'కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలి' | MP rayapati sambasiva rao Sensational Comments on congress leaders | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలి'

Published Mon, Oct 14 2013 3:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలి' - Sakshi

'కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలి'

విజయవాడ : సమైక్యాంధ్రకు కట్టుబడని కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు.  90 శాతం మంది సమైక్యాన్ని కోరుతున్నా టీఆర్ఎస్ కోరిందని కాంగ్రెస్ విజభనకు సిద్ధపడిందని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనకు పాత మిత్రుడని  రాయపాటి సాంబశివరావు అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని, తమను మోసం చేసిందని వ్యాఖ్యానించారు.

సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని రాయపాటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సమైక్యాంధ్రకు కట్టుబడితే సీమాంధ్రలో 20 ఎంపీ సీట్లు కన్నా ఎక్కువే గెలుచుకునే అవకాశం ఉందన్నారు.  పార్టీ మారే విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రాయపాటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement