేశారు. అంతటితో ఊరుకున్నారా... గడ్డి స్కామ్‌లో జైలుకు వెళ్లివచ్చినా... తన దర్పాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఓ పోలీసుతో చెప్పులు మోయించి, మరో డీఎస్పీ స్థాయి అధికారితో ఏకంగా కాళ్లు కడిగించుకుని అప్పట్లో పతాక శీర్షికలకెక్కిన విషయం తెలిసిందే. భజనపరులతో భుజ కీర్తులు తొడిగించుకున్న నేతలు తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో పాదసేవల్లో తరించిపోతున్నారు. చెబితే చాంతండంత అన్నట్లుగా ఇలాంటి సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే.. -
'ఒబామా నన్ను వైట్‌హౌస్‌కు పిలిచారు'
గుంటూరు: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన నివాసం వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో రాయపాటి సాంబశివరావు... అగ్ర రాజ్య అధినేత ఒబామాను కలసి... తిరుపతి లడ్డూ ప్రసాదంతోపాటు ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువాను బహుకరించారు. అలాగే అపురూపమైన ముత్యాల హారాన్ని మిసెస్ ఒబామాకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఒబామా దంపతులు రాయపాటికి కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్‌కు వచ్చి... తమ ఆతిథ్యం అందుకోవాలని రాయపాటిని ఒబామా ఆహ్వానించారు. 2010లో భారత్‌లో పర్యటించిన ఒబామాకు బంగారంతో తయారు చేసిన అరుదైన రుద్రాక్ష హారాన్ని పార్లమెంట్లో రాయపాటి సాంబశివరావు బహుకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటీకీ ఆరుసార్లు అమెరికా వెళ్లానని... కానీ ఈ సారీ అమెరికా ప్రయాణం తనకు అత్యంత ప్రత్యేకమైందని రాయపాటి వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ రాయపాటి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
కౌలురైతులకు కష్టం: రాయపాటి
విజయవాడ: రాజధాని కోసం భూసేకరణ ప్రక్రియ వల్ల కౌలురైతులు, వ్యవసాయ కూలీలకు తీరని నష్టం జరుగుతుందని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశిరావు చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కౌలురైతుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రాజధాని కోసం భూసేకరణ జరిగే ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలకు భూములు లేవని స్పష్టంచేశారు. భూములు సేకరించనున్న గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, మంగళగిరి, తాడికొండ ప్రాంత భూముల్లో ఏడాదికి మూడు పంటలు పండిస్త్తారని, దీంతో ఏడాది పొడవునా రైతులతోపాటు రైతుల కూలీలకు ఉపాధి ఉంటుందని, భూసేకరణతో అదంతా పోతుందన్నారు. రైతులకు ప్యాకేజీ ప్రకటించిన తరహాలోనే రైతుకూలీలకు కూడా న్యాయం చేయాలని సీఎంకు వివరిస్తానన్నారు. తుళ్లూరు ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో అర్ధరాత్రిళ్లు బినామీ లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. భూసేకరణతో సంబంధం లేకుండా కృష్ణా నదిపైనే రాజధాని నిర్మాణం చేసేందుకు చెన్నై ఆర్కిటెక్చర్ కంపెనీ సిద్ధంగా ఉందని, రెండు రోజుల క్రితం ఆ కంపెనీ ప్రతినిధులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఎటువంటి లాభం లేదని వ్యాఖ్యానించారు. -
నిజంగా బలముంటే ఎందుకు ఓడిపోయారు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్వార్థపరులే వివాదాలు సృష్టిస్తున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దుయ్యబట్టారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణకు నిజంగా బలముంటే గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణ మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ బుధవారం బీజేపీలో చేరారు. ఆయన చేరికతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి బలం పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. -
శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై రాయపాటి సంచలన వ్యాఖ్యలు
గుంటూరు: ఏపి రాష్ట్ర రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ సమర్పించిన నివేదికపై ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిటీ సభ్యులకు దొనకొండ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. వారికి భూములున్న కారణంగా వారు ఆ ప్రాంతం రాజధానికి అనువైనదిగా చెప్పుకొస్తున్నారన్నారు. ఏదిఏమైనా విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని ఉంటుందని రాయపాటి చెప్పారు. ఏపి రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ కేంద్ర అర్బన్ డవలప్మెంట్ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.శివరామకృష్ణన్ కాగా, సభ్యులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పోలసీ డైరెక్టర్ డాక్టర్ రతిన్ రాయ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమర్ రేవి, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ జగన్ షా, న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కీటెక్చర్ మాజీ డీన్ కె.టి.రవీంద్రన్ ఉన్నారు. ఈ కమిటీ ఈ నెల 27న కేంద్ర హొం శాఖకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. రాయపాటి వ్యాఖ్యలు వివాదానికి దారితీసే అవకాశం ఉంది. -
టీడీపీలోకి వస్తే ప్రాధాన్యమేదీ?
మంగళగిరి: గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లా కాజ గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొందరు నేతలు తనతోపాటు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వీడిన తాము ప్రస్తుతం టీడీపీలో జూనియర్లమేనని, ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నామని చమత్కరించారు. తెలుగుదేశం పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఒక్కో ఎమ్మెల్యే వద్ద నాలుగైదు గ్రూపులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు ఇబ్బంది పడుతున్నారని రాయపాటి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవచేయాలే తప్ప గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించకూడదని ఆయన హితవు పలికారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని ఉంటుందన్నారు. -
మురళీ మోహనుడికే.......!
సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మీద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడితో పాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించినట్లున్నాయి. టీటీడీ ఛైర్మన్ పదవికి మురళీమోహన్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్ పదవి రేసులోకి వెళ్లిన మురళీ మోహన్... ఈ పదవి కోసం పట్టువదలని విక్రమార్కులు చాలామందే ఉన్నా, వాళ్లందరినీ పక్కకు తోసి ముందు వరుసలో నిలిచారట. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్రంలోని అని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా మురళీ మోహన్ నియామకంపై మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇటీవల 75వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన మనసులోని మాటను బయటకు వెల్లడించారు. ఇందు కోసం మురళీమోహన్ ...బాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇక పాలక మండళ్లు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయటమే ఆలస్యం ఆశావహులు పైరవీలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ రాతపూర్వకంగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఎప్పటి నుంచో చెబుతున్నారు. స్థానికుడైన తనకే పదవి ఖాయమని ఇప్పటివరకూ ధీమాలో ఉన్నారు. దాంతో మురళీమోహన్, చదలవాడ మధ్యే గట్టి పోటీ నెలకొంది. కాగా ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ కోసం పనిచేసిన తనకే ఆ పదవి దక్కుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు భంగపడి.... టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానంటేనే టీడీపీలో చేరానని.. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూసిన రాయపాటి సాంబశివరావుకు మరోసారి ఆశాభంగం తప్పేలా లేదు. ఇక టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులు చేజిక్కించుకుంటారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరో రెండు రోజులు వేచి చూస్తే కానీ.. వెంకన్న, బాబుల కరుణ ఎవరికి దక్కిందో కచ్చితంగా తేలదు. -
రాయపాటికి మళ్లీ ఆశాభంగమే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఛైర్మన్ పదవిని జీవితంలో ఒక్కసారైనా దక్కించుకోవాలని ఎదురుచూసిన రాయపాటి సాంబశివరావుకు మరోసారి ఆశాభంగం తప్పేలా లేదు. టీటీడీ ఛైర్మన్ పదవిని తన అనుంగు సహచరుడు, సొంత జిల్లాకు చెందిన నేత చదలవాడ కృష్ణమూర్తికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. టీటీడీ ఛైర్మన్ పదవి తనకే ఇవ్వాలంటూ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంతకుముందు చంద్రబాబును కోరారు. తాను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి టీటీడీ ఛైర్మన్‌గా ఒక్కసారైనా పని చేయాలన్నది తన జీవితాశయమని, అయితే ఆ కోరిక ఇంతవరకూ నెరవేరలేదని ఆయన వివరించారు. ఆ ఒక్క కోరికను తీరిస్తే తానిక ఏమీ కోరబోనన్నారు. సుదీర్ఘకాలం తాను కాంగ్రెస్‌లో కొనసాగినా, స్థానిక, గ్రూపు రాజకీయాల వల్ల ఆ పదవి చేపట్టలేకపోయానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలెలా ఉంటాయో మీకు కూడా తెలుసని రాయపాటి చెప్పారు. (చదవండి: అది నా జీవితాశయం.. నాకే ఇవ్వండి) అయితే, గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని బాబు అప్పుడే హామీ ఇవ్వడంతో దానికే ఇప్పుడూ కట్టుబడి ఆయనకే ఆ పదవి కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరకాలంగా ఈ పదవి మీద ఆశ పెట్టుకున్న రాయపాటి మరోసారి తీవ్ర ఆశాభంగానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు దక్కుతుందనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు కనుమూరి బాపిరాజుకు దక్కడంతో అప్పట్లోనే ఆయన పార్టీ వీడాలనుకున్నారు. తర్వాతి పరిణామాలలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు ఆశాభంగం తప్పలేదు. -
అది నా జీవితాశయం.... నాకే ఇవ్వండి
టీటీడీ ఛైర్మన్ పదవి ప్రస్తుతం హాట్ సీటుగా మారింది. స్వామివారికి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులు, మాజీలు క్యూ కుడుతున్నారు. ఇందుకోసం తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా ఎప్పటి నుంచో టీటీడీ ఛైర్మన్ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎంపీ రాయపాటి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవి తనకే ఇవ్వాలంటూ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి టీటీడీ ఛైర్మన్‌గా ఒక్కసారైనా పని చేయాలన్నది తన జీవితాశయమని, అయితే ఆ కోరిక ఇంతవరకూ నెరవేరలేదని ఇటీవల ఆయన బాబును కలిసి వివరించారు. ఆ ఒక్క కోరికను తీర్చితే తానిక ఏమీ కోరబోనన్నారు. సుదీర్ఘకాలం తాను కాంగ్రెస్ లో కొనసాగినా, స్థానిక, గ్రూపు రాజకీయాల వల్ల ఆ పదవి చేపట్టలేకపోయానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలెలా ఉంటాయో మీకు కూడా తెలుసని రాయపాటి చెప్పటంతో ఏకీభవించిన బాబు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని హామీఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని బాబు గతంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆ హామీని అమలు చేయాలని చదలవాడ ఇప్పుడు పట్టుబడుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సైతం ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక సుదీర్ఘకాలంగా పార్టీకి సేవ చేస్తున్నా ఎలాంటి అధికారిక పదవి అనుభవించలేదని, అందువల్ల చైర్మన్ పదవి తనకివ్వాలని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ కోరారు. పనిలో పనిగా తనకు వీలుకాకుంటే తన సోదరుడు బీద మస్తాన్రావుకైనా ఇవ్వాలన్నారు. ఇక దేవాదాయ శాఖ మంత్రి పదవి బీజేపీకి దక్కింది కాబట్టి.... టీటీడీ ఛైర్మన్ పదవికి తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. ఇక ప్రస్తుత టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నారు. మరి వెంకన్న స్వామి ఎవరిని కరుణిస్తాడో చూడాలి. -
టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కేను?
-
టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కేను?
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవి ఎవరిని వరించనుంది? ఈ పదవి కోసం అధికార పార్టీ నేతలు పలువురు పోటీపడుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవరికి కట్టబెడతారనేది ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రధానంగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడులు రేసులో ఉన్నారు. రాయపాటికి నరసరావుపేట ఎంపీ టికెట్‌తో పాటు గెలిస్తే కేంద్రమంత్రి పదవి, ఓడితే టీటీడీ బోర్డు చైర్మన్ గిరి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని టీడీపీలోకి రప్పించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జేసీనీ ఇదే రీతిలో టీడీపీలో చేర్చుకున్నట్లు ఆయన అనుయాయులు చెప్తున్నారు. రాయపాటి గతంలో అనేకసార్లు టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ఇపుడు టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన రాయపాటికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఒప్పందం మేరకు తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనంటూ చంద్రబాబుపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి ఆరుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించిన జేసీ ఈసారి అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని ఇదివరకే బాబుతో ఒప్పందం ఉండడం వల్లనేమో జేసీ కూడా తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తెరపైకి గాలి, చదలవాడ: టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరి శాసనసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చంద్రబాబును గాలి కోరుతున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకుంటే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని అడుగుతున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. తిరుపతి శాసనసభ స్థానం టికెట్ ఆశించి భంగపడ్డ చదలవాడ కృష్ణమూర్తి తనకే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ను కృష్ణమూర్తికి కాదని వెంకటరమణకు ఇచ్చారు. వెంకటరమణ విజయానికి సహకరిస్తే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని చదలవాడకు చంద్రబాబు ఆశచూపారు. వెంకటరమణ గెలుపుతో తనకే ఆ పదవి వస్తుందన్న నమ్మకంతో చదలవాడ ఉన్నారు. ఈ పదవికి డిమాండ్ ఎక్కువవటంతో చదలవాడ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. టీటీడీ పదవి ఇవ్వలేని పక్షంలో చదలవాడకు తుడా చైర్మన్ పదవితో సరిపెట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
వారి పనిపడతా: రాయపాటి
నరసరావుపేట: నరసరావుపేట కేంద్రంగా పలనాడు ప్రాంతాన్ని కలుపుకుని ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఎంపీగా ఎన్నికైన ఆయన శనివారం నరసరావుపేట వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన విజయానికి చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ ప్రచారం దోహదపడ్డాయని చెప్పారు. వాస్తవానికి ఇంకా ఎక్కువ మెజార్టీ రావలసి ఉందని అంటూ, నియోజకవర్గంలో తనకు వచ్చిన మెజార్టీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇటీవల జరిగిన జమిలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర అధికారులను గుర్తించామని, తగిన సమయంలో వారి పనిపడతామన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుచేస్తా
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్ :నరసరావుపేట కేంద్రంగా పలనాడు ప్రాంతాన్ని కలుపుకొని ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుకు కృషిచేస్తానని నరసరావుపేట ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఎంపీగా విజయం సాధించిన అనంతరం శనివారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను రాజకీయాలు చేయనని, అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పారు. వారానికి రెండురోజులపాటు నరసరావుపేట పార్లమెంటు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. పలనాడులోని ప్రజలు ఫ్లోరైడ్, వెనుకబాటుతనం, నిరుద్యోగం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఎంపీ నిధులతో గ్రామాల్లో సోలార్, మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు. నరసరావుపేటలో కాపులకోసం కమ్యూనిటీహాలు, ముస్లింలకు రెండవ షాదీఖానా, ఖబర్స్తాన్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులను గుర్తించామని చెప్పారు. వారిని సరైన సమయంలో శిక్షిస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ ప్రచారం తన విజయానికి కారణమని చెప్పారు. వాస్తవానికి ఇంకా ఎక్కువ మెజార్టీ రావలసి ఉందని అంటూ, నియోజకవర్గంలో తనకు వచ్చిన మెజార్టీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.2 లక్షలతో గృహనిర్మాణాలను చేపట్టి మూడుగదులతో నిర్మించి ఇస్తామని, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. నరసరావుపేట-పిడుగురాళ్ళ రైల్వేలైను నిర్మాణానికి కృషిచేస్తామని, డబుల్ డెక్కర్ రైలు జిల్లాలో ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, టీడీపీ చైర్మన్ అభ్యర్థి నాగసరపు సుబ్బరాయగుప్తా, కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రాయపాటిపై దాడి చేశారంటూ దుష్ప్రచారం
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీడీపీ ఆగడాలు హద్దుమీరాయి. గుంటూరు జిల్లా పెద్దకాకానిలో ఓటర్లకు డబ్బు పంచుతూ పెద్దకాకాని టీడీపీ దర్శి వెంకటేశ్వర్లు పోలీసులకు పట్టుబడ్డారు. తక్కెళ్లపాడులో పోలీసులపై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. పెద్దారవీడు మండలం చాట్లమడ అగ్రహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో వైఎస్సార్ సీపీ- టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసుల లాఠీచార్జ్ చేశారు. మరోవైపు రాయపాటి సాంబశిరావుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలు పెట్టింది. -
రాయపాటి మోసాల్లో ఘనాపాటి..
గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని గ్రహించారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచేలా చేసిన కాంగ్రెస్‌ను వదలి టీడీపీలో చేరిపోయారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డిని పక్కకు నెట్టి చంద్రబాబు ఈయనకు వెంటనే నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చేశారు. రాయపాటి గతంలో పొగాకు రైతులకు డబ్బు ఎగ్గొట్టారని, పొగాకు బేళ్లలో పనికిరాని చెత్తను కుక్కి ఇతరదేశాలకు రవాణా చేయగా అప్పట్లో ఆయనను ఇందిరాగాంధీ కాపాడారని పుకార్లు ఇప్పటికీ షికారు చేస్తున్నాయి. ఇటీవల చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా కోర్టు రాయపాటికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ఇలాంటి రాయపాటికి టీడీపీ టికెట్ కేటాయించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వడ్డీలతో పేదల నడ్డివిరిచిన చలమారెడ్డి మాచర్ల టీడీపీ అభ్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డి విషయానికి వస్తే ఈయన నిరుపేదలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి చక్రవడ్డీలతో వారి రక్తాన్ని పీల్చేవారనే నియోజకవర్గ ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. టీడీపీ అధినేత ఈయనకు టికెట్ కేటాయించడం చూస్తే పేదలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్ధమౌతుంది. గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యవహారానికి వస్తే ఈయన గతంలో ఏపీ సీడ్స్‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 1992లో యరపతినేని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి గుంటూరు, నల్గొండ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. డిపాజిట్ డబ్బు చెల్లించకుండా భూములు తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకున్నారు. రూ.60 లక్షలు వారికి చెల్లించకుండా ఎగనామం పెట్టారు. దీంతో వారు హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టులో దావా వేయగా రూ. 1.70 కోట్లకు కోర్టు డిక్రీ ఇచ్చింది. అనంతరం 1999లో యరపతినేని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన భూములను జప్తు చేయకుండా ఆపించుకున్నారు. ఇప్పటికీ ఏపీఎస్ఎస్డీసీ వారు ఆ భూములను జప్తు చేసుకోలేకపోయారు. దీనికితోడు గుంటూరులో స్నేహచరిత చిట్‌ఫండ్ కంపెనీ పెట్టి టోపీ పెట్టి ఐపీ దాఖలు చేయడంతో అప్పట్లో బాధితులు నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు ఈయన ఉన్నం నరేంద్ర హత్య కేసులో నిందితునిగా ఉండి పోలీసుల కళ్లుగప్పి పరారై ఎట్టకేలకు వారి చేతికి చిక్కి జైలుకెళ్లారు. అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సైతం 2004లో ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందారని, ఆ తరువాత వారితో రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్కౌంటర్ కూడా చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్ అయి ఆ తరువాత వారితో రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని చెబుతున్నారు. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్కౌంటర్ కూడా చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కోడెల సంగతి సరేసరి.. ఇక సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి మాజీమంత్రి కోడెల శివప్రసాదరావు రాజకీయ జీవితం మొత్తం నేరచరిత్రతో ముడిపడి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన హోంమంత్రిగా ఉన్న సమయంలో వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. ఈ హత్యలో కోడెల హస్తం ఉందని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. 1999 ఎన్నికల సమయంలో తన ఇంటిలో బాంబులు పేలి తన అనుచరులు నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వారికి టీడీపీలో ప్రత్యేక స్థానం ఉంది. ఈయన నరసరావుపేట నుంచి గెలవలేరని తెలిసి ఆయనకు సత్తెనపల్లి టికెట్ కేటాయించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నీ పార్టీల నాయకులతో వ్యాపార సంబంధాలు నడుపుతూ ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. హైదరాబాద్‌లో భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అక్కడి పత్రికల్లో రావడంతో ఈయన బండారం బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల నుంచి డబ్బు తీసుకుని వారికి భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బూ ఇవ్వకుండా మోసగించారనే ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేట బీజేపీ అభ్యర్థి నలబోతు వెంకట్రావ్ కార్మికశాఖకు సెస్ బకాయి ఉన్నప్పటికీ తన అఫిడవిట్లో లేనట్లుగా చూపి అధికారులను తప్పుదోవ పట్టించారు. ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్న వీళ్లా మన నాయకులంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వీరికా మనం ఓటు వేసేది అంటూ ఛీత్కరించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధమౌతున్నారు. -
‘రాయపాటి’కి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: చెల్లని చెక్‌లు ఇచ్చిన కేసులో తెలుగుదేశం పార్టీ నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి దిగువ కోర్టులో సాగుతున్న విచారణపై గతంలో ఇచ్చిన స్టేను పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.జి.శంకర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సాంబశివరావు దిగువ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి... వ్యాపార అవసరాల నిమిత్తం ఐసీఐసీఐ బ్యాంకు నుంచి సాంబశివరావుకు చెందిన జయలక్ష్మి స్పిన్నింగ్స్ సంస్థ రూ. 31 కోట్ల మేర రుణం తీసుకుంది. బ్యాంకు ఈ మొత్తాన్ని చెక్ రూపేణా ఇచ్చింది. ఈ రుణం వాయిదాలను సాంబశివరావు తనకు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ ద్వారా చెల్లించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బ్యాంకుకు రూ. 2 కోట్ల మొత్తానికి చెక్ ఇచ్చారు. తరువాత మరో రూ. 6 కోట్లకు మరో చెక్ ఇచ్చారు. అయితే ఈ రెండూ చెల్లకపోవడంతో బ్యాంకు రాయపాటి సాంబశివరావుపై 2006లో చేసిన ఫిర్యాదు మేరకు చెక్ బౌన్స్ కేసు నమోదైంది. దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాయపాటి హైకోర్టును ఆశ్రయించి... నాంపల్లి కోర్టులో విచారణపై స్టే ఉత్తర్వులు పొందారు. ఆ ఉత్తర్వుల గడువు తీరిపోవడంతో స్టే మరికొంత కాలం పొడిగించాలని అభ్యర్థిస్తూ రాయపాటి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.జి.శంకర్ విచారించారు. స్టే పొడిగింపునకు నిరాకరిస్తూ అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో రాయపాటి సాంబశివరావుపై దిగువ కోర్టులో సాగుతున్న విచారణకు అడ్డంకులు తొల గిపోయినట్లయింది. ఈ క్రిమినల్ కేసులో నాంపల్లి కోర్టు ఓసారి వ్యక్తిగత హాజరుకు ఇచ్చిన ఆదేశాలను రాయపాటి బేఖాతరు చేయడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారంట్లు కూడా జారీ చేసింది. -
రాయపాటి కి అసంతృప్తుల సెగ
సాక్షి, గుంటూరు :గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి నాలుగుసార్లు గెలుపొందిన రాయపాటి సాంబశివరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి సమస్యలతో సతమతమౌతూనే ఉన్నారు. ఆయన టీడీపీలో చేరకముందే గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు జయదేవ్‌కు కేటాయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాయపాటి టీడీపీలో చేరడంతో నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని రాయపాటికి కేటాయించారు. సొంత నియోజకవర్గాన్ని వదులుకుని నరసరావుపేట వెళ్లిన రాయపాటికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అక్కడ అడుగుపెట్టకముందే టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తులు వెల్లువెత్తాయి. దీనికితోడు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోడెల శివప్రసాదరావుకు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సత్తెనపల్లి సీటు కేటాయించి, నరసరావుపేటను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. రెండురోజులపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు చివరకు ఎంపీ అభ్యర్థి రాయపాటి నామినేషన్ కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తూ నిర్ణయంతీసుకోవడంతో రాయపాటి ఇరకాటంలో పడ్డారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులను బుజ్జగించేందుకు రాయపాటి అనుచరులు రంగంలోకి దిగారు. కొందరు శాంతించి నామినేషన్ కార్యక్రమానికి హాజరైనా, మరికొందరు మాత్రం టికెట్లు మార్చే వరకూ తమ నిర్ణయం మారదంటూ భీష్మించుకుకూర్చున్నారు. తాజాగా మాచర్ల నియోజకవర్గం టికెట్ విషయంలోనూ చంద్రబాబు తడబాటుగా వ్యవహరించడం కూడా రాయపాటికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఈనెల 19వ తేదీన నామినేషన్ల ఘట్టం మరో మూడు గంటల్లో ముగుస్తుందనగా అనూహ్యంగా కొమ్మారెడ్డి చలమారెడ్డికి మాచర్ల టికెట్ కేటాయించడంతో అక్కడ టీడీపీ నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ చిరుమామిళ్ళ మధుబాబు, జూలకంటి శ్రీనివాసరెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి, మానుకొండ సాంబిరెడ్డి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడంతో అక్కడా టీడీపీలో తీవ్ర నైరాస్యం నెలకొంది. సత్తెనపల్లి నుంచి అక్కడ పార్టీ ఇన్చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ, నరసరావుపేట నుంచి బీసీ నాయకులు సింహాద్రియాదవ్, వల్లెపు నాగేశ్వరరావు, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి సైతం టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరందరినీ బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న రాయపాటికి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతూనే ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు రెండు రోజుల్లో ముగుస్తున్నప్పటికీ మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో రెబల్ అభ్యర్థులు పట్టువీడక పోవడంతో ఏంచేయాలో పాలుపోక రాయపాటి తలపట్టుకుంటున్నారు. అసంతృప్త నేతలను బుజ్జగించేపనిలో ఉన్న రాయపాటికి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సమయం చాలక సతమతమౌతున్నారు. కొన్ని నియోజకవర్గాలకైతే ఎంపీ అభ్యర్థిగా ముఖం కూడా చూపకలేక పోతున్నామనే ఆందోళనలో రాయపాటి ఉన్నట్టు తెలిసింది. అసలే నియోజకవర్గానికి కొత్త కావడం, నాయకులెవరో కూడా అవగాహన లేకపోవడంతో ప్రచారంలో పూర్తిగా వెనకబడ్డారు. ప్రచారంలో దూసుకుపోతున్న అయోధ్యరామిరెడ్డి... మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టికెట్ల కేటాయింపు తరువాత ఎక్కడా అసంతృప్తి లేకపోవడం, గతంలో ఉన్న అసమ్మతి నాయకులందరినీ తనవైపు తిప్పుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. దాదాపు అన్ని గ్రామాలనూ ఆయన చుట్టేశారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి అనేకమంది ముఖ్యనేతలు అయోధ్యరామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తున్నారు. తనతోపాటు ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ అయోధ్యరామిరెడ్డి ధీమావ్యక్తం చేస్తున్నారు. -
రాజకీయాల్లో రాణించిన వైద్యులు
గుంటూరు వైద్యకళాశాలలో విద్యనభ్యసించి, వైద్యులుగా గుర్తింపు పొందిన అనేకమంది రాజకీయాల్లోనూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి విద్యనభ్యసించిన వైద్య కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వీరిలో ఎక్కువగా టీడీపీకి చెందినవారే ఉన్నారు. డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, డాక్టర్ కోడెల శివప్రసాదరావు వారి వారి నియోజకవర్గాల నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. గుంటూరు-2 నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన డాక్టర్ శనక్కాయల అరుణ రాష్ట్ర కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు గెలిచిన మాకినేని, కోడెల డాక్టర్ మాకినేని పెదరత్తయ్య ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొంది రికార్డు సృష్టించారు.రత్తయ్య 1983లో వీజీఏ రావుపై, 1985లో చుక్కా పీటర్పాల్పై, 1989లో జి.వి. అప్పారావుపై, 1994లో చేబ్రోలు హనుమయ్యపై, 1999లో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్‌పై గెలుపొందారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో మొదట్లో కొన్నాళ్లు ఉన్నా, తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎన్నిక రేసులో మాత్రం లేరు.డాక్టర్ కోడెల శివప్రసాద్ నరసరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కోడెల 1983లో మొట్టమొదటిసారిగా నరసరావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బి.సుబ్బారెడ్డిపై గెలుపొందారు. తదుపరి 1985లో కాసు వెంకట కృష్ణారెడ్డిపై, 1989లో ఎం.రాధాకృష్ణమూర్తిపై, 1994లో దొడ్డా బాలకోటిరెడ్డిపై, 1999లో కాసు వెంకట కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే కాకపోయినా..ఎమ్మెల్సీ అయ్యారు... రెండుపర్యాయాలు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఒక్కసారి కూడా విజయం వరించని డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి 1983లో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. రెండోసారి 1999లో డాక్టర్ మాకినేని పెదరత్తయ్యపై ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. రాష్ర్ట విభజన నే పథ్యంలో డాక్టర్ రాయపాటిశ్రీనివాస్ సోదరుడు ఎంపీ రాయపాటి సాంబశివరావును కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో సోదరునికి మద్దతుగా డాక్టర్ రాయపాటి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం సోదరునితో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు తొలి మేయర్... గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు మొట్టమొదటి మేయర్‌గా ఎన్నికైన డాక్టర్ కొల్లి శారద ఇక్కడి వైద్య విద్యార్థినే. రైతునాయకుడుగా పేరుగడించిన డాక్టర్ యలమంచలి శివాజి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి, డాక్టర్ కె.కె.కోయ, డాక్టర్ ఫాతిమా తదితరులు గుంటూరు వైద్యకళాశాలలో చదివి వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. కొసమెరుపు... రాష్ట్ర కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రులుగా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్, డాక్టర్ శన క్కాయల అరుణ, మంత్రిగా పనిచేసిన డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, ఎమ్మెల్సీగా పనిచేసిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తమకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల అభివృదికి ఏమీ చేయలేదు. కోస్తాంధ్రలో పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి కూడా ఏమీ చేసిందేమీలేదు. గుంటూరు వైద్య కళాశాలకు భారత వైద్యమండలి గుర్తింపుకోసం అవసరమైన ఎంఆర్ఐ వైద్య పరికరాన్ని తెప్పించడంలో వీరంతా విఫలమయ్యారనే విమర్శలు లేకపోలేదు. -
రాయపాటి...కలిసొచ్చేది ఏ పాటి !
సాక్షి, గుంటూరు :జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఎంపీ రాయపాటి కుటుంబం సైకిల్ ఎక్కడంతో తమకు అదనంగా కలిసొచ్చే ఓటు బ్యాంకు ఏమీ లేదని టీడీపీ కేడర్ పెదవి విరుస్తోంది. ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో తమకు కొత్తగా లాభించేదేమీ ఉండదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గ్రామాల్లో మొన్నటి వరకు తమతో పోరాడిన వారితో ఇప్పుడు ‘చేతులు’ కలపాల్సి రావడం ‘దేశం’ కార్యకర్తలకు ఏ మాత్రం రుచించడం లేదు. ముఖ్యంగా రాయపాటి సొంత నియోజకవర్గం తాడికొండలోనే ఆయనవర్గానికి, టీడీపీ కేడర్‌కు నడుమ గొడవలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాయ పాటి వెన్నుదన్నుతో నామినేటెడ్ పోస్టులు అనుభవించిన నేతలకు, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య తీవ్ర పొరపొచ్చాలున్నాయి. అయితే రాయపాటి చేరికతో ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గంలో ఆయన వర్గం టీడీపీకి జై కొట్టింది. ఇప్పుడు వారితో టీడీపీ కేడర్ ఎలా మసలుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఎన్నికలు ముగిసే వరకు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలింతలే అన్నట్లు వ్యవహరించాల్సి ఉంటుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాయపాటి సాంబశివరావుకు దాదాపు నరసరావుపేట ఎంపీ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే నరసరావుపేటలో అడుగుపెట్టేందుకు రాయపాటి ముహూర్తాలు చూసుకుంటున్నారని వినిపిస్తుంది.రాయపాటి రాకతో టీడీపీలో కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. గ్రూపుల గోల మొదలవుతుందా లేక రాయపాటి వర్గంతో టీడీపీ జెండా భుజానికెత్తుకుని ఆపత్కాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కలసి నడుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రాయపాటి వర్గం ఇవన్నీ కొట్టి పారేయడం గమనార్హం. టీడీపీలో స్థిరమైన గ్రూపులు లేవని, అన్నీ సీజనల్ గ్రూపులేనని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో టీడీపీలో చేరి వెనక్కు వెళ్లిన శ్రీనివాస్... రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్ గతంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కొద్ది నెలలకే టీడీపీలో ఇమడలేక బయటకు వచ్చి మళ్లీ సొంత గూటికి చేరారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం టీడీపీలో లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం కావడంతో మళ్లీ తన కుమారుడు రాయపాటి మోహన సాయికృష్ణ సహా టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ సైకిల్‌ను స్పీడుగా తొక్కగలరా లేదా అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
తాడికొండ నుంచి పోటీ చేయను: డొక్కా మాణిక్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా తాడికొండ నుంచి పోటీ చేయబోనని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడే తాను పోటీ చేస్తానన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయపాటితో పాటు టీడీపీలో చేరడం తనకు ఇష్టం లేదని, అదే విషయాన్ని ఆయనకు తెలియచేశానన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశానన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీడను సీమాంధ్రకు లేకుండా చేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. -
టీడీపీలో చేరిన రాయపాటి సోదరులు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి సోమవారం టీడీపీలో చేరారు. వీరందరికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్‌ను తన్నాలని ప్రజలకు అనిపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరు దారుణమని వ్యాఖ్యానించారు. రాయపాటి వాస్తవానికి 1996 లోక్‌సభ ఎన్నికలప్పుడే టీడీపీలో చేరాలనుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచీ ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇలావుండగా ఎన్టీఆర్ భవన్లో జరిగిన జయనామ సంవత్సర ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. పలువురు కవులను ఆయన సత్కరించారు. తెలుగు ప్రజలకు పూర్వ వైభవం తెస్తానని ఈ సందర్భంగా అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయటంతో పాటు సామాజిక తెలంగాణ నిర్మాణం టీడీపీ వల్లే సాధ్యమని చెప్పారు. పంచాంగ శ్రవణం చేసిన పొన్నలూరి శ్రీనివాస గార్గేయ.. రాజు, మంత్రి ఒకరే అయినందున పరిపాలనలో సమస్యలుండవని చెప్పారు. గార్గేయ గతంలో కూడా టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేశారు. అప్పుడు వచ్చే ఎన్నికల అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఈసారి మాత్రం ఆయన అలాంటి విషయాల జోలికి పోలేదు. -
'సీమాంధ్ర అభివృద్ధికి కసిగా ఆలోచిస్తున్నా'
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రను అభివృద్ధి చేసేందుకు కసిగా ఆలోచిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం చంద్రబాబు నాయుడు నివాసంలో గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఇద్దరు నేతలు వారి అనుచరులను చంద్రబాబు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సీమాంధ్రను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. తెలుగుజాతిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో గెలవదని ఆయన జోస్యం చెప్పారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే తన్నే పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయపాటి సాంబశివరావు తీవ్ర పోరాటం చేశారని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రశంసించారు. -
రాయపాటి ఇన్ .. మోదుగుల ఔట్?
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్ :నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు నేడు చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అదే ముహుర్తానికి మోదుగుల టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. మోదుగులకు గుంటూరు పశ్చిమ, లేదా బాపట్ల అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా లోక్‌సభలో ఎంపీ మోదుగుల తన వాణి గట్టిగా వినిపించారు. లోక్‌సభలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ లోకసభ సభ్యుల దాడికి సంబంధించిన వీడియోలను ఆయన ఆదివారం విడుదల చేశారు. తనపై దాడి చేయటమే కాకుండా తాను పార్లమెంటులోకి కత్తిని తీసుకువచ్చానని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారంతో తీరని అవమానం జరిగిందని ఆయన భావిస్తున్నారు. దీంతో అయన లోక్‌సభకు వెళ్లి తన పరువును నిలుపుకోవాలని భావించారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బావ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బరిలో ఉండటంతో చంద్రబాబు మోదుగులకు టిక్కెట్టు ఇచ్చేది లేదని తేల్చారు. ఆ స్థానం నుంచి ఎంపీ రాయపాటికి అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో తన అభిప్రాయాలకు తగిన గుర్తింపు లేదని మోదుగుల భావించారు. తానెప్పుడు తన బావపై పోటీ చేయనని ప్రకటించలేదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ తనను విశ్వసించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సోమవారం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్య్ర అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేసేది లేదని ఆయన సన్నిహితుల వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. -
తెలుగుదేశంలోకి రాయపాటి కుటుంబం
గుంటూరు: గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక గోగినేని కనకయ్య అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ వర్గీయులుగానే ముద్రపడి, ఆ పార్టీకి ఎనలేని సేవచేసిన తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు సైతం తమ కుటుంబం పార్టీకోసం ఎంతో పాటుపడిందనీ, కానీ తమ సోదరుడు సాంబశివరావుకు సరైన ప్రాధాన్యమివ్వలేదు సరికదా సమైక్యవాదం వినిపించినందుకు సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందని చెప్పారు. తొలుత రాజకీయాల నుంచే తప్పుకుందామనుకున్నామనీ, అభిమానుల కోరిక మేరకు ఈనెల 31నగానీ, వచ్చేనెల 4వ తేదీన గానీ టీడీపీలో చేరనున్నామని వివరించారు. తమతోపాటు రాయపాటి మోహనకృష్ణ కూడా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. -
'ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నా'
ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని విఐపీ ప్రారంభ సమయంలో ఆయన ఆదర్శించుకున్నారు. అనంతరం రాయపాటి విలేకర్లతో మాట్లాడుతూ... నిజాయితితో కూడిన సుపరిపాలన చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు. ప్రజాభిష్టం మేరకే తాను టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించానని, అయిన ఆ పార్టీ తనను బహిష్కరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో రానున్న సమయంలో ఆ పార్టీ సభ్యులైన రాయపాటి, లగడపాటి, ఉండవల్లి, సబ్బం హరితోపాటు పలువురు ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ సదరు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు రాయపాటి తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపగా, సబ్బం హరి, ఉండవల్లి, జీవి హర్షకుమార్లు మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన విషయం విదితమే. -
అజ్ఞాతంలో ఎంపీ రాయపాటి
గుంటూరు: గుంటూరు జిల్లాలో సీని యర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన సమయంలో పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మరి కొందరు పార్టీ నేతలు, అభిమానులు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఆయన అందులో చేరకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలాఉండగా, టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో బీజేపీ తరపున కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ లేదా నరసరావుపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రాయపాటి వ్యూహం ఎమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరికీ చెప్పకుండా, ఫోన్ సైతం అందుబాటులో లేకుండా జాగ్రత్త పడ్డారు. -
రాయపాటి చూపు.. నరసరావుపేట వైపు...?
అరండల్‌పేట(గుంటూరు),న్యూస్‌లైన్: గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు జిల్లాలో పరిచయం అవసరం లేని రాజకీయ నేత. ఒకసారి రాజ్యసభ సభ్యునిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా చలామణి అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.యూపీఏ ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డితో సన్నిహితంగా మెలగడంతో ఆయన ఏర్పాటు చేసే కొత్త పార్టీలో చేరతారని అంతా భావించారు. అయితే సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఒత్తిడితో ఆయన కిరణ్ పార్టీలో చేరలేదు. చివరగా, తెలుగుదేశం పార్టీలో చేరాలని రాయపాటి నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి గుంటూరు పార్లమెంటు టికెట్‌ను రాయపాటి సాంబశివరావుకి ఇవ్వాలని తొలుత తెలుగుదేశం పార్టీ సైతం ఆలోచించింది. అయితే రాయపాటి పార్టీలో చేరేందుకు కాలయాపన చేయడం, ఆ లోపు మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబ సభ్యులు పార్టీలోకి వస్తే గుంటూరు పార్లమెంటు టికెట్ కేటాయించాలని కోరడం అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించడం చకచకా జరిగిపోయాయి.నరసరావుపేట వైపు చూపు... తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రాయపాటి సాంబశివరావు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా గల్లా జయదేవ్‌ను ప్రకటించడంతో నరసరావుపేట సీటు కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ రాయపాటి తన ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు సమాచారం. ఈ నెలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గుంటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ తరువాత నరసరావుపేట పార్లమెంటు టికెట్ కేటాయింపు అంశం ఒక కొలిక్కి రావచ్చని జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో నరసరావుపేట టికెట్ ఇవ్వకుంటే కనీసం కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నుంచి ఎంపీ మోదుగుల ... ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి మోదుగుల పోటీ చేయకుంటే రాయపాటి సోదరుని కుమారుడు మాజీ మేయర్ రాయపాటి మోహనసాయికృష్ణకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెలుగుదేశం అధిష్టానం వద్ద రాయపాటి ఉంచినట్లు సమాచారం. ఏదిఏమైనా 2014 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతూ వ్యూహాల్లో బిజీబిజీగా గడపాల్సిన రాయపాటి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది మరి కొద్దిరోజుల్లో తేలనుంది. -
చెరో దారి
నిన్నటి వరకు గురుశిష్యులుగా మెలిగిన ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు ‘చెరోదారి’ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరణకు గురైన రాయపాటి టీడీపీలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటనేది అనుయాయులకు కూడా అంతు చిక్కడం లేదు. మరో వైపు తాను కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నట్టు రాయపాటి శిష్యుడు మాణిక్యవరప్రసాద్ చెపుతున్నారు. గుంటూరు: జిల్లాలో వరుసగా నాలుగుసార్లు ఎంపీగా గెలుపొంది ఢిల్లీలో చక్రం తిప్పిన రాయపాటి గతంలో తనకు కేంద్రమంత్రి పదవి దక్కనప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలకు దిగిన సందర్భాలున్నాయి. టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకోవాలనే ‘కల’ సాకారం చేసుకోలేనప్పుడు సైతం .. తన సీనియార్టీని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదంటూ ఆవేదన చెందారు. కొన్ని సందర్భాల్లో పార్టీపై వ్యతిరేకతను తన రాజకీయ సన్యాసంతో వ్యక్తపరిచేందుకు కూడా సిద్ధపడ్డారు. కేడర్‌ను పిలిపించుకుని అసమ్మతి సమావేశాలు ఏర్పాటు చేయగానే అధిష్టానం ఆయన్ను బుజ్జగిస్తూ వచ్చింది. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో రాయపాటి టీడీపీలో చేరనున్నట్లు వదంతులు వినిపించాయి. ఆయనా వాటిని ఖండించలేదు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టినప్పుడు రాయపాటి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. తనతో పాటు మంత్రి డొక్కాను పార్టీలోకి తీసుకువస్తామని అప్పట్లో రాయపాటి సోదరులు చెప్పినట్లు టీడీపీ వర్గాల సమాచారం. అయితే, ఇన్నాళ్లూ వారిద్దరూ టీడీపీలో చేరకపోవడానికి నేరుగా చంద్రబాబుతో మాట్లాడి సీట్ల కేటాయింపుపై గట్టిహామీ కోసమే ‘డొక్కా’ ఆలస్యం చేసినట్లు చెపుతున్నారు. తాజా పరిణామాలతో రాయపాటి సోదరులకు టీడీపీలో కూడా తలుపులు మూసుకు పోయాయని, వారు కోరుతున్న నరసరావుపేట పార్లమెంట్ సీటును రాయపాటికి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించలేదని తెలిసింది. దీంతో సోదరులిద్దరూ ఎటు వెళ్లాలో తేల్చుకోలేక మదనపడుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టే పార్టీలోకి చేరదామని సిద్ధపడుతున్నా అందుకు డొక్కా మాణిక్యవరప్రసాద్ అంగీకరించడం లేదని తెలిసింది. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని.. గురువుకు తెగేసి చెప్పినట్లు డొక్కా అనుచరవర్గం చెబుతుంది. అదేవిధంగా రాయపాటిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు మాణిక్యవరప్రసాద్ మంతనాలు జరుపుతున్నారు. నాడు పొగడ్తలు.. గురుశిష్యుల నడుమ ‘అంతరం’ పలు అంశాల ఆధారంగా కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రి కిరణ్‌ను తీవ్రపదజాలంతో దుయ్యబట్టారు. కిర ణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే డొక్కా మాట్లాడుతూ చిరంజీవి నాయకత్వంలో పార్టీని నడిపించగలమని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిని అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పోలుస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడేమో దుయ్యబడుతున్నారు. ఇదిలావుంటే..ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి అర్హులుగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాయపాటి ఇటీవల కన్నాను ముఖ్యమంత్రి చేస్తే తాను సహకరిస్తానని ప్రకటిం చారు. ఆయన శిష్యుడు మాణిక్యవరప్రసాద్ మాత్రం మంత్రి కన్నా పేరు పలక కుండా కాపు సామాజిక వర్గంలో మరొక నేత చిరంజీవి ఉన్నారని గుర్తుచేస్తూ అధిష్టానం వద్ద వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు చెపుతున్నారు. గురుశిష్యులిద్దరూ కూడబలుక్కుని తమ రాజ కీయ పునాదులను పదిలం చేసుకునే క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. వర్గ శత్రువైన కన్నా లక్ష్మీనారాయణ ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాన్ని కూడా వ్య క్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రాయపాటి సోదరులతో పాటు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజకీయ భవితవ్యం ఎటు మరలనుందో వేచిచూడాల్సిందే..! -
రాయపాటి డైలమా !
సాక్షి ప్రతినిధి, గుంటూరు :డామిట్ .. కథ అడ్డం తిరిగిందన్న చందంగా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజకీయ భవితవ్యం ఒక్కసారిగా డైలమాలో పడింది. యూపీఏ అధిష్టానంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఆ పార్టీకి చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించింది. వారిలో గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండటం జిల్లా పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపడంపై భిన్నకథనాలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలో ఇది ఓ భాగమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా రాయపాటి మొదటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తనతోపాటు అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. తామంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని, అధిష్టానం తమ మాట ఖాతరు చేయ కుండా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధమైన ప్రకటనలు ద్వారా కాంగ్రెస్ నిర్ణయానికి తాను వ్యతిరేకంగా ఉన్నానని తెలియజేస్తూ ప్రజల్లో సానుభూతి పెంచుకునే యత్నం చేశారు. ఎంపీగా ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిన సేవలు అంతంత మాత్రంగానే ఉండటంతో రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు వచ్చే అవకాశాలు లేవు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని రాయపాటి ఒక ఆయుధంగా వాడుకున్నారనే అభిప్రాయం వినపడుతోంది. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లే అవకాశాలు ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగానే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలను సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే రాయపాటి... సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి అనుకూలం గా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారని భావిస్తున్నారు. సీఎం నేతృత్వంలో ఆవిర్భవించనున్న కొత్త పార్టీ తరఫున సమైక్యాంధ్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు పొందే ఆలోచనలో రాయపాటి ఉన్నారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. -
వ్యూహమా... వైరాగ్యమా !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లా రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడు సంచలనాలతో వార్తల్లో ఉండటం ఆయనకు పరిపాటి. వాస్తవానికి జిల్లా రాజకీయాల్లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ రాయపాటి సాంబశివరావులు ఉప్పు నిప్పులా ఉంటారు. అయితే తాజాగా మంత్రి కన్నా ఎంపీ స్థానానికి పోటీ చేస్తే తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని రాయపాటి ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏ ఉద్దేశంతో రాయపాటి ఈ ప్రకటన చేసి ఉంటారనే అంశంపై ఊహాగానాలకు తెరలేచింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుసరిస్తున్న వైఖరితో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ విధానాలపై ఆయన పలుమార్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీమాంధ్ర ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టుకుపోతుందని, ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరని ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ అభిమానులకు, పార్టీ అధిష్టానానికి ఈ వ్యాఖ్యలు బాధ కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పెరిగి ఆ పార్టీపై వ్యాఖ్యలు చేయడం సరికాదని సన్నిహితులు రాయపాటికి సూచించారు. ఇవేమీ పట్టించుకోకుండా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారని, ఆ పార్టీ తరఫున తాను పోటీ చేసే అవకాశాలున్నట్టు పరోక్షంగా మరోసారి ప్రకటనలు ఇచ్చారు. వీటి కారణంగా రాయపాటిని పార్టీ కూడా దూరంగానే ఉంచుతోంది. ఇక ఆ పార్టీలో రాయపాటికి సీటు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం వినపడుతున్న నేపథ్యంలో కన్నాకు మద్దతుగా ఇచ్చిన ప్రకటనపై రెండు రకాలైన అభిప్రాయాలు వినపడుతున్నాయి. వైరాగ్యమా? 2009 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో తనకు ఎదురైన ేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైరాగ్యంతో రాయపాటి ఈ ప్రకటన చేసి ఉంటారని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా అప్పటి ఎన్నికల్లో సిటింగ్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఈ సీటు కోసం పోటీ పడ్డారు. అలాగే ఆయన వ్యతిరేక వర్గం సైతం టికెట్ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసింది. కేంద్రమంత్రి పదవికోసం ఎంతగా పోటీ పడతారో అంతలా ఎంపీ టికెట్ కోసం ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు టికెట్ పొంది ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత కేంద్ర మంత్రి పదవి కోసం, టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. అవేమీ రాకపోవడంతో తన సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి వచ్చిన రాష్ట్ర విభజనను ఆసరాగా కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోశారు. వ్యూహమా... తాజాగా మంత్రి కన్నాకు ఎంపీ సీటు ఇస్తే తాను మద్దతు పలుకుతానని ప్రకటించడం ద్వారా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పరోక్షంగా చెప్పినట్టుగా భావిస్తున్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైతం ఒకదశలో ఎంపీగా పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నది వాస్తవమే అయినప్పటికీ ఆయన పశ్చిమ నియోజకవర్గం వదిలి ఎంపీగా పోటీ చేస్తారా అన్నది అనుమానమే. మంగళగిరి, సత్తెనపల్లి, తాడికొండ, తెనాలితో పాటు నగరంలో ఎంపీ రాయపాటికి ప్రత్యేక క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ సహాయంతో తన శత్రువైన కన్నాకు ప్రతికూల ఫలితాలు వచ్చే విధ ంగా చేయాలనే వ్యూహం ఆయనలో లేకపోలేదని మరి కొందరు చెబుతున్నారు. -
సినీ గ్లామర్ కోసం తహతహ!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సినీ నటుడు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్‌కు గుంటూరు ఎంపీ సీటు ఇవ్వాలని జిల్లా టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. అతనికి సీటు ఇస్తే సినీనటుడు మహేష్‌బాబును ఉపయోగించుకుని ఎక్కువ ఓట్లు పొందవచ్చనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపున కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ సీటును ఆశిస్తున్నప్పటికీ జయదేవ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థులెవరూ కనపడకపోవడంతో స్థానిక నేతలు గల్లా జయదేవ్ పేరును తెరపైకి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనలో స్థానిక నేతల స్వార్థం లేకపోలేదు. ఆర్థికంగా వెసులుబాటు కలిగిన గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లలోని అభ్యర్థులకు నిధుల సమస్య ఉండదని, సినీనటుడు మహేష్‌ను ప్రచారానికి తీసుకురావచ్చని, అలా కుదరని పక్షంలో ఆతని ఫ్యాన్స్ ద్వారా పార్టీకి మరిన్ని ఓట్లు పొందాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు చేసిన సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పుడు దివంగత ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాలు బెడిసికొట్టాయి. అధినేత చంద్రబాబు, సినీనటుడు బాలకృష్ణతో తీవ్రస్థాయిలో విభేదాలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌పై ఆశలు వదులుకున్నారు. ఇక మిగిలింది సినీనటుడు బాలకృష్ణ ఒక్కరే. రానున్న ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. పార్టీ ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ పర్యటించలేకపోవచ్చని, ఒకవేళ పర్యటించినా ఆశించిన ఫలితం రాకపోవచ్చనే భావనలో ఉన్నారు. బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాలు, హావభావాలు ప్రజల్ని ఆకర్షించలేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రజల్ని ఆకర్షించే శక్తిగాని, ఆ దిశగా ఆయన ప్రసంగాలు లేకపోవడంతో ఈ ఎన్నికలకు ప్రిన్స్మహేష్పైనే ఆశలు పెంచుకున్నారు. ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన అల్లుడుకు ఇక్కడ సీటు కేటాయిస్తే జిల్లాలో పార్టీ పరి స్థితి కొంత మెరుగవుతుందనే భావన స్థానిక నేతలకు ఉంది. ఇక్కడ అభ్యర్థులు లభించక ఎక్కడ నుంచో దిగుమతి చేసుకున్నారనే విమర్శ నుంచి తప్పుకునే అవకాశం లేకపోలేదు. ఈ విషయాలను అధినేతకు స్థానిక నేతలు వివరించినట్టు తెలుస్తోంది. గ్లామర్‌కు రాలని ఓట్లు.. 2004 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సినీ నిర్మాత అశ్వనీదత్ పోటీచేశారు. సినీ రంగంలో మంచి ఫామ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి అశ్వనీదత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అశ్వనీదత్ కోసం చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ఊహాగానాలు కూడా వినపడ్డాయి. అశ్వనీదత్‌తోపాటు పార్టీనేతలు ఎప్పటికప్పుడు చిరంజీవి ప్రచారానికి వస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. చివరకు చిరంజీవి ప్రచారానికి రాకుండా ఓ దినపత్రిక ద్వారా అశ్వనీదత్ గెలుపునకు సహకరించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే ఆ పిలుపునకు అభిమానులు స్పందించకపోవడంతో అశ్వనీదత్ ఓటమి పాలయ్యారు. మరి రానున్న ఎన్నికల్లో ఈ సినీగ్లామర్ ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే మరి! -
ఆవేశంలో కొత్తపార్టీ పెడతామన్నా!
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కొత్త పార్టీ పెడతాబంటూ అంటూ తెగ హడావుడి చేసిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చల్లబడ్డారు. అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించారు. ఆవేశంలో అన్నామే తప్పా కొత్త పార్టీ ఊసే లేదని అసలు విషయం చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని పాత పాటే పాడారు. సమైక్యాంధ్ర చాంపియన్ కావాలనుకుంటున్న సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతారని, అందులో తాను కూడా చేరే అవకాశముందని పలు సందర్భాల్లో రాయపాటి సూచనప్రాయంగా వెల్లడించారు. ఇప్పుడేమో తుస్సుమనిపించారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే కొత్తపార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో చెప్పిన మాటను వెనక్కు తీసుకున్నారు. కొత్త పార్టీపై డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇంతకుముందు ఆయన ప్రకటించారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని కూడా సెలవిచ్చారు. ఇప్పుడేమో అమాంతంగా మాట మార్చేశారు. ఆవేశంలో అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని సలహాయిచ్చారు. హడావుడి చేయడం, తర్వాత చల్లబడడం రాయపాటికి పరిపాటి. గతంలో ఆయన అనేకసార్లు ఈ విన్యాసం ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో తనకు బెర్త్ దక్కనప్పుడల్లా ఆయన అలకపాన్పు ఎక్కేవారు. కాంగ్రెస్ పార్టీని వీడతానంటూ బిల్డప్ ఇచ్చేవారు. కొద్ది రోజులు గడిచాక కథ మామూలే. కాంగ్రెస్‌లోనే కొనసాగుతునంటూ ముక్తాంపులు ఇచ్చేవారు. గత కొన్నేళ్లుగా ఆయనీ విద్య ప్రదర్శిస్తూనే ఉన్నారు. జనం చూస్తూనే ఉన్నారు. రాష్ట విభజన నేపథ్యంలో మరోసారి రాయపాటి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన కేబినెట్ నోట్‌ను కేంద్రం ఆమోదించడంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన ఈ గుంటూరు నాయకుడు తర్వాత చంద్రబాబుకు చెంతకు చేరారు. ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్టుగా సంకేతాలిచ్చారు. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని రాయపాటి తనశైలిలో స్సందించారు. మున్మందు రాయపాటి మరెన్ని సిత్రాలు చేస్తారో చూడాలి! -
తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుకోండి: రాయపాటి
గుంటూరు : తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విభజించవద్దని రాయపాటి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, సమైక్యంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి లాభమని ఆయన అన్నారు. -
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై స్పష్టత: రాయపాటి
మంగళగిరి, న్యూస్‌లైన్: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర విభజన విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చె ప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో నీట ముని గిన పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పార్టీ విషయమై అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్‌తో కలిసి అవిశ్రాంత పోరాటం చేయనున్నట్టు పేర్కొన్నారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని నిన్న అన్నారు. టీడీపీలోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు. -
కొత్త పార్టీ నేను పెట్టినా కిరణ్ పెట్టినా ఒకటే: రాయపాటి
సాక్షి, చెన్నై ప్రతినిధి: కొత్త పార్టీపై డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో ఆయన సొంత కుంపటి పెట్టుకునే అవకాశముందని సీఎం సన్నిహిత వర్గాలే అంటున్నట్టు సమాచారం. కాగా, రాయపాటి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆయన సంఘీభావం తెలపడంతో ఈ ప్రచారానికి బలం లభించింది. అయితే ఇప్పుడే టీడీపీలో చేరే ఆలోచన రాయపాటికి లేదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.