విభజనతో కేంద్రం అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర ప్రాంతాలకు అన్యాయం చేసిందని విశాలాంధ్ర మహాసభ నేతలు శుక్రవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. విభజన ద్వారా జల వనరులపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కేంద్రం ఆమోదించి తెలుగు ప్రజలకు ద్రోహం చేసేదిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రం సమైక్యంగా ఉంటునే సమస్యలు పరిష్కారం అవుతాయన నేతలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంచేందుకు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని విశాలాంధ్ర మహాసభ నేతలు పేర్కొన్నారు.