samikyandhra
-
బరిలో నుంచి తప్పుకున్న ఆదాల
-
బరిలో నుంచి తప్పుకున్న ఆదాల
హైదరాబాద్ : అధిష్టానం ఒత్తిడి నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ బరి నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన చివరి నిమిషంలో ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారనే విషయంపై సరైన జవాబు చెప్పకుండా కుంటి సాకులు చెప్పటడం విశేషం. కాగా పోటీ నుంచి తప్పుకోవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఆదాలను కోరారు. అయితే తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న ఆయన... తాజాగా పోటీ నుంచి తప్పకుంటున్నట్లు వెల్లడించారు. గతంలో తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకొచ్చిన ఆదాల ... ఇప్పుడు తప్పుకోవటం విశేషం. -
ఆదాల బరిలోనుంచి తప్పుకో....
హైదరాబాద్ : కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డిని రాజ్యసభ బరిలోనుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదాల గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిశారు. అయితే తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని సీఎంతో చెప్పినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చి సమైక్యాంధ్ర నినాదంతో ఆదాలను గెలిపించుకోవాలనే ఆలోచనతో సీఎం కిరణ్ ఆయన్ను రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆఫ్ ది రికార్డ్ మాటల్లో ఆదాల కూడా ఎమ్మెల్యేల వద్ద ఇదే విషయం చెబుతున్నారని వినికిడి. రకరకాల మార్గాల్లో తాను 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను సమీకరించుకుంటే మిగిలిన వారిని సీఎం కిరణే సర్దుబాటు చేసి తన విజయానికి బాటలు వేస్తారని ఆదాల గట్టిగా నమ్ముతున్నారు. అయితే కాంగ్రెస్ హై ‘కమాండ్’ ఫలితంగా సీఎం కిరణ్ ఆదాలకు ఎమ్మెల్యేలను సమకూరుస్తారా? లేక తనను సీఎం చేసిన సోనియాగాంధీతో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో రాజకీయ అవసరాలు ఉంటాయని చివరి నిముషంలో హ్యాండిస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అటు టీడీపీ నుంచి నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి తన ఎమ్మెల్యేలను కట్టడి చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, సీఎం ధైర్యంగా ఎమ్మెల్యేలను ఇవ్వలేకపోతే ఆదాల పరిస్థితి ఏమిటనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
వైయస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం : ప్రజలు
-
కేంద్ర మంత్రి కారుకు అడ్డంగా సమిక్య వాదులు
-
'రాష్ట్రపతి సమక్షంలో సమైక్యగళం'
-
'ఏపీ ఎన్జీఓల పోరాటానికి టిడిపి క్షేత్ర స్థాయిలో మద్దతు ఉంటుంది'
-
జగనన్నతోనే అభివృద్ది సాద్యం
-
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
-
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
-
విభజనపై చెప్పలేకే టీడీపీ ‘కుమ్మక్కు’ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతలు అటు సమైక్యాంధ్రకు లేదా ఇటు విభజనకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితుల్లేకే.. జగన్మోహన్రెడ్డితో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందంటూ ప్రచారం మొదలుపెట్టారని ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ అన్నారు. జగన్‌తో చేతులు కలపాల్సిన పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి లేదన్నారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. తెలంగాణ అంశంలో పార్టీ అధిష్టానం వైఖరినే తప్పుపడుతూ మాట్లాడుతున్న సీమాంధ్ర పార్టీ నేతలు 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే సహచర సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను చేతకాని దద్దమ్మలంటూ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ భవిష్యత్‌లో ఏ పార్టీలోకి పోతారో తెలియదని, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌వాదిగా ఉండాలని సూచించారు. -
రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాశామన్న మంత్రి శైలజానాథ్
-
వేగవంతమైన విభజన ప్రక్రియ
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైంది. సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకునే పరిస్థితులలో కేంద్రం లేదు. తను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లన్నట్లు కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సాధ్యమైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా మెత్తబడిపోయారు. రాష్ట్ర విభజన ఆపడానికి ఇంకా చాలా దారులు ఉన్నాయని ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి వారు చెబుతున్నారు. కొందరైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందని బహిరంగంగానే స్సష్టం చేస్తున్నారు. ఇంకా విభజన ఆపవచ్చని ప్రజలను మోసం చేయడం తనకు ఇష్టంలేదని మంత్రి మాణిక్యవరప్రసాద్ చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి తలవంచడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రి బాలరాజు గతంలోనే చెప్పారు. కేంద్ర మంత్రులు పలువురు రాజీపడిపోయారు. కొందరు ప్యాకేజీలు అడుగుదామన్న ఆలోచనలో ఉన్నారు. వీరంతా వెనక్కు తగ్గిన నేపథ్యంలో కేంద్ర హొం శాఖ విభజన ప్రక్రియ విషయంలో దూసుకుపోతోంది. దీనికి తోడు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. 17 అంశాలకు సంబంధించి 24 గంటల్లో సమాచారం పంపాలని కేంద్ర హొం శాఖ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ నెల 19న మంత్రుల బృందం(జిఓఎం) రెండవసారి సమావేశం కానుంది. ఈ సమావేశం కోసం తెలంగాణలోని పది జిల్లాల సమాచారం మాత్రమే హొం శాఖ కోరింది. విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి సూచించింది. రాష్ట్ర విభజనకు సంబంధిం కేంద్ర మంత్రిత్వ శాఖలు సంబంధిత సమాచారం పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి ఈ నెల 11న లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయవలసి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం 17వ తేదీలోపు సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఇందు కోసం ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్ర మంత్రిత్వశాఖలను ఆదేశించించారు. సంబంధిత రంగం ఏయే ప్రాంతాల్లో ఎలా విస్తరించి ఉంది, ఇరు ప్రాంతాల్లో ఆస్తులు-అప్పుల వివరాలు, ఉద్యోగుల సమాచారంతో కూడిన స్పష్టమైన వివరాలను అందించాలని ఆదేశించారు. 19న జరిగే మంత్రుల బృందం సమావేశంలో సీమాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి చర్చించే అవకాశం ఉంది. అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. రాష్ట్ర సచివాలయంలో కూడా ఈ ప్రక్రియ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖ పరిధిలోని రాష్ట్ర పునర్విభజన (ఎస్ఆర్) విభాగాన్ని పటిష్టం చేస్తున్నారు. సచివాలయంలోని ‘బి’ బ్లాక్ ఆరో అంతస్తులో ఎస్ఆర్ విభాగం ఉంది. ఇందులో ప్రస్తుతం ఒక ఎస్ఓ, ఒక ఏఎస్ఓ మాత్రమే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ విభాగం ప్రాముఖ్యత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎస్ఆర్ విభాగం ద్వారానే రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సమాచారమంతా కేంద్రానికి చేరుతుంది. సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఎస్ఆర్ విభాగం రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల సమాచారాన్ని సేకరించి కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తుంది. ఇందుకోసం ఎస్ఆర్ విభాగంలో సాగునీరు, ఆర్థిక, సర్వీసులు, విద్యుత్, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రణాళికా విభాగం సహా రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అదనపు కార్యదర్శులు లేదా సంయుక్త కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఆ అధికారులు ‘విభజన’కు అవసరమైన సమాచారాన్ని సేకరించి కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తారు. ఆ కమిటీ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ విభాగంతోనే జరుపుతుంది. ప్రధానంగా ఆర్థిక శాఖ జిల్లాల వారీగా ఆదాయ వివరాలు, ఆస్తులు, అప్పులు, వడ్డీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) జిల్లాల వారీగా సమకూర్చుకుంటుంది. జిల్లాల వారీగా విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా, బొగ్గు, గ్యాస్ లభ్యత తదితర సమాచారాన్ని ఇంధన శాఖ కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను కూడా అందజేస్తారు. సాగునీటి ప్రాజెక్టులు, జలవనరుల కేటాయింపు తదితర వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రణాళికా సంఘానికి పూర్తి సమాచారం ఉంది. మొత్తంగా ‘ఎస్ఆర్’ విభాగం నుంచి అందే సమాచారం ఆధారంగా కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర విభజన, ఆస్తులు, ఆదాయ వనరులు, ఉద్యోగులు, అప్పుల పంపిణీకి ఒక ప్రాతిపదికను రూపొందిస్తుంది. ఆ ప్రాతిపదికను కేంద్రమే అమలు చేస్తుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ విభజన ప్రక్రియ ఊపందుకున్న నేపధ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆపడం సాధ్యం కాదని అర్ధమైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమైక్య రాష్ట్రం కోసం తీవ్ర పోరాటం చేస్తోంది. యువనేత జగన్ ఒక్కరే సమైక్యతకు కట్టుబడి ఉద్యమిస్తున్నారు. సిపిఎం, ఎంఐఎం రెండు పార్టీలు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులలో టిడిపి నేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులు నిజాయితీగా జగన్ పిలుపుకు స్పందించి ముందుకు వస్తే విభజనను ఆపడం సాధ్యమవుతుంది. -
సమైక్యతపై చేతులెత్తేసిన సీఎం కిరణ్
హైదరాబాద్: సమైక్యతపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారు. ఏపీ ఎన్జీఓ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. తన చేతిలో ఏమీలేదని, కేంద్రం తరపున ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పారు. ఆర్టికల్ 371(డి)పై కేంద్రంతో మాట్లాడతానన్నారు. 2014 వరకు రాష్ట్రం విడిపోదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై జీఓఎంను కలవండని చెప్పారు. విభజనను అడ్డుకునే ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నానన్నారు. సమ్మె విరమించాలని కోరారు. తాను కూడా మీతో కలిసి ఉద్యమం చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చలు ముగిసిన అనంతరం ఏపీఎన్జీఓ నేతలు అంతర్గతంగా సమావేశమయ్యారు. కొందరు సమ్మె విరమించడానికి సంసిద్ధత తెలుపుతుంటే, మరికొందరు సమ్మె కొనసాగించాలని అంటున్నారు. సమావేశం ముగిసిన తరువాత వారు తమ నిర్ణయం ప్రకటిస్తారు. -
'కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలి'
విజయవాడ : సమైక్యాంధ్రకు కట్టుబడని కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొట్టాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు. 90 శాతం మంది సమైక్యాన్ని కోరుతున్నా టీఆర్ఎస్ కోరిందని కాంగ్రెస్ విజభనకు సిద్ధపడిందని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనకు పాత మిత్రుడని రాయపాటి సాంబశివరావు అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని, తమను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని రాయపాటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సమైక్యాంధ్రకు కట్టుబడితే సీమాంధ్రలో 20 ఎంపీ సీట్లు కన్నా ఎక్కువే గెలుచుకునే అవకాశం ఉందన్నారు. పార్టీ మారే విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రాయపాటి తెలిపారు. -
విభజన మర్ధిని
-
విజయనగరంలో బొత్స కళాశాలపై విద్యార్థులు దాడి
-
ఒకే సచివాలయం..రెండు ప్రభుత్వాలు
-
అనంతపురం జిల్లా కదిరిలో లక్షగళ ఘోష
-
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి
-
సమ్మెకు సిద్ధమైన జీహెచెంసీ,మెట్రో వాటర్‌బోర్డు
-
సమైక్య రాష్ట్ర కోసం ప్రత్యేక ప్రార్ధనలు