
సీమాంధ్రలో 22 ఎంపీ సీట్లు ఇస్తాం: రాయపాటి
విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకుంటే సీమాంధ్రలో 22 ఎంపీ సీట్లు ఇస్తామని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ విభజన ప్రక్రియ ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని విభజించదన్న నమ్మకంతోనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని రాయపాటి తెలిపారు.
తెలంగాణవాదులు కాంగ్రెస్కు 10 లేదా 12 ఎంపీ సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆయన అన్నారు. మరోవైపు రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీ ఏపీ భవన్లో దీక్ష చేపట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును....రాయపాటి కలిసి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.