త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు
త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు
Published Sun, Sep 1 2013 10:08 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆదివారం ఓ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో ఎవరూ గెలిచే అవకాశం లేదని రాయపాటి తేల్చేశారు. అంతేకాక త్వరలోనే సీమాంధ్రలో కొత్తపార్టీ వచ్చే అవకాశం ఉంది అని జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 6 తేది తర్వాత సీమాంధ్ర ప్రాంత ఎంపీలు కీలక నిర్ణయం తీసుకోనున్నారని రాయపాటి తెలిపారు. త్వరలోనే ఎంపీలందరూ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారన్నారు. త్వరలోనే సమైక్యాంధ్ర పార్టీ రాబోతున్నదని ఎంపీ రాయపాటి సూచనప్రాయంగా తెలిపారు.
Advertisement
Advertisement